Halloween Costume ideas 2015

God no Nammukunnara? Telusukunnara?

దేవుడిని నమ్ముకున్నారా? తెలుసుకున్నారా??
పరలోకానికి వెళ్ళటానికి అనువైన శిక్షణ క్రేంద్రము ఈ భూలోకము
దేవుడిని నమ్ముకున్నారా? తెలుసుకున్నారా?
యేసు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలియజేస్తునాను. 1) ఈ విశాల ప్రపంచములో మనిషిది ఒక విచిత్రమైన జీవితము. ఈ సృష్టిలో మనలాంటి జీవితము ఏ జీవరాశికి ఉండదు. ప్రపంచములోని భయంకరమైన పరిస్థితిలో( బాంబు దాడులు, రాజకీయ హత్యలు, రోడ్డు ప్రమాదాలు, భయంకర రోగాలు ఎన్నో ఎన్నెన్నో) మనిషి ఎలా బ్రతకాలో అని ఆలోచిస్తున్నాడే గానీ, ఎందుకు బ్రతకాలో ఆలోచించుట లేదు. లోకము ఎవరినో కొందరిని మాత్రమే చరిత్ర పురుషులుగా గుర్తించి , మిగిలిన వారికీ ఏ చరిత్ర లేదు అని అనుకుంటున్నారు. నిజముగా ప్రపంచములో పుట్టిన వారందరు చరిత్ర పురుషులే. మనుష్యులందరూ దేవుని కలలు పండించటానికే పుడుతున్నారు. దేవుడు సృష్టినంత పెట్టుబడిగా పెట్టి తన కొరకు బ్రతకాలని దేవుడు మనలను పుట్టిస్తే, మనిషి ఎవరి కొరకు బ్రతుకుచున్నాడో అర్థము లేకుండానే బ్రతికేస్తున్నాడు. 2) దేవుడు భయంకరుడు అని తెలియక changes లేని దేవుని చట్టము ముందు దోషిగా నిలవబడివస్తుంది అన్న సంగతి మరచిపోయారు. విశ్వ రహస్యాలు చేదించటానికి బయలుదేరిన మనిషి తన జీవిత రహస్యాన్ని చేదించలేకపోవుచున్నాడు. మరణము తరువాత ఏమి జరగబోచున్నదో తెలియక ఆడుతూ పడుతూ గెంతుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనందానికి హద్దులు లేవు. జీవితము అంటే వినోదమని and చావు అంటే విషాదమని మాత్రమే లోకానికి తెలుసు. పుట్టుక చావుల మధ్యనున్న కాలము చాలా విలువైనది. ఇది దేవుని కోసము బ్రతకవలసిన కాలము అనగా ఇది దేవుని కాలము. ఈ కాలములో దేవుని గూర్చి తెలుసుకొనవలసిన మనిషి , దేవుని గురించి తప్ప అన్ని తెలుసుకున్నాడు.తెలుసుకుంటున్నాడు. ఎవడో చెప్పిన నోటి మాటను బట్టి కష్టపడకుండా దేవుడిని సులువుగా నమ్ముతున్నారు. ఆ తర్వాత చందాలు collect చేసి ఆయనకు ఒక గుడి , yearకి ఒకసారి ఆ గుడికి పండుగ చేస్తారు. ఇంతటి మహా సృష్టిని కలిగించిన దేవుడు మనిషి నుండి కోరుకునేది ఇంత చిన్నవా??? అందుకే world అంత దేవుని మార్గము తప్పింది.

3) మన ఇష్టానుసారముగా మనము బ్రతకటానికే అయితే ఈ భూమి మీద మనము పుట్టవలసిన పని లేదు.ప్రకృతి మీద చేయి వేసే అధికారము ఉండియుండేది కాదు. మనిషి దేవుని కోసము పుట్టాడు గనుక మనిషికి దేవుడే అధికారము ఇచ్చాడేగానీ , మన తెలివి తేటలు భూమి మీద చూపించుకోవటానికో , మన ప్రతిభను ఇతరులకు చూపించి వారిని ఆకర్షించి గోప్పవాడివిగా మట్టిలో కలిసిపోవటానికి మనము పుట్టలేదు .. దేవుని గొప్పతనమును ఇతరులకు చెప్పటానికే మన తెలివి తేటలు ఉపయోగపడాలి. దేవుడిని నమ్ముకోవటములో మనిషికి కష్టము లేదు గనుక అందరు దేవుడిని నమ్ముకుంటున్నారే గానీ, ఏ ఒక్కరు తెలుసుకోవడము లేదు. అయితే దేవుడిని తెలుసుకుని నమ్మినవారికే అయన అర్థమవుతాడు. ఇంతటి మహా సృష్టిని కలిగించిన దేవుడు ఎందుకు మరుగన పడిపోయాడోఆలోచించకుండా ,మానవుని మట్టిబుర్రలో పుట్టిన సామాన్యమైన ఆలోచనతో దేవుడిని సామాన్యుడు అనుకుంటున్నారు.

4) ప్రతి మనిషి దేవుని క్రమశిక్షణలో బ్రతికి పరలోకానికి వెళ్ళటానికి అనువైన శిక్షణ క్రేంద్రము ఈ భూలోకము.అంతే కాని ఎవరు ఇష్టము వచ్చినట్లుగా వారు బ్రతకటానికి కాదు. దేవుని యెద్ద నుండి వచ్చాము అని ఎల్లపుడు గొప్పగా ఆలోచించాలి. చనిపోతున్నాము అంటే అంత అయిపోయిందని అనుకోకండి. వచ్చిన చోటుకు వెళ్ళుచున్నామని తెలివిగా ఆలోచించండి. తెలియని places, historical buildings, tourist places గూర్చి చదివి తెలుసుకుని గ్రహించుటకు tourist guide అనే book ఉంటుంది. “” మృత్యువు తరువాత ఆత్మగా వెళ్ళవలసిన రెండు లోకాలు వాటిలో ఉన్న సుఖాలు,నిత్య శిక్షలు ఎంత భయంకరమైనవో తెలియచెప్పే ఏకైక బుక్ THE BIBLE””. దేవుడిని లోకానికి గొప్పగా పరిచయము చేయాలే గానీ సామాన్యుడుగ చెప్పకూడదు. ఎందుకంటే దేవుని నమ్ముకునే అవసరత మనిషిదే గానీ దేవునిది కాదు.

5) మనిషి వద్ద తనను తను నమ్మించుకోనవలసిన అవసరత దేవునికి లేదు. భూమి మీద ప్రతి ప్రయాణానికి సిద్దపడే మనము భూమిని వదిలిపోయే చివరి ప్రయాణానికి సిద్దపడుచున్నామా???? చనిపోయిన తరువత మన relations సిద్దపరుస్తారు అని అనుకుంటున్నారా??? వారు సిద్దపరిచేది శవాన్నే గానీ ఆత్మను కాదు. మనవ దేహాన్ని శవముగా మర్చి వెళ్ళిపోయినా ఆత్మ సంగతి లోకానికి తెలియలేదు అందుకే దానిని గూర్చి ఎవరు వ్రాయలేదు. దేవుని కోసము బ్రతకని ప్రతి ఆత్మ నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతుందని ఎందరికి తెలుసు??

6) చనిపోయిన వారు వెళ్ళుచున్నది స్మశనానికి కాదు భూమి మీద నుండి పాతాళలోకానికి. ఈ సంగతి ఏ tv channelకు తెలియదు. ప్రకృతి రహస్యాలను బయటపెట్టే discovary channel, national geographic channel, BBC వంటి channels కూడా అంతు చిక్కని భయంకర లోకమే పాతాళము. దాని గురించి చెప్పాలంటే ఒక్క BIBLE CHANNELనే చెప్పాలి. మహామహులను సైతము పాతాళము మ్రింగి వేసింది.ఇది కధ అని అనుకున్న వారందరు అందులో కాలిపోతున్నారు. నిజము అని నమ్మిన వారు నిత్య జివములో ఉన్నారు. అందుకే ఈ చిన్న జీవితములో యేసును దేవునిగా అంగీకరిస్తే చనిపోయిన తరువాత మహా జీవితము వస్తుంది. కులానికి ఒక దేవుడు ,మతానికి ఒక దేవుడు ఉండదు. అలాగున ఉండియుంటే ఈ సృష్టి ఇంతక్రమముగా ఉండియుండేది కాదు.బ్రతికి ఉండగానే నిజ దేవుడిని నమ్ముకుని పరలోకము కొరకు ఎదురు చూడాలి.

7) సంపాదించినా వారు చావు పేరుతో ఏదైనా తిసుకుపోతున్నారేమో జాగ్రతగా చుడండి. ఒకవేళ వారు తీసుకుని పోతే మనము తీసుకోని పోవుటకు బాగా సంపాదించవచ్చు. వదిలిపోయే దాని కొరకు సంపాదన సందడిలో పడి అస్సలు సంగతి మరచిపోకూడదు. years కస్టపడి సంపాదించినా దానిని క్షణాలలో వదిలిపోతారని మరచి , అవసరాలకు మించి సంపాదించేవారు లేకపోలేదు. చావుకు ముందు ప్రతి మనిషి యేసుక్రిస్తును సంపాదించాలి. ఎందుకంటే ఒక lion ముందు నిలబడే ధైర్యము మనిషికి లేనప్పుడు కోట్ల సింహల రోషాన్ని కలిగియున్న దేవుని ముందు దోషిగా నిలబడగలమా???కాస్త ఆలోచించండి. దేవుడు భయంకరుడు గనుకనే సృష్టికి దేవుని సంగతి తెలిసి క్రమముగా పని చేస్తున్నది.

8) బ్రతికియుండగానే ఏది salt,ఏది sugar ,ఏది పులుపు, ఏది చేదు, ఏది తీపి అని వివరముగా తెలుసుకున్న మనము ఏది దేవుడో తెలుసుకోనకపోతే దేవుని మహాశిక్షను తప్పించుకోనలేము. ఈ జీవితము శాశ్వతము కాదు. రాబోయే జీవితానికి ఈ జీవితము పెట్టుబడి కావాలి. చాల మంది దేవునిని తెలుసుకొనుటకు ఈ బ్రతుకు సరిపోతుందా అని అంటారు. ఈ బ్రతుకు ఇచ్చిందే దేవుడిని తెలుసుకోనుటకే అని వీరికి తెలియదు. యేసుక్రీస్తును మనిషిగా ఉహించక మహాశక్తి అని గ్రహించి, క్రిస్తుని దేవునిగా నమ్మండి. అయన చెప్పినవి ఈ worldలో ఏ మహాత్ముడు చెప్పలేదని చెప్పటానికి నేను సిద్దముగా ఉన్నాను. క్రీస్తును నమ్మి చనిపోయి తిరిగి బ్రతికే అదృష్టాన్ని పొందుకోండి. మతము మనిషిని గమ్యానికి చేర్చదు. మార్గములో ప్రయాణించాలనుకుంటే ఆ మార్గము యేసుక్రిస్తే.





Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget