Halloween Costume ideas 2015

Pray for the Healing

నూనే రాచి శరీర స్వస్థత కోసం ప్రార్ధనలు చేయడం వాక్యానుసరమా?
నూనే రాచి శరీర స్వస్థత కోసం ప్రార్ధనలు చేయడం వాక్యానుసరమా?
ముందుగా పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) ఈ రోజుల్లో ఆదివారమున ఆరాధనలలోగానీ ,సువార్త స్వస్థత మహా సభల్లోగానీ ,మరి ప్రత్యేకముగా శుక్రవారం లేదా శనివారమున స్వస్థత ప్రార్ధనలలోగానీ ఎక్కడ చూసినను నూనే రాచి శరీర స్వస్థత కోసం ప్రార్ధనలు చేయడం మనం చూస్తున్నాము. ఇంకా కొబ్బరి చెట్లకు కాసే కాయల్లో తీయటి నీటి కోసం , చీడ పురుగు పట్టిన పంట పొలాల మీద, పాలియ్యని ఆవులు, గేదెలు మీద ప్రార్ధించిన నూనేను జల్లటం(spray) మనం చూస్తున్నాము. తిమోతి 4:1-కడవరి దినములలో కొందరు అబద్దికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును, దయ్యముల భోద యందును లక్ష్యముంచి,విశ్వాస బ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.. ప్రార్ధన చేసిన నూనే అని అమాయకముగా అతి భక్తితో తీసుకుంటున్నారే గానీ నూనే సీసా కోసం ప్రార్ధన చేయాలా? ప్రార్ధన చేస్తే ఎవరు చేయాలి?? ఎందుకు చేయాలి??? bibleలో అలాగుందో లేదో అని అలోచించే వారు కరువయ్యారు.

2) ఈ విషయాలన్నీ జాగ్రతగా bible నందు పరిశీలించి,పరిశోధించి bibleనీ చదివి అర్థం చేసుకుని,భవిష్యత్తులోనైనా అనేకులు బలికాకుండా దయ్యపు మాయలో పడిపోయినవారు వాక్యానికి దూరం కాకుండా ఉండేట్టు చూద్దాం. యాకోబు 5:14-16-మిలో ఎవడైనను రోగియై ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనే రాచి అతని కొరకు ప్రార్ధన చేయవలెను.విశ్వాస సహితమైన ప్రార్ధన ఆ రోగిని స్వస్థపరచును.ప్రభువు అతనిని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును.... ఇక్కడ నూనే రాచి ప్రార్ధన చేయవలెను అని మాత్రమే ఉంది. అయితే ఎక్కడ రాయాలి ఈ నునెను, అది కూడ కొబ్బరి నూనే అని గానీ,ఆలివ్ నూనే అని గానీ bibleలో లేదు.మరి ఏ ఆధారంతో ఈ కొబ్బరి నూనే రాయడం లేక త్రాగించడం లేక జల్లటం చేస్తున్నారు నేడు భోదకులు?

3) పై లేఖన బాగాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. మిలో ఎవడైనను రోగియై ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను అని ఉంది. అంటే అతడు సంఘ పెద్దల యొద్దకు వెళ్ళకూడదు కానీ పిలుపు నందుకున్న పెద్దలే అతనింటికి రావాలి. సంఘ పెద్దలనగా వారికీ కొన్ని అర్హతలు ఉన్నాయి. కానీ నేటి సంఘాలలో డబ్బున్న వారిని,పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారిని,పలుకుబడిన రాజకీయ నాయకులను, ఐఏఎస్,IPS లాంటి వారిని సంఘ పెద్దలుగా ఎంపిక చేయుచున్నారు. bible ప్రకారముగా పెద్ద అనగా (తితు1:5-9,1 తిమోతి 3:1-7) ఏక పత్ని పురుషుడు, విశ్వాసులైన పిల్లలు గలవాడు, నిందారహితుడు ,అతిధి ప్రియుడు,తాను హిత భోద విషయమై జనులను హెచ్చరించుటకు,ఎదురాడు వారి మాట కండించుటకు శక్తి గలవాడగునట్లు ,ఉపదేశము అనుసరించి నమ్మదగిన భోదను గట్టిగా చేపట్టువాడై ఉండవలెను.... అంతేకాని డబ్బున్న వారిని,పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారిని,పలుకుబడిన రాజకీయ నాయకులను, ఐఏఎస్,IPS లాంటి వారు సంఘ పెద్దలు కాదు. 4) పైన చెప్పబడిన అర్హతలు గల సంఘ పెద్దలు కోసం ముందు వెతకాలి. నేటి సంఘాలలో కాగడా పెట్టి వాక్యముతో వెతికినా నేడు ఒక్కరు కూడా కనిపించటం కష్టము.మన మధ్యలో ఉన్న సంఘాలు ఎంతటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళాయో అని ఒక్కసారి వాక్యంతో ఆలోచించండి. ఇది అంత సాతాను తంత్రము అని గమనించగలరు. ఈరోజుల్లో జరపబడుతున్న స్వస్థత సభలలోను,శుక్ర లేక శనివారపు స్వస్థత కూడికలోను జరిపే ప్రార్ధన లేక ఆరాధన కూడికలోను భోదకులు నూనే రాచి లేదా నూనే సీసాల కోసం ప్రార్ధన చేసి ఇవ్వడం వలన నిజమైన స్వస్థతలు (హాస్పిటల్స్ లో జరిగిన విధముగా) జరుగుట లేదు. ఆ స్థలములో కొద్ది సేపు స్వస్థత జరిగినట్టుగా అనుభూతి కలుగుతుంది. తిరిగి వారు ఇంటికేళ్ళాక యదా స్థితి కొనసాగుతుంది( 2తేస్సా 2:9-12,మత్తయి 24:24).

5) సంఘ పెద్దలు నూనే రాచి ప్రార్ధన చేయాలని bibleలో ఉంటె నేడు సంఘకాపరులు ,సువార్తికులు మాత్రమే నూనే వ్రాయుచున్నారు. ఎక్కడ సంఘ పెద్దలు నూనే రాచిన దాఖలాలు కనబడుట లేదు. మరియు నూనే రాచిన తరువాత ప్రార్ధన చేయాలని వాక్యంలో ఉంటె ,ప్రార్ధించిన నూనేను రాయుచున్నారు. ఇంటి కేళ్ళాక ఆ రోగులనే తమ చేతులతో రాసుకోమంటున్నారు లేదా తాగమంటున్నారు. పంటల మీద జల్లమంటున్నారు.మరి కొందరు వారి వ్యాపారాభివృద్ది కోసం ప్రార్ధించిన నూనే సీసాలను parcelలో పంపుతున్నారు. ఈ సభలలో నూనే రాచే వాడిని ,రాయించుకునే వారిని చూడండి వారిద్దిరిది ఒకే సంఘం కాదు,ఒకే ఊరు ,ఒకే ప్రాంతం కూడా కాదు. నూనే రాచే వాడు ఏ సంఘానికి పెద్దో ఎవరికీ తెలియదు. bibleలో చెప్పబడిన అర్హతలన్నీ ఉన్నాయా అని ఏవరు ఆలోచించుట లేదు. 6) కొబ్బరి నూనే అని bibleలో లేకపోయినా ఆ నూనెనే ఆపవాది ఎందుకు ప్రవేశపెట్టాడో తెలుసా?ప్రార్ధన చేయక పోయిన మాములుగా తగిలిన గాయాలకు,కాలిన గాయాలకు, మరికొన్ని పుండ్లు,పగుళ్ళు మొదలైన వాటికీ కొబ్బరి నూనే రాస్తే త్వరగా నయం అవుతుంది.

7) దేవుని వాక్యానికి ఎంత భయంకరమైన అన్యాయం జరిగిపోతుంది???? అన్ని రోగాలకు నూనే రాస్తే సరిపోతుందా???( ఎపెండిసైటిస్ వస్తే నూనే రాయకూడదు కానీ 24 గంటల్లో operation చేయాలి). గుండె వాల్వులు బ్లాక్ అయిపోతే నూనే రాయకూడదు కానీ భైపాస్ సర్జరీ చేయాలి. accidentలో కాలు విరిగితే లోపల steel rod వేసి కుట్లు వేయాలి కానీ కొబ్బరి నూనే రాస్తే అతకదు. sugar వ్యాధి వస్తే రెండు పూటల insulin ఇవ్వాలి కానీ కొబ్బరి నూనెనే injectionగా ఇవ్వకూడదు. ఇంకా kidneyలో కానీ bladderలో కానీ రాళ్ళూ వస్తే operation చేసి తీసివేయలి కానీ ఇలా ఎన్నో రోగాలకు నూనే రాయకూడదు,త్రాగాకుడదు. ఎయిడ్స్ వస్తే మందులు కూడా లేవు కానీ మరణమే గతి.
8) ప్రకృతి నుండి తీయబడిన శరీరానికి రోగం వస్తే,ప్రకృతి నుండి తీయబడిన మందే గతి. నేడు మనకందరికీ(దేవున్ని నమ్మిన వారికీ, నమ్మని వారికీ) స్వస్థతనిస్తున్న మందులన్నీ దేవుడు సృష్టించిన ప్రకృతిలోనివే అని మర్చిపోకండి. దేవుడిచ్చిన జ్ఞానంతోనే మందులు కనిపెట్టిన వైద్యుడు రోగాలను నయం చేస్తున్నాడు.రోగులకు వైద్యం అవసరం(మత్తయి 9:12) అని ఆనాడే క్రీస్తు చెప్పాడు. హిజ్కియకూ రోగం వస్తే అంజురపు పండు ముద్ద ఆ పుండుకు కట్టవలేనని దేవుడు చెప్పాడు(యెషయ 38:21).
9) దేవుడు నితిమంతుల మీదను,ఆ నితిమంతుల మీదను, సమానమైన ప్రేమను చూపిస్తున్నాడు.ఎందుకంటే అయన అందరికి తండ్రియైన దేవుడు .అందరి భాగోగులు చూసే వాడు. ఇప్పుడు ఎవరు నమ్మినా,నమ్మలేక పోయినా దేవుని మాట వలన సృష్టించిన ప్రకృతి నుండి తీసిన మందుల ద్వార అందరి రోగాలు బాగుపడుతున్నాయి. ఆకలి రోగమే గానీ కోరిక కాదు. ఆకలనే రోగానికి ఆహారమనే మందు వేయలే గానీ నూనే రాయకూడదు and నూనే త్రాగకూడదు.కంటి చూపుకూ కళ్ళజోడు మందు,కలికి చెప్పు మందు, వంటికి బట్టలు కూడా మందేనని వీటి కొరకు ప్రార్ధన చేయవలసిన అవసరం కానీ,నూనే రాయవలసిన అవసరం కూడా లేదని ఆలోచిస్తే అద్బుతం.
10) నిష్ప్రయోజనమైన ఈ శరీరానికి వచ్చిన రోగాలకు స్వస్థత దొరకకపోయినా ఫర్వ లేదు గానీ ,ఆత్మకు పట్టిన రోగాలకు స్వస్థత కోసం యేసు రక్తాన్నే(వాక్యాన్నే) ఆశ్రయించండి.శరీర రోగంతో చనిపోయినా నిజమైన విశ్వాసం యోబు వాలే ఉంటె పరలోకం వేళతాము గానీ,ఆత్మకు పట్టిన రోగంతో చచ్చిపోతే చివరికి పాతళమే గతి. ఏడు వారలు శరీర స్వస్థత కోసం ,నూనే ప్రార్ధనల కొరకు తిరుగక ఏడ్పును,పండ్లు కొరుకుటలోనికి జారిపోక ,ఆత్మ ఆరిపోకుండా వాక్యమనే నూనెతో నీ ఆత్మను వెలిగించుకో.

Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget