Halloween Costume ideas 2015

Visvavirbhavamu Gurinchi Bible vivarincucunnada?

ఈ విశ్వావిర్భవము గురించి బైబిలు వివరించుచున్నదా?
మనం ఉన్న భూమి మొదలుకొని ఆకాశములో కంటికి కనిపించే వేలాది నక్షత్రాలు, కంటికి కనిపించనంత సుదూరంలోని లక్షల కోట్ల నక్షత్రాలు, గ్రహాల సమూహముతో కూడిన ఆకాశ మండలము (శూన్య ప్రదేశము) ను విశ్వంగా పిలుస్తున్నారు. అలాంటి ఈ విశ్వం ఎలా ఏర్పడిందో లేఖనముల ద్వారా తెలుసుకొనుటకు ముందు శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దాం!.

విశ్వం పుట్టుక గురించి శాస్త్రవేత్తల సిద్ధాంతం?

ఈ విశ్వం ఎలా పుట్టిందనే విషయమై విభిన్న వాదనలు ఉన్నప్పటికీ బహుళ ప్రాచూర్యం పొందిన సిద్ధాంతం 'బిగ్ బాంగ్' (మహా విస్పోటనం). ఈ సిద్దాంతం ప్రకారం మొదట్లో నక్షత్రాలు, గ్రహాలు తదితర విశ్వ పదార్థమంతా ఒకే ముద్దగా ఉండేది. ఆ పదార్థమంతా బాగా కుంచించుకొని ఉండటం వల్ల అందులో అత్యధిక ఉష్ణం పుట్టి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో విశ్వ పదార్థం విచ్ఛిన్నమై అత్యధిక ఉష్ణంతో వెదజల్లబడింది. కాల క్రమంలో చల్లబడుతూ గురుత్వాకర్షణ శక్తి వల్ల విచ్ఛిన్నమైన పదార్థం సమీకృతమై గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు (GALAXY)గా ఏర్పడ్డాయి. మహా విస్పోటనం సమయంలో వెదజల్లబడిన వేగంతోనే ప్రస్తుతం కూడా నక్షత్ర మండలాలు సుదూరంగా ప్రయాణిస్తూనే ఉన్నాయి. అందువల్ల ఈ విశ్వం కూడా వ్యాపిస్తూనే ఉంది. ప్రతీ నక్షత్ర మండలము తన కేంద్ర స్థానంలో కృష్ణ బిలం (BLACK HOLE) ను కలిగి ఉంది. నక్షత్ర మండలంలోని నక్షత్రాలన్నీ అన్నీ ఈ కృష్ణ బిలం వైపు ప్రయాణిస్తున్నాయి. అక్కడికి చేరుకోగానే అవి అక్కడి శక్తికి మండి ఆవిరైపోతాయి. ఈ వివరణ ద్వారా ఈ విశ్వం భారీ పేలుడు వల్ల ఏర్పడిందని, నేటికీ ఈ విశ్వం వ్యాపిస్తూనే ఉందని, ఎప్పటికైనా ఈ నక్షత్రాలు, గ్రహాలు అన్నీ మండి ఆవిరైపోతాయని తెలియుచున్నది. మరి, ఈ విషయం గురించి లేఖనాలు ఏమంటున్నాయో పరిశీలించెదము. 
1. మహా విస్పోటనం

మహా విస్పోటనం జరిగినప్పుడు అత్యధిక ఉష్ణంతో వెదజల్లబడి ఆ పదార్థం నుంచి భూమి ఇతర గ్రహాలు నక్షత్రాలు ఏర్పడ్డాయని తెలుసుకున్నాము. పేలుడు వల్లనే ఈ విశ్వం ఏర్పడింది కాబట్టి తొలినాళ్లలో అన్ని గ్రహాలు అత్యధిక ఉష్ణం కలిగినవే. మహా విస్పోటనం గురించి లేఖనాలను పరిశీలించాలంటే సృష్టి జరిగినప్పుడు ఏర్పడిన గ్రహాలు అన్ని ఉష్ణంతో ఉన్నాయా అనే విషయాన్ని పరిశోధించాలి. లేఖనాల్లో సృష్టి గురించి చెప్పే సమయంలో మనకు భూ గ్రహం మాత్రమే కనిపిస్తుంది కాబట్టి తొలినాళ్లలో భూమి ఉష్ణంతో ఉన్నదా? అనే విషయాన్ని తెలుసుకుంటే మహా విస్పోటనానికి ఆధారం లభించినట్లే.
"అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను" (ఆదికాండము 2:6)
ఈ వాక్యము భూమి సృజింపబడిన కాలము గురించి చెప్పబడింది (ఆదికాండము 2:4). అప్పట్లో భూమి మీద మొక్కలు లేవని, అందుకు కారణం సేద్యపరచుటకు నరుడు కూడా లేడని (ఆదికాండము 2:5) చెప్పడం ద్వారా భూమి మీద అప్పటికి ఎలాంటి సృష్టి జరుగలేదని గ్రహించగలము. భూమి మీద మొక్కల సృష్టి జరగటం కోసం వర్షం కురిపించినట్లు (ఆదికాండము 2:5-6) లేఖనము విశదీకరిస్తుంది. అయితే ఆ వర్షం భూమి నుంచి లేచిన ఆవిరి వల్ల కలిగినదిగా చెప్పబడినది. నీటి నుంచి ఆవిరి రావడం సర్వసాధారణం. అయితే ఇక్కడ మాత్రం భూమి మీద నుంచి ఆవిరి లేచినట్లు చెప్పబడింది. అంటే అప్పటికి భూమి మీద నీరు కూడా లేదని, అందువల్లనే భూమి మీద నుంచి ఆవిరి లేచినట్లు లేఖనము చెప్పబడినట్లు గ్రహించగలము. భూమి మీద నుంచి ఆవిరి లేవాలంటే ఆ భూమి అత్యధిక ఉష్ణం నుంచి క్రమక్రమంగా పూర్తిగా చల్లబడితేనే అది సాధ్యం. ఉష్ణం చల్లబడే క్రమంలో అది విడుదల చేసే వాయువుల మధ్య రసాయనిక చర్య జరిగి నీటి మూలకాలు ఏర్పడతాయి. అంటే, భూమి సృజింపబడినప్పుడు అత్యధిక ఉష్ణంతో ఉందనే విషయం ఆదికాండము 2:6లో నిగూఢమైయున్నది.
2. విశ్వ వ్యాప్తి

"ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు" యోబు 9:8
ఈ ఆకాశమండలము (ఇది విశ్వం లేదా విశ్వంలోని ఒక భాగమైన పాలపుంతను సూచించవచ్చును) విస్తరించుచున్నది అనే విషయమును పై వచనము స్పష్టం చేయుచున్నది. ఇదే విషయాన్ని యోబు 37:18, యెషయా 42:5, 45:12, 48:13, 51:13, యిర్మియా 10:12, జెకర్యా 12:1 లేఖనములు సైతము నిర్ధారించుచున్నవి.


3. ఆకాశం అంతర్ధానం

"ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును" యెషయా 51:6
అంతరిక్షము (ఇది విశ్వం లేదా విశ్వంలోని ఒక భాగమైన పాలపుంతను సూచించవచ్చును) పొగవలె అంతర్ధానము అగుతుందనే విషయాన్ని పై వచనము స్పష్టం చేయుచున్నది. ఇదే విషయాన్ని "ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు" (మార్కు 13:31) అంటూ నిర్ధారించుచుండగా "ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములును కాలిపోవును" (2పేతురు 3:10)అనే వచనము పరిపూర్ణ వివరణ ఇస్తున్నది.
విశ్వ సృష్టి గొప్పతనాన్ని బైబిలు వివరిస్తున్నదా?



ఈ అనంత విశ్వం సృష్టింపబడటంలోని గొప్పతనం తెలుసుకోవాలంటే, ముందుగా ఈ విశ్వం ఎంత పెద్దదో మనం తెలుసుకోవాలి. సూర్యుడిని కేంద్రంగా చేసుకొని భూమి, ఇతర గ్రహాలు పరిభ్రమించుచున్నాయని, ఈ వ్యవస్థను సూర్య కుటుంబం అంటారని తెలిసిందే. అయితే ఈ సూర్య కుటుంబంతో పాటు కొన్ని వేల కోట్ల నక్షత్రాలు సుడి గుండాలు తిరిగినట్లు ఒక కేంద్రం ఆధారంగా విశ్వంలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ వ్యవస్థనే నక్షత్ర మండలం (Galaxy) అని పిలుస్తున్నారు. ఈ నక్షత్ర మండలం చూడటానికి పాలతో ఏర్పరచిన మార్గాలు ఉన్నట్లు తెల్లగా కనిపించడంతో దీనిని పాలపుంత (Milky way) అని కూడా పిలుస్తున్నారు. మన నక్షత్ర మండలంలో మాత్రమే సుమారు 10వేల కోట్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి నక్షత్ర మండలాలు ఈ విశ్వంలో కోట్ల సంఖ్యలో ఉన్నాయి. మన నక్షత్ర మండలం ఎంత పెద్దదో తెలుసుకోవాలంటే, నక్షత్ర మండలం కేంద్రానికి మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలి. నక్షత్ర మండలం కేంద్రం నుంచి 30 వేల కాంతి సంవత్సరాల దూరంలో మనం ఉన్నాం. కాంతి ఒక సెకండుకు సుమారు 3 లక్షల కిలో మీటర్లు చొప్పున ఒక సంవత్సర కాలంలో 9 లక్షల 50 వేల కోట్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ దూరాన్నే కాంతి సంవత్సరం అని అంటారు. ఇలాంటి 30 వేల కాంటి సంవత్సరాల్లో ప్రయాణించే దూరంలో మనకు మన నక్షత్ర మండలం యొక్క కేంద్రం ఉంది.
ఈ విశ్వసృష్టి ఇంత అద్బుతమైనది కనుకనే "ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది" (కీర్తనలు 19:1) అని, "నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటీవాడు? (కీర్తనలు 8:3) అని లేఖనములు చెబుతున్నవి. నక్షత్ర మండలాలు ఉన్నాయనే విషయాన్ని యోబు 9:9, 38:31-32, యెషయా 40:26 వివరిస్తుండగా మనం చూస్తున్న ఆకాశము కంటికి కనిపించని సుదూర ప్రాంతాల వరకు విశ్వం వ్యాపంచియున్నదనే విషయాన్ని 'మహాకాశము' అనే పదము ద్వారా ద్వితియోపదేశకాండము 10:14, 1 రాజులు 8:27, 2 దినవృత్తాంతములు 2:6, 6:18, నెహెమ్యా 9:6 తెలియజేయుచున్నవి.

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget