పది ఆజ్ఞలు ఎవరు మనకు ఇచ్చారు? అవి ఎక్కడ నుండి వచ్చాయి
మనందరికి మోషే తెలుసు కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలీయులనుదేవుడు ఐగుప్తు నుండి తాను చూపించే దేశమునకు నడిపిస్తారు. ఐగుప్తులో వారు బానిసలుగా ఉండేవారు. వారిని విడిపించి వారిని తీసుకొని వెళ్ళడానికి దేవుడు reference మోషేని ఏర్పరచుకున్నారు. ఎన్నో సంవత్సరములు ఇశ్రాయేలీయులందరూ, చిన్నపిల్లలు మరియు పెద్దవారు, వారి జంతువులు కలిసి ఆ క్రొత్త ప్రదేశానికి ప్రయాణమవుతుంటారు. ఎంతో దూరం వారు ప్రయాణం చేస్తున్నప్పుడు. దేవుని బిడ్డలుగా వారు నడుచుకోవాలని వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు. ఆ ఆజ్ఞల ప్రకారమే వారు నడుచుకోవాలని దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞలను ఇచ్చుటకు దేవుడుreference మోషేని సినాయి కొండపైకి పిలిచి అక్కడ 40 దినములు గడిపి తనకు 10 ఆజ్ఞలను బయలుపరచారు. మీ అందరికీ ఆ 10 ఆజ్ఞలు తెలుసు కదా..
- "నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు"
- మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై అన్నిటికంటే దేవుని మీదే ప్రేమను నమ్మకాన్ని కలిగి ఉండాలి.
- "నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింప కూడదు."
- మనం దేవుని పట్ల భయభక్తులు గలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. ఆయన పేరును శపించడానిగ్గాని, ఒట్టుపెట్టుకోడానిగ్గాని, అబద్దాలు చెప్పటానిగ్గాని, మోసగించడానిగ్గాని, మంత్ర తంత్రాలు చెయ్యడానిగ్గాని ఉపయోగించ కూడదు. అయితే అన్ని కస్ట సమయాల్లో ఆయన్ని పేరు పెట్టి పిలిచి, ప్రార్థించి, స్తుతించి, వందనాలు చెల్లించాలి.
- "విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము."
- మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని బోధను కాదన కూడదు, నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఆ వాక్యాన్ని పవిత్రమైందిగా ఎంచి, సంతోషంతో విని, మనసారా నేర్చుకోవాలి.
- "నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కల్గునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము"
- మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన తల్లిదండ్రులగ్గాని, అధికారంలో ఉన్న ఇతరులగ్గాని కోపం తెప్పించ కూడదు, వాళ్ళని అవమానించ కూడదు. అయితే వాళ్ళను గౌరవించి, ఉపచారం చేసి, వాళ్ళకి విధేయులంగా ఉండి తగిన ప్రేమను, ఘనతను వాళ్ళపట్ల చూపించాలి.
- "నరహత్య చేయకూడదు"
- మనం దేవుని పట్ల భయభక్తులు కలవాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగు వాడికి హాని కలిగించే ఏ పనీ చెయ్యకూడదు. అయితే ప్రతీ అవసరంలో అతనికి సాయపడుతూ మంచి స్నేహితులంగా ఉండాలి.
- "వ్యభిచరింపకూడదు
- మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై, ఆయన్ని ప్రేమించాలి. మనం మాటల్లో చేతల్లో పవిత్రంగా ఉండి గౌరవంగా బ్రతకాలి. భార్యా భర్త లిద్దరూ ఒకళ్ళ నొకళ్ళు ప్రేమించుకుంటూ ఘనపర్చు కోవాలి.
- దొంగిలింపకూడదు
- మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగు వాళ్ళ ఇళ్ళను గాని, ఆస్తిని గాని, ధనాన్ని గాని మనం తీసికో కూడదు, అన్యాయం చేసో, మోసం చేసొ దాన్ని స్వంతం చేసుకోడానికి పూనుకో కూడదు. అయితే వాళ్ళు తమ ఆస్తిని, జీవనోపాధిని అభివ్రుద్ధి చేసుకొంటూ కాపాడుకోటానికి వాళ్ళకు సాయపడాలి.
- నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము చెప్ప్పకూడదు
- మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగువాడి మీద అబద్దాలు చెప్పకూడదు. అతని మీద చెడ్డమాటలు చెప్ప కూడదు. అయితే అతని పక్షంగా మాట్లాడి, అతని గురించి మంచి మాటలు చెప్పి అతని ప్రవర్తన, మాటల పట్ల ప్రేమ భావాన్ని కలిగుండాలి.
- నీ పొరుగువాని ఇల్లు ఆశింప కూడదు
- మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మన పొరుగువాని ఆస్తినిగాని, ఇంటినిగాని సొంతం చేసుకోటానికి కుట్ర పన్న కూడదు. దొంగ పత్రాలు పుట్టించ కూడదు. అయితే ఆ ఆస్తి అతనికే ఉండేలా మనం చెయ్య గలిగినంత సాయం చెయ్యాలి.
- నీ పొరుగువాని భార్యనైనను, దాసుడనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు.
- మనం దేవుని పట్ల భయభక్తులు గల వాళ్ళమై ఆయన్ని ప్రేమించాలి. మనం మన పొరుగువాని భార్యను గాని, పనివాళ్ళను గాని, పశువులను గాని బలాత్కారం చేసో, మోసం చేసో, లాలించో సొంతం చేసుకో కూడదు. అయితే అతని భార్య, పనివాళ్ళు, పశువులు అతనితోనే ఉండేలా చెయ్యదగినంత సాయం చెయాలి.
Post a Comment