Halloween Costume ideas 2015

process of creation?

సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడెనా?

సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడెనా? బైబిలు ప్రకారము నాలుగో రోజు సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల ప్రస్థావన కనిపించుచున్నది. సృష్టి క్రమము తొలిరోజు భూమి ఏర్పడినట్లు (ఆదికాండము 1:-5) లేఖనము చెబుతున్నది. దీనిని బట్టి భూమి ఏర్పడిన తరువాత సూర్యుడు ఆవిర్భావం కనిపిస్తుంది. సైన్స్ ప్రకారము సూర్యుడు ఏర్పడిన తరువాత భూమి ఏర్పడింది. అనగా, బైబిలులోని సృష్టి క్రమము సైన్స్ వివరణకు పూర్తి విరుద్ధమనే అభిప్రాయం కలుగుతున్నది. ఇది ఎంతవరకు వాస్తవమో చూద్ధాం.
"దేవుడు-పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, ఆవి సూచనలను, 
కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని, రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను." ఆదికాండము 1:14-19
పై వాక్యము సృష్టి క్రమము నాలుగో రోజును వివరించుచున్నది. అదే రోజు సూర్యుడు, చంద్రుడు ఏర్పడియున్నారా? లేక అంతకు ముందుగానే ఏర్పడియున్నారా అనే విషయమును ముందుగా నిర్ధారించుకున్నాము. ఆ తరువాత నాలుగో రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము. పై వాక్యములోని "ఆ రెండు గొప్ప జ్యోతులు", "పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి", జ్యోతులు అనే వాక్యములు ద్వారా నాలుగో రోజు సృష్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల గురించిన ప్రస్థావన కనిపించుచున్నది. "ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును" అనే వాక్యములోని 'కలుగును' అనే పదమును నిశితముగా పరిశీలించినట్లయితే సూర్యుడు, చంద్రుడి సృష్టి గురించి గ్రహించవచ్చును. ఆ వాక్యములోని 'కలుగును' అనే పదము 'కనిపించును' అనే అర్థము కోసం వాడబడినది. ఇంగ్లీషు బైబిలునందు ఈ వాక్యమును పరిశీలించినట్లయితే "Let great lights APPEAR in the sky" అని ఉంటుంది. ఇందులో appear అను పదము 'కనిపించును', గోచరమగును', 'ప్రత్యక్షమగును' అను సమానార్థములను సూచించును. అనగా గతంలో సృజింపబడిన సూర్య చంద్రులు, నక్షత్రాలను నాలుగో రోజున ప్రత్యక్షం కావాలని దేవుడు ఆజ్ఞాపించినట్లు అర్థమును ఇచ్చును.
నాలుగో రోజు వరకు సూర్య, చంద్ర నక్షత్రములు ఎందుకు కనిపించలేదు అని లేఖనముల ద్వారా గ్రహింపలేకున్నప్పటికీ అప్పటి వరకు అవి ఏమయ్యాయి? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉన్నది. అది, సూర్యుడిని మబ్బుచేత కప్పబడును, చంద్రుడు వెన్నెల కాయకపోవును (యెహేజ్కేలు 32:7), నక్షత్రములను మరుగుచేయును (యోబు 9:7) అనునది. మరుగైన వాటిని నాలుగో రోజు ప్రత్యక్షతపరచడమెందుకు? అనే ప్రశ్నకు సమాధానము లభించును. నాలుగో రోజు సృష్టిలోని ప్రధాన అంశాలను ఒక్కసారి ప్రత్యేకించి చూస్తే... 1.పగటిని రాత్రిని వేరుపరచునట్లు, 2. సూచనలను, కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, 3. భూమి మీద వెలుగిచ్చుటకు, 4. పగటిని రాత్రిని ఏలుటకు అనే నాలుగు అంశాలు ప్రధానముగా కనిపించును. అవన్నీ ఒకే విషయమును స్పష్టము చేయుచున్నవి. అదేమనగా ఖగోళ వస్తువులకు దేవుడు విధించుచున్న కట్టడ. అది ఎలాగంటే?..
1. వెలుగు చీకటి వేరుపరచు: ఇది సూర్యడు, చంద్రుడు, నక్షత్రములకు అందించు కట్టడ
2. సూచనలను, కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు: ఇది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకు అందించు కట్టడ
3. భూమి మీద వెలుగిచ్చు: ఇది సూర్యుడు, చంద్రుడికి అందించు కట్టడ
4. పగటిని రాత్రిని ఏలు: ఇది సూర్యుడు, చంద్రుడికి, నక్షత్రములకు అందించు కట్టడ
పై వివరణ ద్వారా సృష్టి క్రమము తొలి రోజు నాటి ఖగోళ వస్తువులను నాలుగో రోజు నాటికి ప్రత్యక్షపరచి వాటికి కట్టడలను విధించినట్లు గ్రహించగలము. అందుకే యోబు గ్రంథకర్త "వాటి వాటి కాలములో నక్షత్ర రాసులు వచ్చునట్లు చేయగలవా?" (యోబు 38:32), "ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?" (యోబు 38:33) అని పశ్నించియున్నాడు. ఆ పనిని దేవుడు చేసినట్లు చెప్పడం గ్రంథకర్త ఉద్దేశ్యము.
సైన్స్ ప్రకారము:
నాలుగో రోజుకు ముందుగానే సూర్యుడు ఉన్నాడని సైన్స్ పరంగా నిరూపించడానికి బైబిలులో లేఖన సాక్ష్యాలు బలంగానే చెప్పబడ్డాయి. సృష్టి క్రమములో మూడవ రోజు గడ్డి, మొక్కలు, వృక్షములు మొలవడం (ఆదికాండము 1:11) గురించి. సూర్యుడికి మరియు మొక్కలకు సంబంధం ఏమిటనే విషయము చాలా మందికి తెలిసే ఉంటుంది. మొక్కలు బ్రతకాలంటే కేవలం నీరు మాత్రమే కాదు, వాతావరణంలోని కార్బన్ డై యాక్సైడ్ (మనము ఆక్సిజన్ పీల్చినట్లు) అలాగే సూర్యరశ్మి కూడా కావాలి. సూర్య కిరణాలను గ్రహించి తమకు కావలసిన ఆహారము (గ్లూకోస్)ను తయారు చేసుకుంటాయి. దీనినే వృక్షశాస్త్ర పరిభాషలో కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. సూర్యరశ్మి లేకపోతే మొక్కలు బ్రతకలేవు. కాబట్టి అప్పటికే భూమి మీద వెలుగు, చీకటి మరియు పగలు, వెలుగు ఉన్నాయనే విషయాన్ని చెప్పడంతో పాటు మొక్కలు ద్వారా ఆ విషయాన్ని స్పష్టము చేయబడుతుంది.

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget