Halloween Costume ideas 2015

Bible anaga nemi? Bible ni ela chadavali ?

Bible అనగా ఏమి? Bible ను ఎలా చదవాలి?
bible అను english పదము BIBLAS or BIBLIA అను Greek పదము నుండి వచ్చినది
ముందుగా ప్రభువు నామములో మీకు, మీ కుటుంబమునకు వందనాలు తెలయాజేస్తున్నాను.
ఎఫేసి 4:5 లో ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తీస్మం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అను సంగతి మనకు అర్థమగుచున్నది.
ఈ రోజులలో సుమారు 3000 denominations ఉన్నాయి. ఒకే bible కలిగిన christians అందరు ఒక్కటిగా లేకుండా ఇలా 3000 denominations గా విడిపోయారు. 10th class, intermediate ,btech ఇలా ఈ degree అయిన pass అవ్వాలంటే కష్టపడాలని తెలుసు. మనిషి ఆలోచనలో నుంచి పుట్టిన books ను నేర్చుకోవాలంటే అర్థము చేసుకోవాలి, కష్టపడాలన్న విషయము మనకు తెలుసు. కనిపించని దేవుని మనస్సు అర్థము చేసుకొనుటకు లేక కనిపించని దేవుని మనస్సులో ఉన్న మాటలను నేర్చుకొనుటకు పెద్దగ కష్టపడాల్సిన అవసరత లేదు అనే భావము తో ఈనాడు ఎక్కువ మంది christians ఉన్నారు. bible లో ఇలా ఉంటే మీరు ఏంటి అలా చేసుకుని చెబుతున్నారు అని అడిగితే ‘’’’ మీ విశ్వాసము మిది, మా విశ్వాసము మాది అంటున్నారు. ఇక్కడ రెండు విశ్వాసాలు వచ్చాయి. ఇంకొకడు కలిస్తే ఇంకొక విశ్వాసము. ఇలా కలుస్తూ పోతే విశ్వాసాలు కూడ పెరుగుతూ పోతాయి. మనకు bible లోని మాటలు అర్థము కాలేదు అంటే ఆ సందర్భము తెలుసుకోడానికోసము మనము కష్టపడలేదని అర్థము. దేవుని వాక్యము కష్టపడి నేర్చుకోవాలి. కష్టపడి నేర్చుకున్న తర్వాతే దేవుని పనికి న్యాయము చేయగిలిన వారము అవుతాము bible అనగా ఏమి??
1) bible అను english పదము BIBLAS or BIBLIA అను greek పదము నుండి వచ్చినది. తెలుగులో పుస్తక సముదాయము అంటారు. 1600 years పాటు సుమారు 40 నుంచి 45 persons రాసారు. రాసిన వారంత వేరు వేరు ప్రాంతాలకు చెందినవారు, వేరు వేరు కాలానికి చెందిన వారు, వేరు వేరు వృత్తులకు చెందినవారు. వేరు వేరు అయినప్పటికీ రాసింది ఒకటే భావము. 2 peter 1:20,21 లో ఒకడు తన ఉహను బట్టి చెప్పుటవలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొట్టమొదట గ్రహించుకోవాలి. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్దాత్మ ద్వార ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి. పై వచనములో మనుష్యుని ఉహను బట్టి కాదని, పరిశుద్దాత్మ దేవుడు ఈ వేరు వేరు వాళ్ళందరి నోట అయన పలికించి వ్రాయించాడే తప్ప ఉహను బట్టి కాదు. దేవుని చేత ప్రేరేపింపగా వారు రాసారు.
2) మొదట ఈ మాటలను చెట్ల బెరడలు( box of trees) పై రాసేవారు. తర్వాత చర్మపు కాగితాల మీద రాయడము జరిగింది. 2 తిమోతి 4:12,13 లో చర్మపు కాగితములను తీసుకుని రమ్ము అను మాట కనపడుతుంది. ఆ రోజులలో చర్మపు కాగితములో రాసుకొని చుట్టలుగా( scrolls) చుట్టి భద్రపరుచుకొనేవారు. luke 4:17:20, హెబ్రీ 10:5 to 7 చూడగలరు.
3) మోషే నాయకుడు ఒక time లో ఉన్నాడు, samual న్యాయాదిపతి ఒక time లో ఉన్నాడు, ఎజ్రా శాస్త్రి ఒక time లో ఉన్నాడు, david గొప్ప రాజు ఒక time లో ఉన్నాడు, దానీయేలు రాజుకు advisor ఒక time లో ఉన్నాడు, peter జాలరి ఒక time లో ఉన్నాడు, luke డాక్టర్ ఒక time లో ఉన్నాడు. ఇలా వేరు వేరు మనుష్యులు, వేరు వేరు వృత్తులుగా, వేరు వేరు time లో ఉన్నపటికీ దేవుని మాటలలో మాత్రము ఒకరికి ఒకరు భిన్నముగా లేకుండా ఒకే భావముతో equal గా పరిశుదత్మ ద్వార రాసారు.

bible ను ఎలా చదవాలి?
1) మొదటగా ఏ style లో ఏ పద్దతి లో ఉందో తెలిస్తే తర్వాత ఎలా చదవాలో అర్థమవుతుంది. ఎలాగు వ్రాయబడిందో అర్థమైతే ఎలా చదవాలో కూడ అర్థము అవుతుంది. యెషయ 28:13 లో కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవ వాక్యము మీకు వచ్చును . అంటే అంత ఒకే చోట లేదు అని కొంత ఇచ్చట, కొంత అచ్చట లో ఉంది అన్న సంగతి అర్థమవుతుంది.
example:: రక్షణ.. ఒక మనిషి రక్షింపబడాలి. రక్షింపబడితే పరలోకము వస్తుందని మనకు తెలుసు. రక్షింపబడలంటే మనిషి ఏమి చేయాలన్న సంగతులు bible లో ఒకే దగ్గర లేదు. రక్షింపబడాలంటే
(a) roma 10:9( యేసు ను ప్రభువు అని agree చేయాలి, యేసు మృతులలో నుండి లేచాడని విస్వసించాలి)
(b) roma 10:13 ( ప్రభువు నామము భట్టి ప్రార్ధన చేయాలి,ప్రభువు నామము బట్టి ప్రార్ధన ద్వార పాపాలు అంగీకరించాలి.
(c) mark 16:16( నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షింపబడతాడు.baptism తీసుకోవాలి.
(d) mathew 24:13 ( అంతము వరకు సహించువాడే రక్షింపబడును.అంతము వరకు సహించాలి.. ఇప్పుడు రక్షణ అనే విషయము తెలుసుకోవాలంటే roma,mark, mathew చదవాలి.
2) యెషయ 34:16 లో పరిశిలించి చదవాలి. john 5:39 లో పరిశోదించాలి.. అంటే పరిశిలించి-పరిశోధించి-అలోచించి-ధ్యానించి-గ్రహించాలి. bible చదివేటప్పుడు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి;
a) TIME FACTOR ( కాలము)- మీరు చదువుచున్న మాట ఏ కాలానికి చెందినదో, వర్తిస్తుందో పరిగనించుకోవాలి.
b) CONTEXT FACTOR( సందర్బము)- సందర్బము పరిగనించుకోవాలి.
c) LANGAUGE FACTOR- భాషను పరిగనించుకోవాలి.

a) time factor ( కాలము)::: 1 peter 1:10,11 లో యే కాలమును, ఎట్టి కాలమును సూచించువచ్చెనో దానిని విచారించి పరిశోదించిరి. example 1:: యెషయ 7:14- ఇది ప్రవచనము. కన్యక గర్బవతియై కుమారుని కాని అతడికి immanual అని పేరు పెట్టును. ఈ వచనము భవిష్యత్ లో నెరవేరుతుంది అని యెషయ చెప్పాడు.
example 2:; యెహోషువా 10:12,13- ఎందుకు యెహోషువా దేవుడు విన్నాడు? మేము పగ తీర్చుకోవాలి అందుకోసము సూర్యుడు నీ భాదించుమని అడిగాడు.. ఎఫేసి 4:26 –సూర్యుడు అస్తమించువరకు మీ కోపము నిలిచిఉండకూడదు.. ఇప్పుడు మనము కోప్పాన్ని అనుచుకొన్న కాలములో ఉన్నామె తప్ప సూర్యుని అపుప్రభువాఅనే కాలము లో లేము.అప్పుడు వ్యబిచారము చేస్తే పాపపు. ఇప్పుడు చూస్తే పాపము.
ఆదాము నుండి మోషే వరకు- పితరుల కాలము, మోషే నుండి jesus వచ్చేవరకు-ధర్మశాస్త్రపు కాలము, after jesus birth నుండి jesus second coming వరకు- కొత్త నిబంధన కాలము.
b) context factor:: ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సందర్భములో ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. అపో 8:30 నుంచి చుడండి.
c) language factor;; mathew 13:24 నుంచి పరలోక రాజ్యము ఉపమానముతో పోల్చాడు. మనుష్యునితో,అవగింజతో,పిండితో,ధనముతో ,ముత్యముతో పోల్చాడు. పై చెప్పబడినవి రుపకాలంకారము తో రాయబడింది. భాష లో ఉన్న భావము అర్థము కావాలి(mathew 9:13,mathew 12:7,luke 24:27,danial 5:24,25)






Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget