Halloween Costume ideas 2015

Twelve spies

పన్నెండు మంది వేగులవారు


పండ్లు మోసుకొస్తున్న ఇశ్రాయేలు వేగులవాళ్ళు
ఈ మనుష్యులు మోసుకొచ్చిన పండ్లను చూడండి. ఆ ద్రాక్ష గెల ఎంత పెద్దగా ఉందో కదా. దానిని ఒక కర్రకు తగిలించుకొని ఇద్దరు మనుష్యులు మోసుకురావల్సి వచ్చింది. ఆ అంజూరపు పండ్లను, దానిమ్మ పండ్లను చూడండి. అంత మంచి పండ్లు ఎక్కడివి? కనాను దేశానివి. కనాను అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఒకప్పుడు నివసించిన దేశమని గుర్తుచేసుకోండి. అక్కడ వచ్చిన కరవు కారణంగా యాకోబు తన కుటుంబంతో ఐగుప్తుకు వెళ్ళాడు. దాదాపు 216 సంవత్సరాల తర్వాత మోషే ఇశ్రాయేలీయులను తిరిగి కనానుకు నడిపిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అరణ్యములో కాదేషు అని పిలువబడే ప్రాంతానికి చేరుకున్నారు.
కనాను దేశంలో చెడ్డవాళ్ళు నివసించేవారు. అందుకే మోషే 12 మంది వేగులవాళ్ళను పంపిస్తూ, ‘అక్కడ ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారో, వాళ్ళు ఎంత బలమైనవాళ్ళో కనుక్కొని రండి. పంటలకు ఆ దేశము మంచిదో కాదో చూసి, అక్కడి పండ్లను కొన్నింటిని తీసుకురండి’ అని చెప్పాడు.
ఆ వేగులవాళ్ళు కాదేషుకు తిరిగి వచ్చి మోషేతో, ‘నిజంగా ఆ దేశం మంచి దేశము’ అని చెప్పారు. దాన్ని రుజువు చేయడానికి అక్కడి పండ్లను కొన్నింటిని మోషేకు చూపించారు. అయితే వేగులవాళ్ళలో పదిమంది, ‘అక్కడ నివసించే ప్రజలు చాలా దృఢంగా, బలంగా ఉన్నారు. ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోవడానికి వెళితే వాళ్ళు మనల్ని చంపేస్తారు’ అని చెప్పారు.
అది వినగానే ఇశ్రాయేలీయులు భయపడ్డారు. ‘మనం ఐగుప్తులోనో లేక ఈ అరణ్యంలోనో మరణిస్తే మంచిది. మనం యుద్ధంలో చంపబడి మన భార్యలు, పిల్లలు చెరగా పట్టబడతారు. మోషేకు బదులు మరో కొత్త నాయకుడిని ఎన్నుకొని మనం ఐగుప్తుకే తిరిగి వెళ్దాం!’ అన్నారు.
కానీ వేగులవాళ్ళలో ఇద్దరు మాత్రం యెహోవాపై నమ్మకముంచి, ప్రజలను శాంతపరచడానికి ప్రయత్నించారు. వాళ్ళ పేర్లు యెహోషువ, కాలేబు. వాళ్ళు ప్రజలతో, ‘భయపడవద్దు, యెహోవా మనతో ఉన్నాడు. మనం ఆ దేశాన్ని సులభంగా స్వాధీనపరచుకుంటాము’ అన్నారు. కానీ ప్రజలు వినలేదు. యెహోషువ, కాలేబులను చంపాలని కూడా వాళ్ళు అనుకున్నారు.
దానితో యెహోవాకు చాలా కోపం వచ్చింది. ‘ఇరవై సంవత్సరాలు మొదలుకొని ఆ పై వయస్సుగల వాళ్ళెవ్వరూ కనాను దేశములోకి ప్రవేశించరు. నేను ఐగుప్తులోనూ అరణ్యంలోనూ చేసిన అద్భుతాలను చూసినా వాళ్ళు నన్ను నమ్మడంలేదు. ఆఖరివాడు మరణించేంతవరకూ వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలోనే సంచరిస్తారు. యెహోషువ, కాలేబు మాత్రమే కనానులోకి ప్రవేశిస్తారు’ అని ఆయన మోషేతో చెప్పాడు.
సంఖ్యాకాండము 13:1-33; 14:1-38.


ప్రశ్నలు

  • చిత్రంలోని ద్రాక్ష గెల గురించి మీరేమి గమనించారు, అది ఎక్కడి నుండి వచ్చింది?
  • మోషే 12 మంది వేగులవాళ్ళను కనాను దేశానికి ఎందుకు పంపించాడు?
  • తిరిగి వచ్చిన తర్వాత పదిమంది వేగులవాళ్ళు మోషేకు ఏమని చెప్పారు?
  • ఇద్దరు వేగులవాళ్ళు యెహోవాపై తమకున్న నమ్మకాన్ని ఎలా చూపించారు, వాళ్ళ పేర్లేమిటి?
  • యెహోవాకు కోపం ఎందుకు వచ్చింది, ఆయన మోషేకు ఏమని చెప్పాడు?

అదనపు ప్రశ్నలు

  • సంఖ్యాకాండము 13:1-33 చదవండి.
    దేశాన్ని సంచరించి చూడడానికి ఎవరు ఎంపిక చేసుకోబడ్డారు, వాళ్ళకు ఎలాంటి గొప్ప అవకాశం లభించింది? (సంఖ్యా. 13:2, 3, 18-20)
    యెహోషువ కాలేబుల దృక్కోణం ఇతర వేగులవాళ్ళ దృక్కోణానికి ఎందుకు భిన్నంగా ఉంది, దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (సంఖ్యా. 13:28-30; మత్త. 17:20; 2 కొరిం. 5:7)
  • సంఖ్యాకాండము 14:1-38 చదవండి.
    యెహోవా భూసంబంధ ప్రతినిధులకు వ్యతిరేకంగా సణగడం విషయంలో ఇవ్వబడిన ఏ హెచ్చరికను మనం లక్ష్యపెట్టాలి? (సంఖ్యా. 14:2, 3, 27; మత్త. 25:40, 45; 1 కొరిం. 10:10)
    యెహోవా తన సేవకుల్లో ప్రతి ఒక్కరిపై వ్యక్తిగత ఆసక్తి చూపిస్తాడని సంఖ్యాకాండము 14:24 ఎలా చూపిస్తోంది? (1 రాజు. 19:18; సామె. 15:3)

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget