Halloween Costume ideas 2015

To be released from Egypt to Israel's First King 3rd

3వ భాగం: ఐగుప్తునుండి విడుదల చేయబడడం మొదలుకొని ఇశ్రాయేలీయుల మొదటి రాజు వరకు
మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరనుండి సీనాయి పర్వతం దగ్గరకు నడిపించాడు, అక్కడ దేవుడు వాళ్ళకు తన నియమాలను ఇచ్చాడు. తర్వాత మోషే కనాను దేశాన్ని వేగు చూడడానికి 12 మందిని పంపించాడు. అయితే వారిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోవడమే మంచిదని ప్రజలు భావించేలా చేశారు. ఇశ్రాయేలీయులు విశ్వాసం లేకుండా ప్రవర్తించినందుకు దేవుడు వాళ్ళను 40 సంవత్సరాలపాటు అరణ్యంలో సంచరించేలా చేసి శిక్షించాడు.

చివరకు, ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపించడానికి యెహోషువ ఎన్నుకోబడ్డాడు. వాళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి సహాయం చేసేందుకు యెహోవా అద్భుతాలు చేశాడు. ఆయన యొర్దాను నది ప్రవహించకుండా ఆపుచేశాడు, యెరికో గోడలు కూలిపోయేలా చేశాడు, ఓ రోజంతా సూర్యుడు నిలిచిపోయేలా చేశాడు. ఆరు సంవత్సరాల తరువాత కనానీయులనుండి ఆ దేశం స్వాధీనపర్చుకోబడింది.

యెహోషువతో ఆరంభమై ఇశ్రాయేలు దేశం 356 సంవత్సరాలు న్యాయాధిపతులచేత పరిపాలించబడింది. వాళ్ళలో బారాకు, గిద్యోను, యెఫ్తా, సమ్సోను, సమూయేలులతోపాటు అనేకమంది గురించి మనం తెలుసుకుంటాం. రాహాబు, దెబోరా, యాయేలు, రూతు, నయోమి, దెలీలా వంటి స్త్రీల గురించి కూడా మనం చదువుతాం. మొత్తం 396 సంవత్సరాల చరిత్ర మూడవ భాగంలో వివరించబడింది.



ఈ భాగంలో

34వ కథ: ఒక క్రొత్త రకమైన ఆహారం

35వ కథ: యెహోవా తన నియమాలను ఇవ్వడం

36వ కథ: బంగారు దూడ

37వ కథ: ఆరాధన కోసం ఒక గుడారం

38వ కథ: పన్నెండు మంది వేగులవారు

39వ కథ: అహరోను కర్రకు పువ్వులు పూయడం

40వ కథ: మోషే బండను కొట్టడం

41వ కథ: ఇత్తడి పాము

42వ కథ: గాడిద మాట్లాడడం

43వ కథ: యెహోషువ నాయకుడు కావడం

44వ కథ: రాహాబు వేగులవాళ్ళను దాచిపెట్టడం

45వ కథ: యొర్దాను నది దాటడం

46వ కథ: యెరికో గోడలు

47వ కథ: ఇశ్రాయేలులో దొంగ

48వ కథ: తెలివైన గిబియోనీయులు

49వ కథ: సూర్యుడు అలాగే నిలిచిపోవడం

50వ కథ: ధైర్యంగల ఇద్దరు స్త్రీలు

51వ కథ: రూతు, నయోమి

52వ కథ: గిద్యోను, అతని 300 మంది పురుషులు

53వ కథ: యెఫ్తా వాగ్దానం

54వ కథ: గొప్ప బలంగల వ్యక్తి

55వ కథ: చిన్నపిల్లవాడు దేవుణ్ణి సేవించడం

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget