Halloween Costume ideas 2015

The angels

దేవుని పిల్లలపై దేవ దూతల భద్రత వ్యవస్థ...

దేవుని పిల్లలపై దేవ దూతల భద్రత వ్యవస్థ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను .
దేవుని కొరకు బ్రతికేవాడు దేవునికి ఎలా ప్రాముఖ్యమైన వాడో ,దేవుడే వారిని కావాలి అని అనుకుని ఎలా దేవదూతల భద్రత వ్యవస్థల మధ్య కాపాడుతున్నడోన్న వివరణ ఈ పాఠం యొక్క ఉద్దేశం..కనుక ప్రతి మాటను ఆలోచిస్తూ చదవగలరు. దేవుని గూర్చి సరియైన అవగాహన లేకపోవుట వలన నేడు సమాజములో దేవుని కొరకు బ్రతికే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. కేవలం అవసరాలకు మాత్రమే దేవునిని నమ్ముకుని ,ఆ తర్వాత విడిచిపెట్టాక దేవుడు అనగా ఒక చిన్న చూపుతో దేవుని కొరకు బ్రతికే విషయములో ప్రతి మనిషి చిన్నగానే ఆలోచిస్తున్నాడు. దేవుని కోసం బ్రతుకే తన పిల్లలైనా వారి పట్ల కపుదల,జాగ్రతలు ఎలానో మనం ఆలోచిస్తే భూమి మీద ముఖ్యమైన వారు అని అనుకుంటున్న వారందరి కంటే దేవుని పిల్లలే ముఖ్యమైన వారు అని ఒప్పుకొని తీరాలి...

ఈ రోజు లోకంలో ప్రజలను పరిపాలించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రజలను రక్షించవలసిన భాద్యత ఎంతగానో ఉన్నదీ. ప్రభుత్వంలో ఉన్న ప్రాముఖ్యమైన వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భద్రత ఏర్పాటును కలిగియుండుట మనకు తెలుసు. అనగా ప్రజలను గూర్చి ఆలోచిస్తున్న,పరిపాలిస్తున్న ముఖ్యమైన వారికీ భద్రత గురించి అలోచించి భద్రత వ్యవస్థను ఇస్తారు. ఈ రోజు ఒక mla, mp,cm,pm ఇలా ప్రాముఖమైన వారి భద్రత కొరకు ఆధునికమైన టెక్నాలజీతో వారిని కాపాడడానికి ప్రభుత్వం చేస్తున్నవన్నీ మనకు తెలుసు. ఎప్పుడు ఏమి జరిగుతుందో అని వారినీ భద్రతగా కాపాడుతారు. భూమి మీద ఉంటున్న ప్రాముఖ్యమైన వారి యొక్క భద్రత వ్యవస్థ మనకు కనపడుతుంది.. ఈ భూమి మీద ఉన్న వారందరు దేవునికి పిల్లలని మర్చిపోకూడదు. ప్రారంభములో దేవుడు ఆదామును కని,ఆ తర్వాత మన అందరిని కని ప్రతివారిని తన కుమార్తెగా ,కుమారుడుగా పిలుచుకుంటున్నాడు. దేవుడు పుట్టిన వారందరి గూర్చి ఆలోచిస్తున్నాడు మరియు పుట్టిన వారిలో మళ్ళి తన కొరకు ప్రత్యేకముగా బ్రతుకుతున్న వారి గూర్చి ఇంకా ఎక్కువుగా ఆలోచిస్తున్నాడు.... ఎలాగైతే ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ & అలానే ప్రభుత్వంలో ఉంటున్న ప్రాముఖ్యమైన వారిని గూర్చి ఆలోచిస్తుందో అలాగే దేవుడు కూడా మన అందరి గురించి ఆలోచిస్తూ & తన కొరకు బ్రతికే ప్రత్యేకమైన తన పిల్లలపై అయన ఆలోచిస్తున్నాడు. తన పిల్లలు ఈ భూమిపై ఉండటం వలన అనేక మందిని తనను తెలుసుకునే మహా భాగ్యం కలుగుతుంది కనుక తన పని చేసే వారి పట్ల దేవుడు భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా bible నందు చూస్తే మనం అర్చర్యపోక తప్పదు.

మనమందరము దేవుని వలన పుట్టిన వాళ్ళమే. యోహాను 1:13-దేవుని వలన పుట్టిన వారే గానీ, రక్తము వలనైనను, శారిరేచ్చల వలనైనను పుట్టిన వారు కారు. దేవుని వలన పుట్టటం అంటే మనం ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మనిషి తాను పాపి అని గ్రహించి, దేవుని వాక్యమును విశ్వసించి,మరు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు మళ్ళి పుట్టినట్టు. యోహాను 3:3-ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిర్చయముగా చెప్పుచున్నాను అని అనెను. అంటే క్రొత్తగా జన్మించాలి అంటే మళ్ళి పుట్టాలి. మళ్ళి పుట్టటం అంటే దేవునిలోకి రావటం. దేవుడు అందరి గురించి ఆలోచిస్తూ మరియు అందరిలో తన కొరకు బ్రతుకుతున్న వారి కొరకు ఎక్కువుగా ఆలోచిస్తున్నాడు. అందరి గురించి ఆలోచించటం అంటే ఈ భూమి మీద మానవ ఆయుష్షు కాలములో ఎన్నో ప్రమాదాలు నుంచి తప్పించబడుతాము. తప్పించబడుతున్నాము అంటే మన తెలివి తేటలు బట్టి కాదు. మరి కొంత మంది ఫలానా సమయమున అదృష్టవశాత్తు తప్పించబడ్డాను అని అంటారు. నిజముగా మన అదృష్టం వలన కానీ, తెలివి తేటల వలన కానీ మనం ప్రమాదాల నుండి కాపాడబడటం లేదు గానీ దేవుడే ఈ ప్రపంచం మీదకు పంపిన మనల్ని పుట్టిన దగ్గర నుండి చావు వరకు ప్రతి ఒక్కరికి భద్రత ఏర్పాటు చేసాడు..

ఎందుకు భద్రత ఇస్తున్నాడు అంటే ఇచ్చిన ఆయుష్షు కలంతో ఈ భూమి మీద మనిషి తన కొరకు బ్రతకాలని. ఈ రోజు ప్రకృతి ఇంత చక్కగా మనిషికి సహకరిస్తుంది అంటే దానికి కారణం దేవుని కొరకు బ్రతుకుతారని.. తన కొరకు బ్రతికే వారి విషయం గూర్చి ఆలోచిస్తే దేవుడు రెట్టింపు భద్రతతో తన పిల్లలను కాపాడుకోవటంలో అయన ఉన్నాడు. తన పిల్లలపై భద్రత ఎలా ఉంటుందో bible నందు చూస్తే అర్థమవుతుంది. ఎవరైతే మారుమనస్సు పొంది క్రొత్తగా జన్మించి దేవుని కొరకు బ్రతికే వారి పట్ల దేవుడు తన సేవకులైన దేవ దూతలను మనకు భద్రత వ్యవస్థగా విభాగించి మన కొరకు పనిలో పెట్టాడన్నవాస్తవాలు తెలియాలి.

ఈ సమాజము వారు ఈ లోకములో ఉన్న వారిని ముఖ్యమైన వారుగా అనుకుంటున్నారు కానీ దేవుని కొరకు బ్రతుకుతున్న వారే దేవునికి ముఖ్యమైన వారు. మత్తాయి18:10- ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణికరింపకుండ చూచుకొనుడి.వీరి దూతలు ,పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుదురని మీతో చెప్పుచున్నాను... అంటే భూమి మీద మనం ఉంటె, మనకు సంభందించిన కొన్ని దేవదూతలు పరలోకములో మన తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తున్నాయి. అనగా మన దూతలు తండ్రిని ఎందుకు చూడాలి??? మనకు సంభందించిన కొన్ని దూతలు తండ్రి ముఖాన్ని ఎందుకు చూడాలి అంటే మన కొరకు దేవుడు order వేయగానే మన భద్రత వ్యవస్థను సమిక్షించడానికి దేవ దూతలు తండ్రి ముఖాన్ని చూస్తున్నాయి. దేవదూతలు అనగా కేవలం దేవునికి మాత్రం సేవ చేస్తాయి అని అనుకుంటే పొరపాటు. దేవుడు ప్రతి వ్యక్తికి దేవదూతలను నియమించి మనలను భద్రత వ్యవస్థలో అయన ఉంచుతున్నాడు. మత్తాయి 26:52,53- ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకోనలేననియు,వేడుకోనిన యెడల అయన పండ్రెండు సేనా వ్యూహము కంటే(1 వ్యూహము=6000 దూతలు=72000 దూతలు) ఎక్కువ మంది ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నవా? యేసుకి సంభందించిన కొన్న దూతలు తండ్రి ముఖాన్ని చూస్తూ ఉన్నవి. అంటే యేసు గురించి తండ్రి ఏమన్నా order వేయగానే వెంటనే భూమి మీదకు వచ్చిన భద్రతను కల్పించడానికి పరలోకంలో ఉన్న దూతల భూమి మీద ఉన్న మనిషి కొరకు ఏర్పాటు చేయబడింది అన్న సంగతి నిజముగా bible నందు ఆలోచిస్తే చాలా అర్చర్యంగా ఉంటుంది. దేవుని కోసం బ్రతుకుతున్న మనికి భూమి మీద మనకు ఏమి లేఖపోవచ్చు కానీ పరలోకములో దేవదుతల భద్రత వ్యవస్థ మధ్య మనం ఉన్నామన్న సంగతి యేసు మాట్లాడిన పై వచనము యొక్క మాట బట్టి అర్థమవుతుంది. దేవుని పనిలో ఉన్న ముఖ్యమైన వారికీ ఎల్లప్పుడూ అన్ని విధాలుగా భద్రత ఉంటుంది.

దేవుని కొరకు బ్రతకటంలో దేవునికి నువ్వు ,నేను ముఖ్యమైన వాడు అయితే ముఖ్యమైన వాడిగా ఎదుగుతున్నంత సేపు ఈ భద్రత పరలోకంలో పెరుగుతూ వస్తుంది. పరలోకములో ఉంటున్న దేవదూతలు కేవలం దేవుని కొరకే కాక భూమి మీద ఉంటున్న మన కొరకు భాద్రతనివ్వటానికి తండ్రి ముఖమును ఎల్లప్పడు చూస్తున్నది దేవదూతలు ఎలా భద్రతనిస్తాయో కొన్ని సందర్భాలు చూస్తే దానియేలు 3:22-25-షడ్రకు,మేషాకు,అబెద్నేగో లను విసిరి వేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కల్చబడి కాల్చబడి చనిపోయిరి. షడ్రకు,మేషాకు,అబెద్నేగోయను ఆ ముగ్గరు వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా.

మనిషి చంపాలనుకున్నా దేవుడు కాపాడాలనుకుంటే ఆ మనిషిని ఎవ్వరూ ఏమి చేయలేరు. ఒక వేళ దేవుడే మనిషిని చంపాలనుకున్నా ఈ భూమిపై ఎంత భద్రత వ్యవస్థ ఉన్నను ఎవ్వరూ కాపాడలేరు. ఈ ముగ్గురు విస్వసులను గూర్చి మనం ఆలోచించినప్పుడు పరలోకం నుండి దేవ దూత భూమి మీద దిగి వచ్చి వారితో పాటు అగ్ని గుండములో ఉండుట రాజు చూసి కలవరిపోయాడు. దేవుని కోసం బ్రతుకుతున్న వాడు లోకానికి చిన్ని వాడేమో కానీ దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు. ఎందుకంటే దేవదూతలు భూమి మీదకు దిగి వచ్చి కాపాడుతున్నాయి అంటే గొప్ప సంగతి భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్న వారికీ కంటికి కనబడని భద్రత వ్యవస్థ పరలోకములో దేవదుతల రూపంలో మనకు పెట్టినట్లుగా అర్థమవుతుంది. అందుకే మనం ప్రమాదాల నుండి కాపాడబడుతున్నాము.

సువార్త వెళ్లి వస్తున్నప్పుడు కానీ, దేవుని పనిలో ఉన్నప్పుడు ఎన్నో ప్రమాదాలు నుండి తప్పించబడుటకు కారణం మన తెలివి తేటలు కాదు and అదృష్టం కాదు. మనం దేవుని పనిలో ఉన్నాము గనుక నిన్ను కాపాడటం అయన భాద్యతగా తీసుకున్నాడు. ఎందుకంటే సమాజానికి దేవుని పిల్లల అవసరత ఉన్నదీ కాబట్టి. మత్తాయి 4:5,6-నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము –అయన నిన్ను గూర్చి తన దూతలకూ అజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు....... అనగా దేవుడు తన పిల్లలను కాపాడుకుంటాడు అన్న సంగతి సాతానికి కూడ తెలుసు.

ఒక వేళ దేవుడే కాపాడకపోతే అస్సలు దేవుని పిల్లలు ఈ భూమి పై ఉండగలరా?ఉండలేరు. ఎన్ని ప్రమాదాలు,ఎన్ని రోగాలు విటినన్నిటి మధ్య దేవుని కొరకు బ్రతికే వారు ఉంటె అయన భద్రత మనకు కావాలి. యోబు 2:6- యెబు ప్రాణం పై దేవుడు భద్రత ఉంచాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు గనుకనే భూమి మీద మనం దిన దినము బ్రతుకుతున్నాం. దేవుని కొరకు పని చేస్తున్న నువ్వు లేక నేను దేవుని పని గురించి ఆలోచించాలే తప్ప మనల్ని గురించి కాపాడుకోవాలనే ఆలోచన ఉండవలసిన అవసరత లేదు. కీర్తనలు 121:4- దేవుడు కాపాడుతున్న ఇశ్రాయేలు గురించి ఆలోచిస్తే ఇంచు మించు 40 years అరణ్యములో ఉన్నారు.

ఉన్న ఎలాంటి రోగం, ఇబ్బంది లేదు. వీరిని కాపాడింది దేవుడు. చీకటి వల్ల వారికీ ఇబ్బంది కలుగకుండా అగ్ని స్థంబాన్ని పెట్టాడు. ఎండ వాళ్ళ వారికీ ఇబ్బంది కలుగకుండా మేఘ స్థంబాన్ని పెట్టాడు. 40 years దేవుడు సంరక్షించాడు. దేవుని కాపుదలలో ఉన్న మనిషి దేవుని పనిలో ఉండాలి. మనల్ని నిత్యము కాపాడుతున్నది అయన పనిలో ఉండాలని and మనలని ఆరోగ్యంగా ఉంచుతున్నది అయన పనిలో ఉండాలని. ఇంత భద్రత కలిగిన మనం భద్రత ఉంది కదా అని దేవుని పని మానేసి జీవిస్తే దేవుడు భద్రత నుండి నిన్ను తీసేస్తే ఉండగలమా???? దేవుడు మనల్ని కాపాడే పనిలో ఉన్నాడు గనుక మనం కూడ నశించిపోతున్న ఆత్మలను కాపాడే పనిలో ఉండాలి.

Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget