Halloween Costume ideas 2015

What is faith?

విశ్వాసము అనగా ఏమి? విశ్వాసమును పరిక్షించుకుని వృద్ది చేసుకొనుట ఏలా?


విశ్వాసము అనగా ఏమి? విశ్వాసమును పరిక్షించుకుని వృద్ది చేసుకొనుట ఏలా?
మన ఆత్మలకు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవుల సంఖ్య పెరుగుతూపోతుంది.అనగా క్రీస్తును తెలుసుకుని విశ్వసిస్తున్నారు పెరుగుతున్నారు. నేటికి ప్రపంచ జనాభా సుమారు 750 కోట్లు అయితే అందులో 33 శాతం పైగా క్రైస్తవులుగా ఉన్నారు. అయితే ఈ ప్రపంచములోన్న 33శాతపు క్రైస్తవులు ఒక్కటిగా లేకుండా సుమారు3000 శాఖలుగా విడిపోయారు. శాఖలు అనగా ఇంగ్లీష్ లో డినోమినేషన్స్ అంటారు. అవేవి అనగాపెంతుకోస్తు ,కాథలిక్, లూథరన్, అర్సియెం మొదలగునవి. అయితే ఒక్కొక్క డినోమినేషన్ వారికీ ఒక్కొక్క విధమైన విశ్వాసమును కలిగియుంటారు. అంటే ప్రపంచములోన్న 33 శాతపు క్రైస్తవులకు ఒక్క విశ్వాసము కాక 3000పైగా విశ్వాసములు కలిగియున్నారు. అందరి చేతిలో ఒకే బైబిల్ ఉన్నను క్రైస్తవులు మాత్రముఒక్కటిగా ఉండకపోవడం విచారించదగిన దుస్థితి అనే చెప్పాలి.
2) ఎఫేసి 4:5- ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే,బాప్తీస్మం ఒక్కటే... అనగా విశ్వాసము అనునది ఒక్కటే అని వాక్యము చెబుతుంది. బైబిల్ లోని ఒక అంశము గూర్చిఒక డినోమినేషన్ వారిని ఏంటి మీరు ఇలా నమ్ముతున్నారు మరి అవతలి డినోమినేషన్ వారుఎందుకుఅలా నమ్ముతున్నారు అని ప్రశ్నిస్తే వారు ఇచ్చే సమాధానమే “ మా విశ్వాసము మాది& వారి విశ్వాసము వారిది. అయితే మరొక డినోమినేషన్ వారిని ఏంటి వారు అలా నమ్ముతున్నారు మరి మీరెందుకు ఇలా నమ్ముతున్నారు అంటే వారు ఇచ్చే సమాధానమే “ మా విశ్వాసము మాది, మీ విశ్వాసము మీది& వారి విశ్వాసము వారిది. అనగాబైబిల్ లోని ఒక అంశముపై ఇలా అనేక రకాలుగా విశ్వాసము కలిగియున్నారు. ఎవరి విశ్వాసము వారిది అయితే మరి దేవుడు ఎఫేసి 4:5లో చెప్పబడిన సంగతి ఏంటి?????? అంటే వాక్యమును ఉన్నదీ ఉన్నట్టుగా వారి వారి జీవితములో సీరియస్ గా తీసుకోవడం లేదు కనుక నేడున్న ప్రపంచ క్రైస్తవ్యములో ఇలాంటి స్థితిఏర్పడింది. 3) చనిపోక ముందే అనగా భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే మన జీవితాలను వాక్యనుసారముగాసరి చేసుకునే అవకాశం ఉన్నదీ. అంటే భూమి మీద మనం బ్రతికియున్నంత కాలం పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉన్నదే తప్ప చనిపోతే మాత్రం లేదు. అంటే ఒక్కసారి చనిపోతే జీవితమును సరి చేసుకునే అవకాశం లేదు కనుక పరలోకం పొందుకునే అవకాశం లేదు. కనుకనే మన విశ్వాసాన్ని మనం పరిక్షించుకోవాలి. మన విశ్వాసాన్ని మనం పరిక్షించుకోకపోతే క్రీస్తు రెండవ రాకడలో విశ్వాసుల జాబితలో మనం ఉండము. నేను విశ్వాసి అనుటకు గల అర్హతలు ఏంటి అని మనల్ని మనం పరిక్షించుకోవాలి. 11 కోరంది 13:5- మీరు విశ్వాసము గలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి.మిమ్మును మిరే పరిక్షించుకోనుడి. 1 కోరంది 11:28- కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరిక్షించుకోనవలెను.....అనేక డినోమినేషన్స్ పేరుతో వేల విశ్వాసులు కలిగియున్న నేటి క్రైస్తవ సమాజములో బైబిల్ చెప్పిన విశ్వాసమును కలిగియున్నమో లేదో అని మనల్ని మనం పరిక్షించుకోవాలి. క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో అనగా పరలోకం వెళ్ళే వారి జాబితాలో ఉండాలంటే ఏటువంటి విశ్వాసము కలిగియున్నమో పరిక్షించుకోవాలి అనే విషయము అర్థమయింది.
4) నేడున్న క్రైస్తవ సమాజములో ఎక్కువ మంది ఇతరుల యొక్క విశ్వాసాన్ని పరిక్షిస్తారే తప్ప వారి విశ్వాసo ఎట్టిదో అని పరిక్షించుకోరు. యేసు రెండవ రాకడ కాయమని, మనలోనున్న పరిశుద్దులను పరలోకం తీసుకెళ్తాడు అని క్రైస్తవులైన మనకు నిరీక్షణ ఉన్నదీ . అయితే మొదటి శతాబ్దములో యేసు జీవించిన కాలములో తన రెండవ రాకడలో జరగబోయే సంగతిని చెబుతున్నాడు. లూక 18:8-అయినను మనుష్య కుమారుడు(యేసుక్రీస్తు) వచ్చునప్పుడు అయన భూమి మీద విశ్వాసము కనుగోనునా? నేను మరలా వచ్చినప్పుడు నన్ను విశ్వసించినవారు భూమి మీద ఉంటారా, ఉన్న వారిలో విశ్వాసం ఉంటుందా అని భవిష్యత్తు తెలిసిన యేసు సందేహం వ్యక్తం చేస్తున్నాడు.
5) విశ్వాసము అను మాటకు అర్థము వాక్యము నందుచూస్తే హెబ్రీ 11:1- విశ్వాసము అనునది నీరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు రుజువైయున్నది. విశ్వాసము, నీరీక్షణ ఒకదానికోకటి విడదీయలేని పదాలు.విశ్వాసమనునది లేకుండా నీరీక్షణ ఉండదు అలానే నీరీక్షణ లేకుంటే విశ్వాసము ఉండదు. నీరీక్షణ అనగా ఎదురుచూపు. ఎదురుచుస్తున్నాము అంటే అది ఇంకా రాలేదని, దానిని ఇంకా పొందుకోలేదని,ఇంకా మన కళ్ళతో చూడలేదని అర్థము. విశ్వాసము ఉంటేనే దానిపై మనము ఎదురుచూస్తాము. ఎప్పుడైతే విశ్వాసము కలుగుతుందో అప్పుడు ఎదురుచూడడము మొదలు పెడతాము.దేవునిని మనము చూడలేదు కానీ నమ్మాము.అంటే దేవుడు అనే అయన పరలోకములో ఉన్నాడని, ఆయనే ఈ లోకానికి మనల్ని పంపాడని,మరలా తిరిగి ఆ పరలోకానికి ఆహ్వానిస్తున్నాడని ,మనము అంత తిరిగి అయన యొద్దకు వెళ్ళాలని నమ్ముటయే విశ్వాసము.పరలోకము వెళ్ళే క్షణాలకోసం ఎదురుచుస్తున్నాము ( నిరీక్షిస్తున్నాము). అనగా దేవుడు ఉన్నాడని నమ్మటము విశ్వాసము అయితే,ఉన్న ఆ దేవునిని చూసే క్షణము నీరీక్షణగా అవుతుంది. అంటే విశ్వాసము,నీరీక్షణ అను రెండు కలసిన పదాలు.
1) చూడకుండా నమ్మటమే విశ్వాసము . ఈ రోజు దేవుని నమ్మటము ఎలా మారిపోయినదంటే- దేవునిని నమ్ముతాము కానీ మేము నమ్మాలంటే మేము అనుకున్నది జరగాలి.జరిగితే జరిగిన దానిని మా కళ్ళతో చూసినప్పుడు దేవునిని నమ్ముతాము అని అంటున్నారు.అస్సలు ఈ విశ్వాసము విశ్వాసమేనా??? చూచి నమ్ముట విశ్వాసముగా పిలవబడుతుందా? ఏదో జరిగిందని, ఏదో కలిగిందని, ఏదో లాభపడ్డామని ప్రభువుని నమ్మటము ,ప్రభువు యొద్దకు రావటము అనునది విశ్వాసముగా పిలవబడదని వాక్యం చెబుతుంది.యేసు తోమతో అన్న మాట సందర్భాన్ని చూస్తేయోహాను 20:29- యేసు- నీవు నన్ను చూచి నమ్మితివి . చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను.
6) 1 కోరంది 15:19- ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తు నందు నిరిక్షించువారమైన యెడల మనుష్యులందరి కంటే దౌర్బాగ్యులమై ఉందుము.
7) ఏ విధమైన విశ్వాసం పెద్దలకు ఉందో తెలుసుకోవాలంటే ఒక్క మనిషి జివితమైన బైబిల్ నుండి తెలుసుకోవాలి. విశ్వాసులకు తండ్రియైన అబ్రహాము గురించి ఆలోచిద్దాం. రోమా 4:18-22- నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు ,నిరీక్షణఆధారములేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసము నందు బలహీనుడు కాక ,రమారమి నూరేండ్లు వయస్సు గలవాడై యుండి ,అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్ధానము గూర్చి సందేహింపక దేవునిని మహిమపరిచి అయన వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్ధుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందు చేత అతనికి నీతిగా ఎంచబడెను. పై వచనపు మాటలను గమనిస్తేదేవుడు అబ్రహమునకు కుమారుడిని ఇస్తాననే వాగ్ధానము చేసాడు. నూరేండ్లు వయస్సు గలవాడై యుండి కూడా, శరీరము మృతతుల్యమైనట్టుగా ఉన్నను కూడా దేవుడు చేసినవాగ్ధానము నమ్ముటకు అవకాశం లేకపోయినా విశ్వాసము ఉంచాడుకాబట్టి నీతిగా ఎంచబడెను. ఇది ఆనాడు అబ్రహమునకు దేవుడు చేసిన వాగ్ధానము.
8) అయితేక్రైస్తవులైన మనకు దేవుడు స్వయముగా చేసిన వాగ్ధానము ఉన్నదా? ఒక వేళ దేవుడు క్రైస్తవులైన మనకు వాగ్ధానము ఇచ్చియుంటే ఆనాడు ఏ రీతిగా వాగ్ధానము నమ్ముటకు అవకాశం లేకపోయినా అబ్రహాము నమ్మాడో ఆ రీతిగా మనము కూడ దేవుడు ఇచ్చిన వాగ్ధానము పై విశ్వసించాలి. 1యోహాను 2:25-నిత్య జీవము అనుగ్రహింతుననుదియే అయనతానే మనకు చేసిన వాగ్ధానము. అనగా అదృశ్యమైన నిత్యజీవమను వాగ్ధానమును దేవుడు మనకు ఇచ్చాడు. అయితే దేవుడు మనకుఇచ్చిన నిత్యజీవము అను వాగ్ధానము బట్టి ఎంత మంది దేవుడిని నమ్ముతున్నారు? యేసును నమ్ముకుంటే అదృశ్యమైన పరలోకం చేరుతాననే విశ్వాసముతో దేవునిని నమ్ముతున్నారా? ఈజీవిత కాల మట్టుకే మన ఆవసరాలు తిర్చుకోనుట కొరకు ఎసుపై విశ్వాసము ఉంచితే ఆ విశ్వాసము నీ ఆత్మను రక్షించదు& పరలోకమునకు చేర్చదు.
9) అదృశ్యమైన దేవుడు ఉన్నాడని, అదృశ్యమైన పరలోకం ఉన్నదని, ఆ పరలోకం పొందాలంటే యేసును నమ్మి చేసిన పాపాలకు క్షమాపణలు చెప్పి బాప్తీస్మం పొంది నమ్ముకముగా యేసు మాటలు అనుసారముగా జీవిస్తే పరలోకము వస్తుంది అని విశ్వసించాలి.అదృశ్యమైన దేవుడిని కానీ, పరలోకమును కానీ మనము చూడలేదు కానీ నమ్ముతున్నాము. నమ్మడానికి ఆవకాశమే లేని, ఎన్నడు మనము చూడనిఅదృశ్యమైన పరలోకము ఇస్తానని దేవుడు చేసిన వాగ్ధానము పై విశ్వసించి యేసుపై నమ్మిక ఉంచిన వాడే నిజమైన విశ్వాసి అని వాక్యం చెబుతుంది. పై చెప్పబడిన విశ్వాసము మనము కలిగియున్నమో లేదో పరిక్షించుకోమన్నాడు.
10) పరలోకం పొందుకోవాలంటే మొదటిగా అద్రుశ్యుడైన దేవుడు పరలోకములో ఉన్నదని విశ్వసించాలి. దేవుడు అనేవాడు లేడు అని నమ్ముతున్న నాస్తికులు,హేతువాదులు పరలోకమునకు వెళ్ళలేరు. మరి కొందరు దేవుడు ఉన్నాడని నమ్మిన యేసు దేవుని కుమారుడని, 2000 సం ల క్రితము పాపులమైన మనల్ని రక్షించుటకు ఈలోకానికి వచ్చి, సిలువ యాగము చేసి, మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచాడని, రెండవ రాకడలోవిశ్వాసులను పరలోకమునకు తిసుకేల్తాడని విశ్వసించరు కనుకవీరు కూడ పరలోకమునకు వెళ్ళరు. అయితే క్రైస్తవులైన మనకే పరలోకము పొందుటకుఅవకాశాలు ఎక్కువుగాఉన్నాయి. ఎవరైతేనేడు అద్రుశ్యుడైన యేసును, యేసు ద్వార పొందే పరలోకమును నమ్మరో వారు నిత్యజీవము పొందలేరు. ఈ జీవిత కాల మట్టుకే యేసుపై నమ్మిక ఉంచక పరలోకము ఇస్తాడని నమ్ముకున్నవారికి పరలోకమునాకు వెళ్ళుటకు అవకాశం ఎక్కువుగా ఉన్నదీ.
11) హెబ్రీ 11:17-19లో మనం చూస్తే దేవుడు చేసిన వాగ్ధానమును అబ్రహాము నమ్మిన తర్వాత దేవుడు అతని విశ్వాసాన్ని పరీక్షించాలాని తన కుమారుడిని బలిగా ఇవ్వమన్నాడు. అయితే చనిపోయిన కూడ ఇస్సాకును దేవుడు లేపుటకు సమర్ధుడు అని విశ్వసించి బలి ఇచ్చుటకు కూడ సిద్దము అయ్యాడు. అంటే అబ్రహు యొక్క విశ్వాసము క్రియల ద్వార కనబరిచాడు. యాకోబు 2:14 నుండి 26 వరకు ఉన్న ప్రతి మాటను ఆలోచిస్తే క్రియలు లేని విశ్వాసము మృతము అని అర్థమవుతుంది. అనగా విశ్వాస జీవితములో పరలోకం వెళ్ళాలనే నమ్మిక ఉండాలంటే విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలనిపై వచనపు సారము. హెబ్రీ 11:31-విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిదేయులతో పాటు నశింపకపోయెను.
12) రోమా10:17- వినుట వలన విశ్వాసము కలుగును;వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. కనుక క్రీస్తు యొక్క జనన,మరణ,సమాధి & పునరుర్ధనపు మాటలను ప్రకటించి అనేకమంది మదిలో విశ్వాసము కలిగించి స్థిరులుగా చేయవలసిన భాద్యత మనపై ఉన్నదీ.మార్క్ 16:15- మీరు సర్వ లోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వాడికి శిక్ష విధింపబడును.
13) చివరిగాదేవుడు చేసిన నిత్యజివమను వాగ్ధానము బట్టి తన యెడల నమ్మిక ఉంచాలి, పరిశుద్దులుగావాక్యనుసరముగా జీవిస్తూ, దేవుని కార్యక్రమాల కొరకు దాచుకొనక ఇచ్చేవారిగా ఉండాలి. అవసరమైతే మనకు ఉన్నది అమ్మి దేవుని కార్యక్రమాల కోసము మనము ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు యేసు రెండవ రాకడలో ఎత్తబడే విశ్వాసుల జాబితలో ఉంటాము


Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget