Halloween Costume ideas 2015

Devunni enduku nammali ? Devunni enduku nammavalasi vastundhi ?

దేవునిని ఎందుకు నమ్మాలి?? దేవునిని ఎందుకు నమ్మవలసి వస్తుంది?
నాస్తిక ఆస్తిక వాదుల సైతం తరతరాలుగా యావత్తు మనవ జాతిని వేదిస్తున్న అతి ప్రాముఖ్యమైన ప్రశ్నయే దేవుడు ఉన్నాడా?? 
1) నాస్తిక ఆస్తిక వాదుల సైతం తరతరాలుగా యావత్తు మనవ జాతిని వేదిస్తున్న అతి ప్రాముఖ్యమైన ప్రశ్నయే దేవుడు ఉన్నాడా?? ఉంటే ఆ దేవుడు ఎవరు?అని అది నుండి నేటి వరకు ప్రపంచములో ఎప్పుడు అనుమానాలతో ఉంటూనే ఉన్నారు. దేవుడు కనిపించకపోయినా నమ్మేవారు ఒకరైతే దేవుడు ఉన్నాడు అనుటకు సాక్షాలు కావాలని ప్రశ్నిస్తూ నమ్మనివారు మరొకరు. ఈ ఇరువర్గాల నమ్మకాలలో ఎవరిదీ నిజము?దేనిని నమ్మాలి? ఇలాంటి వారిలో ఒక తెగ దేవునిని నమ్ముతారు ఎలాగంటే ఏదైనా రోగము వస్తే ఆ రోగము పోవడానికి ఏ దేవుడైన ఫరవాలేదు,ముందు రోగము పోతే చాలు అని అనుకున్తున్న్నారు. అంటే వీరు అవసరానికి దేవునిని వాడుకొనుటకు నమ్ముతున్నారు.
2) ప్రతి ప్రారంభానికి ఒక మూలం(endpoint) ఉంటుంది.ఒక చక్కని building నిర్మించబడిoదంటే దానిని నిర్మించాలని ఎవరికో కలిగిన ఆలోచనకు రూపకల్పనే ఆ building.ఆ building నిర్మించిన తర్వాత కట్టిన పనివారు ఇంటిదగ్గర ఉండవలసిన అవసరం లేదు.కట్టిన వారు లేనంత మాత్రన ఆ ఇల్లు దానికదే వచ్చిందని అనుట వేర్రితనమే. సృష్టిని దేవుడు చేసాడు. సృష్టికర్తయైన దేవుడు కనిపించనంత మాత్రన అయన లేడు అనుట వేర్రితనమే అవుతుంది.ఈ రోజు మనిషిని సుఖపెట్టాలనే ఆలోచనలో scientists ప్రతి పదార్ధాన్ని పరిశోదిస్తున్నారు. ప్రకృతిని పరిశిలిస్తున్నారు గాని ప్రకృతిని కలిగించిన దేవునిని పరిశిలన చేసి తెలుసుకొనే పరిశోదన కేంద్రాలు ప్రపంచములో కరువయ్యాయి. 3) దేవుడు మనిషికి కనిపించడు.అయన అద్రుశ్యుడు. కనిపించని దేవుడు ఇతనే అని ఆ రూపము ఎలా చూసావు?ఎలా గిసావు?దేవుడు మనిషిని చేసాడు కానీ మనిషి దేవునిని చేయలేదు.ఒక తండ్రి కుమారుని కనగలడు కానీ కుమారుడు తండ్రిని కనలేడు. కుమ్మరి కుండను చేస్తాడు కానీ కుండ కుమ్మరిని చేయదు. దేవుడు మనుష్యులను చేస్తే మనుష్యులు దేవుళ్ళను చేసే ఎత్తుకు ఎదిగిపోయారు.దేవుడు ఒక్కడే అని కచ్చితముగా తెలుసుకొని అతనే దేవుడు అనే నిర్ణయానికి వస్తే మన నమ్మకానికి ఒక అర్థము ఉంటుంది. వంశపారంపర్యంగా ముత్తాతలు,తల్లితండ్రులు నమ్ముకున్నారు గనుక వారు నమ్మిన దేవుడినే పిల్లలు నమ్ముకున్తున్నారు.తండ్రి సుర్యనమస్కారము చేస్తే కుమారుడు (msc) చదువుకున్న science స్టూడెంట్ కూడా సూర్య నమస్కారము చేస్తాడు. సూర్యుడు ఒక star అనే సంగతి తెలిసిన దేవునిగా పూజిస్తున్నారు.చంద్రుడు దేవుడు కాదని,అది ఒక నేల అని 1969వ yearలో neil armstrong వెళ్ళొచ్చి చెప్పాడు. వంశపారంపర్యంగా పుజించటము అలవాటైపోయింది గానీ,నిజ నిర్ధరనతో రుజువులతో ఇతనే దేవుడు అని ఏ మనిషికి పరిశోధించి తెలుసుకోవాలని
ఆశగాని,ఆలోచనగాని లేదు.దేవుని తెలుసుకోవాలంటే పరిశీలన అవసరము. అంతే కానీ ఏ దేవుడైన ఒక్కటే అని adjust అవ్వకూడదు? కనీ ఏ దేవుడైన ఫరవాలేదని సర్దుకుపోయారంటే కష్టము. మనుష్యుల చేత విమర్శింపబడే వాడు దేవుడు కాదు. దేవునిని ఎందుకు నమ్మాలో అని తెలుసుకోకుండా ప్రపంచములోని వారంతా దేవునీ అవసరాల కోసమే నమ్ముతున్నారు.ఆపదలో అదుకోనేవడేనా దేవుడు?60 years వరకే దేవుడా?చనిపోయినతర్వత దేవుడు అవసరము లేదా?మనము పుట్టకముందే ఈ మహా విశ్వాన్నికిలిగించి అందులో మనము త్రాగడానికి నీరు,ఉపిరి పిల్చుకోవడానికి గాలి, రంగురంగుల ప్రకృతి,ఒక కాయ ఒక పండుతో adjust అవ్వలేవని నీ నాలుక రుచిని ఎరిగి దేవుడు నీకు ఏది ఇష్టమో అని నీ మనస్సును తెలుసుకుని రకరకాల రంగులతో,ఆకారాలతో,రుచులతో లెక్కలేనన్ని ఆహార పదార్ధాలు చేసినది ఎవరు?నీ కోసము ఇన్ని ఎందుకు చేయాలి? నీవు ఆయనకు ఏమి అవుతావు అని ఎప్పుడైనా ఆలోచించావా? మనము మార్కెట్లో ఏది కొన్న ఏది made in india న కాదా అని, వాటి తయారీ ఎక్కడ ,ఎవరు చేసారని తెలుసుకునే నువ్వు నిన్ను ఎవరు చేసారు?అనుభవిస్తున్న సూర్యచంద్ర నక్షత్రాలు ,భూమి,గాలి ,నీరు ఇవన్ని ఎవరు చేసారని తెలుసుకోవా?? తల్లి ఆహారము వండిన తరువాత ఆహార పదార్ధలన్నిటి మీద మూతలు పెట్టినట్లుగా –మనం తినే బత్తాయి పండు మీద చక్కని ముత( తొక్క),అరటిపండు మీద ముత,వేరుశనగ పలుకులకు కుడా చిన్న ముత దేవుడు పెట్టాడు.మన మీద ఎంత శ్రద్ద ఎందుకు కలిగింది? ఆ కనిపించని దేవుడు ఎవరు?మన కోసము ఈ ప్రకృతి ఎందుకు చేయవలసిన వచ్చింది?ఆ దేవునికి మనము ఏమి అవుతాము అన్న విషయాలను తెలుసుకోవాలని ఆశ లేదా?60 years వచ్చిన ఈ సృష్టిని సృష్టించిన దేవుడే ఆత్మలకు కన్నతండ్రి అని తెలుసుకొనక పోవుట విచారకరము. ఒక family ఒకే తండ్రి ఉంటాడు కానీ తండ్రులు ఉండరు.ఒక కుటుంబములో నలుగురు sons and 2 daughters ఉన్నంతమాత్రాన,తండ్రులు 6 నా లేక జన్మనిచ్చిన తండ్రి ఒక్కడేన?? అలాగే భూమి మీద ఉన్న మానవులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవునికి మనమంతా పిల్లలము గనుకనే దేవుడు సృష్టిలో ఉన్నవాన్ని మనకొరకు సృష్టించి ఉచితముగా ఇచ్చాడు.
4) సూర్యుడు,చంద్రుడు,నక్షత్రాలు దేవుడు కలిగించి సుమారు 1500 crores years అయింది. వెలుగులో ,కాలాలలో తేడా లేదు.భూమి తన చుట్టూ తను తిరగటానికి రోజుకు 24hours,చంద్రుడు భూమి చిత్తూ తిరగడానికి 1 month. మనిషి చేత నడిపింపబడుతున్న bus, rail , aeroplane అన్ని ఆలస్యముగా తిరుతున్నాయి కానీ, మన కొరకు దేవుడు పుట్టించిన సూర్యచంద్ర నక్షత్రాలు second కూడా తేడా లేకుండా కచ్చితముగా తిరుగుతున్నాయి అంటే వీటిన్నంటిని మహా వేగముతో తిప్పుతున్నది దేవుడే.tv ని మనము remoteతో operate చేస్తునట్టు ఈ విశ్వాన్ని కూడా దేవుడే నడిపిస్తున్నాడు.గనుక ఎంత వేగముతో తిరిగిన danger జరుగుట లేదు.వాటిని నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు మన ఆత్మలకు తండ్రి.ఆ దేవున్ని తండ్రిగా నమ్మాలి గని అవసరాలకు దేవుడు అని నమ్మకూడదు.
5) భూమి మీద మీకు జన్మనిచిన శరీర సంభందించిన మీ తండ్రిని మీ తల్లి చెబితే నమ్ముతారు.మరి కనిపించని దేవుడు ఉన్నాడని చెబితే నమ్మలేవా? సృష్టికర్త అయిన దేవుడే మన ఆత్మలకు కన్నతండ్రి అని తెలియజేసిన వ్యక్తి శకపురుషుడైన క్రీస్తు యేసు.నేడు ప్రతి మనిషి ఫలానా year,month,date వెయ్యగాలుగుతున్నదంటే దేనిని బట్టో తెలుసా??క్రీస్తు అనే మహానుభావుడు పుట్టాడు గనుక. క్రీస్తు శకము(AD),క్రీస్తు పూర్వము(BC) అని కాలాన్ని విభజించారు.కాలాన్ని లెక్కించుటకు క్రీస్తు యేసును మాత్రమే ఎందుకు శకపురుషునిగా గుర్తుంచాలి?క్రీస్తుకు ముందున్న వారిలో ఎవరు కూడా శక పురుషుడిగా గుర్తున్చ్తకు సరిపోరా?? క్రీస్తుకు ఎవరు సరిరారు గనుకనేఅయన అందరికంటే గొప్పవాడని అయన చేసిన త్యాగానికి శక పురుషునిగా గుర్తించారు.
6) ప్రపంచము అంత గుర్తుంచిన వ్యక్తి అయిన క్రీస్తు యేసు పరలోకము ఉందని,ఆ లోకములో ఉన్న దేవుడు మనకు తండ్రి అని, అయన ఉనవదని చెప్పిన మాటలు నమ్మలేర??శక పురుషుడు అయిన క్రీస్తు మాట్లాడిన మాటలున్న the bible ను నమ్మలేర?అందులో ఉన్న మాటలు వాస్తవము గనుకనే ముద్రన యంత్రము కనుగొన్న తరువాత ముద్రింపబడిన తొలి పుస్తకముగా చరిత్రక్కేక్కింది.
7) దేవుడు లేదని నమ్మి, చచ్చిపోయిన తరువాత తీరా ఆ లోకానికి వెళ్ళాక దేవుడు ఉన్నాడని తెలిస్తే ఆ స్థితి చాల భయంకరము.ఎందుకంటే ,ప్రతి మనిషికి దేహము విడిచిన తరువాత తెలుస్తుంది అస్సలు నిజము.ఒక విత్తనము మట్టిలో పది చచ్చి బ్రత్కి మరో బ్రతుకుందని తెలుపుతుంటే విత్తనము కంటే గొప్పవాడైన నీకు మరణించిన తరువాత మరో లోకంలో మరో బ్రతుకుందని తెలుపుటకు క్రీస్తు చనిపోయి మరణ బ్రతికేను



Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget