Halloween Costume ideas 2015

Manishi Uhallo Devudu

మనిషి ఊహల్లో దేవుడు!!

ఇంత గొప్ప నిర్మాణాలు ఎక్కడి నుండి వచ్చాయో అన్న ఆలోచన లేని మనిషి

మనిషి ఊహల్లో దేవుడు!
మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలయజేస్తున్నాను.
మనిషి ఊహలకు అందనివి చాలా ఉండగా, అందులో దేవుడు మొదట అని చెప్పాలి. దేవుడు చేసిన ఈ అందమైన సృష్టిలో ఎన్నో పెద్ద పెద్ద నిర్మాణాలు, sky, stars, నదులు , మహా సముద్రాలు ఇలా ఎన్నో ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఏనాటికి చేయలేని ఇంత గొప్ప నిర్మాణాలు ఎక్కడి నుండి వచ్చాయో అన్న ఆలోచన లేని మనిషి ఎంత అమాయకుడో అర్థమవుతుంది. ప్రకృతి అందాలను చూస్తూ ఏ విధముగా తృప్తి చెందుతున్నడో ఇప్పుడు చూద్దాము.
1) (a) నయగారా( water falls) వంటి అందమైన జల పాతాలను చూసే పరిస్థితి అందరికి ఉండదు. కాబట్టి అట్టి దృశ్యాలను సినరిలుగా photoలను పెద్దవిగా చేయించుకొని ఇంటిలో గోడలకు తగిలించుకుని అనుభూతి చెందుతున్నారు
(b) ఆకాశములో కనిపించే stars సమూహాన్ని చేరుకో లేకపోయిన , వాటిని పోలిన చిన్న చిన్న bulbs లను గుత్తులు గుత్తులుగా వెలిగించుకొని అందని అంతరిక్షమును ఉహించుకుంటున్నారు.
(c)ఒక మహా సముద్రములోని మత్స్య సంపద ,వాటి జాతులను లెక్కించుట అసాధ్యము. ఇంతటి మహా సముద్రాన్ని లేక నదిని కూడా చిన్నగా చూడాలని ఉహించుకుని ఒక గ్లాస్ పెట్టెను తయారు చేసుకుని దానిలో కొంచెము నీటిని , oxygenను and నాలుగైదు రకాల చేపలను ఉంచి అక్వేరియం గా చేస్తున్నారు. ఇది మనవ జాతి పని. మరి దేవుడు అక్వేరియంను కాదు మహా సముద్రాలను కలిగించి ,వాటిలో విస్తారమైన మత్స్య సంపదను ఉంచియున్నాడు. కీర్తన 104:25,26లో దేవుడు నిర్మించినట్టు ఉంది. 2) ఎక్కడ ఏ జీవ రాశి పుట్టిన ,ఎంత ఎత్తులో నుండి నిరు ప్రవహిస్తున్న ,stars ఎంత ఎత్తులో ఉండినా ప్రతిది మన కొరకే. మన ఆనందము కొరకు దేవుడు ఇంత గొప్ప వాటిని కలుగజేస్తే వాటిని పోలిన నమూనాలను(duplicate) చేసుకుని దేవుడిని మరచిపోవుట న్యాయమా?? నేటి దినాలలో మత్స్య పరిశ్రమ విపరీతముగా అబివృద్ది చెందినది . పంట పొలాలను రొయ్యల,చేపల చెరువులుగా మర్చి అందులో చేపలను పెంచుతూ వాటికీ ఆహారము వేస్తున్నారు. దిన్ని వాళ్ళ ఎన్నో feed(చేపకు ఆహారము) factories, చేపల పిల్లలు ఉత్పత్తి చేసే factories పుట్టుకొచ్చాయి.మనము పెంచే చేపలకు మనమే ఆహారము పెట్టి పోషిస్తున్నాము అయితే సముద్రాలలోని మత్స్య సంపదకు ఆహారము పెట్టి వాటిని తృప్తి పరుస్తున్నది ఎవరు??? వాటి అంతట అవే పెరుగుతున్నాయని అనుకుంటున్నారా??? అవే వాటికంతటికి అవే పెరుగుతాయి అని అనుకుంటే మన చెరువులోని చేపలను వదిలి వెయ్యండి చూద్దాము??? చెరువులోని చేపలకు నీ help కావాల్సి వస్తే అక్కడి వాటి help దేవుడే. కీర్తన 104:27-తగిన కాలమున నీవు వాటికీ ఆహారము ఇచ్చేదవని ఇవి అన్నియు నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి. వీటినే కాదు మనలను పోషిస్తున్నది దేవుడే!!!ప్రసంగి 2:25-అయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికీ సాధ్యము?
3) సృష్టిలో ఉన్న వస్తువుల యొక్క అందాలను చిన్నగా photoలలో చూస్తున్న మనిషి దేవుడిని కూడా చిన్నగా photoలో చూసుకోవాలని అనుకుంటున్నారు. దేవుని బొమ్మల photoలు విధిలలోఅమ్ముకుంటూ ఉంటె ఆలోచన కోల్పోయిన క్రైస్తవులు లోని అనేకులు వాటిని కొనుక్కొని గోడలకు తగిలించుకొంటున్నారు.
4) దేవుని వాక్య భావాలు అర్థము చేసుకొనే తీరిక లేకపోవటముతో అయన మాటలన్నిటిని అపార్ధము చేసుకున్నారు. యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరి అని అన్నాడు. ఈ మాటకు నేటి క్రైస్తవుల స్పందన ఏ విధముగా ఉన్నదో చూస్తే యేసు ఒక పచ్చని కొండ ప్రదేశములో ఒక బండ మిద కూర్చొని ఒక గోర్రపిల్లను ఎత్తుకుని యుంటే మిగిలిన గొర్రెలన్నీ అయన ముఖము వైపు దినముగా చూస్తునట్లు చిత్ర పటాన్ని చిత్రీకరించారు. మనము జీవాధారము కొరకు మేపుకోను గోర్రాలను మేపుట కొరకు యేసు పరలోకము నుండి దిగి రావాలా? త్రోవ తప్పి నశించి పోవుచున్న వారినందరిని రక్షించి వాక్యమనే పచ్చికతో పుష్టిగా మేపి పరలోకానికి నడిపించుటకు అయన వచ్చియున్నాడు.
5) పుట్టుక ,చవులు మన ఇష్టమేనా? మరణకరమైన రోగము వస్తే ఉన్నదంతా అమ్ముకున్న మరణించట తప్పుట లేదు. మనకు మనము పుట్టి చనిపోతే ఇంకా దేవుడు ఎందుకు? లోకములో ఎంతో మంది అందగత్తెలు ఉన్న ఒక రోజుకు ముసలి వారుగా మిగిలిపోతున్నారు.ఒక నాటి దివ్య జ్యోతి ,సౌందర్య ఏమైపోయారు? వీరిని గూర్చి వారము రోజుల పాటు సంతాప సభలు పెట్టి తర్వాత ఎవరి shootingకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంత అందమైన దేహమును అటు తల్లితండ్రుల ప్రమేయము లేకుండా ఇటు మన ప్రమేయము లేకుండా ఎలా వచ్చిందో ఈ ఒక్కరు ఆలోచించుట లేదు. దేహము దేవుని ఆలయమని మిలో ఉన్న పరిశుద్దాత్మకు నిలయమని దేవుడే చెబితే ,ఈ దేవాలయాన్ని కలుషితముగా మార్చితే దేహనిచ్చిన దేవుడు ఎలా స్పందిస్తాడో మిరే చెప్పండి? మట్టిలో కలిసిపోయే మనవ దేహమునునకు మెరుగులు దిద్దుత కొరకు ఎన్నో beautyparlour పుట్టుకొచ్చాయి.ఈ విధమైన ఆలోచనలు మనిషికి రాకముందే అయన ఏమి చెప్పడో చూస్తే సామెతలు 31:30- అందము మోసకారము సౌందర్యము వ్యర్ధము.

6) ఎంతో మంది బలవంతులు కండలు తిరిగిన దేహముతో 100, 200 kg weight అవలీలగా ఎత్తిపారేస్తున్నారు. ఈ భలము వారికీ ఎంత కాలము ఉంటుంది?? 100kg నీ ఎత్తిపారేస్తున్న అదే మనిషి చివరికి 100గ్రా నీటి glassను నోటి యొద్దకు తెచ్చుకోనుతకు చాలా కష్టపడవలసి వస్తుంది. పుట్టినది మొదలుకొని మనము చనిపోయే వరకు ఇన్ని సంగతులు తెలియజేయుచు వచ్చిన తండ్రియైన యెహోవా మనకు దేవుడుగా ఉండుట మనకు మహా భాగ్యము కాదంటారా?
ఈ లోకములో ఉన్న దేవుని చేతి పనులను నమునాలుగా చేసుకుని చూసుకుందామా లేక ఇంతకంటే అద్బుతమైన లోకము ఉందని గమనించి ఆ దేవునికై బ్రతుకుదామా? అక్వరియం చూడక మహా సముద్రములోని గొప్పతనాన్ని చూస్తే తెలుస్తుంది. ప్లానిటోరియము కాదు sky చూస్తే దేవుని చేతి పని తెలుస్తుంది. విమర్శించుటకు ఎదుటి వారిని చూడక bibleను పరీక్షించి చూస్తే చదివితే దేవుని మనస్సు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు మన ఉహలకు అందని వాడుగా మనిషి ఉహల్లో దేవుడు దేవుడిగా ఉంటాడు.





Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget