అవసరాలకేనా దేవుడు?
మన ఆత్మలను నరకం నుండి పరలోకానికి తప్పించుటకు వచ్చిన యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభములు తెలియజేస్తున్నాను.
1) భూమి మీద వాక్యానుసారమైన విశ్వాసం కలిగి ఉండువారు చాలా కొద్దిమంది అనే చెప్పాలి. తమకు మేలు జరిగినందుకే క్రీస్తును నమ్మామని చెప్పుకుంటూన్నారంటే వీరు స్వార్ధంతోనే క్రీస్తును నమ్మారని మనకి అర్థమవుతుంది. ఒక వేళ తమకు ఆ మేలే జరగకపోతే ఖచ్చితంగా వీరు దేవునిని నమ్ముకునే వారు కాదేమో. అవసరాల కొరకై తండ్రిని వాడుకునే వారు పిల్లలు కాగలరా??? నీ పరలోకపు తండ్రి ద్వారా నీకు ఒక వేళ మేలు జరగకపోతే ఆయనను తండ్రిగా స్వికరించలేవా? వీరి మనస్సులను పరిశిలించినట్లు అయితే కేవలం శరీర సంభంధమైన స్వార్ధంతో కూడిన ప్రేమను కలిగి దేవుని నమ్మారనుటకు సందేహం లేదు. 1 కోరంది 15:19- ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తు నందు నీరిక్షించువారమైన యెడల మనుష్యులందరికంటే దౌర్బాగ్యులమై యుందుము. అనగా ఈ కొద్ది చిన్నపాటి జీవితకాలంలో శరీర అవసరాలను తీర్చుకొనుటకే మనం క్రీస్తును నమ్మి, నీరిక్షించువారమైన యెడల ప్రపంచ మానవులందరి కంటే దేవుని దృష్టిలో దౌర్బాగ్యులు అవ్వుతామని దేవుడు చెబుతున్నాడు. తమ తండ్రి వలన మేలు జరుగుతుంది అని తండ్రిని నమ్మే పిల్లలు అయన పిల్లలు కారు. దేవుడు అన్ని సందర్భాలలోనూ మేలునే జరిగిస్తాడనుకుంటే అది పొరపాటు. అయన నిన్ను ఎప్పుడైనా పరిక్షించినచో కీడును అనుభవించటానికైనా సిద్దంగా ఉండాలని బైబిల్ చెబుతుంది.
2) యోబు 2:10- అందుకు యోబు-మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా,కీడును మనము అనుభవింప తగదా అనెను. పై మాటలోని సారాన్ని నేటి క్రైస్తవ్యం నిజంగా గ్రహించగలిగితే దేవుని వలన మేలులు అనుభవించడానికి అలవాటు పడ్డ వీరు ఇక మీదట కీడును కూడా అనుభవించటానికి సిద్దపడాలని అర్థమగుచున్నది.. మేలు జరిగితేనే దేవునిని నమ్ముతావా? లేకుంటే నమ్మవా??? నీకు ఉద్యోగం వచ్చింది గనుక ప్రభువును నమ్ముకున్నావని చెప్పుకుంటున్న నీవు ఒకవేళ రోగమే ముదిరితే ప్రభువును స్వికరించవా????తీరా ప్రభువును నమ్ముకున్న తర్వాత ఉన్న ఉద్యోగం పోతే ,లేని రోగం నీకు వస్తే, నీ బిడ్డలు చనిపోతే నమ్మిన ప్రభువును వదిలేస్తావా? కేవలం మేలులను అనుభవించడానికే సిద్దపడ్డ ఈ క్రైస్తవులు అస్సలు క్రైస్తవులoటారా?