Halloween Costume ideas 2015
Latest Post

సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడెనా?

సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడెనా? బైబిలు ప్రకారము నాలుగో రోజు సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల ప్రస్థావన కనిపించుచున్నది. సృష్టి క్రమము తొలిరోజు భూమి ఏర్పడినట్లు (ఆదికాండము 1:-5) లేఖనము చెబుతున్నది. దీనిని బట్టి భూమి ఏర్పడిన తరువాత సూర్యుడు ఆవిర్భావం కనిపిస్తుంది. సైన్స్ ప్రకారము సూర్యుడు ఏర్పడిన తరువాత భూమి ఏర్పడింది. అనగా, బైబిలులోని సృష్టి క్రమము సైన్స్ వివరణకు పూర్తి విరుద్ధమనే అభిప్రాయం కలుగుతున్నది. ఇది ఎంతవరకు వాస్తవమో చూద్ధాం.
"దేవుడు-పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, ఆవి సూచనలను, 
కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని, రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను." ఆదికాండము 1:14-19
పై వాక్యము సృష్టి క్రమము నాలుగో రోజును వివరించుచున్నది. అదే రోజు సూర్యుడు, చంద్రుడు ఏర్పడియున్నారా? లేక అంతకు ముందుగానే ఏర్పడియున్నారా అనే విషయమును ముందుగా నిర్ధారించుకున్నాము. ఆ తరువాత నాలుగో రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము. పై వాక్యములోని "ఆ రెండు గొప్ప జ్యోతులు", "పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి", జ్యోతులు అనే వాక్యములు ద్వారా నాలుగో రోజు సృష్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల గురించిన ప్రస్థావన కనిపించుచున్నది. "ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును" అనే వాక్యములోని 'కలుగును' అనే పదమును నిశితముగా పరిశీలించినట్లయితే సూర్యుడు, చంద్రుడి సృష్టి గురించి గ్రహించవచ్చును. ఆ వాక్యములోని 'కలుగును' అనే పదము 'కనిపించును' అనే అర్థము కోసం వాడబడినది. ఇంగ్లీషు బైబిలునందు ఈ వాక్యమును పరిశీలించినట్లయితే "Let great lights APPEAR in the sky" అని ఉంటుంది. ఇందులో appear అను పదము 'కనిపించును', గోచరమగును', 'ప్రత్యక్షమగును' అను సమానార్థములను సూచించును. అనగా గతంలో సృజింపబడిన సూర్య చంద్రులు, నక్షత్రాలను నాలుగో రోజున ప్రత్యక్షం కావాలని దేవుడు ఆజ్ఞాపించినట్లు అర్థమును ఇచ్చును.
నాలుగో రోజు వరకు సూర్య, చంద్ర నక్షత్రములు ఎందుకు కనిపించలేదు అని లేఖనముల ద్వారా గ్రహింపలేకున్నప్పటికీ అప్పటి వరకు అవి ఏమయ్యాయి? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉన్నది. అది, సూర్యుడిని మబ్బుచేత కప్పబడును, చంద్రుడు వెన్నెల కాయకపోవును (యెహేజ్కేలు 32:7), నక్షత్రములను మరుగుచేయును (యోబు 9:7) అనునది. మరుగైన వాటిని నాలుగో రోజు ప్రత్యక్షతపరచడమెందుకు? అనే ప్రశ్నకు సమాధానము లభించును. నాలుగో రోజు సృష్టిలోని ప్రధాన అంశాలను ఒక్కసారి ప్రత్యేకించి చూస్తే... 1.పగటిని రాత్రిని వేరుపరచునట్లు, 2. సూచనలను, కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, 3. భూమి మీద వెలుగిచ్చుటకు, 4. పగటిని రాత్రిని ఏలుటకు అనే నాలుగు అంశాలు ప్రధానముగా కనిపించును. అవన్నీ ఒకే విషయమును స్పష్టము చేయుచున్నవి. అదేమనగా ఖగోళ వస్తువులకు దేవుడు విధించుచున్న కట్టడ. అది ఎలాగంటే?..
1. వెలుగు చీకటి వేరుపరచు: ఇది సూర్యడు, చంద్రుడు, నక్షత్రములకు అందించు కట్టడ
2. సూచనలను, కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు: ఇది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకు అందించు కట్టడ
3. భూమి మీద వెలుగిచ్చు: ఇది సూర్యుడు, చంద్రుడికి అందించు కట్టడ
4. పగటిని రాత్రిని ఏలు: ఇది సూర్యుడు, చంద్రుడికి, నక్షత్రములకు అందించు కట్టడ
పై వివరణ ద్వారా సృష్టి క్రమము తొలి రోజు నాటి ఖగోళ వస్తువులను నాలుగో రోజు నాటికి ప్రత్యక్షపరచి వాటికి కట్టడలను విధించినట్లు గ్రహించగలము. అందుకే యోబు గ్రంథకర్త "వాటి వాటి కాలములో నక్షత్ర రాసులు వచ్చునట్లు చేయగలవా?" (యోబు 38:32), "ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?" (యోబు 38:33) అని పశ్నించియున్నాడు. ఆ పనిని దేవుడు చేసినట్లు చెప్పడం గ్రంథకర్త ఉద్దేశ్యము.
సైన్స్ ప్రకారము:
నాలుగో రోజుకు ముందుగానే సూర్యుడు ఉన్నాడని సైన్స్ పరంగా నిరూపించడానికి బైబిలులో లేఖన సాక్ష్యాలు బలంగానే చెప్పబడ్డాయి. సృష్టి క్రమములో మూడవ రోజు గడ్డి, మొక్కలు, వృక్షములు మొలవడం (ఆదికాండము 1:11) గురించి. సూర్యుడికి మరియు మొక్కలకు సంబంధం ఏమిటనే విషయము చాలా మందికి తెలిసే ఉంటుంది. మొక్కలు బ్రతకాలంటే కేవలం నీరు మాత్రమే కాదు, వాతావరణంలోని కార్బన్ డై యాక్సైడ్ (మనము ఆక్సిజన్ పీల్చినట్లు) అలాగే సూర్యరశ్మి కూడా కావాలి. సూర్య కిరణాలను గ్రహించి తమకు కావలసిన ఆహారము (గ్లూకోస్)ను తయారు చేసుకుంటాయి. దీనినే వృక్షశాస్త్ర పరిభాషలో కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. సూర్యరశ్మి లేకపోతే మొక్కలు బ్రతకలేవు. కాబట్టి అప్పటికే భూమి మీద వెలుగు, చీకటి మరియు పగలు, వెలుగు ఉన్నాయనే విషయాన్ని చెప్పడంతో పాటు మొక్కలు ద్వారా ఆ విషయాన్ని స్పష్టము చేయబడుతుంది.

బైబిలు గొప్పతనం ఏమిటి?
బైబిలు గొప్పతనం ఏమిటి?


అక్షర జ్ఞానం లేని పామరుడైనా సరే బైబిలులోని సారాంశం తెలిస్తే చాలు, నేటి విద్యావంతులకు ధీటుగా విషయ పరిజ్ఞానం పొందినట్టే. శాస్త్ర సాంకేతిక రంగం, ఖగోళం, అంతరిక్షం, వైద్యం, భూగర్భం, విమాన శాస్త్రం ఇలా ఎన్నో రంగాల గురించి కొద్దో, గొప్పో విషయాలు గ్రహించినట్లే. నేటి సామాజిక పరిస్థితులకు తగిన చట్టాలు, లోకొక్తులు, సూక్తులు, జనరల్ నాలెడ్జ్ వంటి విభిన్న అంశాలపైన తిరుగులేని పట్టు సాధించినట్లే. అంతగా అనంత విషయాలను అక్షర రూపంలో బైబిలు తనలో నిక్షిప్తం చేసుకుంది. నేడు శాస్త్రవేత్తలు కనిపెట్టె పలు విషయాలు బైబిలులో శాస్తీయంగానే ఉన్నాయి. బైబిలులో ఉన్న అద్బుతమైన విషయాల సమాహారాన్ని చూద్దాం!.


* ఈ సృష్టి ఎప్పుడు? ఎలా ఆవిర్భవించింది?
* విశ్వం విస్తరించుచున్నదా?* భూమి ఎలా ఏర్పడింది?* జీవపరిణామ క్రమం ఎలా జరిగింది?* జన్యువుల పని తీరు ఏంటి?* అంతరించిపోయిన అరుదైన జీవజాతులు, వాటి భౌతిక నిర్మాణము?* నాగరికత వెలసిల్లిన చరిత్ర* భూగోళంపై జనాభా వ్యాప్తి ఎలా జరిగింది?* భాషలు ఎలా ఏర్పడ్డాయి?* మానవులతో మానవాతీతులకు సంబంధాలు ఉన్నాయా?* నేటి చట్టాలు, శిక్షలకు మూలాధారంగా ఉన్న బైబిలుబైబిలు నుంచి వ్యాప్తి చెందిన విఖ్యాత లోకోక్తులు, సూక్తులు* భారత దేశంతో బైబిలు చరిత్రకు ఉన్న సంబంధము?* హిందూ ఆచారాలు, పూజలకు బైబిలులోని కనిపించే మూలాలు?ఇలాంటి మరెన్నో విషయాలను ఇముడ్చుకున్న అద్భుత గ్రంథమే బైబిలు.


బైబిలు క్రైస్తవుల కొరకే నిర్దేశింపబడినదా?
''బైబిలు అనేది క్రైస్తవుల పవిత్ర గ్రంథం" ఇది చాలా మందిలో నెలకొన్న భావన. క్రీస్తు గురించి ముందు మెరుపులతో పాత నిబంధన గ్రంథం, క్రీస్తు ప్రత్యక్షతతో కొత్త నిబంధన గ్రంథం కనిపించడమే అందుకు ప్రధాన కారణం. వాస్తవానికి బైబిలు అనేది సర్వమానవాళి కోసం అందించబడిన పవిత్ర గ్రంథం.
బైబిలు ఉద్బోద దేని గురించి?
ఈ విశ్వం పుట్టుక మొదలుకొని మానవజాతి ఆవిర్భవము, మనుగడ వరకు జరిగిన చారిత్రక ఘటనలు బైబిలునందు నిక్షిప్తమైయున్నాయి. అయితే ఇది బాహ్యంగా కనిపించే చరిత్ర మాత్రమే. నిజానికి ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు చరిత్రలో మోపబడిన ప్రతీ ఒక్క అడుగు వెనుక దేవుని ఉద్దేశ్యము ఉన్నది. అందుకే ఆ గాథలను విశ్లేషిస్తే అందులో దేవుని ప్రణాళిక గురించి లోతైన భావనలు కనిపిస్తాయి. ఆత్మీయ జీవనానికి తోడ్పడే చక్కటి సందేశాన్ని కూడా వెల్లడిస్తాయి. ఆ సందేశాలు ఏమిటో చూద్దాం!.
* పాపం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది?
* పాపుల యందు దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది?* ఆపత్కాలాల్లో నీతిమంతులు ఎలా రక్షింపబడతారు?* నీతిమంతుల సంతానం ఎలా ఆశీర్వదింపబడుతుంది?* నీతిమంతుల వలన వారి కుటుంబం ఎలా రక్షింపబడుతుంది?* దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే ఏం జరుగుతుంది?* దేవుని యందు విశ్వాసముతో ఎలా కాపాడబడుతున్నారు?
వంటి పలు సందేశాలను బైబిలులోని యధార్ధ గాథలు వెల్లడిస్తాయి.


సృష్టి అంతటిని దేవుడు ఆరు రోజుల్లో పూర్తి చేసి ఏడవ రోజున విశ్రమించెనని బైబిలు చెబుతుంది. మొదటి రోజు సృష్టి క్రమములో దేవుడు వేటిని సృజించెను? అని ప్రశ్నించుకుంటే, భూమి, ఆకాశము, జలము, చీకటి, వెలుగు అనే అయిదు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి (ఆదికాండము 1: 1-5). మరి వీటిలో మొట్టమొదట దేవుడు దేనిని సృష్టించెను?. ఇందుకు చాలా మంది నుంచి వచ్చే సమాధానము 'భూమి'. "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను" (ఆదికాండము 1:1) అనే వాక్యములో మొదట 'భూమి' కనిపించడమే ఈ భావనకు కారణం. అయితే శాస్త్రవేత్తలు మాత్రం, ఈ సృష్టిలో మొట్టమొదట శూన్యం ఉండేదని, ఆ తర్వాతే పలు నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయని, ఆ గ్రహాల్లో భూమి ఒకటని చెబుతున్నారు. దీనిని బట్టి సృష్టిలో మొట్టమొదట భూమి ఏర్పడలేదు. తార్కికంగా ఆలోచిస్తే, ఖాళీ స్థలం ఉంటేనే అందులో ఏమైనా వస్తువులు ఉంచగలము. అలాగే భూమి సృజింపబడటానికి ముందు దానిని ఉంచడానికి ఖాళీ స్థలమును కూడా దేవుడు సృష్టించియుండాలి. వాస్తవానికి ఇదే విషయాన్ని బైబిలు చెబుతుంది.



"శూన్యమండలముపైని ఉత్తర దిక్కున నున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను" యోబు 26:7

పై వాక్యమును పరిశీలిస్తే భూమికన్నా ముందుగా శూన్యమండలము ఉన్నదని, దానిపైనే భూమిని ఉంచినట్లు చెప్పబడినది. యెషయా 42:5, 51:13 లేఖనములు సైతము ఇదే భావమును చెప్పుచున్నవి. అనగా భూమి కన్నా ముందుగానే శూన్యమండలము ఉందనే అర్థమును పై వాక్యము ద్వారా గ్రహించవచ్చును. ఇక్కడ పేర్కొనబడిన 'శూన్యమండలము' అనే పదమే ఆదికాండము 1:1లో చెప్పబడిన ఆకాశములు. ఈ పదము మూలభాషయైన హెబ్రీ భాషయందు shah-MAH-yim (שמים) అనే పదముగా ఉండగా దానిని ఇంగ్లీషులో 'heavens' అని, తెలుగులో 'ఆకాశములు' అని భాషాంతరము చేసియున్నారు. shah-MAH-yim (שמים) అనే పదమునకు హెబ్రీ భాషయందు ఖగోళము, విశాలమండలము మరియు శూన్యము అనే నానార్థములు కూడా ఉన్నవి. దీనిని బట్టి ఆదికాండము 1:1లోని 'ఆకాశములు' అనే పదము అనంత విశాలములోని శూనమును సూచించుచున్నదని గ్రహించగలము. అనగా దేవుడు ప్రప్రథమముగా శూన్యముతో కూడిన అనంత విశ్వమును సృజించియున్నట్లు గ్రహించగలము.

తొలి సృష్టిగా భూమి అనే భావనను బైబిలు ఎందుకు కలిగిస్తున్నది?

"ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను" ఆదికాండము 2:1
సృష్టి క్రమము సంపూర్ణము చేయబడినట్లు పేర్కొనే సందర్భములో పై వాక్యము చెప్పబడినది. అందులోని క్రమములో పరిశీలించినట్లయితే భూమికన్నా ముందుగానే ఆకాశము సృష్టించినట్లు తెలియుచున్నది. అయితే తొలి సృష్టి 'భూమి' అని అర్థమునిచ్చే విధముగా ఆదికాండము 1:1 లో "భూమ్యాకాశములు" అనే పదము ఎందుకు కనిపిస్తున్నది?. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా హెబ్రీ భాషా లేఖనములను ఇతర భాషల్లోకి అనువదించేందుకు చేపట్టిన పద్ధతుల గురించి తెలుసుకోవాలి. హెబ్రీ భాషా లేఖనాలను పదానికి పదం క్రమం తప్పకుండా అర్థాన్ని వ్రాస్తూ తర్జుమా చేయడం ఒక పద్దతి కాగా, పదాల క్రమంతో సంబంధం లేకుండా వాక్యం యొక్క భావం సరిగ్గా ఉండే విధంగా తర్జుమా చేయడం రెండవ పద్ధతి. భాషా సౌందర్యం కోసం రెండవ పద్ధతినే అత్యధికులు అవలంభించారు. తెలుగు భాషకు కూడా ఇదే తర్జుమా విధానం అవలంభించారు. అందుకే హెబ్రీ భాషలో 'ఆకాశములు మరియు భూమి' అనే అర్థముతో ఉన్న పదములు తెలుగులో 'భూమ్యాకాశములు' అని తర్జుమా చేయబడినది. ఇంగ్లీషు బైబిలు నందు మాత్రం ఈ తర్జుమా 'Heavens and the Earth' గా ఉండటం గమనించవచ్చును.

ప్రకటన గ్ర౦థ౦ 17వ అధ్యాయ౦లోని ఎర్రని మృగ౦ ఎవరు?


తెలుగు ప్రకటన గ్ర౦థ౦ 17వ అధ్యాయ౦లోని ఎర్రని మృగ౦ ఎవరు? బైబిలు ఇచ్చే జవాబు ప్రకటన గ్ర౦థ౦ 17వ అధ్యాయ౦లోని ఎర్రని మృగ౦, ప్రప౦చ దేశాలను ఏక౦ చేయాలనే స౦కల్పాన్ని, వాటికి ప్రాతినిధ్య౦ వహి౦చాలనే ఉద్దేశాన్ని కలిగిన స౦స్థకు గుర్తుగా ఉ౦ది. అది మొదట్లో నానాజాతి సమితి రూప౦లో ఉ౦డేది, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి రూప౦లో ఉ౦ది.
ఎర్రని మృగాన్ని గుర్తి౦చడానికి ఉపయోగపడే కీలక విషయాలు
ఇది రాజకీయ స౦బ౦ధమైనది. ఈ ఎర్రని మృగానికి ‘ఏడు తలలు’ ఉన్నాయి, అవి ‘ఏడు పర్వతాలకు,’ ‘ఏడుగురు రాజులకు’ లేదా ఏడు పాలనా శక్తులకు ప్రాతినిధ్య౦ వహిస్తున్నాయని ప్రకటన గ్ర౦థ౦ చెప్తో౦ది. (ప్రకటన 17:9, 10) బైబిల్లో పర్వతాలను, మృగాలను ప్రభుత్వాలకు గుర్తులుగా ఉపయోగి౦చారు.—యిర్మీయా 51:24, 25; దానియేలు 2:44, 45; 7:17, 23.
దీనికి ప్రప౦చ రాజకీయ వ్యవస్థ పోలికలు ఉన్నాయి. ఈ ఎర్రని మృగ౦, ప్రకటన 13వ అధ్యాయ౦లోని ఏడు తలల మృగానికి ప్రతిబి౦బ౦. ఆ ఏడు తలల మృగ౦ ప్రప౦చ రాజకీయ వ్యవస్థను సూచిస్తు౦ది. ఆ ఏడు తలల మృగానికి ఉన్నట్లే ఈ ఎర్రని మృగానికి కూడా ఏడు తలలు, పది కొమ్ములు, దేవుణ్ణి దూషి౦చే పేర్లు ఉన్నాయి. (ప్రకటన 13:1; 17:3) ఈ పోలికలు చూస్తు౦టే, ఏదో అనుకోకు౦డా కలిసినవాటిలా అనిపి౦చడ౦ లేదు. ఈ ఎర్రని మృగ౦, ప్రప౦చ రాజకీయ వ్యవస్థకు ప్రతిబి౦బ౦ లేదా సారూప్య౦.—ప్రకటన 13:15.
ఇతర పాలకుల ను౦డి అధికార౦ పొ౦ది౦ది. ఈ ఎర్రని క్రూరమృగ౦ ఇతర పరిపాలనా శక్తుల్లో ను౦డి ‘వస్తు౦ది,’ లేదా వాటి వల్ల ఉనికిలో ఉ౦టు౦ది.—ప్రకటన 17:11, NW; 17:17.
దీనికి మత౦తో స౦బ౦ధ౦ ఉ౦ది. ప్రప౦చ౦లోని అబద్ధ మతాలన్నిటికీ ప్రతీక అయిన మహాబబులోను ఈ ఎర్రని మృగ౦ మీద కూర్చు౦ది. అ౦టే, మత గు౦పుల ప్రభావ౦ ఈ మృగ౦ మీద ఉ౦టు౦దని తెలుస్తో౦ది.—ప్రకటన 17:3-5.
దేవుణ్ణి అవమానిస్తు౦ది. ఈ మృగ౦ “దేవదూషణ నామములతో ని౦డుకొని” ఉ౦ది.—ప్రకటన 17:3. తాత్కాలిక౦గా చచ్చుబడిపోతు౦ది. ఎర్రని మృగ౦ కొ౦తకాల౦ “అగాధ జలములో” * లేదా నిష్క్రియా స్థితిలో ఉ౦టు౦ది, కానీ మళ్లీ బయటకు వస్తు౦ది.—ప్రకటన 17:8.
బైబిలు ప్రవచన నెరవేర్పు
ఎర్రని మృగ౦ గురి౦చి బైబిలు చెప్పిన ప్రవచన౦, ఐక్యరాజ్య సమితి, దానికి ము౦దున్న నానాజాతి సమితి విషయ౦లో ఎలా నెరవేరి౦దో చూడ౦డి.
ఇది రాజకీయ స౦బ౦ధమైనది. ఐక్యరాజ్య సమితి, ‘దానిలో సభ్యత్వ౦ ఉన్న అన్ని రాజ్యాల సార్వభౌమ సమానతకు’ ప్రాధాన్యత ఇవ్వడ౦ ద్వారా రాజకీయ వ్యవస్థకు మద్దతిస్తు౦ది. *
దీనికి ప్రప౦చ రాజకీయ వ్యవస్థ పోలికలు ఉన్నాయి. 2011లో ఐక్యరాజ్య సమితి, తన 193వ సభ్యదేశాన్ని చేర్చుకు౦ది. ఆ విధ౦గా ప్రప౦చ౦లోని అనేక దేశాలకు, ప్రజలకు తాను ప్రాతినిధ్య౦ వహిస్తున్నానని అది చూపి౦చుకు౦టో౦ది.
ఇతర పాలకుల ను౦డి అధికార౦ పొ౦ది౦ది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వ౦ ఉన్న దేశాల వల్లే అది ఉనికిలో ఉ౦ది. ఆ దేశాలు దానికి ఎ౦త అధికార౦ ఇస్తే అ౦త అధికారమే దానికి ఉ౦టు౦ది.
దీనికి మత౦తో స౦బ౦ధ౦ ఉ౦ది. నానాజాతి సమితికి, ఐక్యరాజ్య సమితికి ఈ రె౦డిటికీ ప్రప౦చ మతాలు మద్దతునిస్తూ వచ్చాయి. *
దేవుణ్ణి అవమానిస్తు౦ది. “అ౦తర్జాతీయ శా౦తిభద్రతలను కాపాడడానికి” ఐక్యరాజ్య సమితి స్థాపి౦చబడి౦ది. * ఈ లక్ష్య౦ గొప్పగానే కనిపిస్తో౦ది గానీ, దేవుని రాజ్య౦ మాత్రమే సాధిస్తు౦దని దేవుడు చెప్పినవాటిని, తానే చేస్తానని చెప్పుకు౦టూ ఐక్యరాజ్య సమితి నిజానికి దేవుణ్ణి అవమానిస్తు౦ది.—కీర్తన 46:9; దానియేలు 2:44.
తాత్కాలిక౦గా చచ్చుబడిపోతు౦ది. మొదటి ప్రప౦చ యుద్ధ౦ జరిగిన కొద్దికాలానికి, శా౦తిని కాపాడడానికి స్థాపి౦చబడిన నానాజాతి సమితి అ౦తర్జాతీయ ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయి౦ది. 1939లో రె౦డవ ప్రప౦చ యుద్ధ౦ ప్రార౦భమైనప్పుడు అది పనిచేయడ౦ ఆగిపోయి౦ది. రె౦డవ ప్రప౦చ యుద్ధ౦ ముగిసిన తర్వాత 1945లో ఐక్యరాజ్య సమితి రూపొ౦ది౦ది. ఉద్దేశాల్లో, పద్ధతుల్లో, నిర్మాణ౦లో ఐక్యరాజ్య సమితి నానాజాతి సమితికి అద్ద౦పట్టి౦ది.

The answers to your Bible questions

  1. God(2)
  2. Jesus Christ(2)
  3. Holy Spirit
  4. Salvation
  5. The Bible(2)
  6. Church(2)
  7. End Times
  8. Angels
  9. Humanity
  10. Theology
  11. Apologetics & Worldview
  12. Christian Life(2)
  13. Prayer
  14. Sin
  15. Eternity
  16. Marriage
  17. Relationships
  18. Family
  19. Counseling Related
  20. Creation
  21. Christianity
  22. Church History
  23. Cults & Religions(2)
  24. False Doctrine
  25. Life Decisions
  26. Topical(2)
  27. Miscellaneous(2)
  28. Bible Characters
  29. Old Testament Survey
  30. New Testament Survey
  31. Questions about the Books of the Bible
  32. Catholic Questions
  33. Jewish Questions
  34. Muslim Questions

దేవుడు ఉన్నాడా? దేవుని ఉనికికి ఆధారములు ఉన్నాయా? ప్రశ్న: దేవుడు ఉన్నాడా? దేవుని ఉనికికి ఆధారములు ఉన్నాయా? జవాబు: దేవుని యొక్క ఉనికి నిరూపించనులేము లేదా ఒప్పక ఉండనూలేము. పరిశుద్ధ గ్రంధము చెప్తుంది దేవుడు ఉన్నాడని విశ్వాసముతో మనము నమ్మాలని: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” (హెబ్రీ. 11:6). దేవుడు అలా గనుక అనుకుని ఉంటే, ఆయన ఉన్నాడని అందరికి ప్రత్యక్షమై ప్రపంచమంతటికి నిరూపించేవాడు. కాని ఆయన అది చేసియుంటే, విశ్వాసము యొక్క అవసరత ఉండేది కాదు. “యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను” (యోహాను 20:29). అయినప్పటికీ, దీనికి అర్ధం దేవుని ఉనికికి ఆధారం లేదు అని కాదు. పరిశుద్ధ గ్రంధం చెప్తుంది, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నదిలోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవి” (కీర్తన. 19:1-4). నక్షత్రములను చూచినప్పుడు, విశ్వము యొక్క విస్తీర్ణతను అర్ధం చేసుకొనినప్పుడు, ప్రకృతి యొక్క వింతలను పరిశీలించినప్పుడు, సూర్యాస్తమయము యొక్క అందమును చూచినప్పుడు– ఇవన్నియు సృష్టికర్తయైన దేవుని వైపు మనలను చూపిస్తున్నవి. ఇవన్నియు చాలవన్నట్లు మన హృదయములలో కూడా దేవుని గురించి ఒక ఆధారం ఉంది. ప్రసంగి 3:11 చెప్తుంది, “...ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు.” మన అంతరంగములో మనకు ఈ జీవితము తరువాత మరియు ఈ ప్రపంచము తరువాత ఏదో ఉన్నదన్న ఒక గ్రహింపు ఉంది. తెలివిగా ఈ జ్ఞానాన్ని తిరస్కరించవచ్చును గాని, మనలో మరియు మన చుట్టూ ఉన్న దేవుని ప్రసన్నత స్పష్టంగానే ఇంకను ఉంది. అయినా కూడా, కొందరు దేవుని ఉనికిని విస్మరిస్తారని పరిశుద్ధ గ్రంధము చెప్తుంది: “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు” (కీర్తన. 14:1). చరిత్ర అంతటిలో, అన్ని సంస్కృతులలో, అన్ని నాగరికతలలో, మరియు అన్ని ఖండాలలో అధిక సంఖ్యక ప్రజలు ఎదో ఒక రకమైన దేవుని యొక్క ఉనికిని నమ్ముతారు గనుక, ఈ నమ్మకమును కలిగించే ఒకటి (లేదా ఒకరు) ఉండే ఉంటారు. దేవుని ఉనికికి గల పరిశుద్ధ గ్రంధ వాదనలతో పాటు కొన్ని హేతుబద్ధ వాదనలు కూడా ఉన్నాయి. మొదటిగా మనకు అస్తిత్వ వాదన ఉంది. ఈ అస్తిత్వ వాదనలో ప్రసిద్ధమైన రూపము దేవుడు అనే భావనను దేవుని ఉనికిని ఋజువు చేయడానికి వాడుతుంది. అది దేవుని “తన కంటే ఉన్నతమైనవారు ఎవరిని ఊహించలేము” అని నిర్వచిస్తూ మొదలౌతుంది. ఆ తరువాత అది ఉనికి లేకుండా ఉండటం కంటే ఉనికి కలిగి ఉండటం గొప్పదని వాదిస్తుంది, మరియు ఈ కారణాన ఊహించగలిగే గొప్ప వ్యక్తి తప్పక ఉండాలి. దేవుడు ఒకవేళ లేకపోతే, అప్పుడు దేవుడు ఊహించగలిగే గొప్ప వ్యక్తి కాదు, కాబట్టి ఇది అసలు దేవునికున్న ముఖ్య నిర్వచనాన్ని వైరుధ్యపరుస్తుంది. రెండవ వాదన ఉద్దేశ్యతత్వ వాదన (దీనినే టీలియాలజీ అంటారు). ఈ ఉద్దేశ్యతత్వ వాదన చెప్తుంది ఈ విశ్వం అనేకమైన ఆశ్చర్యకర రూపకల్పనలు కలిగియున్నందున వీటిని చేసిన ఒక దైవికమైన కల్పనాకారుడు ఉండాలి. ఉదాహరణకు, ఒకవేళ భూమి గాని సూర్యుని నుండి ఇంకా దగ్గరగానో లేక ఇంకొంత దూరంగానో ఉంటే, అది ప్రస్తుతం చేస్తున్నట్లుగా జీవకోటిని పోషించగలిగేది కాదు. మన వాతావరణంలో ఉన్న కొన్ని మూలికలు ఎంతోకొంత తక్కువ శాతంలో ఉండి ఉంటే, దరిదాపుగా ఈ భూమి మీద ఉన్న సమస్త జీవకోటి మరణిస్తుంది. ఒక పోషకపదార్ధ అనువు దానంతట అది ఏర్పడుటకు గల అవకాశం10243 లో (అంటే 10 తరువాత 243 సున్నాలు) కేవలం 1 మాత్రమే ఉంటుంది. దేవుని ఉనికికి గల మూడవ హేతుబద్ధ వాదన విశ్వోద్భవ వాదన. ప్రతి ప్రభావానికి తప్పక ఒక హేతువు ఉండక తప్పదు. ఈ విశ్వము మరియు దానిలో ఉన్న సమస్తము ఒక ప్రభావం. సమస్తమును ఉనికిలోకి తెచ్చినది ఒకటి తప్పక ఉంటుంది. ఆఖరుకు ప్రతి దానిని మనుగడలోనికి తెచ్చిన హేతువు ఉన్నదంటే తప్పకుండా “అహేతువు” అయినది ఒకటి ఉండాలి. ఆ “అహేతువైన” హేతువే దేవుడు. నాల్గవ వాదనను నైతిక వాదన అంటారు. చరిత్ర అంతటిలో ప్రతి సంస్కృతి ఒక విధమైన చట్టమును కలిగియుంది. ప్రతి ఒక్కరికి తప్పేదో ఒప్పేదో అనే జ్ఞానం ఉంది. నరహత్య, అబద్ధం, దొంగతనం మరియు అనైతికత అన్ని విశ్వవ్యాప్తంగా తిరస్కరించబడినవి. పరిశుద్ధుడైన దేవుని నుండి గాక తప్పు ఒప్పులను గూర్చిన ఈ తెలివి ఎక్కడ నుండి వచ్చి ఉంటుంది? ఇవన్నీ ఉన్నప్పటికీ, పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది స్పష్టమైన మరియు విస్మరించరాని దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి ఒక అబద్ధాన్ని నమ్ముతారని. రోమా 1:25లో, “అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌” అని చదువుతాం. దేవుని నమ్మకయుండిన యెడల ప్రజలు నిరుత్తరులై యున్నారు అని పరిశుద్ధ గ్రంధము చెప్తుంది: “ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు” (రోమా. 1:20). దేవుని ఉనికిని ప్రజలు తిరస్కరిస్తామని అంటుంటారు, ఎందుకంటే అది ఒక “శాస్త్రీయమైనది” కాదు లేదా “ఎందుకంటే దానికి ఆధారము ఏమియు లేదు” అని అంటారు. అసలైన కారణము ఏమంటే ఒకసారి వారు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నట్లయితే, వారు దేవుని పట్ల బాధ్యులుగా ఉన్నారని మరియు ఆయన నుండి క్షమాపణ కోరవలసినవారిగా ఉన్నారని వారు గ్రహించాలి గనుక ఒప్పుకోరు (రోమా. 3:23, 6:23). దేవుడు ఉన్నట్లయితే, మన క్రియలను బట్టి మనము ఆయనకు జవాబుదారులము. దేవుడు లేకపోతే, దేవుడు మనకు తీర్పు తీరుస్తాడనే భయం లేకుండా మనకు ఇష్టమోచ్చినది చేయవచ్చు. ఈ కారణము చేతననే దేవుని ఉనికిని తిరస్కరించే చాలా మంది సహజసిద్ధ సృష్టి అనే సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకొని వ్రేలాడుతుంటారు – ఈ సిద్ధాంతం వారికి సృష్టికర్తయైన దేవుని నమ్ముటకు ఒక ప్రత్యమ్నాయ మార్గాన్ని ఇస్తుంది. దేవుడు ఉన్నాడు మరియు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆయన ఉన్నాడని తెలుసు. కొందరు ఆయన లేడని నిరూపించడానికి దూకుడుతో ప్రయత్నిస్తారు అనే విషయమే ఆయన ఉన్నాడు అనడానికి ఋజువుగా ఉంది. దేవుడు ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? క్రైస్తవులముగా, మనము ప్రతి దినము ఆయనతో మాట్లాడతాము గనుక ఆయన ఉన్నాడని మనము ఎరుగుతాము. ఆయన మనతో మాట్లాడడం వినదగేట్లు ఉండదు, కాని ఆయన ప్రసన్నతను స్పృశిస్తాం, ఆయన నడిపింపును అనుభవిస్తాం, ఆయన ప్రేమను తెలుసుకుంటాం, ఆయన కృప కొరకు కనిపెడతాం. దేవుడు తప్ప వేరే ఎవ్వరు మనకు వివరించలేని కొన్ని సంగతులు మన జీవితములలో జరిగాయి. దేవుడు ఎంతో అద్భుతరీతిగా మనలను రక్షించి మన జీవితాలను మార్చాడు కనుక ఆయన ఉనికిని గుర్తించి ఆయనను స్తుతించకుండా ఉండలేము. ముందు నుండే స్పష్టంగా కనిపించే దానిని విస్మరించే వారిని పైన తెలుపబడిన వాదనలు ఏవీ కూడా ఒప్పించలేవు. ఆఖరుగా, దేవుని ఉనికి విశ్వాసముతో అంగీకరించబడాలి (హెబ్రీ. 11:6). దేవునిపై విశ్వాసం అంటే చీకటిలోనికి మనం వేసే గ్రుడ్డి అడుగు కాదు; బాగా వెలిగించబడిన గదిలోనికి వేసే సురక్షితమైన అడుగు, అక్కడ అధిక సంఖ్యాకులు ఇప్పటికే నిలిచియున్నారు.

భూమి మీద నీరు ఎలా ఏర్పడినది?

భూమి మీద నీరు ఎలా ఏర్పడినది?

పై ప్రశ్నను చదివిన వెంటనే 'బైబిలుకు ఈ ప్రశ్నతో సంబంధం ఏమిటి?' అనే అనుమానం పలువురిలో కించింతైనను కలుగక మానదు. అయితే సర్వ విజ్ఞాన భండాగార రూపమే మన బైబిలు అనే విషయాన్ని గ్రహించగలిగితే దాదాపు ప్రతీ చిన్న విషయానికి ప్రత్యక్షముగాలో లేక పరోక్షముగానో లేఖన రూపములో సమాధానములు లభించును.

భూమి మీద జలములు ఏర్పడటం గురించి సైన్స్ వివరణ

"మహా విస్పోటనం కారణంగా మండుచున్న భూమి క్రమముగా వేడిమిని కోల్పోసాగింది. చివరి దశలో భూమి చల్లబడగానే ఏర్పడిన రసాయనిక మార్పుల కారణంగా భూమి మీద విస్తారంగా వర్షం కురిసింది. దీంతో జలములతో భూమి అంతా కప్పివేయబడినది. ఆ తరువాత జలములన్నీ అగాధముల్లోకి చేరుకోవడంతో అది సముద్రములుగా ఏర్పడగా మిగతా ప్రాంతం ఖాళీ భూభాగంగా ఏర్పడింది" అంటూ భూమి మీద నీరు ఏర్పడటానికి వైజ్ఞానిక కారణాలను ఆధునిక సైన్స్ వివరిస్తుంది. అదీనూ సంవత్సరాల కొద్ది జరిపిన అనేక పరిశోధనల ఫలితంగా చెబుతుంది. అయితే ఇదంతా బైబిలులోనే ఉన్నది. దానిని పరిశీలించెదము.

బైబిలు వివరణ

"దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను" (ఆదికాండము 1:7) అనే వాక్యములో విశాలము క్రింది జలములు అనే పదము భూమి మీద నున్న జలములను సూచించును. అనగా, అప్పట్లో ఈ భూమి జలములతో కప్పివేయబడి ఉన్నదనే భావనను ఆ లేఖనము తెలియుచున్నది. ఈ విషయాన్ని "ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ధి పూర్వకముగా మరతురు" (2పేతురు 3:5) అనే వాక్యము స్పష్టము చేయుచున్నది. "దేవుడు-ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను" (ఆదికాండము 1:9-10) అనే వాక్యము ద్వారా సముద్రములు, భూభాగం ఎలా ఏర్పడ్డాయనే విషయమును కూడా చెబుతున్నది. అసలు, ఈ భూమి మీదకు జలములు ఎలా వచ్చాయనే విషయాన్ని "అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను" ఆదికాండము 2:5 లేఖనము వివరించుచున్నది. ఈ లేఖనము భూమి సృజింపబడిన తొలినాళ్లను (ఆదికాండము 2:4) సూచించును.

నేటి ఆధునిక సైన్స్ చెప్పిన విషయాన్ని సుమారు 3,500 సంవత్సరములకు ముందుగానే గ్రంథస్థము చేయబడుట ద్వారా లేఖనాలు యొక్క విశిష్టత తెలియుచున్నది. ఇదే మన బైబిలు గొప్పదనం.

విశ్వం గురించిన అద్భుత వాస్తవాలు

విశ్వం గురించిన అద్భుత వాస్తవాలు
చంద్రమండలాన్ని చేరినంతటిలోనే మానవుడు అంతరిక్షాన్ని జయించానని అనుకుంటున్నాడు. అయితే చంద్రమండలం అంతరిక్షంలో కేవలం అంతరిక్షం యొక్క అంచుమాత్రమే. అంతరిక్షం మన ఊహలను తడబాటు చేసేటంతటి విశాలమైనది.
కొన్ని నక్షత్రాలయొక్క దూరాన్ని గురించి ఆలోచిద్దాం. మనకు దగ్గర్లో ఉండి మాములు కంటితో చూడగలిగే నక్షత్రం ఆల్ఫా సెంటౌరి - 40 వేల కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉంది. నీవు వెలుతురుతో సమానమైన వేగంతో ప్రయాణించగలిగినట్లయితే చంద్రున్ని చేరటానికి 1-1/2 సెకన్లు మరియు సూర్యున్ని చేరటానికి 8-1/2 నిమిషాలు పడుతుంది. అదే వేగంతో 4-1/2 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఆల్ఫా సెంటౌరి చేరగలవు.  మరెన్నో గెలాక్సీ అనబడే నక్షత్ర వీధి లేక నక్షత్ర సముదాయాలు టెలిస్కోపు సహయంతో కనబడ్తున్నాయి. అవయితే 650 కోట్ల వెలుగు సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నక్షత్రాల పరిమాణం గూర్చి చూద్దాము. ఓరియన్ బెల్టులో ఉండే బేతెల్ గీసు అనే నక్షత్రం యొక్క వ్యాసం 50 కోట్ల కిలోమీటర్లు. ఈ నక్షత్రం కనుక గుల్లగా ఉన్నట్లయితే అందులో భూమి సూర్యుని చుట్టూ తన మామూలు కక్ష్యలో పరిభ్రమించవచ్చు. ఎందుచేతనంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే కక్ష వ్యాసం కేవలం 30 కోట్ల కి.మీ.లు మాత్రమే.
ఇప్పుడు నక్షత్రాల సంఖ్యను గురించి ఆలోచిద్దాము. మన సూర్యకుటుంబం ఈ పాలపుంత అనబడే గెలాక్సీ లేక నక్షత్ర వీధిలో భాగం. అందులో సూర్యుడు ఒక్కటి మాత్రమే. మరియు పాలపుంత అనేది అనేక నక్షత్ర వీధులలో ఒక్కటి మత్రమే మనము టెలిస్కోపులో చూడగలిగినంతటిలో కనీసం పదికోట్ల నక్షత్ర సముదాయాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఇంకా ఎన్నో వున్నాయి. ఈ గ్రహలు తమ తమ కక్ష్యలలో ఎంత ఖచ్చితంగా తిరిగుతున్నాయో అనేది కూడా ఆలోచిద్దాము. మనుష్యుని చేత ఎంతో చక్కగా తయారుచేయబడ్డ గడియారము కూడ ఆకాశమందలి నక్షత్రాలంత ఖచ్చితమయినది కాదు. ప్రతి నక్షత్రాన్ని, గ్రహన్ని సృష్టించి, వాటికి ప్రణాళిక ఏర్పాటు చేసిన ఏదో ఒక అత్యున్నతమైన జ్ఞానము, తప్పనిసరిగా ఈ విశ్వానికంతటికి వెనుక ఉండి ఉండాలి.
ఎంత విశాలమైనది విశ్వం! ఎంత చిన్నవాడు మానవుడు!! బైబిలును వ్రాసిన వారిలో ఒకరు ఈ విధంగా వ్రాసారు. నేను రాత్రివేళ ఆకాశాన్ని, నక్షత్రాలను చూసినప్పుడు ఓ దేవా! నీవు ఈ అల్పుడైన మానవుని యెడల ఆసక్తి ఎందుకు చూపుతున్నావో అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. అయినప్పటికి ఈ విశ్వమంతటికి సృష్టికర్తయైన దేవుడు మన గురించి జాగ్రత్త తీసికొంటున్నాడు. ఈ అద్భుతమైన సత్యాన్ని బైబిలులో మనం నేర్చుకుంటాము.
ఏదైన ఒక వస్తువు యొక్క విలువ దాని పరిమాణం బట్టి నిర్ణయమవదు. ఒక లక్షాదికారికి ఎకరాల కొద్దీ భూమి ఉండవచ్చు. కాని వాని యొక్క చిన్న బిడ్డ తనకుండిన ఎంతో భూమికంటె అతనికి విలువయినవాడు. దేవుని విషయంలోనూ అంతే. అంతరిక్షం ఎంతో గొప్పది కావచ్చు. నక్షత్రాలు వాటి పరిమాణంలో మరెంతో పెద్దవి కావచ్చు. కాని దేవుడు మానవుని ఆయన యొక్క మిగిలిన సృష్టికంటె ఎక్కువగా ప్రేమించి కాపాడుతున్నాడు. మానవుడు దేవునికి కుమారునిగా ఉండుటకు, దేవునితో సహవాసం కొరకు సృష్టించబడ్డాడు. దేవునితో అటువంటి సహవాసం కలిగి యుండటం మన ఉనికికి ఒక అర్థాన్ని, ఒక ఉద్దేశ్యాన్ని ఇస్తుంది. మనం సృష్టిలో దేవుని యొక్క గొప్పతనాన్ని చూడగలం. కాని దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని, మరియు మన గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడని బైబిలు బయలు పరుస్తుంది.

పది ఆజ్ఞలు ఎవరు మనకు ఇచ్చారు? అవి ఎక్కడ నుండి వచ్చాయి


మనందరికి మోషే తెలుసు కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలీయులనుదేవుడు ఐగుప్తు నుండి తాను చూపించే దేశమునకు నడిపిస్తారు. ఐగుప్తులో వారు బానిసలుగా ఉండేవారు. వారిని విడిపించి వారిని తీసుకొని వెళ్ళడానికి దేవుడు reference మోషేని ఏర్పరచుకున్నారు. ఎన్నో సంవత్సరములు ఇశ్రాయేలీయులందరూ, చిన్నపిల్లలు మరియు పెద్దవారు, వారి జంతువులు కలిసి ఆ క్రొత్త ప్రదేశానికి ప్రయాణమవుతుంటారు. ఎంతో దూరం వారు ప్రయాణం చేస్తున్నప్పుడు. దేవుని బిడ్డలుగా వారు నడుచుకోవాలని వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు.   ఆ ఆజ్ఞల ప్రకారమే వారు నడుచుకోవాలని దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞలను ఇచ్చుటకు దేవుడుreference మోషేని సినాయి కొండపైకి పిలిచి అక్కడ 40 దినములు గడిపి తనకు 10 ఆజ్ఞలను బయలుపరచారు. మీ అందరికీ ఆ 10 ఆజ్ఞలు తెలుసు కదా..





  • నీ దేవుడనైన యెహోవాను నేనే

    1. "నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు"
      మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై అన్నిటికంటే దేవుని మీదే ప్రేమను నమ్మకాన్ని కలిగి ఉండాలి.
    2. "నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింప కూడదు."
      మనం దేవుని పట్ల భయభక్తులు గలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. ఆయన పేరును శపించడానిగ్గాని, ఒట్టుపెట్టుకోడానిగ్గాని, అబద్దాలు చెప్పటానిగ్గాని, మోసగించడానిగ్గాని, మంత్ర తంత్రాలు చెయ్యడానిగ్గాని ఉపయోగించ కూడదు. అయితే అన్ని కస్ట సమయాల్లో ఆయన్ని పేరు పెట్టి పిలిచి, ప్రార్థించి, స్తుతించి, వందనాలు చెల్లించాలి.
    3. "విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము."
      మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని బోధను కాదన కూడదు, నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఆ వాక్యాన్ని పవిత్రమైందిగా ఎంచి, సంతోషంతో విని, మనసారా నేర్చుకోవాలి.
    4. "నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కల్గునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము"
      మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన తల్లిదండ్రులగ్గాని, అధికారంలో ఉన్న ఇతరులగ్గాని కోపం తెప్పించ కూడదు, వాళ్ళని అవమానించ కూడదు. అయితే వాళ్ళను గౌరవించి, ఉపచారం చేసి, వాళ్ళకి విధేయులంగా ఉండి తగిన ప్రేమను, ఘనతను వాళ్ళపట్ల చూపించాలి.
    5. "నరహత్య చేయకూడదు"
      మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగు వాడికి హాని కలిగించే ఏ పనీ చెయ్యకూడదు. అయితే ప్రతీ అవసరంలో అతనికి సాయపడుతూ మంచి స్నేహితులంగా ఉండాలి.
    6. "వ్యభిచరింపకూడదు
      మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై, ఆయన్ని ప్రేమించాలి. మనం మాటల్లో చేతల్లో పవిత్రంగా ఉండి గౌరవంగా బ్రతకాలి. భార్యా భర్త లిద్దరూ ఒకళ్ళ నొకళ్ళు ప్రేమించుకుంటూ ఘనపర్చు కోవాలి.
    7. దొంగిలింపకూడదు
      మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగు వాళ్ళ ఇళ్ళను గాని, ఆస్తిని గాని, ధనాన్ని గాని మనం తీసికో కూడదు, అన్యాయం చేసో, మోసం చేసొ దాన్ని స్వంతం చేసుకోడానికి పూనుకో కూడదు. అయితే వాళ్ళు తమ ఆస్తిని, జీవనోపాధిని అభివ్రుద్ధి చేసుకొంటూ కాపాడుకోటానికి వాళ్ళకు సాయపడాలి.
    8. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము చెప్ప్పకూడదు
      మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగువాడి మీద అబద్దాలు చెప్పకూడదు. అతని మీద చెడ్డమాటలు చెప్ప కూడదు. అయితే అతని పక్షంగా మాట్లాడి, అతని గురించి మంచి మాటలు చెప్పి అతని ప్రవర్తన, మాటల పట్ల ప్రేమ భావాన్ని కలిగుండాలి.
    9. నీ పొరుగువాని ఇల్లు ఆశింప కూడదు
      మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగువాని ఆస్తినిగాని, ఇంటినిగాని సొంతం చేసుకోటానికి కుట్ర పన్న కూడదు. దొంగ పత్రాలు పుట్టించ కూడదు. అయితే ఆ ఆస్తి అతనికే ఉండేలా మనం చెయ్య గలిగినంత సాయం చెయ్యాలి.
    10. నీ పొరుగువాని భార్యనైనను, దాసుడనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు.
      మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మనం మన పొరుగువాని భార్యను గాని, పనివాళ్ళను గాని, పశువులను గాని బలాత్కారం చేసో, మోసం చేసో, లాలించో సొంతం చేసుకో కూడదు. అయితే అతని భార్య, పనివాళ్ళు, పశువులు అతనితోనే ఉండేలా చెయ్యదగినంత సాయం చెయాలి.

    యేసు బోధనలు


    • నీతికోసం హింసను అనుభవించినవారిదే దేవుని రాజ్యం. కనుక వారు ధన్యులు.
    • నరహత్య చేయరాదు. ఒకరిని మానసికంగా బాధపెట్టడంకూడా నరహత్యే.
    • పరుల సొమ్ము ఆశించరాదు.
    • వ్యభిచరింపరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే
    • మిమ్మల్ని హింసించినవారి కోసం దేవుణ్ణి ప్రార్ధించండి.
    • మీరు దానం చేసినప్పుడు నలుగురికీ తెలిసేలా చేయకండి
    • మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి; అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.
    • ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే , తన కోరికలను కాదనుకొని శిలువనెత్తుకొని వెంబడించాలి.
    • మొదట నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేస్తే, నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభం
    • వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది.
    • విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది. మార్కు 11: 23
    • ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటిని పొందియున్నామని నమ్మండి. అప్పుడు మీకు అని కలుగును. మార్కు 11: 24
    • నేను నీతిమంతులకోసం రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చాను.
    • నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.
    • చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు
    • దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్ధించండి.
    • నేనే మార్గమును, సత్యమును, జీవమును
    • మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. లూకా 16:15


    Nitikosam violence anubhavincinavaride the kingdom of God. So they are happy.
    Should not be homicide. Narahatye badhapettadankuda someone emotionally.
    Are asincaradu money.

    Vyabhicarimparadu. Vyabhicarincinatle salacious look of a foreign woman
    Pray to God for hinsincinavari.
    Four, do not know when you donate
    At first his kingdom and his righteousness, Look; They are then available to you.
    Vembadincalanukunte me to anyone, eschewed siluvanettukoni follow her wishes.
    First, remove particulate in thine eye, thy brother's eye, easy to remove the particulate
    Hearing by faith, healed by faith.
    Moving confidence even if the hill. Visvasincagaligite visvasamunnavaniki you anything is possible. Mark 11: 23
    When you pray, trust adugucunnavatini pondiyunnamani. Then you will be. Mark 11: 24
    I did not nitimantulakosam, came to rescue sinners.
    Receives me receives him who sent me.
    Blessed are believed to look and see namminavarikante
    Miradiginavi trust and pray that God gives.
    I am the way and the truth and the life
    Encabadunadi among men is abomination in the sight of God. Luke 16:15

    రేపు రాత్రి చనిపోవాల్సి వస్తే..............? గొప్ప సువార్తికుడు మరియు మెథడిస్టూ సంఘ వ్యవస్తాపకుడైన జాన్ వెస్లీ గారిని ఒకరోజు ఓ స్త్రీ ఇలా ప్రశ్నించింది.


    గొప్ప సువార్తికుడు మరియు మెథడిస్టూ సంఘ వ్యవస్తాపకుడైన జాన్ వెస్లీ గారిని ఒకరోజు ఓ స్త్రీ ఇలా ప్రశ్నించింది. అయ్యా! రేపు రాత్రి 12 గంటలకు మీరు చనిపోతున్నారు అని మీకు తెలిస్తే...! మిగిలిన సమయాన్ని ఎలా గడుపుతారు? అందుకు జాన్ వెస్లీ చాల తీరిగ్గా... ఈరోజు నేను యేఎ పనులు చేయాలనీ ముందుగా నిర్ణయించుకున్నానో అనగా, " ఈరోజు సాయంత్రం గ్లొసెస్తర్ అనే ప్రాంతం లో సువార్త ప్రకటిస్తాను. ఆ తర్వాత రేపు ఉదయం 5 గంటలకు వాక్య పరిచర్య చేస్తాను. రేపు మద్యాహ్నం ట్యూకిస్బరి లో ప్రసంగిస్తాను. రేపు సాయంత్రం మా కమిటి మీటింగ్ వుంది అది చూసుకుంటాను. ఆ తర్వాత రెవ. మార్టిన్ ఇంటిని దర్శించి వారితో కలిసి మాట్లాడుకొని, ప్రార్ధించి 10 గంటలకు నా గది చేరి నన్ను నా దేవుని హస్తాలకు అప్పగించుకొని మంచంమీద విస్రమిస్తను. మీరు అన్నట్టుగా అర్ధరాత్రి 12 గంటలకు చనిపోతే మహిమ లోకంలో కళ్ళు కళ్ళు తెరుస్తాను." అని గొప్ప నిస్చయతతో జవాబిచ్చెనట, సిద్దపాటు కలిగిన ఆ గొప్ప సువార్తికుడు. జాన్ వెస్లీ భక్తుడు ఎంత గొప్ప సిద్దపాటు కలిగి ఉన్నాడో చూసాము కదా! బైబిల్ సెలవిస్తుంది " నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. (కీర్తన 103)", " సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. (ఎషయ 40)". అవును ఏదో ఒక రోజు పువ్వువలె మనము వాదిపోవాల్సిందే, రాలిపోవాల్సిందే కానీ, రాలిపోయిన తర్వాత అనగా మనము కన్ను మూసినా తర్వాత పరలోకంలో కళ్ళు తెరుస్తావో లేక నిత్య నరకంలో కళ్ళు తెరుస్తావో అది నీ సిద్దపాటుపై ఆధారిపడి వుంటుంది.

    సూటిగా ఒక ప్రశ్న మనలను మనం వేసుకుందామ? ఈ రాత్రి నేను కన్ను మూయవాల్సి వస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తానా? ఆ విశ్వాసం, ఆ నిశ్చయత, ఆ నీరిక్షణ నీవు కలిగి యున్నావా? లేక నువ్వు చేసిన పాపములను బట్టి , నీ నటనా జీవితన్నిబట్టి, నీ రహస్య పాప బ్రతుకునుబట్టి, నీలో ఇంకా దాగివున్న, మిగిలివున్న, వదిలిపెత్తలేకున్న పాపిష్టి చేష్టలను బట్టి నరకములో కళ్ళు తెరుస్తావా? ఒక్క సరి ఆలోచించు, నీ పాపమును విడచి వాకయ్నుసారముగా జీవించే వాడిగా నిన్ను నీవు కనపరుచుకొని పరలోకంలో సుస్తిరమైన స్థానం సంపాదించు.

    "రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. యాకోబు 4:14" నిథ్యజీవమా? లేక నిత్య నరకమా? తేల్చుకో. ఇదిగో జీవం మరణం నీ ఎదుట ఉంచబడినవి. ఎంపిక నీ చేతుల్లో వుంది మిత్రమా. " ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు. ప్రకటన 14:13"


    MKRdezign

    {facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

    Contact Form

    Name

    Email *

    Message *

    Powered by Blogger.
    Javascript DisablePlease Enable Javascript To See All Widget