Halloween Costume ideas 2015

Manishi Satanuni Chittakkottadam Ela

మనిషి సాతానును చితుకత్రోక్కడం ఎలా

మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. 1) నిజముగా దేవుని మనస్సు తెలుసుకోవడంలో బైబిల్ తప్ప ఈ ప్రపంచములో ఏది లేదన్న సంగతి మనకు తెలుసు. దేవుడు మనం పరలోకమునకు రావాలని కోరిక కలిగియున్నాడు అలనే మనకు కూడా పరలోకం వెళ్ళాలన్న ఆశ ఉన్నదీ. మనల్ని రప్పించుకోవాలని దేవుడు తలచిన , వెళ్ళాలని మనం తలచిన మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నది మన ప్రధాన శత్రువైన అపవాది. వీడికి అపవాది అని,సాతాను అని అనేక పేర్లు ఉన్నాయి. ప్రారంభము నుండి ఈ దినము వరకు కాలమనేది లేకుండా మనిషిని దేవుని వైపు మళ్లించనివ్వకుండా, ఆలోచింపనివ్వకుండా ఈ చిన్న జీవితం కొరకే మనిషిని బ్రతికేతట్టుగా మార్చింది ఈ సాతాను లేక అపవాది. వాస్తవముగా దేవుడు సాతనును ఎందుకు బ్రతకనిచ్చాడన్న అనుమానం ప్రతి క్రైస్తవునిలో ఉంటుంది. ఆనాడు అక్కడే అదేను తోటలో సాతనును నాశనం చేస్తే ఈ రోజు మనుషులు సాతాను నుండి మోసపోయేవారు కాకుండా ఉండేవారు కదా అనే సందేహం, దేవుడు ఎందుకు సాతనును బ్రతకనిచ్చాడు అనే సందేహలు ప్రతి క్రైస్తవునిలో ఉంటుంది.
2) తప్పు జరగకూడదు అని తలచిన దేవుడు తప్పు జరిగిన తర్వాత అయన ఆలోచన విధానo మారింది. తప్పును సహించుకోలేని దేవుడు మళ్ళి తప్పు జరగకూడదని ఎంత జాగ్రత్త పడ్డాడో పరిశోధిస్తే మాత్రమే అర్థమవుతుంది. మనిషిగా మనకు కలిగిన ఆలోచన చూస్తే అదేను తోటలో సాతనును నాశనం చేయొచ్చు కదా అని. మనిషికి మెదడు ఇచ్చి, ఆ మెదడుకు ఆలోచనలు ఇచ్చిన దేవునికి ఈ ఆలోచన రాలేదని ఎందుకు మనము అనుకుంటున్నాము? 3) ఆదికాండము 3:15- మరియు నీకును స్త్రీకిని , నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. ఈ వచనములో మనకు బాగా తెలిసిన విషయం సాతాను సర్పములోకి ప్రవేశించి అదేను తోటలో హవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజామా అను ప్రశ్న వేసి తినవద్దు అని దేవుడు చెప్పిన పండును తినిపించుటకు ప్రేరేపించింది. ఇందులో తప్పు జరిగిన తర్వాత దేవుని ఆలోచన విధానము మరియు దేవుడు చేస్తున్నది మనకు అర్థం కావాలి. తప్పు జరిగాక ఆదామును, హవ్వను, సర్పమును దేవుడు శపించాడని మనకు తెలుసు. అస్సలు తప్పు జరిగించటానికి ఈ ముగ్గురును తప్పులో పడేయడానికి కారకుడు అపవాది. వీడిని ఎందుకు దేవుడు వదిలిపెట్టాడు అని అనుకుంటున్నారు? ఈ లోకపు చట్టంలో నేరం చేసిన వాడి కంటే నేరం చేయించిన వాడికి ఎక్కువ శిక్ష పడుతుంది. అనగా తప్పు చేసిన వాడికంటే తప్పు చేయమని ప్రోత్సహించిన వాడికి ఎక్కువ శిక్ష. ఈ లోక చట్టములో మనుషులు ఇలాంటి శిక్షలు రాసుకున్నప్పుడు ఆదాము, హవ్వ, సర్పము తప్పు చేయటానికి సాతనును ఎందుకు వదిలివేస్తాడు?

4) దేవుడు వారికీ ఇచ్చిన శాపాల విషయం చూస్తే
1)ఆదాము- నీ కొరకు ఈ నేల ముళ్ళ పొదలు మోలిపిస్తుంది.నీ బ్రతుకు దినాలు అన్ని ప్రయసపడాలి, కష్టంతో బ్రతకాలి.
2) హవ్వ – ప్రసవ వేదనను మిక్కిలి హెచ్చించేదవు.
3) సర్పం- కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు.. మరి ఈ ముగ్గురును తప్పులోనికి లాగిన సాతానును మాత్రం ఎందుకు వదిలేస్తాడు? ఆదికాండము 3:15- మరియు నీకును స్త్రీకిని ,నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఈ మాటను ఎవరిని గూర్చి వ్రాయబడిందో మనం ఆలోచించాలి. ఆదికాండము 3:15లో ఉంటున్న మాటను క్రైస్తవులు పట్టించుకోలేదు. ఆదాము, హవ్వ, సర్పమునకు శాపం పెట్టాడని అందరికి తెలుసు కానీ సాతానును ఏమని శపించాడన్న విషయం తెలియదు. ఎందుకంటే తన గురించి , తన ఆయుష్షు గురించి కాని, తన పన్నాగాలు గురించి సాతాను ఎవరికీ అంత సులువుగా తెలియనియ్యదు.

5) బైబిల్ లో సాతాను గూర్చి దేవుడు వ్రాయించిన మనకు తెలియనియ్యకుండా జగ్రతపడుతుంది ఈ సాతాను. దయ్యం అను పదానికి అర్థం మార్చేసింది. అందరు దయ్యం స్మశానంలో ఉంటుంది అనుకుంటారు. స్మశానంలో కుళ్ళిపోయిన శవాలు ఉంటాయి. కుల్లిపోయిన శవాలుతో దయ్యనికి ఏమి సంభంధం?? సమాజంలో బ్రతికియున్న వారితో పనినా లేక స్మశానంలో కుళ్ళిపోయిన శవాలు దగ్గర దానికి పనినా?? దయ్యం అనగానే రాత్రి వస్తుంది అనుకుంటారు. దయ్యం అంటే మరణించిన వారు దయ్యాలుగా మారుతారని మనిషిని దయ్యంగా చిత్రీకరించి చుపించిందే తప్ప అస్సలు దయ్యని గురించి మనిషికి ఏమి తెలుసు?? స్మశానంలో వాటికీ పని లేదు. వాడికి ఎవరితో పని ,ఎక్కడ అని చూస్తే 1 పేతురు 5:8-మీ విరోధియైన ఆపవాది గర్జించు సింహమువాలే ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నది.. సమాజములో దేవుని కొరకు కదులుతూ,దేవుని కోసం బ్రతకాలనుకుంటున్న మనతోనే సాతానుకు పని.
6) బైబిల్ తీసుకుని తల మీద బాగా కొడితే దయ్యం పోతుందని అనేక మంది తప్పుడు ఆలోచనతో ఉన్నారు. ఏది ఎవరు నేర్పించారు? ఇంక కొంత మంది ఉన్నట్టు ఉండి ఏదో విద్యుత్ షాక్ కొట్టినట్టుగా ఎగురుతుంటారు. అలా భోదకుడు ఎగిరితే పరిశుద్దాత్ముడు వచ్చాడని విశ్వాసులు ఎగిరితే దురాత్మా అని అనుకుంటున్నారు. సాతాను యొక్క ఉనికిని మనకు తెలియనియ్యకుండా ఇలా తప్పుడు మార్గమునకు నడిపిస్తుంది. మత్తాయి 16:22,23-పేతురు అయన(యేసు) చెయ్యి పట్టుకుని ప్రభువా, అది నీకు దురమవ్వు గాక, అది నీకు ఎన్నడును కలుగదని ఆయనను(యేసును) గద్దించెను. అయితే అయన( యేసు) పేతురు వైపు తిరిగి- సాతనా నా వెనుకకు పొమ్ము.... ఈ వచన భావంలో మనం తెలుసుకొనవలసిన విషయం దేవుని సంకల్పానికి వ్యతిరేకముగా మాట్లాడేది దయ్యం.. దయ్యంపట్టటం అంటే దేవునికి విరుద్ధముగా మాట్లాడటమే, దేవుని సంకల్పానికి విరుద్ధముగా మాట్లాడుటమే...
7) ఆదికాండము 3:15లో దేవుడు సాతనును శిక్షించుచున్నాడు. నీ సంతానము అనగా( సర్పము గూర్చి కాదు) సర్పములో ఉంటున్న సాతాను గురించి.. ఏ పిల్లలను అయితే నాకు కాకుండా చేసావో ఆ పిల్లలతోనే నిన్ను చితక త్రోక్కిస్తాను అని దేవుడు శపించాడు. ప్రకటన 12:12-అపవాది తనకు సమయము కొంచమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను. ఈ వచనములో మనం ఆలోచించాల్సిన విషయం కొంచెం కాలము వరకు దేవుడు సాతనును అనుమతిస్తే ఇంత కాలం అనగా ఇప్పటికి ఎందుకు ఉంది??? కొంచెము కాలంలో దేవుని పిల్లలమైన మన చేతితో సాతనును త్రోక్కించాలనుకున్నాడు. మన చేత త్రోక్కించడానికి దేవుడు సిద్దముగా ఉన్నాడు కానీ త్రోక్కేవాడు లేడు.
8) త్రొక్కేవాడు లేకపోవడం వలన సాతాను ఇంత వరకు ఉన్నాడే తప్ప దేవుని వలన కాదు. యేసు వచ్చిన తర్వాత సిలువ మరణంతో పాపానికి అధికారం లేకుండా ప్రపంచ మానవాళి ప్రాయశ్చిత్తం కలుగజేసి మరణాన్ని మ్రింగివేసి విజయాన్ని చేకుర్చాడు. 1 కోరంది 15:55- విజయమందు మరణము మ్రింగివేయబడెను . ఓ మరణమా నీ విజయము ఎక్కడా? ఇలా యేసుక్రీస్తు తన మరణము ద్వారా సిలువలో సాతనును చితకద్రోక్కాడు.
9) రోమా 10:15- ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి...యేసుక్రీస్తు రెండవ సారి భూమి మీదకు రావాలంటే మనం సువార్త(మరణ ,సమాధి,పునరుర్ధానము) ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి అంటే మన పాదాలు బయటపెట్టాలి.ఎప్పుడైతే మనం దేవుని పని చేయుటకు ముందుకు వస్తామో దాని అర్థం అపవాది ఆయుష్షును తగ్గిస్తున్నట్లు. మత్తాయి 24:14-రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్ధమై లోకమందటను ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. యేసుక్రీస్తు రెండవ సారి వచ్చేలోపు మనం సాతనును చితకత్రోక్కితే యేసు వచ్చాక నాశనం చేస్తాడు. సువార్త ప్రకటనకు వేసే ప్రతి అడుగు సాతాను తల మీద పడుతుంది. సువార్త ప్రకటన పనిలో అడుగులు వేస్తే సాతనును చితక ద్రోక్కటo మొదలు అవుతుంది.
10) కనుక నశించిపోయే ఆత్మలను రక్షించుటకు చేయు పనిలో ఉండి సాతనును చితకత్రోక్కుతావో లేక దేవుడు చేయమన్న పనిని విడిచి ఇహలోక మాలిన్యముతో జీవించి సాతాను చేత చితక త్రోక్కించుకుంటావో నిర్ణయం నీ చేతిలో ఉన్నదీ.?


Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget