Halloween Costume ideas 2015

Abrahamu gari Pillalama ? Apavadhi pillalama?

అబ్రహాము గారి పిల్లలమా? అపవాదికి పిల్లలమా?
అబ్రహాము కాలములో ఎవరు ఉన్నారు 
1)అబ్రహాము అనగానే మనకు జ్ఞపకము రావాల్సింది విశ్వాసము. ఎందుకంటే విశ్వాసానికి పెట్టింది పేరుగా,విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము చరిత్రకు ఎక్కడం మనకు తెలుసు. అప్పటికాలములో ఒకప్పుడు విశ్వాసానికి, నీరిక్షనకు ఆధారమే లేనప్పుడు దేవుని నమ్మిన,విశ్వసించిన ఘనుడు అబ్రహాము. నిజముగా ఆయనకు ఉన్న విశ్వాసము చాల గొప్పది.ఆయనకు ఉన్న విశ్వాసము చూసి దేవుడు అర్చర్యపోయినట్లుగా మనము చూస్తున్నాము.అబ్రహాము దేవునికి స్నేహితుడు.దేవుడు అబ్రహముతో స్నేహము చేయడానికి ఇష్టపడ్డాడు అంటే అబ్రహాము character ,జీవితము ఎంత గొప్పదో అర్థమవుతుంది.ఎందరో భూమి మీద ఉండగా అబ్రహమునే ఎందుకు స్నేహితుడిగా చేసుకున్నాడు?కోరుకున్నాడు? అంటే దేవునికి కావలసినవి అబ్రహములో ఉన్నాయి గనుక.
2) ఈ రోజు మనకి నిజ దేవుడిని నమ్ముటలో ఎన్నో సాక్షాధారాలు ఉన్నాయి. దేవునిని నమ్ముటకు మన కళ్ళముందు ఏన్ని సాక్షాధారాలు ఉన్నాను మనిషికి దేవునిపై అనుమానము కలుగుతుంది. ఈ రోజు దేవుని గురించి చక్కగా చెప్పడానికి అనేక మంది ఉన్నారు. ఆనాడు అబ్రహాము కాలములో ఎవరు ఉన్నారు దేవుని గురించి చెప్పడానికి?లేరు. ఇంకా మనము దేవుని గురించి తెలుసుకోవడానికి 66 పుస్తకాలతో సాక్షముగా మన చేతిలో పెట్టాడు దేవుడు bibleను. ఈ 66 పుస్తకాలలో దేవుడు ఉన్నాడని,ఉన్న దేవుడు ఏ ఆలోచనలతో ఉన్నాడు,ఏ ఆశయాలతో ఉన్నాడు,ఏ ఉద్దేసాలతో ఉన్నాడన్న సంగతులు ఈ bible ద్వార మనకు అర్థమవుతుంది.మరి అబ్రహాము కాలములో ఈ పుస్తకాలు లేవు, చెప్పేవారు లేరు అయినను దేవునిని ఎంతగా నమ్మాడు అబ్రహాము? విశ్వాసానికి ముల పురుషుడు అయ్యాడు.
(a)నేను చూపించే ప్రదేశానికి వెళ్ళాలి అని దేవుడు చెప్పగా ఏమి సందేహాపడకుండా,ఆలోచించకుండా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండ బయలదేరాడు.( ఆదికాండము 12:1 నుంచి). హెబ్రీ 11:8-ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుగక బయలువేల్లెను.
(b) ఏడాది తర్వాత నీ దగ్గరకు వస్తాను,వచ్చే సమయానికి నీవూ బిడ్డకు జన్మనిస్తావు ,సంతానము కలుగుతుంది మరియు నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువులలా విస్తరిస్తుంది అని దేవుడు అబ్రహముతో చెప్పాడు. సుమారు 100 years వయస్సు కలిగిన అబ్రహాము దేవుడు చెప్పిన మాటను సందేహాపడకుండా,ఆలోచించకుండా నమ్మాడు.దేవుడు చెప్పిన విధముగా ఇస్సాకుకు జన్మనిచ్చాడు.కుమారుని చూసి ఎంతగానో మురిసిపోయాడు,ఆనందపడ్డాడు( ఆదికాండము 15:5 నుంచి).
(c)దేవుడు మరల ఇస్సాకును బలిగా ఇవ్వమన్నాడు. అందుకు ఇవ్వడానికి సిద్దమయ్యాడు.
పైన చెప్పబడిన a,b,c సందర్భాలను చూస్తే దేవుడు ఎంతగానో అర్చర్యపోయాడు, సంతోషపడిపోయాడు.అబ్రహములో ఉన్న విశ్వాసాన్ని చివరి వరకు చూసాడు. 3) అబ్రహాము గర్భాన పుట్టిన పిల్లలం అని చెప్పుకోవాలంటే ఆయనలాంటి జీవితము,లక్షణాలు కలిగి ఉంటేనే తప్ప ఆయనకు పిల్లలు కాలేరు, అలా పిలవబడము.అంత మహనీయుని గర్బన పుట్టిన israels అవిశ్వాసులుగా అయిపోయారు. విశ్వాసుని గర్భాన అవిశ్వాసులు వచ్చేసారు.అబ్రహమునకు పుట్టిన ఇస్సాకు బాగున్నాడు,ఇస్సాకుకు పుట్టిన యాకోబు బాగున్నాడు కానీ యకోబు గర్భాన పుట్టిన వారు పాడైపోయారు.పాత నిబంధనలో israels ఎంత భయంకరులో తెలియటానికి egypt నుండి ప్రయాణమై కనానుకు అడుగుపెట్టిన సంఖ్య జ్ఞపకము చేసుకుంటే 6 lakhs నుండి 2 persons చేరారు. మిగిలిన వారు శవములు గా రాలిపోయేను. దేవుడు వారి మధ్య ఏన్ని అద్బుతకార్యాలు, సూచక క్రియలు,మహత్కార్యాలు కళ్ళ ముందు జరిగిస్తూ వచ్చిన పోత పోసిన దూడకు నమస్కారము చేసిరి. కనీసము దేవునికి thanks కూడా చెప్పలేదు.ఎందరినో ప్రవక్తలను,న్యాయదిపతులను,రాజులను ఇలా అందరిని పంపించిన దేవుని మాట వినలేదు. యెషయ 1:2- దేవుడు ఎలాంటి వారు israels అని ఇక్కడ చెప్పాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని కానీ వారు నా మీద తిరగబడినారు. యెషయ 1:3-గాడిద ,ఎద్దు కన్నా వీరికి తెలివి లేదు అంటున్నాడు. యెషయ 1:4- పాపిష్టి జనమా,దోష భరితులైన ప్రజలారా ,దుష్టసంతానమా అని తిడుతున్నాడు దేవుడు. అబ్రహాము సంతానము యెషయ కాలానికి రాగానే దుష్ట సంతానముగా మారింది.
4) యోహాను కాలము రాగానే luke3:7- సర్ప సంతానమా అని అంటున్నాడు.అక్కడ యెషయలో israelsనీ దుష్టసంతానమా అని అంటే ఇక్కడ యోహాను కాలము వచ్చకా కూడ అదే స్థితిలో ఉన్నారు గనుక సర్ప సంతానమా అంటున్నాడు.మార్పు లేదు వారిలో.అబ్రహాము పిల్లలు కాదు సర్ప సంతానము అంటున్నాడు.
5) యేసు israels గురించి ఏమి అంటున్నాడో చూస్తే john 8:33-మేము అబ్రహాము సంతానము, నీవూ మాకు చెప్పేది ఏంటి అని యేసు తో అంటున్నారు. john 8:39-మా తండ్రి అబ్రహము అనిరి. ఇక్కడ israels మాటిమాటికి అబ్రహాము సంతానము అని అంటున్నారు. అందుకు యేసు కోపముతో john 8:44-మీరు మీ తండ్రి అయిన అపవాది సంభందులు ,అబ్రహాము పిల్లలు కాదు అంటున్నాడు. యెషయలో దుష్ట సంతానమా అని, johnలో సర్ప సంతానమా అని , యేసు అపవాది సంబంధులని అంటున్నాడు. యేసు-మీరు అబ్రహాము తండ్రి అని చెప్పుకుంటున్నారు.అబ్రహామునన్ను చుడడానికి ఇష్టపడుచున్నాడు కానీ అయన పిల్లలు అని చెప్పుకుంటున్న మీరు ఈ రోజు నన్ను చంపుటకు ప్రయతిస్తున్నారు.( john 8:39).
6) israels మాట్లాడితే మేము అబ్రహాము నుండి వచ్చిన వారము అంటున్నారు. అయితే యేసు మాటలను బట్టి,paul గారు పత్రికలో వ్రాసినదానిని బట్టి “కేవలము విశ్వాసాన్ని బట్టి మాత్రమే ఆయనకు పిల్లలు అవుతారు అనే విషయము అర్థమవుతుంది. గలతీ3:7- విశ్వాస సంబందులే అబ్రహమునకు కుమారులని తెలుసుకోనుడి. ఇప్పుడు మనమంతా విశ్వాసమును బట్టి అబ్రహాము పిల్లలు.
7) జక్కయ సందర్భము-luke19:8- యేసు జక్కయతో ని ఇంట వచ్చుచున్నాను అను మాట అనగానే నా ఆస్తిలో సగము బిదలకిస్తాను,నేను ఎవని యెద్ద అన్యాయముగా తీసుకున్నానో నలుగంతలుగా చెల్లింతును అని ప్రభువుతో చెప్పెను.కేవలము ఒక మాట చెప్పగానే ఎందుకు జక్కయలో అంత మార్పు? luke19:9-యేసు-ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఇక్కడ జక్కయ ఎలా అయ్యాడు అబ్రహాము కుమారుడు? యేసు మాటలను నమ్మాడు,విశ్వసించాడు. విశ్వసించిన దానిని క్రియలలో చూపాడు. అబ్రహములో –విశ్వాసము ఉంది and తగినట్లుగా క్రియలు కూడా ఉన్నాయి. అలానే జక్కయ లో విశ్వాసము ఉంది and తగినట్లుగా క్రియలు కూడా ఉన్నాయి కాబట్టి యేసు జకయ్యను అబ్రహాము కుమారుడే అంటున్నాడు. ఇప్పుడు మన సంగతి ఏంటి???యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నాము,విస్వసిస్తున్నాము కానీ అయన కోసము మను ఏమి క్రియలు చేస్తున్నాము???పరలోకము వేల్లిపోతము అను విశ్వాసము ఉంది కానీ క్రియలు?
8)యాకోబు 2:14-క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన యడల ఏమి ప్రయోజనము?? అట్టి విశ్వాసము రక్షింపగలదా? విశ్వాసముక్రియలు ఉంటె అప్పుడు అబ్రహముకు పిల్లలు అవుతాము.ఇవి రెండి లేకపోతే అపవాది పిల్లలు అవుతాము.విశ్వాసము ఉంది క్రియలు లేకపోయినా అపవాది పిల్లలమే.విశ్వాసానికి తగిన క్రియలు ఉంటె అబ్రహాము పిల్లలు. యాకోబు 2:26-ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. విశ్వాసి అనగా దేవునిని అడిగే వాడు కాదు దేవునికి ఇచ్చేవాడు.
9) ఈ రోజు israel దేశములో israels ,యూదులు ఉన్నారు. వారు ఇంకా మెస్సయ్యా మా కొరకు పంపు పంపు అని వేడుకుంటున్నారు. కానీ, యేసు వచ్చాడని,మనము చంపింది ఆయననే అని, ఆయనే మా రక్షకుడని ,ఆయనే మరలా తిరిగి రాబోతున్నాడని సంగతి ఇప్పటికి వారు అంగీకరించారు. మరి వారు అబ్రహాము సంతానమా??? ఇష్మయేలియులు,israels గాని వీరు అబ్రహాము నుండి వచ్చారు కానీ అబ్రహమునకు ఉన్న లక్షణాలు లేవు.ఈ రోజు పాలస్తీనా,israel యుద్దము. కేవలము భు భాగము కోసము చంపుకొంటున్నారు. చంపుకుంటున్న వీరు అబ్రహాము పిల్లలు అంటున్నారు.
10) అందుకే విశ్వాస సంభందులే అబ్రహమునకు పిల్లలు అవుదురు అని paul చెప్పాడు.మనము అంతా విశ్వాస సంబందులే . విశ్వాస సంభందులుగా ,అయన పిల్లలముగా చెప్పుకుంటున్న మనము ఆయనకు తగిన క్రియలు మన జీవితములో చూపించాలి.అప్పుడే మనము అబ్రహాము పిల్లలము. విశ్వాసముతో కూడుకున్న క్రియలు జరగకపోతే మనము కూడా అపవాది పిల్లలే తప్ప అబ్రహాము పిల్లలము కాలేము.మనము కూడా విశ్వాసముతో కూడిన క్రియలు జరిగిస్తే తప్ప అబ్రహాము పిల్లలముగా పిలువబడలేము.గనుక అబ్రహాము పిల్లలా లేక అపవాది పిల్లలా అని ఒకసారి పరిక్షించుకుoదాము.అబ్రహాము పిల్లలముగా బ్రతుకుతున్నామా లేక అపవాది పిల్లలుగా మారమా అని ఆత్మ పరిశీలన చేసుకుందాము. అబ్రహాము పిల్లలుగా బ్రతికితేనే విశ్వాసులు ఉన్న ఆ మహా లోకానికి వేల్లిపోతాము. అలా కాక అపవాది పిల్లలుగా మారితే అపవాదికిని,వాడి దూతలకు సిద్దము చేయబడిన ఆ నిత్యాగ్ని దండనలోకి వెళ్లి కలకాలము ఆ మంటలో కాలిపోవాలి.


Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget