Halloween Costume ideas 2015

O manishi! Nee Janma Dhinam Rahasyama?

ఓ మనిషీ! నీ జన్మ దినం రహస్యమా?
ఓ మనిషీ! నీ జన్మ దినం రహస్యమా?
యేసుక్రీస్తు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను
1) నేటి ఆధునిక ప్రపంచములో ఏ దేశంలో చూసిన ప్రజలు వారితో పాటు వారి భంధువుల యొక్కయు ,నాయకుల,అభిమానుల,అధికారుల యొక్కయు జన్మ దినం(జయంతి) ,మరణ దినం(వర్ధంతి) స్మరించుట మనం చూస్తున్నాము. అలాగే వారు నమ్మిన దేవుళ్ళకి కూడా జయంతి, వర్ధంతులను జరిపించడం సర్వసాదారణ విషయం.మనిషి జన్మ బహు గొప్పది. తనకన్నా ముందు పుట్టిన ప్రకృతి నుండి తీయబడిన శరీరాన్ని ధరించుకుని, అదే ప్రకృతిపై పెత్తనం చేలాయించుట అనేది నిజముగా అదృష్టం. ఏవరికి అంతుబట్టని ఈ అపురూపమైన శరీరాన్ని ధరించుకోవటానికి వెనుక ఎంతటి పోరాటం జరిగిందో ఒకసారి ఆలోచిస్తే మతి పోతుంది.

2) ఉదాహరణకు ఒక మామిడి చెట్టును చూద్దాం. దాని పుతకాలంలో ఆకులే కనబడనంతగా కోట్ల సంఖ్యలో పూస్తుంది. కానీ పువ్వు అంత కాయలుగా మారుతాయా???? ప్రకృతి ప్రభావముతో ఎన్నో లక్షల పూలు నెల రాలిపోగా వేల సంఖ్యలో పిందెలుగా మారుతాయి. ఆ పిందెలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుని వందల సంఖ్యలో మాత్రమే కాయలుగా ఇస్తున్నాయి. అవన్నీ పండ్లు అవుతాయా అంటే లేదు. ఎన్నో కారణాల చేత చాలా నేలరాలిపోగా లెక్కపెట్టే సంఖ్యలో కొన్ని మాత్రమే పండ్లుగా మారుతాయి. ఇప్పుడు నరుల పుట్టుక గూర్చి ఆలోచిద్దాం.... పెండ్లి అయిన దంపతులు దేవుని ఆజ్ఞ-ఆశీర్వాదం ప్రకారం ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు పురుషుని నుండి కోట్లాది జివ కణాలు( X,Y CHROMOSOMES) స్త్రీ గర్భాములోకి వెళ్తాయి. అయితే వారు కలుసుకున్న ప్రతి సారి స్త్రీ అండాశయంలోకి ప్రవేశించి పిండముగా మారుతాయా?
లేదు.ప్రతి సారి కొన్ని కోట్ల జీవ కణాలు నేల రాలుతాయి. ప్రతి నెల స్త్రీ అండం కూడా నెల రాలుతుంది.ఇలా ఎన్నో years నుండి పిల్లలు పుట్టని వారు ఉన్నారు.ఎప్పుడో ఒకసారి దైవ సంకల్పాన్ని బట్టి మాత్రమే స్త్రీ కణం(అండం)తో ఒక పురుష కణం (x గానీ,y గానీ) మాత్రమే కలుసుకుని ఫలదీకరణం చెంది పిండముగా మారుతుంది.అది అడ లేక మగ కావచ్చు. అదే నీవు-నేను ధరించుకున్న ఈ ఆకారం. 3) నీకన్నా ముందు వెనుకల ఎంత మంది నెల రాలిపోయరో పువ్వు రాలినట్టుగా అని ఆలోచిస్తే ఒళ్ళు జలదరిస్తుంది.పిండముగా మారిన బయటికి రాలేక గర్బస్రావంలో పోయిన వారెందరో,ఇలా ఎంతో గట్టి పోటీని తట్టుకుని ఎంతో పోరాటంలో అమ్మ కడుపులోంచి బయటి ప్రపంచానికి వచ్చాం.... కీర్తన 139:14- నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును,అర్చర్యమును నాకు పుట్టుచున్నవి అని దేవుడు తన కుమారుడైన దావీదు ద్వారా పలికించిన మాట అక్షర సత్యం కదు....... ఈనాడు ప్రతి మనిషి దేవునిని వదిలి శాస్త్రం వెంబడి పరుగులు తీస్తున్నాడు.నిజంగా ఏ మానవ జ్ఞానం లేక శాస్త్రం తల్లి గర్భములో శరీరాన్ని నిర్మించగలదో ఆలోచించండి.కంటికి కనబడని అవయవాల సమ్మెళనమై అందమైన ఆకారముగా మారుతుంది. ఈ అవయవాలను దేవుడే(కోరంది 15:37:38) తల్లి గర్భములో తయారు చేస్తున్నాడు. ఈనాడు శాస్త్రాన్ని నమ్ముకున్న మనుషులు శరీరములో ఉన్న leg లేద hand పోతే కృతిమ leg లేక hand తప్ప original leg or hand తయారు చేయలేరు. ఇంకా కన్ను,kidney, heart ఇలా ప్రతి అవయవం దేవుడే తయారు చేసిన చేసాడు కానీ మనిషి చేయలేదు.

4) ప్రపంచములో ఎన్నో కోట్ల మంది మనుషులున్నారు.వాళ్ళను జాగ్రతగా పరిశిలిస్తే అందరికి అవే స్థానాల్లో ముక్కు,నోరు..... ఇలా కనబడే అవయవాలు ఒక్కటిగానే ఉన్నట్టుగా అనిపించినా ఒక్కటిగా ఉండరు. చివరికి కవల పిల్లల్లు అయిన ఎక్కడో ఒక చోట తేడ ఉంటుంది. యోబు 37:7-మనుషులందరు అయన( దేవుని) సృష్టి కార్యములను తెలుసుకోనునట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి అయన ముద్ర వేసియున్నాడు . ప్రపంచం జనాభా సుమారు 700 కోట్లు. వారి చేతి వేలి ముద్రలను పరిశీలించినట్లయితే ఏ ఒక్కరి వేలి ముద్ర మరొకరి వేలి ముద్రతో సరిపోదు.అదే దేవుడిచ్చిన మానవ శరీరం ప్రత్యేకత అని సకల శాస్త్రాలను అధిగమించిన bible ఏనాడో చెప్పిన వాస్తవం.

5) నేటి సర్వ మానవులు ప్రతి ఒక్కరు ఒక ప్రాంతంలోనో,దేశంలోనో,ఇంట్లోనో,ఆసుపత్రిలోనో ,మనుష్యుల సమక్షములో పుట్టుచున్నాం అనుకుని తమ పుట్టిన తేదిని వ్రాయించుకుని ప్రతి దినము లేవ గానే దిన,వార,మాస ఫలాల పేపర్లలో చూసుకుని మురిసిపోతున్నారు.నిజముగా లోకం అనుకుంటున్నా ఈ జన్మ దినం కరెక్ట్ నేనా???? ,మనుష్యులు వ్రాసిన గ్రంధాలను అడిగితే వారి ఆలోచనలు ప్రకారం వ్రాస్తారు గనుక ఒకరు వ్రాసింది మరొకరితో సరిపోదు. అందరిని పుట్టించిన దేవుడిని అడిగితేనే న్యాయముగా ఉంటుంది. కీర్తన 139:15- నేను రహస్య మందు పుట్టినవాడు. క్రి.పూ ఇశ్రాయేలియులను పరిపాలించిన దావీదు మహారాజు దేవుని ప్రేరేపణతో అంటున్న మాటయే అయన రహస్య మందు పుట్టానన్న విషయం. bibleలో కచ్చితముగా చెప్పబడింది అంటే మనుష్యులందరు రహస్యంగానే పుడుతూ ఉండాలి..అది ఎలాగో పరిశిలిద్దాం.

6) తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన దినాన్నే పుట్టిన రోజు అంటున్నాం. కానీ అంతకముందే దాదాపు 9 నెలలు తల్లి గర్బంలో ఉన్నాం అనే సంగతి మర్చిపోతున్నాం. అంతకమునుపు ఎక్కడ ఉన్నాం?? అందులోనికి ఎప్పుడు వచ్చాం?? తల్లి గర్భములోకి రాకమునుపు తండ్రిలో ఉన్నాం. అంటే ప్రతి మనిషి తన తండ్రి ద్వార తల్లి గర్భములో ప్రవేస్తున్నాడు. అందుకే నేటి doctorsనీ అడిగితే అడ,మగ బిడ్డ పుట్టాలన్న నిర్ణయించేది పురుషుడే అని చెబుతారు.. అంటే మనం తండ్రిలో నుండి తల్లిలోనికి ప్రవేశించి తల్లి గర్భములో శరీరాన్ని లేదా ఒక ఆకారాన్ని సంతరించుకుని దాదాపు 9 months తర్వాత బయటి ప్రపంచానికోస్తున్నాం అన్నమాట. “”””””తండ్రిలో నుండి విడిపోయి అనగా తండ్రి కనగా తల్లిలోనికి వచ్చి అండంతో కలిసి పిండంగా మారిన దినమే మనం పుట్టిన దినం””””.తల్లి గర్భమే మన జన్మ స్థలం కానీ ఇండియా కాదు.

7) నిజముగా మన జన్మ దినం రహస్యమే. అది అమ్మకు,నాన్నకు తెలియదు. అమ్మకు నెల రోజుల తర్వాత తెలుస్తుంది.అమ్మ చెబితేనే నాన్నకు తెలుస్తుంది.ఎందుకు తెలియదు?? test చేసి scanning ద్వారా doctor చెబుతాడని వెళితే ఆ కంప్యూటర్ కూడా ఒక వారం ముందు,వెనుక అనగా expected delivery date అని చెబుతుందే తప్ప correct date చెప్పదు.ఎందుకంటే దేవుడే మన పుట్టిన దినం రహస్యం అన్నాడు కాబట్టి మనిషి ఎన్నటికి తెలుసుకోలేడు. ఇది దేవుడి challenge.మనం పుట్టిన దినమే రహస్యమైతే మరి దేవుడి పుట్టిన దినం గూర్చి ఆలోచిస్తే పిచ్చిపడుతుంది

8) దేవుడు bibleలో మరో అద్బుతమైన మాట చెప్పాడు. మన తల్లితండ్రులు అయితే మనల్ని భూప్రపంచాములోనికి వచ్చాక చూస్తారు గానీ ఆయనైతే తల్లి గర్భంలో పిండముగా ఉండి ఆ తర్వాత ప్రతి దినము మన అవయవ నిర్మాణము జరుగుతున్నప్పుడు చూస్తున్నాడు...కిరస్తాన 136:16-నేను పిండమునైయుండగా నీ కన్నులు నన్ను చూచెను..... అంటే మానవ నేత్రానికి కనపడని సుక్ష్మ పిండంగా ఉన్నప్పటినుండి చూస్తున్న దేవుడు నీవు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎక్కడ తిరుగుతున్నావో,ఏమి చేస్తున్నావో చుడడా????? ఎందుకు అంత జాగ్రతగా నిన్ను చూస్తున్నాడు అను అనుకుంటున్నావు?? నీవు అయన కుమారుడవు,సాక్షాత్తు అయన స్వరూపమై ఆయనలోని భాగానివి గనుక. అలాగే నీకు ఒక జీవిత కాలాన్ని ముందే నియమించి ఇక్కడకు పంపుతున్నాడు. కీర్తన 139:16- నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నియు నీ గ్రంధములో లిఖితిములాయెను. నియమింపబడిన దినాలు అనగా జీవితకాలం. అదే ప్రపంచంలోనికి వచ్చిన దినం నుండి ప్రపంచాన్ని వదిలి వచ్చిన చోటికి తిరిగి వెళ్ళడం అనగా మరణ దినం. అదే సమాధి రాయి మీద కనబడే “జననం-మరణం.

9) మరో అద్బుతమైన విషయం చూస్తే మన మరణ దినమేప్పుడో కూడా మనకు తెలియదు.. ఇది. secret. bibleలో అన్ని విషయాలు తెలియజేసిన దేవుడు మన జన్మదిన-మరణ దినాల గూర్చి మనకెందుకు తెలియజేయలేదు అనే ఆలోచన రావొచ్చు.. మన జన్మకు,ఈ జగత్తుకు కారకుడు మన ఆత్మకు భాగము(కీర్తన 16:5) అయన పరమాత్ముడైన తండ్రియగు దేవునికి కూడా జనన-మరణాలు లేవు గనుక. మన తండ్రియైన దేవుడు ఆది-అంతం లేనివాడైతే మనకు ఆది-అంతం ఉంటాయని బ్రమించడం వేర్రితనమే అవుతుంది. దేవుడు ఉన్నవాడు గనుక ఆ ఉన్నవాడిలో నుండే పుట్టుకోనివచ్చి కొద్ది కాలం ఆ మట్టి శరీరంలో,ప్రస్తుతం ఆ భూమి మీద జివించుచూ ఉన్నవారం. ఇందులోనికి రాక ముందు దేవునిలో ఉండేవారం(కీర్తన 90:1).

10) ఈ శరీరాన్ని వదిలినాక కూడా మన క్రియలను బట్టి నరకంలో నిత్యం కాలుతునో,లేక పరలోకంలో నిత్యం అనంధముతోనో ఎక్కడో ఒక చోట తప్పని సరిగా ఉంటాం.. address మాత్రం గల్లంతు కాదు.. అన్ని సంగతులను నిజంగా చెప్పిన bible ఈ విషయం కూడ సత్యమే చెప్పింది.నమ్మటం-నమ్మకపోవటం నీ ఇష్టం. అందుకే మానవ మట్టి బుర్రతో కాక ఆత్మజ్ఞానంతో ఆలోచిస్తేనే తెలుస్తుంది. దేవుడు మన పుట్టుక-చావులను మనకెందుకు రహస్యముగా ఉంచాడో అర్థమయింది .కనుక దేవుడుజీవిత కాలాన్ని వ్యర్ధం చేయకుండా,మనకెందుకు ఈ జన్మనిచ్చాడో అనే దేవుని సంకల్పాన్ని తెలుసుకొని అయన ఆశ,ఆశయాలకను గుణంగా అయన చిత్తాన్ని అను క్షణం నెరవేరుస్తూ మట్టి లోకంలో మనిషిగా బ్రతికినంత కాలం నీలోని దైవత్వాన్ని ప్రపంచ ప్రజలకు చూపాలి.

11) మనిషి సృష్టించలేని ,ఎక్కడ తెలుసుకోలేని అమూల్యమైన కాలాన్ని సరిగ్గా ఆ దేవుని కోసం ఉపయోగిస్తే నీకు,నీ కుటుంబానికి,నీ దేశానికి ఆఖరున నిన్ను కనిన దేవునికి కూడా ఎంతో మేలు చేసిన వాడివి అవుతావు. ఇంకా ఎన్నో వేల years అయిన ఈ శాస్త్రవేత్తలు ,మేధావులు,ఇంకా ఎవ్వరైనా తెలుసుకోలేని ఎన్నో నిగుడమైన సంగతులను దేవుడు తన పిల్లలైనా వారి కోసం ఎన్నో వేల years క్రితమే తన మాటలైనా పరిశుద్ద గ్రంథమని పిలువబడే bibleలో వ్రాయించి ఆ తర్వాత వాటిని ముద్రించి భావితరాల కోసం భద్రం చేసాడు.వాటిని తెలుసుకుని,గ్రహించి వాటి ప్రకారం ప్రవర్తించి దేవునితో పాటు దేవలోకం లేక పరలోకంలో నిత్యము ఆనందముతో జీవించాలనే ఆశ,ఆశయం,తపనతో ఉండాలి





Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget