Halloween Costume ideas 2015

Amazing facts about the universe

విశ్వం గురించిన అద్భుత వాస్తవాలు

విశ్వం గురించిన అద్భుత వాస్తవాలు
చంద్రమండలాన్ని చేరినంతటిలోనే మానవుడు అంతరిక్షాన్ని జయించానని అనుకుంటున్నాడు. అయితే చంద్రమండలం అంతరిక్షంలో కేవలం అంతరిక్షం యొక్క అంచుమాత్రమే. అంతరిక్షం మన ఊహలను తడబాటు చేసేటంతటి విశాలమైనది.
కొన్ని నక్షత్రాలయొక్క దూరాన్ని గురించి ఆలోచిద్దాం. మనకు దగ్గర్లో ఉండి మాములు కంటితో చూడగలిగే నక్షత్రం ఆల్ఫా సెంటౌరి - 40 వేల కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉంది. నీవు వెలుతురుతో సమానమైన వేగంతో ప్రయాణించగలిగినట్లయితే చంద్రున్ని చేరటానికి 1-1/2 సెకన్లు మరియు సూర్యున్ని చేరటానికి 8-1/2 నిమిషాలు పడుతుంది. అదే వేగంతో 4-1/2 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఆల్ఫా సెంటౌరి చేరగలవు.  మరెన్నో గెలాక్సీ అనబడే నక్షత్ర వీధి లేక నక్షత్ర సముదాయాలు టెలిస్కోపు సహయంతో కనబడ్తున్నాయి. అవయితే 650 కోట్ల వెలుగు సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నక్షత్రాల పరిమాణం గూర్చి చూద్దాము. ఓరియన్ బెల్టులో ఉండే బేతెల్ గీసు అనే నక్షత్రం యొక్క వ్యాసం 50 కోట్ల కిలోమీటర్లు. ఈ నక్షత్రం కనుక గుల్లగా ఉన్నట్లయితే అందులో భూమి సూర్యుని చుట్టూ తన మామూలు కక్ష్యలో పరిభ్రమించవచ్చు. ఎందుచేతనంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే కక్ష వ్యాసం కేవలం 30 కోట్ల కి.మీ.లు మాత్రమే.
ఇప్పుడు నక్షత్రాల సంఖ్యను గురించి ఆలోచిద్దాము. మన సూర్యకుటుంబం ఈ పాలపుంత అనబడే గెలాక్సీ లేక నక్షత్ర వీధిలో భాగం. అందులో సూర్యుడు ఒక్కటి మాత్రమే. మరియు పాలపుంత అనేది అనేక నక్షత్ర వీధులలో ఒక్కటి మత్రమే మనము టెలిస్కోపులో చూడగలిగినంతటిలో కనీసం పదికోట్ల నక్షత్ర సముదాయాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఇంకా ఎన్నో వున్నాయి. ఈ గ్రహలు తమ తమ కక్ష్యలలో ఎంత ఖచ్చితంగా తిరిగుతున్నాయో అనేది కూడా ఆలోచిద్దాము. మనుష్యుని చేత ఎంతో చక్కగా తయారుచేయబడ్డ గడియారము కూడ ఆకాశమందలి నక్షత్రాలంత ఖచ్చితమయినది కాదు. ప్రతి నక్షత్రాన్ని, గ్రహన్ని సృష్టించి, వాటికి ప్రణాళిక ఏర్పాటు చేసిన ఏదో ఒక అత్యున్నతమైన జ్ఞానము, తప్పనిసరిగా ఈ విశ్వానికంతటికి వెనుక ఉండి ఉండాలి.
ఎంత విశాలమైనది విశ్వం! ఎంత చిన్నవాడు మానవుడు!! బైబిలును వ్రాసిన వారిలో ఒకరు ఈ విధంగా వ్రాసారు. నేను రాత్రివేళ ఆకాశాన్ని, నక్షత్రాలను చూసినప్పుడు ఓ దేవా! నీవు ఈ అల్పుడైన మానవుని యెడల ఆసక్తి ఎందుకు చూపుతున్నావో అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. అయినప్పటికి ఈ విశ్వమంతటికి సృష్టికర్తయైన దేవుడు మన గురించి జాగ్రత్త తీసికొంటున్నాడు. ఈ అద్భుతమైన సత్యాన్ని బైబిలులో మనం నేర్చుకుంటాము.
ఏదైన ఒక వస్తువు యొక్క విలువ దాని పరిమాణం బట్టి నిర్ణయమవదు. ఒక లక్షాదికారికి ఎకరాల కొద్దీ భూమి ఉండవచ్చు. కాని వాని యొక్క చిన్న బిడ్డ తనకుండిన ఎంతో భూమికంటె అతనికి విలువయినవాడు. దేవుని విషయంలోనూ అంతే. అంతరిక్షం ఎంతో గొప్పది కావచ్చు. నక్షత్రాలు వాటి పరిమాణంలో మరెంతో పెద్దవి కావచ్చు. కాని దేవుడు మానవుని ఆయన యొక్క మిగిలిన సృష్టికంటె ఎక్కువగా ప్రేమించి కాపాడుతున్నాడు. మానవుడు దేవునికి కుమారునిగా ఉండుటకు, దేవునితో సహవాసం కొరకు సృష్టించబడ్డాడు. దేవునితో అటువంటి సహవాసం కలిగి యుండటం మన ఉనికికి ఒక అర్థాన్ని, ఒక ఉద్దేశ్యాన్ని ఇస్తుంది. మనం సృష్టిలో దేవుని యొక్క గొప్పతనాన్ని చూడగలం. కాని దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని, మరియు మన గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడని బైబిలు బయలు పరుస్తుంది.

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget