Halloween Costume ideas 2015

A new kind of food

ఒక క్రొత్త రకమైన ఆహారం

నేలపైనుండి ప్రజలు ఏమి ఏరుకుంటున్నారో చెప్పగలరా? అది మంచులా ఉంది. తెల్లగా సన్నగా పల్చని కణాలుగా ఉంది. కానీ అది మంచు కాదు; అది ఆహార పదార్థం.
మన్నా సేకరించుకుంటున్న ఇశ్రాయేలీయులు
ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చి దాదాపు ఒక నెల గడిచింది. వారు అరణ్యంలో ఉన్నారు. అక్కడ ఆహార పంటలు తక్కువగా పండుతాయి. కాబట్టి ప్రజలు, ‘యెహోవా మమ్మల్ని ఐగుప్తులో చంపేసినా బాగుండేది, అక్కడ కనీసం మేము మాకు ఇష్టమైన ఆహారాన్ని తినేవాళ్ళం’ అని ఫిర్యాదు చేశారు.
అందుకే యెహోవా, ‘నేను ఆకాశంనుండి ఆహారాన్ని కురిపిస్తాను’ అన్నాడు. యెహోవా అలాగే చేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇశ్రాయేలీయులు నేలపై ఉన్న తెల్లని పదార్థాన్ని చూసి ‘ఇదేమిటి?’ అనుకున్నారు.
‘ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారం’ అని మోషే చెప్పాడు. ప్రజలు దాన్ని మన్నా అని పిలిచారు. దాని రుచి తేనెతో చేసిన పల్చని కేకులా ఉండేది.
మోషే ప్రజలతో, ‘మీలో ప్రతి వ్యక్తి తాను తినగలిగినంత ఆహారాన్ని సమకూర్చుకోవాలి’ అని చెప్పాడు. కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్నే వారు అదే పని చేసేవారు. ఆ తర్వాత ఎండ వచ్చినప్పుడు ఆ వేడికి నేలపై మిగిలివున్న మన్నా కరిగిపోయేది.
‘ఎవరూ కూడా మరుసటి రోజు కోసం మన్నాను దాచుకోకూడదు’ అని కూడా మోషే చెప్పాడు. అయినా కొంతమంది వినలేదు. అప్పుడేమి జరిగిందో తెలుసా? వారు దాచుకున్న మన్నా ఆ మరుసటి రోజు ఉదయానికి పూర్తిగా పురుగులు పట్టి కంపు కొట్టడం ప్రారంభించింది!
అయితే వారంలో ఒకరోజు మాత్రం ప్రజలు రెండింతల మన్నాను దాచుకోవచ్చని యెహోవా తెలియజేశాడు. వాళ్ళు ఆరవ రోజున అలా చేయాలి. వాళ్ళు కొంత మన్నాను మరుసటి రోజుకి దాచుకోవాలని, తాను ఏడవ రోజున ఆహారాన్ని కురిపించనని యెహోవా తెలియజేశాడు. వాళ్ళు మన్నాను ఏడవ రోజు కోసం దాచుకున్నప్పుడు అది పురుగులు పట్టేది కాదు, కంపు కొట్టేది కాదు! అది మరో అద్భుతం!
ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నన్ని సంవత్సరాలు యెహోవా వారిని మన్నాతో పోషించాడు.
నిర్గమకాండము 16:1-36; సంఖ్యాకాండము 11:7-9; యెహోషువ 5:10-12.


ప్రశ్నలు

  • చిత్రంలోని ప్రజలు నేలపై నుండి ఏమి ఏరుకుంటున్నారు, దాని పేరేమిటి?
  • మన్నా ఏరుకోవడానికి సంబంధించి మోషే ప్రజలకు ఏ ఉపదేశాలు ఇచ్చాడు?
  • ఆరవ దినమున ఏమి చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు, ఎందుకు అలా చెప్పాడు?
  • ఏడవ రోజు కోసం మన్నాను దాచుకున్నప్పుడు యెహోవా ఏ అద్భుతం చేశాడు?
  • యెహోవా ఎంతకాలం వరకు ప్రజలకు మన్నా దయచేశాడు?

అదనపు ప్రశ్నలు

  • నిర్గమకాండము 16:1-36; సంఖ్యాకాండము 11:7-9 చదవండి.
    క్రైస్తవ సంఘంలో దైవపరిపాలనా ఏర్పాటు కోసం నియమించబడినవారిని గౌరవించడం విషయంలో నిర్గమకాండము 16:8 ఏమి చూపిస్తోంది? (హెబ్రీ. 13:17)
    అరణ్యప్రాంతంలో ఇశ్రాయేలీయులు యెహోవాపై ఆధారపడాలనే విషయం వాళ్ళకు రోజూ ఎలా గుర్తుచేయబడేది? (నిర్గ. 16:14-16, 35; ద్వితీ. 8:2, 3)
    యేసు మన్నాకు ఎలాంటి సూచనార్థక భావాన్ని తెలియజేశాడు, ఈ ‘పరలోక ఆహారం’ నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? (యోహా. 6:31-35, 40)
  • యెహోషువ 5:10-12 చదవండి.
    ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలపాటు మన్నాను తిన్నారు, అది వాళ్ళను ఎలా పరీక్షించింది, మనం ఈ వృత్తాంతం నుండి ఏమి నేర్చుకోవచ్చు? (నిర్గ. 16:35; సంఖ్యా. 11:4-6; 1 కొరిం. 10:10, 1

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget