Halloween Costume ideas 2015
November 2016

యేసుక్రీస్తు మూడు రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా
.

మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలయజేస్తున్నాను. నేడు క్రీస్తు గురించి ,అయన మరణ సమాధి పునరుర్ధానము గూర్చి క్రీస్తు విరోధులు వేస్తున్న నిందలు చెప్పలేనివి. యేసుక్రీస్తు బాల్యము నుండి పెరుగుతున్నప్పుడు , సువార్త ప్రకటిస్తున్నప్పుడు ,సిలువ ఎక్కినప్పుడు ,సమాధి చేయబడినప్పుడు,తిరిగి లేచి పరలోకానికి వెళ్లి సుమారు 2000 years గడిచిన అయన మీద ఇంకా నిందలు  ఉన్నాయంటే అయన వలన ఈ ప్రపంచానికి ఎలాంటి రక్షణ,ఎలాంటి పరిస్థితులు అయన రెండవ రాకడలో జరగబోతుందో ఆలోచించవచ్చు.
1) యేసుక్రీస్తు పలికిన కొన్ని మాటలను బట్టి నేడు క్రీస్తు విరోధులు(muslims) క్రీస్తు మూడు రాత్రింబగళ్ళు సమాధి లో ఉన్నాడా అను ప్రశ్నను సమాజములో పుట్టించారు.ముందుగా bibleలో ప్రశ్నలు అనేవి లేవు .కేవలము సమాధానాలే ఉంటాయి. bibleలో వ్రాయబడిన సంగతులు మనిషికి అర్థము కాక అపార్ధము చేసుకుని ప్రశ్నలుగా ఈ రోజు సమాజములో పుట్టిస్తున్నారు. మత్తయి 12:40లో యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భుగర్భములో ఉండును. యేసు పలికిన ఈ మాటను పట్టి క్రీస్తు విరోధులు ముఖ్యముగా muslim వారు క్రీస్తు మూడు రాత్రింబగళ్ళు సమాధి లో ఉన్నాడా అను ప్రశ్నను ప్రపంచానికి వేసి అమాయకులైన క్రైస్తవులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నము చేసారు,చేస్తున్నారు... 2) bibleను తప్పు పట్టాలని , క్రీస్తు మరణ సమాధి పునరుర్ధానములు అబద్దము అని చెప్పడానికి వారు పడుతున్న ప్రయాస వివరించలేనిది. bible ప్రకారముగా వాస్తవముగా యేసుక్రీస్తు విశ్రాంతి దినమున ముందటి రోజు అనగా friday మధ్యాహానము మూడు గంటలకు అయన సిలువలో చనిపోయాడని and మరలా sunday early morning లేచాడని మనకు తెలుసు. ఇప్పుడు క్రీస్తు విరోధులు ఏమి అడుగుతున్నారంటే friday దినమున ఒక పగలు ,ఒక రాత్రి వచ్చింది ,saturday ఒక పగలు ఒక రాత్రి వచ్చింది and sunday రాత్రి ఎక్కడ అయింది అనగా యేసు మాటలలో వాస్తవము లేదు and 2 రాత్రులు, 2 పగలు వస్తున్నాయే తప్ప మూడు రాత్రులు మూడు పగలు ఎక్కడ ఉన్నాయని ప్రపంచానికి ప్రశ్న వేసే సరికి అమాయక క్రైస్తవులు అవును నిజమే కదా యేసు మాటలలో తప్పు ఉంది అని అనుకుని చివరికి bible తప్పు అని declare అయ్యి islamగా మారిపోతున్నారు. bibleలో ఎన్నో తప్పులు ఉన్నాయని అమాయక క్రైస్తవుల దగ్గరకు వెళ్లి తప్పుడు ప్రచారము చేసి ఎన్నో వందల familiesను muslimsగా మారుస్తున్నారు. వాళ్ళ మత గ్రంధము అయిన quranలోనివి christians చెప్తే నమ్మరు అని మన గ్రంధమైన bibleలోని కొన్ని వచనాలను తప్పు పట్టి ఈ రోజు అమాయక క్రైస్తవులను తప్పు దోవ పట్టిస్తున్నారు. క్రీస్తు విరోధుల యొక్క ఈ ప్రశ్నకు మన christiansలో కొంత మంది ఎలాగన్నా జవాబు ఇవ్వాలని యేసుక్రీస్తు friday కాదు చనిపోయింది thursday అని బదులు ఇస్తున్నారు.

3) ఈ ప్రపంచములో తప్పు అనేది లేని ఏకైక మహా జ్ఞాన గ్రంధ రాజు bible.. bibleలో అర్థము కానీ విషయము అర్థము అవ్వాలంటే సరిగా విభజించి,విభజించినది అన్ని విధాలుగా ఆలోచించాలి ( 2 timothy2:15,కొలాసి 3:16). mark 8:31లోని మాటను చూపించి ఈ మాటలో యేసు మూడు దినములైన తర్వాత లేస్తాడని ఉంది కనుక thursday లేచాడు అని తప్పుడు జవాబు ఇస్తున్నారు. ఇలాంటి తప్పుడు జవాబులు ఇచ్చి క్రీస్తు విరోధులకు అవకాసము ఇస్తున్నారు.

4) మూడవ దినమున లేస్తాను అని అన్నాడా లేక మూడు దినములైన తర్వాత లేస్తాను అని అన్నాడా??? మత్తాయి16:21-మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా......... మూడవ దినమున లేస్తాను అని మత్తాయిలో వ్రాయబడింది. మరి mark 8:31లో యేసు మూడు దినములైన తర్వాత లేస్తాడని ఉంది.. ఈ mark 8:31, మత్తాయి16:21,మూడు రాత్రింబగళ్ళు తర్వాత లేచుట ఏది వాస్తవము???? ఇంత గంధరగోలములో ఏది వాస్తవము అంటారు??? ఆ మూడు సందర్భాలలో యేసునే మాట్లాడాడు. ఇప్పుడు మనము తెలుసుకోవలసింది ౩ రోజుల తర్వాత లేచాడా లేక మూడవ దినమున లేచాడా లేక మూడు రాత్రి మూడు పగలు ముగిసిన తర్వాత లేచాడా?

5) ఇప్పుడు వివరణలోకి వెళ్దాము.. 2 దినవృత్త 10:4 లో అతడు- మీరు మూడు దినములు తాళి(ఆగి) మరలా నా యొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్ళిపోయిరి. ఇక్కడ మూడు దినములు అయిన తర్వాత రండని చెప్పచున్న సందర్భము.. 2 దినవృత్త 10:12లో మూడవ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము...... పైన 4వ వచనములో3 days తర్వాత రండి అని రాజు చెప్పాడు and 12వ వచనములో ముడువ దినము నందు రండి అని రాజు చెప్పాడు.. అనగా మూడు దినముల తర్వాత అన్న ,మూడవ దినము అన్న ఒక్కటే భావము... 1సముయేలు30:11- వాడు మూడు రాత్రింబగళ్ళు అన్నపానము లేమియు పుచ్చుకొనలేదని తెలుసుకుని.... 1సముయేలు30:13-మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా.....పై వివరణ బట్టి చివరగా అనగా మూడు దినములైన తర్వాత అన్న ,మూడవ దినమున అన్న , మూడు రాత్రింబగళ్ళు అన్న ఒక్కటే భావము అర్థము.. యేసు మూడు దినములైన తర్వాత తిరిగి లేస్తాడని markలో ఉన్నట్టు చూసాము., ముడువ దినమున లేస్తాడని మత్తాయిలో ఉన్నట్టు చూసాము, మూడు రాత్రింబగళ్ళు అయన తర్వత లేస్తాడు అను మాటను మత్తాయిలో ఉన్నట్టు చూసాము. ఈ మూడు సందర్భాలలో భావము- నేను మూడవ దినము తిరిగి లేస్తాను అని అర్థము....

6) అపోకార్య 10:40-దేవుడు ఆయనను మూడవ దినమున లేపి..... అంటే యేసు మూడవ దినమున లేచాడని అపోస్తులలు సాక్ష్యము ఇస్తున్నారు. luke 24:21- ఇశ్రాఎలును విమోచించుబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములు ఆయెను..... అంటే కచ్చితముగా మూడవ దినమున తిరిగి లేచాడు..

7) మత్తాయి 12:38 నుంచి 41-వాళ్ళు సూచక క్రియ అడిగినప్పుడు యోన సూచక క్రియే మీకు అనుగ్రహిoపబడును అని యేసు అన్నాడు. ఇందులో ఆలోచించాల్సింది బ్రతుకున్నవాడు భయటపడడము గొప్ప లేక బ్రతుకున్న వాడు చనిపోయి తిరిగి లేవడము గొప్ప????? యేసు చనిపోయి లేచాడు గనుక యోన కంటే గొప్పవాడు. luke 11:30- ఇందులో తిమింగలము time చూసుకుని మ్రింగిందా లేక time చూసుకుని కక్కిందా??????? example:: 16-4-14న nithin అనే నేను ఉదయము 9 గంటలకు officeకి వెళ్ళాను. వెళ్ళిన నేను ఆ రోజు పూర్తి చేయాలంటే మరలా రేపు ఉదయము 9 వరకు ఉండాలా???? 12am వస్తే 17date వస్తుంది.

8) time చూసుకుని సమాధిలోకి వెళ్ళవలసిన అవసరత, time చూసుకొని లేవవలసిన అవసరత లేదు. మనకు తిరిగి లేవడము ముఖ్యము కానీ ఎన్ని రోజులకు లేచాడన్న విషయము ముఖ్యము కాదు. సమాధిని గెలవడము ముఖ్యము. విశ్రాంతి దినమున ఎప్పుడు ప్రారంభమైనదో చూస్తే లేవియు 23:32- సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను..అంటే ముందటిరోజు evening 6 నుంచి తర్వాత రోజు 6 pm వరకు అని అర్థము. friday దినమున 6pm దాటితే విశ్రాంతి దినము start అవుతుంది. john19:31- ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మిద ఉండకుండునట్లు.. .... అనగా విశ్రాంతి దినమున సిలువపై శవము వ్రేలడకుడదు.. friday 3pm సమీపములో అరిమతయ ఎసుపు పిలాతు దగ్గరకు వెళ్లి deadbody కోసము permission అడిగి సమాధి చేసాడు,..

9) ఎందుకు లేవాలి మూడవ దినమున?? అయన తిరిగి sunday దినాన లేవలేకపోతే permanentగా మట్టిలో పాతిపెట్టేవారు. పాతి వేస్తే అయన దేహము కుళ్ళు పడుతుంది. నీ పరిశుద్దుని కుళ్ళు పట్టనియ్యవు అను ప్రవచనము ఉంది గనుక sunday లేచాడు. అయన లేవడము ముఖ్యమా ? ముందు క్రైస్తవుడిగా ఆలోచించవలసినది time కాదు లేవడము ముఖ్యము. మూడు రాత్రింబగళ్ళు ఎలాగో చూద్దాము... a)మొదటి దినము(ఒక పగలు,ఒక రాత్రి)- ఇది friday-afternoo n 3 నుంచి 6 pm వరకు పగలు ,6 pm నుంచి 12am వరకు ఒక రాత్రి. b) రెండవ దినము( ఒక పగలు ,ఒక రాత్రి)-ఇది saturday- 12 am నుంచి 6pm వరకు పగలు, 6 pm నుంచి 12 am వరకు రాత్రి. c) మూడవ దినము ( ఒక పగలు ఒక రాత్రి)-ఇది sunday -12 am నుండి 6 వరకు రాత్రి ,సూర్యోదయము అవుతుండగా లేచాడంటే పగలు వచ్చింది..

10) 1 కోరంధీ 15:3- లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను,సమాధి చేయబడెను,లేకహనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను..మూడవ లేవుట అనునది లేఖనాల నెరవేర్పు.. చివరగా యేసుక్రీస్తు friday చనిపోయినది, సమాధి చేయబడడము వాస్తవము and తిరిగి మూడవ దినమైన sunday లేవడము వాస్తవము. time correctగా ఉంటె రక్షణ రాదు కానీ తిరిగి లేస్తేనే రక్షణ.



బైబిల్ ప్రకారముగా మనుష్యులకు తీర్పు తీర్చవచ్చా?

అనేక మంది హృదయాలలో చోటు సంపాదించుకున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున

మీకు శుభములు తెలియజేస్తున్నాను.

1) యేసుక్రీస్తుఈ లోకానికి వచ్చి నేటికి సుమారు 2000 సం దాటిపోయింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో భోదనలు చేసాడు. 2000సం దాటిపోయిన ఈ రోజు ప్రపంచములో ఎక్కువ మందిని ప్రభావితం చేసి ,ఎక్కువ మంది హృదయాలలో చీరస్థాయిగా యేసుక్రీస్తు చోటు సంపాదించాడంటే కేవలము అయన మాటలలోనున్నగొప్పతనమే అని చెప్పక తప్పదు.నేటి వరకు మన కళ్ళ ముందు ఎంతో రాజకీయ నాయకులు, పెద్దవారుమనల్ని పరిపాలించి చివరికి మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇలా వీరు ఈ లోకాన్ని వదిలి కనీసం 20సం కాకముందే వారిని మర్చిపోయే దాఖలు ఉన్నాయి.  అనగా మన కళ్ళముందు తిరిగిన వ్యక్తి, ప్రతి రోజు మీడియా వార్తలలో కనుబడు వ్యక్తి ఒక సంవత్సరం పాటు కనబడకపోతే మర్చిపోతాం. అయితే యేసుక్రీస్తు ఏ మీడియా వార్తలలో కనబడలేదు కానీ ఈ రోజు అనేక లక్షల, కోట్ల మంది హృదయాలలో అయన చోటు సంపాదించడంటే ఇంక అయన మాటలు ఎంత గొప్పవో ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి.

2) మహనీయుడైన యేసుక్రీస్తు మాటలలో ఒక అంశమును చూస్తే మత్తయి 7:1- మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు.మనక్రైస్తవు సమాజానికి ఈ వచనమంటే బాగా గుర్తుండేఉంటుంది కానీ ఈ మాటలో ఉన్న పరిపూర్ణ సారాన్ని అర్థం చేసుకొనుటలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. వ్యక్తిగత విషయాలలో ఘోరమైన తప్పిదమునుఅవతలి వారికీ తెలియజేసి సరిచేసుకోమని చెప్పినప్పుడు వెనువెంటనే వారి నోట నుండి వచ్చే మాటే మత్తయి 7:1. బైబిలుకు వ్యతిరేకమైన భోదన చేస్తూ ,వాక్యాన్ని వక్రికరిస్తూ, వాక్యమును తప్పుగా చెబుతున్నప్పుడుమనం సత్యమైన వాక్యము చెప్పి మీరు చెప్పింది తప్పు అని చెప్పినప్పుడు వెనువెంటనేవారి నోట నుండి వచ్చే మాటే మత్తయి 7:1.

3) క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు మొట్టమొదట మత్తయి 7:1 నుండి 5 వరకు యేసు పలికిన భోదనలో ఎవరిని దృష్టిలో పెట్టుకుని, ఎవరి గూర్చి ,ఎందుకు చెప్పారో తెలుసుకోవాలి. ఇది ఇలా ఉంచి 1 కోరంది 6:2,3 చూస్తే పరిశుద్దుల లోకమునకు తీర్పు తీర్చుదురని మిరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా ,మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తిర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవ దూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంభంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తిర్చవచ్చును గదా? మత్తయి 7:1 లో తీర్పు తీర్చకుడి అని మాట అంటే 1 కోరంది6:2,3 లో తీర్పు తీర్చమని చెబుతున్నాడు. కనుక మనం పై మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? చూద్దాము.

4) బైబిలలో ఆదికాండము మొదలుకుని ప్రకటన గ్రంధము వరకు గల 66 పుస్తకాలలో మనకు ముఖ్యముగా రెండు తీర్పులు కనబడుతున్నాయి. A) దేవుని తీర్పులు B) మనుష్యుల తీర్పులు. అయితే మత్తయి 7:1 నుండి 5లో, 1కోరంది6:2,3లోచెప్పబడినది మనుష్యుల తీర్పు గూర్చి అని తెలుసుకోవాలి. ఈ పాఠమును భాగాలుగా విడదీసి వివరించుకుంటే చక్కగా అర్థమవుతుంది.(1) దేవునికి నచ్చని మనుష్యునితీర్పులు (2) దేవునికి నచ్చే మనుష్యుని తీర్పులు. మత్తయి 7:1 నుండి 5 వరకు చెప్పబడిన మాటలు దేవునికి నచ్చని మనుష్యుల తీర్పులకు సంభంధం ఉంటే 1 కోరంది 6:2,3,లో చెప్పబడిన మాటలు దేవునికి నచ్చే మనుష్యుల తీర్పులకు సంభంధం ఉందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క భాగమును విడగొట్టుకుంటూ ధ్యానించుటలో ముందుకు సాగుదాం. దేవునికి నచ్చని మనుష్యుల తీర్పులు

A) మత్తయి 7:1 నుండి 5వరకు-మీరు తీర్పు తీర్చకుడి. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గుర్చియు తీర్పు తీర్చబడును,మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేలా?నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొనుము,అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇది వాక్యములోని మాటలు.

B) పై వచనములో దూలము అనగా మనిషిలోనున్న బలహీనత లేక తప్పు లేక పాపము. ఇక వచన వివరణలోకి వెళ్తే అవతలివారిలోనున్న నలుసును గుర్తించిన నీవు నీ కంటిలోనున్న దులాన్ని మొదట గుర్తుంచుకోవాలి అని చెబుతున్నాడు. అనగా అవతలి వాళ్ళ బలహీనతలపై ఎల్లప్పుడూ శ్రద్ద చూపుట కంటే మొట్ట మొదట మన బలహీనతల గూర్చి చూసుకోవాలి అని చెబుతున్నాడు. 24 గంటలు అవతలి వాడిలో ఉన్న బలహీనతలు ఆలోచిస్తూ తమకు తాములో ఉన్న ఘోరమైన బలహీనతలను ఆలోచించకుండా అవతలి వారు చేయు తీర్పు దేవునికి నచ్చని తీర్పు కనుక ఇట్టి తీర్పు తీర్చకుడి అని అంటున్నాడు.

C)ఏ రోజు కూడనీ జీవితాన్ని వాక్యముతో పరిశిలించుకొనక, చెడ్డవాడిననితెలిసి సిగ్గుపడక ,నిన్ను నీవు విమర్శించుకొనకుండా ,నీకు నీవు తీర్పు తిర్చుకోనక ఎల్లప్పుడూ అవతలి వాడికి తీర్చుతున్న తీర్పులు దేవునికి నచ్చని తీర్పులు. నీబలహీనతలు ఏనాడు పట్టించుకొనక ఎప్పుడు అవతలివాడి గురించి తీర్పు తీర్చుతున్న నీవు చేసేది దేవునికి నచ్చని తీర్పులు కనుక మత్తయి 7:1 నుండి 5లో తీర్పు తీర్చకుడి అని చెప్పాడు. లూకా 18:9 నుండి 14లో తమకు తామేనీతిమంతులమని ఇతరులను తృణికరించువారితో పరిసయ్యుడు-సుంకరి గూర్చి చెబుతున్న సందర్భపు మాటలను ఒక్కసారి ధ్యానించండి.

D) మత్తయి 7:1 నుండి 5లో అవతలి వాడిలో బలహీనతలు ఉంటె వాటిని తీసేసే ప్రయత్నం మీరు ఎప్పుడు చేయకండి అని యేసు చెప్పలేదు కానీ తీసి వేసే ముందుగా నీలోనున్న దూలము(ఘోరమైన తప్పిదములు) తెలుసుకుని సరిచేసుకోమని చెబుతున్నాడు. రోమా 2:1నుండి చూస్తే కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవైయున్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తిర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తిర్చుకోనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?.....అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా,నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా? అనగా అవతలి వాళ్ళను తప్పు అని తీర్పు తీర్చుతున్న వారు ఆ తప్పునే వీరు చేస్తున్నప్పుడు ఇట్టివారు దేవుని తీర్పును తప్పించుకోలేడని పై వచనములో అర్థమవుతుంది

E) మత్తయి 7:1నుండి 5, లూకా 18:9, రోమా 2:1 నుండి 5 ఈ మూడు వచనాలలో మనకు అర్థమైన విషయమేమనగాఅవతలి వారి తప్పిదములను బట్టి తీర్పు తిర్చవద్దు అని చెప్పలేదు కానీ తీర్పు తీర్చుతున్న వాడు మొట్టమొదట తనను తాను తీర్పు తీర్చుకోవాలని చెబుతున్నాడు. తనను తాను సరిచేసుకోకుండా అవతలి వాళ్ళకి తప్పు అని తీర్పు తీర్చుతు ఆ తప్పునే వీరుచేస్తూ ఇచ్చే తీర్పు దేవునికి నచ్చని తీర్పు .అవతలి వాడి యొక్క బలహీనతలు బట్టి తీర్పు తీర్చే ముందు ఒక్కసారి తమకు తాము ఆలోచించుకోవాలి. 1 కోరంది11:28-ప్రతి మనుష్యుడు తన్ను తాను పరిక్షించుకోనవలెను.....31-మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పొందుము.

F) అను దినము వాక్యముతో జీవితాన్ని పరిశిలించుకుంటూ, విమర్శించుకుంటూ, సరి చేసుకుంటూ ఈ అనుభవంతో అవతలివారిని దారిలో తెచ్చే అవకాశం ఉంటుంది కానీ తమకు తాము మంచివారిగా,నీతిమంతులుగా తీర్చుకుంటూ ఎప్పుడు అవతలి వారి మీద వెలు ఎత్తేస్వభావముతో తీర్పు తీర్చితే అట్టి తీర్పు దేవునికి నచ్చే తీర్పు కాదు కనుక మత్తయి 7:1లో తీర్పుతీర్చకుడి అన్నాడు. దేవునికి నచ్చే మనుష్యుల తీర్పులు

A) ఇంతవరకు పై వివరణలో దేవునికి నచ్చని మనుష్యుల తీర్పుల గూర్చి తెలుసుకున్నాము. అయితే దేవునికి నచ్చే మనుష్యుని తీర్పులు గూర్చి ఇప్పుడు ఆలోచిద్దాము. వాస్తవానికి సహోదరులమైన మనం ఒక బలహీనత ఒకరిలో ఉందని తెలిసినప్పుడు ఆ బలహీనత గురించి ప్రస్తావించి మంచి దారికి తీసుకుని రావొచ్చా?? అయితే గలతీ 6:1- సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకోనినయెడల ఆత్మ సంభందులైన మిలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకుని రావలెను. ఆవతలి వారిని దారిలో తీసుకునివచ్చుటకు దేవుడు నియమ నిభంధనలతో గలతీ 6:1 ద్వార మనకు తెలియజేసాడు.

B)ఎవరైనా ఏ బలహినతలోనైన ,నేరములో’నైన, పాపములోనైన, తప్పిదములోనైన పడిపోతే తాను ఒక దినాన ఆదేబలహినతలో ,నేరములో’, పాపములో, తప్పిదములో శోధింపబడుదునేమో అని తన విషయమై తాను చూచుకోనుచు సాత్వికముతో తననుమంచి దారికి తీసుకుని రావాలి. ఇది దేవునికి నచ్చే తీర్పు. అనగా మనల్ని మనం సరి చేసుకుని అవతలి వారి తప్పులను ఎత్తి వారిని నిందించకుండా, హేళనచేయక, గడ్డించక సాత్వికమైన మనస్సుతో తాను చేసినది తప్పు అని తెలియజేసి మంచి దారికి తీసుకుని వచ్చే తీర్పు దేవునికి నచ్చే తీర్పుగా మనం గలతీ 6:1 ద్వార తెలుసుకుంటూన్నాము. C)ఒక వ్యక్తిని మంచి దారికి తీసుకుని వచ్చే ముందు మొదట తప్పు అని అతనికి తెలియజేయాలి. తప్పు అని చెప్పకపోతే అది తప్పు అని తెలుసుకునే ఆవకాశం రాదు కనుక ఆ తప్పు బట్టే నరకములో పడుట ప్రమాదం ఉన్నదీ. అనగా అవతలి వారి వ్యక్తి గత విషయములో దేవునికి వ్యతిరేకముగా తప్పిదము చేస్తున్నప్పుడు మొదట ఆ తప్పు మనలో ఉన్నదో అని పరిశిలించుకుని సరి చేసుకుని సాత్వికమైన మనస్సుతో అవతలి వారికి తప్పును తెలియజేసి మంచి దారికి తీసుకుని వచ్చే క్రియే దేవునికి నచ్చే తీర్పు.

D)అయితే తీర్పు తీర్చుట విషయములో దేవుడు మన నుండి ఆశించేది ఏది? ఈ లోకంలోనున్న న్యాయాధిపతుల వలె మనం తీర్పు తీర్చకూడదు కానీ ఆ తీర్పు అవతలి వారిని దేవునికి దగ్గర చేసేటట్టు ఉండాలి. నీతి గల దేవునికి పిల్లలమైన మనం కూడ నీతిమంతులుగా బ్రతకమన్నాడు. ఆనీతినే ఖచ్చితముగా తీర్పులో పెట్టమన్నాడు. న్యాయమైన తీర్పు తీర్చవచ్చని లేవికండము 19:15,17,18 లో దేవుడు చెప్పాడు.

E)అయితే న్యాయమైన దేవునికి నచ్చే తీర్పు తీర్చు విధానమును మత్తయి 18:15 నుంచి చూడవచ్చు చివరిగా 1.అవతలి వారిలో ఉండు బలహీనత బట్టి తీర్పు తీర్చక ముందు ఆ బలహీనత నీలో ఉన్నదేమో పరిశిలించుకుని ఆవకాశం దొరికింది అని పెత్తనం చేయక సాత్వికమైన మనస్సుతో ఒంటరిగానున్నప్పుడు అతినికి చెప్పాలి. 2. మీ మాట వినని యెడల ఇద్దరు ముగ్గురితో చెప్పించాలి. 3. ఇంకను వినకపోతే సంఘమునకు తెలియచెప్పాలి. 4. ఇంకా వినక పోతే ఇంక వాడిని అన్యుడిగా ఎంచుకోవాలి. 5. వెలి వేసాక ఏదో ఒక రోజున తప్పు తెలుసుకుని మార్పు చెందితే వెంటనే మనలోకి చేర్చుకోవాలి.

3. అవతలి వారు వాక్యమును తప్పుగా చెబుతుంటే సత్యమేదో చెప్పి వారిని తీర్పు తీర్చమన్నాడా??? ఇప్పటికి వరకు దేవునికి నచ్చే ,నచ్చనివ్యక్తిగత తీర్పుల గూర్చితెలుసుకున్నాము. ఇక అవతలి వాడు భిన్నమైన భోద, అసత్యమైన భోద చేస్తున్నప్పుడు ఖచ్చితముగా మనం సత్యం చెప్పి సరి చేయవలసిన భాద్యత మనకు ఉన్నదీ. అవతలి వాడు చెబుతున్న భోద ఆలాగు ఉన్నదో లేదో అని బైబిల్ లోని మాటలను పరిశీలించి తీర్పు తీర్చాలి. అనగా తప్పుడు భోదన చేయువాడు తనను తాను నరకానికి చేర్చుకుంటూ వింటున్న వారిని నరకానికి చేరవేస్తాడు కనుక సత్యము చెప్పి అబద్ద భోదకుడిని సరిచేయమన్నాడు. అబద్ద భోదకుల నుండి జాగ్రతగా ఉండమని, భోద విషయములో జాగ్రత్తగా ఉండమని ఎన్నో హెచ్చరికలు బైబిల్ ద్వార దేవుడుమనకు తెలియజేసాడు.( మత్తయి 7:15,మత్తయి 24: 4,5,24, గలతీ 1:6,7,8, ఎఫేసి 5:6,7,11, 1 తేస్సా 5:12,11 తేస్సా 3:6,11 తిమోతి 3:16,17,తితు 2:15....)బైబిలుకు వ్యతిరేకమైన భోదన చేస్తూ ,వాక్యాన్ని వక్రికరిస్తూ, వాక్యమును తప్పుగా చెబుతున్నప్పుడుమనం సత్యమైన వాక్యము చెప్పి సరి చేయాలి.
 

సువార్త అనగా ఏమి? సువార్త ఎలా ప్రకటించాలి?


ప్రభువు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు వందనములు తెలియజేస్తూన్నాను.

ఈనాడు సువార్త ప్రకటన చేసే విధానము రాక క్రైస్త్యవ్యమును అవహేళన పరుస్తున్నారు. సువార్త ఎలా ప్రకటించాలో క్రైస్త్యవ్యులకు కీ తెలియకపోవడం, సువార్త అనగా ఏంటో తెలియని వారిగా ఉన్నారు. ఎవరినో నమ్మించాలని వారి యొక్క నమ్మకాలికి పోయి చెప్తే మారుతాడు అని ఆలోచిస్తున్నారు.

1) మార్క్16:16, మత్తాయి28:19 ప్రకారము సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు క్రీస్తు అన్నాడు. ప్రకటించమన్న యేసు ఎలా ప్రకటించాలో చెప్పలేదు ఈ వచనములో. చెప్పమన్న యేసు ఎలా చెప్పాలో bible లోఉన్నది.

2) సువార్త ఎలా ప్రకటించమని దేవుడు చెప్పాడు?యేసు ఎలా ప్రకటించాడు? యేసు పునరుర్ధానము తరువాత శిష్యులు ఎలా సువార్త ప్రకటించారు?సువార్త ప్రకటనకు ఉదాహరణలు వేటిని తీసుకోవాలి( వేదాల లేఖ ఇతర మతాల గ్రంధాల) అన్న విషయాలు తెలుసుకుందాము. psalm 115:4 లో విగ్రహాల గురించి చెప్పబడింది. సందర్భము,సన్నివేశము,ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో మనము తెలుసుకోవాలి bible చదివేటప్పుడు.దావీదు israels తో చెప్పుతున్న సందర్బము. ఆనాడు israels కూడా egyptians వలె విగ్రహారాధనకు మల్లుతున్నప్పుడు దావీదు మీరెందుకు నమ్ముతున్నారని వారితో చెప్పాడు. అన్యజనులను ఉద్దేశించి israels తో అన్న మాట కాదు. క్రైస్త్యవ్యం నుండి విగ్రహారాధన లోకి వెళ్ళిన వారికీ చెప్పవలసిన మాట ఇది. example::: వాడితో ఎందుకు తిరుగుతున్నావు ,వాడు మంచి వాడు కాడు అని parents వాళ్ళ child తో చెప్తారు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తే గొడవలు అయిపోతాయి. కనుక నమ్ముతున్న వారి నమ్మకాలలో వెళ్లి చెప్తే సమస్యలు వస్తాయి..

3) mathew 10:5 లో మిరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి....... కానీ israel వంశములోని నశించిన గొర్రెల యోద్దకే వెళ్ళుడి.వెళ్ళుచు- పరలోకరాజ్యము సమిపించినది అని ప్రకటించుడి... ఈ వచనము ద్వార a) వెళ్ళమన్న స్థలము- israel వంశములోని నశించిన గొర్రెల యోద్దకే వెళ్ళుడి b) ఏమి చెప్పమన్నాడు- పరలోకరాజ్యము సమిపించినది  అని ప్రకటించుడి. సువార్త అనగా ఏమి?

4) 1 కొరంది 15:3 ప్రకారము సువార్త అనగా మరణ,సమాధి,పునరుర్ధానము గురించిన వాక్యాము లేక భోద

5) 1 పేతురు 1:24 లో వాక్యమే సువార్త.సువార్త అనగా వాక్యము. వాక్యము అంటే ఆదికాండము నుండి ప్రకటన గ్రంధము వరకు ఉన్న లేఖనలే. ‘’ ఈ 66 పుస్తకాలలో ఉన్న మాటలను తీసుకుని దేవుని వైపు ఒక మనిషిని మళ్ళించాలని అనుకున్నదే సువార్త ప్రకటన... bibleలో ఉన్నటువంటి వాక్యాలు ద్వార మనిషిని దేవుని వైపు తీసుకురావడమే సువార్త.సువార్త అను వాక్యము చెప్పి సత్యములోకి మల్లించాలి. 6) మార్క్ 1:14,15 లో యేసు మరణ,సమాధి,పునరుర్ధానము ముందు యేసు సువార్త చెప్పాడు స్వయముగా.అంటే సువార్త సమాజానికి పోతున్నది. సువార్త ఎలా ప్రకటించాలి?

7) ముందు వాక్యాన్ని బాగా సంపూర్ణముగా నేర్చుకోవాలి. ఈ శ్రేష్టమైన మహా జ్ఞ్యాన్నాన్ని ఎలా చెప్పాలో తెలియాలి. చాలా మంది ఏమి చెప్తే ఏమి ఇప్పుడు క్రిస్తులోనికి తీసుకురావాలి అంటారు. మనకు ఇష్టమైనది చెప్పి తిస్కురవడము కాదు . వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు మాట అయ్యి ఉండాలి. bible లో వ్రాయబడిన మాటల ద్వార ఒక మనిషి విశ్వాసి అవ్వలే తప్ప ఎదో సొంత మాటలు చెప్పి వారికీ విశ్వాసము కలిగించిన అది నిలకడగా ఉండదు.

8) 1 కొరంది 15:3 లో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతుబొందెను,సమాధి చేయబడెను,తిరిగి లేచెను.. లేఖనముల ద్వార యేసును గురించి చెప్పాలి. మరణ,సమాధి,పునరుర్ధానము లేఖనాల ద్వార చెప్పాలి.లేఖనాల ద్వార సువార్త చెప్పాలి(1 కొరంది 15:3). క్రీస్తు లోనికి తీసుకురావాలి గాని క్రిస్తునే వేదాలలోకి తెస్తున్నారు, తిసుకేల్లుతున్నారు. లేఖన ప్రకారము అను మాట మనము చూస్తున్నాము ఇక్కడ ( మత్తాయి 3:1,2,3 ,12:16,17,13:13,15 ,15:6,7).... అపోకార్య 8:34,35 and అపో కార్య 28:23 లో లేఖనాలు అనుసరించి యేసు గురించి చెప్పెను.

9) సువార్త ప్రకటనలో ముఖ్యముగా లేఖనాల ప్రస్తావన ఉండాలి.లేఖనాలు అనుసరించి సువార్త చెప్పాలి. అన్యజనులకు అపోస్తాలుడు అయిన paul గారు సృష్టి ని ఉపయోగించి భోదించాడు ( అపో కార్య 14:14,15,16 and 17:23 &).

10) అన్యజనులకు మన కళ్ళముందు కనపడుతున్న సృష్టిని ద్వార సువార్త చెప్పాలి. అలానే christians కి వాక్యాము ద్వార సువార్త చెప్పాలి. ప్రకృతి ని, ప్రకృతి లో ఉన్న గొప్పదాన్ని ,ఇంత గొప్పదనాన్ని చేసినది ఎవరో చెప్పాలి సువార్త గా. christians కు లేఖనాలు అనుసరించి చెప్పాలి.

11) కోలస్సి 1:28 లో వాక్యము తో బుద్ది చెప్పాలి.........


శోధనపై బైబిల్ భోధన

ఈ రోజు ప్రపంచములోని మానవులంతా రెండు మహా అదృశ్య శక్తుల మధ్య జీవిస్తున్నారు. ఇందులో ఒక శక్తీ పేరు దేవుడైతే మరొక శక్తీ పేరు సాతాను. అనగా ఒక శక్తీ మంచిదైతే మరొక శక్తీ దుష్ట శక్తీ. కనిపించని ఈ రెండు అదృశ్య శక్తులైన దేవుడు ,సాతానుల మధ్య మనుష్యుడు బ్రతుకుతున్నాడని మొదట తెలుసుకోవాలిమరియుఈ రెండు శక్తులకు కావలసిన వాడే మనుష్యుడు కూడా. అయితే పైన చెప్పబడిన రెండు అదృశ్య శక్తులలో మనం ఎవరికీ చెందిన వారమో, ఎవరు మన తండ్రో, ఎవరు మనల్ని నడిపిస్తున్నారో,ఎవరి పిల్లలమో అను విషయములు తప్పక పరిశిలించుకుని తెలుసుకోవాలి.

కనిపించని మహా అదృశ్య శక్తీయైన దేవుడే ఈ సృష్టిలోనున్న మానవులైన ప్రతి వారిని కన్న పరలోకపు తండ్రి అని మనకు తెలుసు.ఎఫేసి 4:5-అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. మనమందరికి తండ్రి ఆ పరలోకపుదేవుడైతే మనం అయన పిల్లలమే అవ్వుతాము. నా పిల్లలు నాకే కావాలని, నా పిల్లలు నేను చెప్పినట్టు వినాలని,  నా పిల్లలు నా ఇష్టానుసారముగా ఉండాలని, నా పిల్లలు నాకే చెందిన వారిగా ఉండాలని మనల్ని కన్న ఆ పరలోకపు తండ్రియైన దేవుడు తలంచుట ధర్మమే అవ్వుతుంది. యోహాను 8:44-మీరు మీ తండ్రియగు ఆపవాది( సాతాను) సంభందులు. పౌలు గారు ఎఫేసి 4:5 లో మన తండ్రి దేవుడనిఅని చెబితే యోహాను 8:44 లో తండ్రి సాతాను కూడ అనియేసుక్రీస్తు చెప్పాడు. అయితే సాతాను అన్యాయముగా తండ్రిగా దూరి మీరు నాకు కావాలి అని అనుకోవడము ఆధర్మమే అవ్వుతుంది. అనగా దేవుడు మనల్ని నిజముగా కన్న పరలోకపు తండ్రియైతే దుష్టుడైన సాతానుమధ్యలో వచ్చి మనకు తండ్రిగా మారిపోయిన దుర్మార్గుడు. ఈ రెండు అదృశ్య మహా శక్తుల లక్షణాల విషయములో, మనస్తత్వం విషయములో చాలా తేడా ఉన్నదీ. మొదటిగా తండ్రియైన దేవుని గూర్చి చూద్దాము. దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్తయైనపరలోకపు తండ్రి. పరిశుద్దత విషయములో దేవుడు గొప్పవాడు. ఈ పరిపూర్ణత గల దేవుడు తన పిల్లలమైన మన పట్ల ఏ కోరిక కలిగియున్నాడో చూస్తే లేవియకాండము 11:44- నేనుమీ దేవుడైన యెహోవాను ;నేను పరిశుద్దుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలేను. తన పోలికను తన పిల్లలమైనమనపట్ల ఉండాలనుకున్నాడు. అంటే దేవుడు మనల్ని పాపము లేని పరిశుద్దులుగా చూడాలనుకుంటున్నాడు. ఎఫేసి 1:4,6-మనము తన యెదుట పరిశుద్దులమును,నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత అయన (తండ్రి) క్రిస్తులో మనలను ఏర్పరుచుకోనేను. అనగా ఈ సృష్టికి పునాది వేయబడకముందే ఏ పాపము లేకుండా,ఏ లోపాలు,తప్పులు లేని వారిగా నా పిల్లలు ఉండాలనే కోరిక దేవుడు మన పట్ల కలిగియున్నాడు.

తన పిల్లలను తమకు తాముగా ఒక విషయముపై ఏది మంచి, ఏది చెడు, ఏది న్యాయము,ఏది అన్యాయము, ఏది సత్యము ,ఏది అసత్యము అని ఆలోచింపజేయడానికి దేవుడు పెట్టిన విధానమే “ పరిక్ష”. మన పిల్లలకు బడిలో ప్రతి సంవత్సరముఅనేకమైన పరిక్షలుపెడుతూ ఉంటారు. ఏ రోజైన పిల్లలు కలిగిన తల్లితండ్రులు బడికి వెళ్లి నా వాడికి ఎన్ని పరిక్షలు ఎందుకు పెడుతున్నారని అడుగుతారా? లేదు. పరిక్షలు పెట్టకపోతే అడుగుతారు కానీ పరిక్షలు పెడితే ఎవ్వరూ అడగరు. పరిక్ష ఉంటుందని తెలిసిన పరీక్షలో నెగ్గాలి అనే మనస్సు ఉండాలే తప్ప పరిక్ష పెట్టుటఎందుకు అని దేవునిని ప్రశ్నించుట సరి కాదు. పరిక్ష అన్నది మన మంచికే జరుగుతుందనే విషయము మనము తెలుసుకోవాలి. అందుకే దేవుడు మనిషికి పరిక్షలు పెట్టాడు.

దేవుడు మొదటి పరీక్షను ఆదాము-హవ్వలకు పెట్టినప్పుడు చివరికి తినవోద్దన్న పండు తినీ దేవుడు పెట్టిన పరీక్షలో విఫలము అయ్యారు. ఏందుకు వీరు విఫలము అయ్యారని అలోచించలే తప్ప దేవుడు పరీక్ష ఎందుకు పెట్టాలి అని ఆలోచించుట తప్పు. ఆదాము-హవ్వలకు పరిక్ష పెట్టిన దేవుడే మరలా అబ్రహమునకు కూడా పెట్టాడు. అయితే దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము నెగ్గి ఈ రోజు విశ్వాసులకు తండ్రి అయ్యి చరిత్రలోనే గొప్పవాడు అయ్యాడు.(ఆదికాండము 22:1 నుండి 19).అనగా దేవుడు ఆదాము-హవ్వలకు, అబ్రహమునకుపరీక్ష పెట్టినప్పుడు అందులో అబ్రహాము నేగ్గినట్టుగా, అదాము-హవ్వలు తప్పినట్టుగా అర్థమయ్యింది. అంటే దేవుడు మనిషిని పరిక్ష చేయడానికి ముందుకు వచ్చినప్పుడు నెగ్గిన వ్యక్తి మరియు ఓడినవ్యక్తులు కనపడుతున్నారు. అనగా దేవుడు పరిక్షించువాడని, పరిశోదించువాడని అర్థమయ్యింది.

దేవుని యొక్క తత్వం ఏంటో చూస్తే - (a) ఆదికాండ 6:5-నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఉహా అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి... అంటేనరులహృదయ తలంపులను పరిశిలించేవాడుగా ఉన్నాడు. (b)ఆదికాండ 8:21-నరుల హృదయాలోచన వారిబాల్యము నుండి చెడ్డది.. అంటే హృదయ ఆలోచనలు పరీక్షించే వాడు. (c)1సముయేలు 16:7-యెహోవా హృదయమును లక్ష్య పెట్టును... (d) యోబు 34:21-అయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి యున్నది. అయన వారి “నడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు”.కీర్తనలు 7:9- “హృదయములను,అంతరింద్రియములను పరిశిలించు”నీతి గల దేవా.... (e) సామెతలు 17:3-హృదయ పరిశోధకుడు యెహోవాయే. (f) సామెతలు 21:2-యెహోవాయే హృదయమును పరిశీలన చేయువాడు. (g) యిర్మియా17:10- యెహోవా అను నేను హృదయమును పరిశోదించువాడను.. (h) రోమా 8:27-హృదయములను పరిశోదించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. (i) 1యోహాను 3:20-దేవుడు మన హృదయము కంటే అధికుడై ,సమస్తమును ఎరిగియున్నాడు. ఇలా పై వచనములోని సారాన్ని ఆలోచిస్తే దేవుడు పరీక్షించువాడని , పరిశోదించువాడని అర్థమయ్యింది.

దేవుడు పెట్టు పరిక్ష మనిషికి మంచి చేస్తుందే కానీ చెడు చెయ్యదు. తన యెదుట మనిషిని గొప్పగా నిలబెట్టటానికి దేవుడే ఆ పరీక్షలు పెడుతున్నాడు. అస్సలు ఈ పరిక్షలు ఎందుకు పెడుతున్నాడో చూస్తే నిర్గమ 20:20-మీరు పాపము చేయకుండునట్లు, అయన భయము మీకు కలుగుటకు ... పాపము చేయకుండ ఉండడానికి, దేవుని యెడల భయము కలుగుటకు ఈ పరిక్షలు.. అనగా 1) పరిక్ష ఉంటేనే భయము ఉంటుంది. 2)భయము కలిగినప్పుడు పాపము చేయకుండా ఉండడానికి జాగ్రత్తపడుతాము. పై వివరణలో దేవుని యొక్క తత్వం పరిశోధకుడనీ అర్థమయ్యింది.

ఇప్పుడుసాతాను యొక్క తత్వము - చూస్తే వీడు శోధకుడు. పరిశోధకుడు & శోధకుడు అను రెండు పదాలకు చాలా తేడ ఉన్నదీ. పరిశోధకుడు-మనం పాపము చేయకుండ ఆపుతాడు& శోధకుడు- మనం పాపము చేయుటకు రెచ్చగొట్టి ప్రయత్నిస్తాడు. అనగా తప్పులు చేయుటకు ఆపేవాడు పరిశోదకుడైన దేవుడైతే తప్పు చేసేలా ప్రయత్నించేవాడు శోదకుడైన సాతాను. దేవుడు పరిశోధించిన అనేకమందిలో మనం గొప్పవారిగా చెప్పువారిలో యోబు ఒకరు. యోబు యధార్ధవంతుడు, న్యాయవంతుడు,దేవుని యెడల భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించిన వాడు అను విషయములు మనకు తెలుసు. యోబు 2:3 నుండి చూస్తే తన కుమారుడైన యోబు ఎంత గొప్పవాడో సాతనుకు నిరూపించడానికి శోదించుటకు సాతనుకు ఆవకాశంఇచ్చాడు. భక్తుడైన యోబును దేవుడు సాతనుకు అప్పగించాడు.

యోబు విషయములో దేవుని పరిశోదన & సాతాను శోదన జరిగాయి. యోబుచివరికి దేవుడు పెట్టిన పరీక్షలో గెలవడమే కాక సాతాను పెట్టిన శోధనను జయించాడు. అనగా భక్తుడైన యోబుకు పరిశోదన & శోదనఏదురైనది. “”దేవుడుతన భక్తులను చూచి ఏంత ఆనందపడుతాడో ఆ భక్తులను చూసి సాతాను తట్టుకోలేక వారిని చెడగొట్టాలని,లోకములో కలిపి వేయాలని చివరికి దేవునికి దూరం చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునితో దగ్గర సంభంధం కలిగియున్న వారిపై సాతాను గురి ఎప్పటికి ఉంటుంది. ఒక్కసారి నా చేతికి అప్పగిస్తే మీ బిడ్డలు ఎంత బలహినులో చూపిస్తానని దేవునికే సవాలు విసురుతాడు. లూకా 22:31- ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోదుమవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను.

సాతాను పెట్టు శోదనలు జయించాడు కనుక చరిత్రలో యోబు గొప్పవాడయ్యాడు. యాకోబు 1:12 నుంచి-శోదన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్ధానము చేసిన జీవకిరిటము పొందును.””” శోధనకు నిలిచిన వాడు,శోధనను సహించు వాడు, శోధనను జయించువాడే జీవకిరిటానికి పాత్రుడు”””. ప్రకటన 3:21-నేను జయించి నా తండ్రితో కూడ అయన సింహాసనము నందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడ నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను. అనగా తండ్రి సింహాసనముపై కూర్చుండే అర్హత శోధనను జయించిన వాడిదే.. జీవకిరిటం పొందాలని మీకుగురిఉంటే సాతాను పెట్టు శోధనకు నిలిచి, సహించి& జయించాల్సిందే. పిరికివారు అంటే దేవునికి అసహ్యము. సాతాను పెట్టు శోధనకు భయపడి, సహించలేక చివరికి జయించలేక శోదనలు కల్పించవద్దు అనికొందరు ప్రార్ధనలు చేసే వారు దేవునికి ఇష్టులు కాలేరు.

అనేకమంది బాప్తీస్మం తీసుకున్నాక శోదనలు ఎక్కువ అయ్యాయి అని, రోజు వాక్యము చదువుతూ,ప్రార్ధన చేసుకుంటూ ,సంఘానికి వెళ్తున్న నాకు శోదనలు ఎక్కువుగా వస్తున్నాయి అని ,దేవునిలోకి రాక ముందు ఆనందముగా ఉన్నాను కానీ దేవునిలోకి వచ్చాక శోదనలు ఎక్కువుగా వస్తున్నాయి అని కొందరు అంటూ ఉంటారు. శోదనలన్నవి ప్రతి మనిషికి వస్తాయి. అప్పుడు వాటియందు నిలిచి, సహించి& జయించి సాతనును చితకకొట్టి రావాలే కానీ పిరికివాడిగా శోదనలు వద్దు ప్రభువా అని ప్రార్ధన చేయకూడదు. దేవుడునా తండ్రి అని చెప్పుకుంటూనప్పుడు , అయన బలవంతుడని చెప్పుకుంటూనప్పుడు అయన పిల్లలమైన మనము ధైర్యవంతులుగా, శక్తివంతులుగా ఉండాలే కానీ సాతాను పెట్టు శోధనలకు భయపడి పిరికివాడిగా చరిత్రలో నిలిచిపోతావా??

సాతాను మనల్ని చూసి పారిపోవాలే కానీ వాడు పెట్టు శోధనలకు దేవుని నుండి మనం పారిపోకూడదు. 1 కోరంది 10:12,13- తాను నిలుచుచున్నానని తలంచుకోనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోనవలెను. సాధారణముగామనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభావింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించ గలిగినంతకంటే ఎక్కువుగా అయన మిమ్మును శోదింపనియ్యడు.సహింపగలుగుటకు అయనశోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.పై వచనములోని భావాన్ని చూస్తే దేవుడు సహించ గలిగినంతకంటే ఎక్కువుగా అయన మిమ్మును శోదింపనియ్యడని, సహింపగలుగుటకు అయనశోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయునను విషయము అర్థమయ్యింది.

సాతాను పెట్టు శోధనను జయించే మార్గమును చూస్తే - ఎఫేసి 6:11- మీరు అపవాది తంత్రములను ఏదిరించి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు” సర్వాంగ కవచమును ధరించుకోనుడి”. అనగా సాతాను యొక్క తంత్రములైన శోదనలు జయించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనుడి అని అంటున్నాడు. అలానే మనకు శత్రువు శరిరులు కాదు కానీ సాతనే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకములో మనకు శత్రువు అనే వాడు ఉన్నాడు అంటే వాడు కేవలం సాతనే కానీ సాటి మనిషి కాదు.ఇప్పుడు సర్వాంగ కవచుములోని ఒక్కొక భాగాన్ని చూద్దాము.

(a) ఎఫేసి 6:14-“నడుమునకు సత్యమను దట్టి కట్టుకోవాలి”. సత్యం అనగా వాక్యం(యోహాను 17:17). సత్యమను వాక్యమును ధరించాలి. నీ దగ్గర నుండి సత్యం దూరము అవ్వకుండా మరియు సత్యానికి నువ్వు దూరం అవ్వకుండా జాగ్రత్తపడాలి.సాతాను కల్పించు అబద్ద భోదనల యెందు కాక సత్యమైన వాక్యమునకు కట్టుబడి యుండాలి. అనగా సత్యములో నిలిచి ఉండాలి.

(b) ఎఫేసి 6:14-“నీతి అను మైమరువు తోడుగుకోవాలి”. నిరిక్షిణకు ఆధారమే లేనప్పుడు దేవునిని నమ్మడమే దేవుని దృష్టిలో నీతి. హెబ్రీ 11:7 లో నోవాహు విశ్వాసము బట్టి నీతికి వారసుడాయేను. ఆదికాండ 15:6 లో అబ్రహాము యెహోవాను నమ్మెను; అది అతనికి నీతిగా ఎంచెను. నమ్ముటకు అవకాశమే లేని దేవునిని, పరలోకమును,నరకమును, యేసుక్రీస్తును, పరిశుద్దాత్మను నమ్ముటయే నీతి& నమ్మువాడే నీతిమంతుడు.

(c) ఎఫేసి 6:15-“పాదములకు సమాధాన సువార్త వలనైనసిద్ద మనస్సను జోడు తోడుగుకోవాలి”.సువార్త వ్యాప్తిలో పాలి భాగస్థుడు అవ్వుటకు మనం సిద్దముగా ఉండాలి. దేవుని వాక్యం నేర్చుకుని ,పాటించి, చెప్పాలి, చెప్పించాలి& చెప్పే వాళ్ళకు సహకరించాలి.

(d) ఎఫేసి 6:16-“విశ్వాసము అను డాలు పట్టుకోనుడి”. హెబ్రీ 11:1 లో విశ్వాసం యొక్క నిర్వచనము చెప్పబడింది. అదృశ్యమైన ఉన్నాయి అని నమ్ముటయే విశ్వాసము. అద్రుశ్యుడైన దేవుడు ఉన్నాడని,ఆ దేవుడు మన పాపాల నిమిత్తము యేసును ఈ లోకానికి పంపించాడని, ఈ యేసు చనిపోయి తిరిగి లేచాడని,పునరుర్ధనుడైన యేసు రెండవ రాకడలో వచ్చి విశ్వాసుల జాబితలోనున్న వారిని పరలోకానికి తీసుకెళ్ళుతాడని విస్వసించాలి. మనం విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి.

(e) ఎఫేసి 6:17-“రక్షణ అను శిరస్త్రాణమును ధరించాలి”. రక్షణ పొందాలి అంటే i) యేసుప్రభువు అని ఒప్పుకుని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని విశ్వసించాలి. ii) యేసుప్రభువు నామమున తండ్రికి పాపపు ఒప్పుకోలు ప్రార్ధనను చేయాలి. iii) నమ్మి బాప్తీస్మం పొందితే రక్షింపబడుతారు. బాప్తీస్మం తీసుకుని నమ్మకముగా జీవిస్తే రక్షణ అను శిరస్త్రాణమును కలిగియుంటాము.

(f) ఎఫేసి6:17- “వాక్యమను ఖడ్గమునుధరించుకోవాలి”. ఇలా సర్వ అంగమునకు పై చెప్పబడిన కవచమును ధరించి సాతాను పెట్టు శోధలతో యుద్ధము చేస్తే విజయము మనదే అవ్వుతుంది... ఇందులో ఈ ఒక్కటి లేకుంటే సాతను పెట్టు యుద్దములో ఓడిపోతాము.


రూతు గ్రంథం
అధ్యాయాలు: 4, వచనాలు:85

గ్రంథ కర్త: సమూయేలు ప్రవక్త



రచించిన తేది: దాదాపు 450 నుండి 425 సం. క్రీ.పూ.

మూల వాక్యము: “నివు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నివు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;” రూతు 1:16

ఉపోద్ఘాతం: రూతు గ్రంథం బైబిలులో చిన్న పుస్తకం. కేవలం నాలుగు అధ్యాయాలు ఉన్నప్పటికీ ఈ గ్రంథానికి చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిలు గ్రంథములో స్త్రీ పేరుతొ ఉన్న గ్రంథాలలో ఒకటి ఎస్తేరు మరియొకటి రూతు. రూతు అన్న మాటకు అర్ధం “స్నేహితురాలు” మరియు “కనికరము”. రూతు మోయాబియురాలు అయినప్పటికీ క్రైస్తవ పరంపర లో ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంది. సాధారణంగా మన నిజ జీవితంలో ఉండే విశ్వాసము, దయ, కరుణ, కనికరము, ఓపిక, అణుకువ, నమ్రత, ప్రయాస మరియు ప్రేమ ఈ గ్రంథంలో మనం చక్కటి ఉదాహరణాలుగా గమనించవచ్చు. అంతేకాకుండా మన జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాల్లో కుడా దేవుడు మన పట్ల కలిగిన శ్రద్ధ మనలను విశ్వాసంలో ఇంకా బలపరుస్తుంది. ఈ గ్రంథం మనకు చాలా అందముగా కనబడవచ్చు అంతే కాకుండా మన నిజ జీవితంలో సహజమైన ప్రత్యామ్నాయముగా ఉంటుంది. మరియు జరిగిన సంగతులను తెలుసుకోవాలనే ఇచ్చ కలిగించే విధంగా ఉంటుంది మరియు దేవుడు తన ప్రజలకు విడుదల కలిగించిన ప్రణాళిక ఈ రూతు గ్రంథం తెలియజేస్తుంది. రూతు గ్రంథం ఒక నవల వలె ఉంటుంది అని బైబిలు పండితులు అంటారు. రూతు గ్రంథం అనేకమైన జీవిత అధ్యాత్మిక సత్యాలను మరియు చారిత్రాత్మిక సంగతులను తెలియజేస్తుంది. రూతు గ్రంథం మొత్తం ఈ గ్రంథంలో ఉన్న వ్యక్తుల పేర్లకు ఉన్న అర్ధాలను బట్టి రచించబడింది.

ఇశ్రాయేలునకు రాజు లేని దినాలలో న్యాయాధిపతులు పరిపాలించే వారు. అ దినాలలో ఆ రాజ్యామంతటా కరువు సంభవించింది. ఇశ్రాయేలు కుటుంబానికి చెందిన ఎలిమేలేకు, ఆయన భార్యయైన నయోమి, వారిద్దరి కుమారులు మహ్లోను, కిల్యోను ను వెంటబెట్టుకొని బెత్లెహేము నుండి ప్రయాణమై మోయాబు దేశమున కాపురముండుకు బయలుదేరిరి. వ్యాకులం చెందిన ఇంటి యజమాని, విధిలేని పరిస్తితిలో మోయాబు దేశమునకు తన కుటుంబముతో వచ్చి తన కుమారులైన మహ్లోనుకు రూతు, కిల్యోను కు ఒర్పా అను మోయాబు స్త్రీలతో వివాహముచేసి అక్కడ కాపురముండిరి. మోయాబు దేశంలో ఎలిమేలేకు మరియు ఆయన కుమారులు చనిపోయిన తరువాత, ఆ దుఃఖకరమైన  స్థితిలో వారు ఆహారము లేని వారాయెను. కరువు తీవ్రత తట్టుకోలేక మేలుకువగల అత్తగా తన ఇద్దరు కోడండ్రను జాగ్రత్తగా చూచుకొనుటకు తిరిగి తాము వదిలి వచ్చిన దేశానికి ప్రయాణమైరి. అయితే ఓర్పా అయిష్టముగా తన అత్తను మార్గము మధ్యలో వదిలి వెళ్లిపోయింది కాని రూతు తన అత్తను హత్తుకొని “ నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నివు వెళ్ళు చోటికే నేను వచ్చెదను. నివు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి బొందు చోటనే నేను మృతి బొందెదను, అక్కడనే పాతి పెట్ట బడెదను. మరణము తప్ప మరి ఎదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక” (రూతు 1:16-17) అని తీర్మానించుకొని తన అత్తతో బెత్లెహేమునకు ప్రయాణమైరి. అప్పుడు బెత్లెహేమునందు యవల కోత కాలమున రూతు తన అత్తకు ఆధారముగా నుండుటకు పరిగె ఏరుకొందునని, అత్త వద్ద సెలవు తీసుకోని ఎలిమేలేకు వంశపువాడైన బోయజు పొలములోనికి వచ్చి చేను కోయు వారి పొలములో ఏరుకొనెను. బోయజు పేరున్న యూదయ న్యాయాధిపతి. బోయజు అను మాటకు అర్ధం “బలవంతుడు”. బోయజు రూతునకు ఉన్న యదార్థతను మరియు సత్ ప్రవర్తనను గ్రహించి ఆమెను బంధుధర్మము చొప్పున వివాహము చేసుకొనెను. యెహోవా బోయజును రూతును ఆశీర్వదించి వారికి కుమారుని అనుగ్రహించెను. అతని పేరు ఓబేదు. ఓబేదు అనగా “దాసుడు లేదా సేవకుడు” అని అర్ధం. ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను.

సారాంశము: రూతు గ్రంథంలోని అనేక విషయాలు మన నిజ జీవితంలో కార్యసిద్ధి కలుగజేసే విధంగా ఉంటుంది. దేవునితో విశ్వాసంలో స్తిరపడే బంధుత్వము ఒక ఉదాహరనముగా కనబడుతుంది మరియు పరస్పర అంకిత భావాన్ని విశదీకరిస్తుంది. దేవుని పట్ల శ్రద్ద, భక్తి, వినయము, విధేయత రూతు జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు అంతే కాకుండా నిజ జీవితంలో ఏది ఉత్తమమైనదో దాన్ని ఎంచుకునే విషయంలో మనకు ఈ గ్రంథం దోహదపడుతుంది. నిరాశపూర్వకమైన పరిస్తితులలో కుడా నిస్వార్ధమైన జీవతం జీవించడానికి నేర్పిస్తుంది ఈ గ్రంథం.

రూతు మోయాబియురాలు అనగా దేవునికి అయిష్టమైన జనాగం నుండి వచ్చిన స్త్రీ అయినప్పటికి ఆమెకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి, వ్యక్తిగతంగా ఆమె గుణ లక్షణాలు ఆమెను క్రీస్తు వంశావళిలో ఒక చక్కటి స్థానాన్ని పొందుకునేలా చేసింది. మన కిర్తి ప్రతిష్టలు మనం జివించే విధానాన్ని అధారంచేసుకొని ఉంటాయి. ఎలాంటి కష్ట సమయాల్లో కుడా మనం ఓర్పు సహనం కలిగి ఉంటే ఉన్నతమైనవాటిని చేరుకునే అవకాశం ఉంటుంది.

దేవుడు మనకు చూపించే కృప ఎంతో అధికం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అయన మనలను ప్రేమించేవాడిగా ఉంటాడు. విధేయత వలన ఆశీర్వాదం మరియు దేవుని యొక్క ప్రణాళికలో ఒక చక్కటి స్థానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది.


యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానల మధ్యనున్న మూడు రోజులలో ఎక్కడ గడిపాడు?
.

1 పేతురు 3:18-19 ఏలయనగా మనలను దేవునియొద్డకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్ర్మపడెను. దేవుని దీర్ఙ్హశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్డపరచుచుండగా, అవిధేయులైనవారియొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి. 18 వచనములోనున్న ఆత్మ విషయములో అన్న భాగము శరీర విషయములో లాగా నిర్మితమయినది. కాబట్టి ఆత్మ అన్న పదాన్ని శరీరమన్న పదముతో పోల్చుట సముచితమే. ఇక్కడున్న శరీరము ఆత్మ, క్రీస్తు శరీరము ఆత్మయే. ఆత్మ విషయములో బ్రదికింపబడి అన్నది క్రీస్తు పాపముల విషయములో శ్రమపడి మరణముద్వారా, తండ్రినుండి తన ఆత్మను వేరుపరచినాడు అని సూచిస్తుంది(మత్తయి 27:46). శరీరము ఆత్మల మధ్యనే వ్యత్యాసము మత్తయి 27:46 మరియు రోమా 1:3-4 సూచించినట్లు క్రీస్తు శరీరము పరిశుధ్ధాత్మలమధ్య కాదు. క్రీస్తు పాపముల విషయమై ప్రాయశ్చిత్తము చెల్లించటం పరిపూర్ణమయినప్పుడు ఆయన ఆత్మ తెగిపోయిన సహవాసాన్ని పునరుద్డీకరించెను.

1 పేతురు 3:18-22 వచనాలలో క్రీస్తు శ్రమలకు (18) ఆయన మహిమపరచబడుటకు (22) మధ్యనున్న సంభంధాన్ని సూచిస్టుంది. కేవలం పేతురు మాత్రమే ఈ రెండు సంఘటనల మధ్యన జరిగిన సమాచారాన్ని అందిస్తున్నాడు. 19వ వచనములో భోధించటం అన్న పదం నూతన  నిభంధనలో తరచుగా వాడే సువార్త భోధించటం అన్నవంటిది కాదు. ఒక వార్తను చాటించటం అని అర్థం. యేసు శ్రమనొంది సిలువపై మరణించాడు. ఆయన శరీరము మరణమునకు అప్పగించబడింది. ఆయన మీద పాపము మోపగా ఆయన ఆత్మ మరణించెను. అయితే ఆయన ఆత్మను బ్రదికించబడినపుడు ఆయన దానిని తండ్రికి అప్పగించెను. పేతురురాసినట్లుగా మరణానికి పునరుత్థానికి మధ్యన చెరలోనున్న ఆత్మలకు ప్రత్యేకంగా ప్రకటన చేసెను. పేతురు మనుష్యులకు సూచించటానికి ప్రాణాత్మలు (సోల్స్)వుపయోగించాడు కాని ఆత్మలుగా (స్పిరిట్స్)కాదు. క్రొత్త నిబంధనలో ఆత్మ అన్నదానిని దేవదూతలకు, దయ్యములకు వుపయోగించారు కాని మనుష్యులకు కాదు. ఇదే భావాన్ని 22వ వచనములో కూడ చూడవచ్చు. మరియు బైబిలులోమరీ ఇంకెక్కడ కూడ యేసుక్రీస్తు నరకాన్ని దర్శించినట్లు పేర్కొనబడలేదు. అపోస్తలుల కార్యములు 2:31లో పేర్కొనబడిన పాతాళము కాదు. పాతాళముఅన్నది మరణించిన వారి స్థాయిని సూచించేది. పునరుత్థానముకోసం వేచియుండే తాత్కాలికమైన ప్రదేశము. ఈ రెండింటి మద్యననున్న వ్యత్యాసాన్ని ప్రకటన 20:11-15 ను చూడగలం. నరకం నిత్యమైనది, అంతిమ స్థానం నశించినవారికి ఇచ్చినటువంటి తీర్పు. పాతాళము (హెడెస్) తాత్కాలికమైనది.

మన ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించిన తర్వాత మరణించాడు. మరణ పునరుత్థానముల మధ్య పాతాళములోనున్న ఆత్మలకు (బహుశా త్రోసివేయబడినటువంటి దేవదూతలు యూదా6)లో భోధించెను. నోవహు ప్రళయమునకు ముందు కాలమునకు చెంధినవారికి వర్తమానము అందించెను. 20వచనము దీనిని స్పష్టము చేస్తుంది. చెరలోనున్న ఆత్మలకు ఏమి ప్రకటించారో పేతురు చెప్పలేదు గాని, బహుశా! వర్తమానము విమోచనమునకు సంభంధించినది కాకపోవచ్చు. ఎందుకంటే రక్షణ దేవదూతలకు వర్తించదు కాబట్టి (హెబ్రీయులకు 2:16). ఇది బహుశా! సాతాను మరియు అతని శక్తులపై ప్రకటించిన విజయము (1 పేతురు 3:22; కొలస్సీయులకు 2:15). ఎఫెసీయులకు 4:8-10 క్రీస్తు పరదైసుకు వెళ్ళినట్లు సూచిస్తుంది. (లూకా 16:20;23:43) మరియు ఆయన మరణమునకు ఆయనయందు విశ్వాసముంచిన వారందర్ని పరలోకమునకు తీసుకొనివెళ్ళెను. ఈ వాక్యభాగమునకు ఎక్కువ వివరములను ఇవ్వటంలేదు అని చెరను చెరగా కొనిపోబడెను అన్న దానికి ఎక్కువమణ్ది బైబిలు పండితులు అంగీకరించేది ఈ భాష్యంనే.

కాబట్టి యేసుక్రీస్తు మరణమునున్న మధ్య మూడురోజులలో ఖచ్చితంగా ఏంచేశారో అన్నది బైబిలు స్పష్టీకరించటం లేదు. ఆయన త్రోసివేయబడిన దేవదూతలు అవిశ్వాసులపై విజయాన్ని ప్రకటించటానికి వెళ్ళినట్లు సూచిస్తున్నాయి. యేసయ్య రక్షణ నిమిత్తము ప్రజలకు రెండవ అవకాశము ఇవ్వటానికి అన్న విషయము మాత్రము ఖచ్చితముగా అర్థంచేసుకోగలం. మరణం తార్వాత మనము తీర్పును ఎదుర్కోవాలి రెండవ అవకాశం లేదని ఖచ్చితముగా (హెబ్రి 9:27) చెప్తుంది. యేసుక్రీస్తు తన మరణము పునరుత్థానముల మధ్య ఏంచేశారో అని నిర్థిష్టమైన జవాబు లేదు. బహుశా మనము మహిమలో చేర్చబడిన తర్వాత అర్థంచేసుకోగలిగే ఒకే మర్మం ఇదేనేమో!

భుమికి పునాది వేసిన దేవుడు సమాధి చేస్తాడా?

గత 2 or 3 years నుంచి అక్కడ,ఇక్కడ మనకు వినబడుతున్న మాట యుగాంతము గురించి. ఈ ప్రపంచము నాశనము అవుతుందని dates fix చేస్తున్నారు,books రాస్తున్నారు. ఇవన్ని మనము వింటున్నపుడు దేవుడు అనుకుంటున్నది ఏదో తెలుసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. దేవుడు ఈ ప్రకృతిని కలిగించేటప్పుడు,ఈ ప్రక్రుతిలోనికి మనిషి వచ్చిన తర్వాత దేవుని ఆలోచన ఏంటో మనము పరిశిలిస్తే ఒక ప్రణాళికతో ఉన్నాడని అర్థమవుతుంది. హెబ్రీ1:10- ప్రభువా! నీవూ “ఆదియందు భూమికి పునాది వేసితివి”,ఆకాశములు కూడా నీ చేతి పనులే....... ఇలా paul గారు పరిశుద్దాత్ముని ప్రేరేపణతో భుముకి పునాది వేసిన సందర్భాన్ని జ్ఞపకము చేస్తున్నాడు.విశ్వములో గ్రహాలు,stars, ఎన్నో వస్తువులు దాగి ఉన్న భూమిని గురించే దేవుడు మాట్లాడుటకు గల ప్రత్యేకత or ప్రాదాన్యత ఏంటి???? ఈ విశ్వములో భూమికంటే పెద్దవి ఉన్నప్పటికీ, ప్రత్యేకించి భూమికి పునాదులు వేసిన సందర్బంనే గుర్తుచేస్తున్నాడు. అంటే భూమి ఈ విశ్వమంతటిలో ప్రాముక్యతతో ఉన్నదని హెబ్రీ1:10 ద్వార అర్థమవుతుంది. 2)ఆదికాండము 1:1- ఆదియందు దేవుడు భుమ్యకసములను సృజించెను. మల్లి ఇక్కడను కూడా భూమి ప్రస్తావనే కనపడుతుంది. అనగా భూమి మీద అయన పిల్లలముగా మనము రాబోతున్నామని కనుక భూమి చాల ప్రాముక్యతగా ఉన్నది అని అంటున్నాడు. దేవుడు భూమికి పునాది వేసిన రోజులు ఎలా ఉన్నాయి?? భూమికి పునాదులు వేసిన్నప్పుడు దేవుని మనస్సులో ఎంత సంతోషము ఉందో లేఖనలలో చూస్తే మన మనస్సు ఆనందముతో నిండుతుంది. దేవుడు భూమిని కలిగించిన తర్వత మనకు కావలసినవన్ని సిద్దపరచిన తర్వాతే ఆదామును కన్నాడు. తొలి రోజుల దేవుని సంతోష పరిస్థితి చూస్తే యోబు 38:7- ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు,దేవదుతలందరు ఆనందించి జయ ద్వనులు చేసినప్పుడు దాని ములరాతిని వేసినవాడు ఎవడు?ఇక్కడ యోబు తో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పరీక్షించాలని,సాతాను శోదించాలని అనుకున్నాడు.ఈ పరిక్ష,శోధనల మధ్య స్నేహితులు వచ్చి యోబుతో మాట్లాడుతు నీవూ ఏదో తప్పు చేసి ఉంటావు ,అందుకే ఈ కష్టాలు వచ్చాయని మాటలతో యోబును నిందిస్తున్నప్పుడు నిరసించిన యోబును చూసి ,మానవ పుట్టుక గురించి జరిగిన తొలి దినాల సందర్భాన్ని జ్ఞపకము చేసి యోబును సంతోషపరచాలని,నిరసించిన యోబును మానసిక ధైర్యము ఇవ్వడానికి దేవుడు మాట్లాడుతున్న సందర్భము. యోబు 38:4- నేను భూమికి పునాదులు వేసిన్నప్పుడు నీవేక్కడ నుంటివి? అనగా ప్రారoభములో దేవుడు ప్రకృతిని కలిగించిన తొలి రోజుల సందర్బాన్ని గురించి చెప్పుతున్నాడు.( ఈ వివరణ హెబ్రీ1:10 కు link)

3) యోబు 38:7లో మనము రాబోతున్నామని ఆనందముతో మనకోసము భూమిని కలిగిస్తున్నపుడు మొట్టమొదట రాయి వేసినప్పుడు ఎంత ఆనందమో చెప్పుతున్నాడు. కేవలము ఈ భూమిపై ఒక స్వంత ఇల్లు కట్టుకుని సంతోషపడే మనకు రాబోయే మన గురించి దేవుడు కడుతున్న ఈ విశ్వమనే ఇల్లు గురించి ఆలోచిస్తే దేవుడికి కూడా గొప్ప ఆనందము ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.ఉదయనక్షత్రములు యొక్క పాటల మధ్య,దేవదూతలు యొక్క జయద్వానుల మధ్య ఈ నేలపై నా పిల్లలు రాబోతున్నారని గొప్ప ఆనందముతో ఉన్నాడు. దేవుడు ఈ విశాలమైన ,ఉహకు అందని ప్రకృతిని కలిగించడానికి 6 days కష్టపడ్డాడు. 6 days కష్టపడింది అయన ఉండడానికి కాక రాబోయే మనము ఉండడానికే.. అంటే రాబోవుతున్న మనయెందు దేవునికి ఎంత ప్రేమ???మనము పుట్టాక ముందే ఇంత ప్రేమ ఉంటె ఇంకా పుట్టిన తర్వాత ఇంకా ఎంత ప్రేమ ఉండాలి?? మనిషి పుట్టాక ముందే ఇంత ఆనందముగా ఉన్న దేవుడు ,పుట్టిన తర్వాత ఇంకెంత ఆనందముగా ఉండాలి? కోట్లనుకోట్ల మంది పిల్లలు కలగబోతున్నారని ఆ తొలి రోజులలో దేవునికి ఆనందమే. భూమి మీదకు వచ్చి,నా కోసము బ్రతుకుతూ,తండ్రి అని నన్ను పిలుస్తుంటే ఆనందపడాలి అని అనుకున్నాడు.

4) ఇంతవరకు మనము పుట్టాక ముందు తొలి రోజులలో దేవుడు మన యెడల ఒక ప్రణాళికతో ఉన్నాడని, చాల ఆనందముగా ఉన్నాడని తెలుసుకున్నాము.మనము పుట్టక ముందే దేవునికి ఆనందము ఉంటె పుట్టిన తర్వాత ఆనందము రెట్టింపు అవ్వాలి కానీ పుట్టిన తర్వాత భాద అంటే ఏంటో దేవునికి పరిచయము చేసాడు మనవుడు . అప్పటివరకు ఆనందముగా ఉన్న, కన్నతండ్రికి భాద ఎలా ఉంటుందో రుచి చూపించింది మనిషే. ఆదాముని అదేను తోటలో పెట్టి ఒక్క పండును తిన్నోద్దు అంటే అదే తిని దేవుని మాట మీరి దేవునిని భాదపెట్టాడు. 11timothy3:1 నుంచి-మనుష్యులు స్వార్ధప్రియులు,ధనపేక్షులు,బిమ్కములడువారు దుషకులు ........అని అంటున్నాడు.మనవ చరిత్ర మలినము అయింది.. ఆదికాండము6:6-తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవ సంతాపము నొంది తన హృదయము నోచ్చుకోనేను.. అంటే ప్రారంభ దినాలలో మనము పుట్టాక ముందు ఆనందపడ్డ దేవుడు తర్వాత దినాలలో మానవుని క్రియలు ద్వార హృదయము నోచ్చుకోన్నట్ట్లుగా మనకు అర్థమవుతుంది. యేసు రాక ముందు అనేక ప్రకతి వైపరిత్యాలు చేసినను, jesus పంపించినను మనిషి మారడము లేదు. మారలేదు. మనిషి ఎప్పటికి మారని వాడిగా మిగిలిపోతున్నాడు.

5) రాభోవుతున్న తన పిల్లలకోసము భూమికి పునాదులు వేసి,మనకు కావలసినవన్నీ దేవుడు పెడితే మనిషి మానవత్వము కోల్పోయిన పరిస్థిని బట్టి దేవుడు ఎలాంటి నిర్ణయము తిస్కుకోవాలి????మనిషికి భుద్ది చెప్పటానికి ప్రకృతి వైపరిత్యాలు కలగజేసి తెలియజేస్తూ ఉన్నాడు.ఇంత వరకు ఎన్నో earth quakes,tsunami వచ్చిన ఉపయోగము లేదు.ప్రవక్తలను,యేసును,apostles భోధన ద్వార,ప్రకృతి వైపరిత్యాలు ద్వార మానవుడు మరుతాడని చేసిన ఏమి పట్టనివాడిగా ఉన్నాడు.వినని సమాజానికి ఏమి చేయాలి దేవుడు? అందుకే దేవుడు హెబ్రీ 12:26- భూమిని,నక్షత్రాలను కంపింపజేతును అని అంటున్నాడు.

6)మనకి భుద్ది కలగటానికి earth quakes,tsunami కలిగిస్తున్నాడు.ఇలా ప్రపంచములో అంతట ఎక్కడోఅక్కడ ప్రకృతి వైపరిత్యాలు మనము చూస్తున్న భుద్ది కలగట్లేదు.అక్కడ కదా వచ్చింది మాకు ఏంటి అని అనుకుంటున్నారు. ప్రకటన 6:13- ఆకాశానక్షత్రాలు రాలును అంటున్నాడు. మత్తయి 24:29-యేసు రెండవ రాకడలో ఆకాశము నుండి stars రాలబోతున్నాయి అని అంటున్నాడు..

7) ముంచుకొస్తున్న ప్రమాదము గురిచి అలోచించి అయిన మనిషి జగ్రతపడుతదని ఈ విలువైన bible మాటలను రాసాడు దేవుడు.యేసు ను రెండవ రాకడగా పంపబోతు ఈ విశ్వాన్ని అంతము చేయాలనుకుంటున్నాడు.దేవుడు ముగించాలనుకున్న ఈ కాలములో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ అంత్య దినలలో ఎలా ఉన్నమన్నడో 11 peter3:11,12,13- పరిశుద్దమైన ప్రవర్తనతోను ,భక్తితోను ఎంతో జాగ్రతగా ఉండాలి అని అంటున్నాడు.

8)ఆ ప్రమాదము వచ్చేముందు మనము ఉండే ఈ కొద్దికాలములో ఆత్మలను రక్షిస్తే దేవుడు సంతోశపడుతాడు.ఒకసారి అలోచించి ఒక మంచి నిర్ణయము మన జీవితము పట్ల తీసుకుని మనల్ని మనము కాపాడుకొని,సమాజములో ఉంటున్న కొద్దిమందైన మనము కాపాడాలి.


బాప్తీస్మం అనగా ఏమి

ఎందుకు తీసుకోవాలి? తీసుకోవడము వలన ఏమి జరురుగుతుంది? ఎలా

 తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? చిన్న పిల్లలకు బాప్తీస్మం 

ఇవ్వవచ్చా?
ఈ యొక్క అంశములో బాప్తీస్మం అనగా ఏమి? ఎందుకు తీసుకోవాలి?
తీసుకోవడము వలన ఏమి జరురుగుతుంది? ఎలా తీసుకోవాలి?
ఎప్పుడు తీసుకోవాలి? చిన్న పిల్లలకు బాప్తీస్మం ఇవ్వవచ్చా??
అను సందేహాలకు జవాబులను పొందుపరిచాను.
1) మనము దేవుని పనికి ఉపయోగపడాలంటే ముందు :
a) వాక్యము నేర్చుకోవాలి.అప్పుడు subject అంతా mindలోకి పోతుంది. దీనిని “receive” అంటారు
b) నేర్చుకున్న వాక్యమును పంపాలి. దీనిని “production” అంటారు. అంటే వాక్యమును నేర్చుకున్నవాడు వాక్యము చెప్పాలి and వాక్యము చెప్పేవాడు ముందు వాక్యము నేర్చుకోవాలి. 3 ½ years వరకు యేసు శిష్యులకు training ఇచ్చాడు. శిష్యులు వాక్యము చెప్పేముందు యేసు దగ్గర వాక్యమును నేర్చుకున్నారు. యేసు కూడా తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడు. john 8:26లో “ నేను అయన( తండ్రి) యెద్ద వినిన సంగతులే లోకమునకు భోదించుచున్నాను అని చెప్పెను.john 8:28 లో తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు నేను మాట్లాడుచున్నాను.(ప్రైస్ ద లార్డ్ బ్రదర్స్ క్రింద ఉన్న యాడ్స్ ని క్లిక్ చెయ్యండి) అంటే యేసు ఈ లోకానికి రాక ముందు తండ్రి దగ్గర వాక్యము విని ,నేర్చుకుని చెప్పాడు. ఈ రోజు భోదకులు చాలా మంది పరిశుద్దత్ముడే మా చేత మాట్లాడిస్తున్నాడు అని అంటున్నారు. మత్తయి10:18to20, john 16:13 లో పరిశుద్దత్ముడు కూడా వేటిని వినెనో అవే చెప్పుతున్నాడు.

బాప్తీస్మం అనగా ఏమి?
1) బాప్తీస్మం అను పదము greek భాష నుండి baptiso అను పదము ద్వార derive చేయబడింది.baptiso అనగా సమాధి చేయుట,పాతి పెట్టుట,ముంచుట. బాప్తీస్మం గురించి roma 6:3 లో యేసు లోనికి బాప్తీస్మం పొందిన మనమందరము “అయన మరణములోనికి” బాప్తీస్మం పొందితిరని మీరు ఎరుగరా?? roma 6:4 లో మనము బాప్తీస్మం వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా “పాతిపెట్టబడితిమి”. ఇది బాప్తీస్మం యొక్క అర్థము. బాప్తీస్మం ద్వారా పాతిపెట్టబడుతున్నాము. యేసు క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యముగా మనమందరము బాప్తీస్మం ద్వారా పాతిపెట్టబడుతున్నాము. ఎందుకు తీసుకోవాలి?తీసుకోవడము వలన ఏమి జరుగుతుంది? 2) సమాజములో బాప్తీస్మం ఎందుకు తీసుకుంటున్నారో చూస్తే సంఘములో సబ్యత్వం కొరకు, సమాధి స్థలము కొరకు పెళ్లి కొరకు,caste certificate కొరకు, ఇలా ఎన్నో...... bible చెప్పిన కారణాలు ద్వార తీసుకునే బాప్తీస్మం అసలైన బాప్తీస్మం. బాప్తీస్మం తీసుకుంటే ప్రధానముగా 3 విషయాలు జరుగుతాయి.
a) అపోకార్య 22:16- బాప్తీస్మం పొంది నీ పాపములను కడిగివేసుకోనమని చెప్పెను. “బాప్తీస్మం తీసుకోవడము వలన మొట్టమొదట పాపాలు కడగబడుతాయి”. బాప్తీస్మం తీసుకొనేవాడు పాపాలు కడిగివేసుకోవటానికి తీసుకోవాలి. నేను పాపి అని ఒప్పుకొని, మారు మనస్సు పొంది, ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంబిస్తాను అని నిర్ణయించుకుని పాపాలు ఒప్పుకొనక పోతే కుదరదు. అపోకార్య 2:38-మీరు మరుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తీస్మం పొందుడి.
b) mark 16:16- నమ్మి బాప్తీస్మం పొందువాడు రక్షింపబడును.బాప్తీస్మం తీసుకోవడము ద్వార రక్షణ అనే ఓడలోకి వస్తాము. బాప్తీస్మం తీసుకోవడము వలన ఏమి జరుగుతుంది అంటే మొట్టమొదట పాపక్షమాపణ కలిగి,రక్షణ అనే ఓడలోనికి వచ్చినట్లు అర్థము.రక్షణ పొందాలంటే ముందు బాప్తీస్మం తీసుకోవాలి.

ఎందుకు బాప్తీస్మం తీసుకోవడము అంటే పరిశుధాత్మ అను వారము పొందుతాము( అపోకార్య2:38,39). ఎలా తీసుకోవాలి?
3) బాప్తీస్మం ఎలా తీసుకోవాలో అన్న విషయము పై ఒకరు చిలకరింపుగానా,జెండా క్రింద దూరడముగానా, అస్సలు అవసరము లేదు అంటున్నారు నేటి వారు. john 3:23- నీళ్ళు విస్తారముగా ఉండెను గనుక యాహోను కూడా అక్కడ బాప్తీస్మం ఇచ్చుచుండెను. నీళ్ళు విస్తారముగా ఉన్నందున............ అపోకార్య 8:36to38-phillippu-నపుంసకుడు సన్నివేశము- నీళ్ళులోనికి దిగిరి... దినిని బట్టి బాప్తీస్మం నీళ్ళలో మునిగి తీసుకోవాలని అర్థము.పాతిపెట్టబడడము అంటే మునగాలి.

ఎప్పుడు తీసుకోవాలి ?
4) ఏ రోజు అయితే మనస్సులో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నావో,పాపి అని ఎప్పుడు ఒప్పుకొంటున్నావో అప్పుడు immediateగా పాపాలు ఒప్పుకొని బాప్తీస్మం తీసుకోవచ్చు. అపోకార్య22:16-నీవు తడువు(ఆలస్యము) చేయుట ఎందుకు.... , అపోకర్య8:36to38- phillippu-నపుంసకుడు సన్నివేశము-వారు త్రోవలోవెళ్ళుచుండగా బాప్తీస్మం జరిగింది. అపోకార్య 16:33-paul- చెరసాల నాయకుడు సన్నివేశము-midnight బాప్తీస్మం పొందారు. ఈ రోజు అయితే ఏ గడియ అయితే నీ పాపాలు ఒప్పుకొని,ఎందుకు బాప్తీస్మం తీసుకోవాలన్న కారణాలు నేర్చుకుని విస్వసిస్తే ఆ గడియలోనే బాప్తీస్మం పొందవచ్చు.

5) బాప్తీస్మం పాపక్షమాపణ కొరకు తీసుకోవాలి. పసి పిల్లలు పాపము చేస్తారా? చిన్ని పిల్లలకు పాపము,మంచి,చెడు,విశ్వాసము,యేసు ,పునర్ధానము అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. 1 peter2:1to3- క్రొత్తగా జన్మించిన “శిశువులను” పోలి ఉండాలి , మత్తయి18:3-మీరు మార్పు నొంది “బిడ్డలు” వంటి వారు అయితే పరలోక రాజ్యములో ప్రవేస్తారు, మత్తయి 19:14- “చిన్నపిల్లలను” ఆటంకాపరచనియ్యకుడి. దేవుడు పిల్లలను గూర్చి చెప్పుతున్నాడు.

6) గలతీ3:27- క్రిస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. christian అనగా క్రీస్తును ధరించినవాడు.

7) conclusion::: బాప్తీస్మం లేకుండా రక్షణ కలగదు అని, అది తీసుకుంటే పాపక్షమాపణ, రక్షణ ,పరిశుదత్మ అను వరము వస్తుందని,ఈ రోజు అయితే ఏ గడియ అయితే నీ పాపాలు ఒప్పుకొని,ఎందుకు బాప్తీస్మం తీసుకోవాలన్న కారణాలు నేర్చుకుని విస్వసిస్తే ఆ గడియలోనే బాప్తీస్మం పొందవచ్చని, మునిగితేనే బాప్తీస్మం తిసుకోనట్లు లెక్క అని,చిన్న పిల్లలకు బాప్తీస్మం ఇవ్వకూడదని తెలుస్తుంది.

8) important point:::: బాప్తీస్మం తీసుకున్న వారికీ పరలోఖము వస్తుందా? రాదు. ఇది తీసుకుంటే పని అయిపోయినట్లు కాదు కానీ దేవుని పని ప్రారంభమైనట్టు. యేసు బాప్తీస్మం తీసుకుని దేవుని పని మొదలుపెట్టాడు. బాప్తీస్మం తీసుకున్న వాడు దేవుని పనిలోనికి వెళ్ళాలి.ఆపనిలోఉండగాకష్టాలు,శ్రమలు,అవమానాలు,ఆటంకాలు,వస్తాయి. వీటి అంతటిని సహించాలి అంతము వరకు. అప్పుడు రక్షి౦పబడుతాము. ఈ రోజు నుంచి క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించి, అయన రాజ్య వ్యాప్తి కొరకు పని చేస్తానని వాగ్ధానము చేసినట్టు బాప్తీస్మం అనగానే.


పాపపు ప్రపంచముపై దేవుని ప్రణాళిక

మన ఆత్మలకు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) నేడు పేపర్లో వస్తున్న వార్తలను బట్టి, టివిలో చూపిస్తున్న వార్తలను బట్టి, మన కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలను బట్టి సమాజం నాటి నుండి నేటి వరకు ఎంత భయంకరముగా చెడిపోయిందో మనకు అర్థమవుతుంది. పరలోకమందున్న దేవుడు ఈ సమాజాన్ని ఇలా చూడాలనుకున్నడా? ఆదియందు దేవునికి మనిషి పట్ల ఉన్న ప్రణాళిక వేరన్న విషయము బైబిల్ లోని మాటల ద్వార అర్థమవుతుంది.

2) పుట్టబోయే బిడ్డ పట్ల తల్లితండ్రులు ఎన్నో కలలు కంటారు. వాడు పెరిగి పెద్ద వాడయ్యాక చెడు స్నేహాల వలన చెడిపోయి చివరికి కన్న తల్లితండ్రులను నిందించేవాడిగా ఉన్నప్పుడు వాళ్ళు అనే మాట “మేము వీడిని గూర్చి అనుకున్నది వేరు జరిగింది వేరు అని భాదపడుతూ ఉంటారు”. అనగా భూమి మీద రాక మునుపు తల్లితండ్రులు మనల్ని బట్టి ఎంతో ఆనందముగా ఉండేవారు. భూమి మీదకు వచ్చి ఒక ఆకారమును ధరించుకుని , పెరిగి పెద్దయాక చెడు ప్రవర్తన బట్టి తల్లితండ్రుల ఆనందం అవిరి అవుతుంది.  చెడు చేష్టల వలన ప్రతి రోజు వాడు ఏమి చేస్తాడా అని కంటి మీద కునుకు లేకుండా వాళ్ళ భవిష్యత్తును గురించి వాపోతున్న తల్లితండ్రులు ఎంతో మంది నేడు మనకు కనబడుతున్నారు. వాడినైతే కనగలము కానీ వాడి భవిష్యత్తును కనగలమా అని, వాడిని గొప్పవాడిగా చుడాలనుకున్నాము కానీ ఇలా చూస్తామని అనుకోలేదని తల్లితండ్రులు భాదపడుతూ ఉంటారు.

3) పై సందర్భము చక్కగా అర్థమైతే పరలోకమందున్న మనల్ని కన్నతండ్రికి కూడ మనం కలుగనప్పుడు ఉన్న ఆలోచన వేరు. అనగా ఈ భూమి మీదకు మనం రాక ముందు తండ్రికి మన యెడల ఉన్న ఉద్దేశం వేరు. కానీ ఆదాము ద్వారా అందరు భూమి మీదకు వచ్చిన తర్వాత మనిషిని ఎలా అయితే చూడకూడదని దేవుడు అనుకున్నాడో అలానే చూడవలసిన పరిస్థితి ఏర్పడిందన్న విషయం ఈ సమాజన్ని బట్టి మనకు తెలుసు. నా పిల్లలు రాబోతున్నారని ,నా కోసం భూమి మీద బ్రతుకుతారని ఆరు దినాల మహా కష్టాన్ని అనుభవంచి కలుగును గాక అని అనకుండా ఆదామును మట్టితో ఆకారమును నిర్మించి, తనలో ఉన్న ఆత్మను మట్టి ఆకరాములోకి ప్రవేశపెట్టి ఎంతగానో ఆనందపడ్డాడు. 4) కష్టము అంటే ఏంటో తెలియనియ్యకుండా, కష్టించి పని చేసి సంపాదించుకోవలసిన అవసరం లేకుండా, ఆకలే లేకుండా ఇక చివరికి కనబడుతున్న ఆహార పదార్ధాలను తింటూ దేవుడు కలిగించిన ప్రకృతిని అనుభవించే మంచి జీవితాన్ని మనిషికి దేవుడు ప్రారంభించాడు . ఆదాము ఏదేనులో ఉంటున్నప్పుడు దేవుడు మనిషికి ఇచ్చిన జీవితాన్ని చూస్తే ఎలాంటి మంచి పరిస్థితుల మధ్య పెట్టాడో అర్థమవుతుంది.తన తొలి కుమారుడు భూమి మీద పుట్టాడని ఆనందముతో పొంగిపోతూ కోటాను కోట్ల పిల్లలతో తండ్రిగా నేనే కొలవబడాలని ఆలోచన కల్గిన పరలోకపు తండ్రికి భాద అంటే ఏంటో మనిషి రూచి చూపించాడు. ఈ ప్రకృతిని దేవుడు తన కొరకు కలిగించుకోనక మానవులైన మనము ఉండడానికి కలిగించాడన్నది సత్యం. తోట మధ్యన ఉన్న ఒక్క ఫలం తప్పితే సమస్తమును భుజించమని చెప్పాడు. ఏ ఫలం తినకూడదో చెప్పాడు, తినవద్దన్న ఫలం ఎక్కడ ఉందో చెప్పాడు, ఎందుకు తినకూడదో చెప్పాడు,తింటే జీవితం ఏమైపోతుందో అన్న విషయాలు చెప్పిన్నప్పటికి ఏదైతే వొద్దు అన్నాడో అదే ఆదాము హవ్వలు చేసారు.

5) మనిషి తినుచు, త్రాగుచు, సంపాదనే ద్యేయంగా పెట్టుకని ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఆ తర్వాత చివరికి మరణానికి చేరువైపోతున్నాడు నేటి మనిషి. ఏదేను తోటలో ఎన్నో జాగ్రతలు చెప్పి తినవోద్దని చెప్పిన ఆ ఒక్క పండు కోసం పరమ తండ్రి మాటను ప్రకన్న పెట్టి పాపాన్ని ఆహ్వానించి ఈ రోజు పరలోకపు తండ్రికి కంట నీరు కలిగిస్తున్న సమాజమును చూస్తే అర్థమవుతుంది. ఆదాము పాపానికి ప్రారంభోస్తవం చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రతి మనిషి పాపంలో మునికి చివరికి మంచిలేని సమాజముగా మార్చేసారు.

6) పాపానికి చోటు లేకుండా మొదట ఈ ప్రపంచాన్ని నిర్మిస్తే మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత మంచికి చోటు లేనిగా దేవుడు చూస్తున్నాడు. ఏదైతే పరలోకము తండ్రికి ఇష్టం లేదో దానితో(పాపం) మనిషి భూమిని నింపేశాడు. ఏదైతే వద్దన్నాడో అదే చేస్తున్నాడు. ఏదైతే మానేయ్యమన్నాడో అదే చేస్తున్నాడు. అయన కోసం బ్రతకాలనే ఆలోచనలు నేటి మనిషికి లేదనే చెప్పాలి. ఆదికాండ 3:9-దేవుడైన యెహోవా ఆదామును పిలిచి- నీవు ఎక్కడ ఉన్నవనేను. అందుకతడు-నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననేను. తప్పు చేసిన ఆదాము భయపడినట్టుగా పై వచనము బట్టి అర్థమవుతుంది.ఈ రోజు తప్పు చేసిన కూడ దేవునికి భయపడక ధైర్యముగా ఉంటున్నాడు. తప్పు చేస్తున్న భయం లేదంటే దృడమైన మనస్సాక్షి కలిగిన వారై దేవునికి ఎదురు తిరగడానికి అలవాటుపడ్డారు. మనిషి తప్పు చేస్తున్న భయపడటం లేదంటే మానవ జీవితాలు ఎంత భయంకరముగా మారాయే ఆలోచించండి.

7) వాస్తవముగా మొదట దేవుడంటే మనిషికి కావాల్సింది భయము ఆ తర్వాత భక్తి రావాలి( హెబ్రీ 5:7) . ముందు మనిషికి దేవుడంటే భయం ఉంటె వణుకుతూ ఒంట్లో భక్తి పుడుతుంది. మనిషికి దేవుని యెడల భయమే లేకుంటే భక్తి ఎలా ఉంటుంది? దేవునికి ఇష్టంలేని నిర్ణయాలతో పరలోకమందున్న కన్న తండ్రి కన్న కలలు కన్నీరు అయిపోయిన ఈ కాలములో మనిషికి ఎలాంటి మాటలు కావాలి? మానవత్వం మంట కలిపి మనిషే మృగం అయిపోయి సమాజమే అరణ్యము అయిపోతే మనిషికి దేవుని మాటలు ఎలా ఉండాలి? మనిషి మనస్సు బండైతే దేవుని మాట సూత్తే కావాలి. మనిషి హృదయాలు బండలైతే ఆ బండలు బద్దలు కొట్టడానికి దేవుని వాక్యం సుత్తిలా ఉండాలి.మనిషి కృర మృగం అయితే ఆ కృర మృగాన్ని చీల్చి చెండాడే కత్తిలాంటి వాక్యం ఈ రోజు సమాజనికి కావాలి. అలంటి భోదలు నేడున్న సమాజానికి వస్తే కాస్తంత భయం దేవునిపై ఉంటుంది.

8) అన్ని భయాలు కోల్పోయిన మనిషి గురించి దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? పాడైపోయిన ఈ సమాజాన్ని చూచి అస్సలు పరలోకమందున్న కన్న తండ్రి ఆలోచన ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?? దేవుడికే భయపడని ఈ కాలములో ఉన్నవారిని దేవుడు ఏమి చేయాలి? అయన తీసుకున్న నిర్ణయాలు ఏంటో, దేవుడు ఎంత భికరుడో, దేవుడు ఎలా దహించు అగ్నిగా ఉన్నాడో, అయన విశ్వరూపం ఏంటో, అయన కోసం బ్రతకకపోతే మానవ బ్రతుకులు ఎలా నాశనం అవుతాయో అన్న ప్రాముఖ్యమైన సంగతులు ప్రతి మనిషికి తెలియాలి.

9) పరలోకం నుండి ఈ చెడిపోయిన సమాజమును చూసి, పరలోకం నుండి భయపడని మనిషిని చూసి, ఎన్ని సార్లు దేవుని మాటలు విన్న భయం లేని మనిషిని, తినీ త్రాగి వ్యబిచరించడం ఆలవాటుగా మార్చుకున్న మనిషిని, సంపాదనే ద్యేయముగా మారిన వారిని దేవుడు ఏమి చేస్తున్నాడో చూస్తే కీర్తనలు 7:11,12,13- న్యాయమును బట్టి అయన తీర్పు తీర్చును.అయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని యెడల ,అయన తన ఖడ్గమును పదును పెట్టును.తన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్దపరచియున్నాడు.”వాని కొరకు మరణ సాధనములను సిద్దపరచియున్నాడు”.

10) బ్రతుకు మార్చుకొనుటకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన దేవునిని ప్రక్కన పెట్టి తన ఇష్టానుసారముగా జీవిస్తున్న వారి కొరకు మరణ సాధనములు సిద్దపరుస్తున్నాడని పై వచనము ద్వారా అర్థం అవుతుంది. జీవితములో కలుగు కష్టమైన,నష్టమైన,భాదనైన,వ్యాదినైన ఏదైనా ఉన్నను అయన కోసము బ్రతికితే నిన్ను కాపాడుకుని పర సంభంధమైన ప్రతి ఆశీర్వాదమును ఇస్తాడు. అవసరాల కోసమే దేవునిని నమ్ముకుంటూ బ్రతుకుని మార్చుకొనక ,బైబిల్ లోని మహా జ్ఞానమును నేర్చుకోనక జివిస్తుంటే అప్పుడు దేవుడు ఆశీర్వాదాలు కాక మరణ సాధనములు సిద్దపరుస్తున్నాడు.

11) ఈ ప్రకృతిలో దేవుడు ప్రతి దానికి అజ్ఞాపించాడు & ఆజ్ఞాపించిన ప్రకారముగా ఈ ప్రకృతి అంత పరుగెడుతుంది.దేవుని మాటను కాదంటే,దేవుని మాటకు ఎదురు తిరిగితే,దేవునితో ఎదురాడితే చివరికి నష్టపోయేది మనిషే. ఈ ప్రకృతి దేవుని చేతిలో ఒక ఆయుధం. పైనుండి దేవుడు మనల్ని శిక్షించడానికి రానవసరం లేదు కానీ ప్రకృతికి ఆజ్ఞాపిస్తే చాలు.

12) దేవునికి మనం లోబడి ,భయభక్తులతో వాక్యనుసారముగా జీవిస్తే ఈ ప్రకృతి మన మాట ఉంటుంది. ఒక వేళ దేవునిని కాదని బ్రతికితే ఈ ప్రకృతి మన పతనాన్ని చూస్తుంది, ప్రాణమును తీస్తుంది. దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ ప్రకృతి మనల్ని కాపాడుతుంది లేక ప్రాణమును తీసేస్తుంది. కనుక ఈ పాపపు ప్రపంచము పై శిక్షించుటకు దేవుడు గొప్ప ప్రణాళికను ప్రకృతి ద్వార సిద్దం చేస్తున్నాడు. ఓ మనిషి బైబిల్ నేర్చుకో! మనస్సు మార్చుకో!! ఆత్మను రక్షించుకో!


MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget