Halloween Costume ideas 2015

What is the first creation of God?


సృష్టి అంతటిని దేవుడు ఆరు రోజుల్లో పూర్తి చేసి ఏడవ రోజున విశ్రమించెనని బైబిలు చెబుతుంది. మొదటి రోజు సృష్టి క్రమములో దేవుడు వేటిని సృజించెను? అని ప్రశ్నించుకుంటే, భూమి, ఆకాశము, జలము, చీకటి, వెలుగు అనే అయిదు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి (ఆదికాండము 1: 1-5). మరి వీటిలో మొట్టమొదట దేవుడు దేనిని సృష్టించెను?. ఇందుకు చాలా మంది నుంచి వచ్చే సమాధానము 'భూమి'. "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను" (ఆదికాండము 1:1) అనే వాక్యములో మొదట 'భూమి' కనిపించడమే ఈ భావనకు కారణం. అయితే శాస్త్రవేత్తలు మాత్రం, ఈ సృష్టిలో మొట్టమొదట శూన్యం ఉండేదని, ఆ తర్వాతే పలు నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయని, ఆ గ్రహాల్లో భూమి ఒకటని చెబుతున్నారు. దీనిని బట్టి సృష్టిలో మొట్టమొదట భూమి ఏర్పడలేదు. తార్కికంగా ఆలోచిస్తే, ఖాళీ స్థలం ఉంటేనే అందులో ఏమైనా వస్తువులు ఉంచగలము. అలాగే భూమి సృజింపబడటానికి ముందు దానిని ఉంచడానికి ఖాళీ స్థలమును కూడా దేవుడు సృష్టించియుండాలి. వాస్తవానికి ఇదే విషయాన్ని బైబిలు చెబుతుంది.



"శూన్యమండలముపైని ఉత్తర దిక్కున నున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను" యోబు 26:7

పై వాక్యమును పరిశీలిస్తే భూమికన్నా ముందుగా శూన్యమండలము ఉన్నదని, దానిపైనే భూమిని ఉంచినట్లు చెప్పబడినది. యెషయా 42:5, 51:13 లేఖనములు సైతము ఇదే భావమును చెప్పుచున్నవి. అనగా భూమి కన్నా ముందుగానే శూన్యమండలము ఉందనే అర్థమును పై వాక్యము ద్వారా గ్రహించవచ్చును. ఇక్కడ పేర్కొనబడిన 'శూన్యమండలము' అనే పదమే ఆదికాండము 1:1లో చెప్పబడిన ఆకాశములు. ఈ పదము మూలభాషయైన హెబ్రీ భాషయందు shah-MAH-yim (שמים) అనే పదముగా ఉండగా దానిని ఇంగ్లీషులో 'heavens' అని, తెలుగులో 'ఆకాశములు' అని భాషాంతరము చేసియున్నారు. shah-MAH-yim (שמים) అనే పదమునకు హెబ్రీ భాషయందు ఖగోళము, విశాలమండలము మరియు శూన్యము అనే నానార్థములు కూడా ఉన్నవి. దీనిని బట్టి ఆదికాండము 1:1లోని 'ఆకాశములు' అనే పదము అనంత విశాలములోని శూనమును సూచించుచున్నదని గ్రహించగలము. అనగా దేవుడు ప్రప్రథమముగా శూన్యముతో కూడిన అనంత విశ్వమును సృజించియున్నట్లు గ్రహించగలము.

తొలి సృష్టిగా భూమి అనే భావనను బైబిలు ఎందుకు కలిగిస్తున్నది?

"ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను" ఆదికాండము 2:1
సృష్టి క్రమము సంపూర్ణము చేయబడినట్లు పేర్కొనే సందర్భములో పై వాక్యము చెప్పబడినది. అందులోని క్రమములో పరిశీలించినట్లయితే భూమికన్నా ముందుగానే ఆకాశము సృష్టించినట్లు తెలియుచున్నది. అయితే తొలి సృష్టి 'భూమి' అని అర్థమునిచ్చే విధముగా ఆదికాండము 1:1 లో "భూమ్యాకాశములు" అనే పదము ఎందుకు కనిపిస్తున్నది?. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా హెబ్రీ భాషా లేఖనములను ఇతర భాషల్లోకి అనువదించేందుకు చేపట్టిన పద్ధతుల గురించి తెలుసుకోవాలి. హెబ్రీ భాషా లేఖనాలను పదానికి పదం క్రమం తప్పకుండా అర్థాన్ని వ్రాస్తూ తర్జుమా చేయడం ఒక పద్దతి కాగా, పదాల క్రమంతో సంబంధం లేకుండా వాక్యం యొక్క భావం సరిగ్గా ఉండే విధంగా తర్జుమా చేయడం రెండవ పద్ధతి. భాషా సౌందర్యం కోసం రెండవ పద్ధతినే అత్యధికులు అవలంభించారు. తెలుగు భాషకు కూడా ఇదే తర్జుమా విధానం అవలంభించారు. అందుకే హెబ్రీ భాషలో 'ఆకాశములు మరియు భూమి' అనే అర్థముతో ఉన్న పదములు తెలుగులో 'భూమ్యాకాశములు' అని తర్జుమా చేయబడినది. ఇంగ్లీషు బైబిలు నందు మాత్రం ఈ తర్జుమా 'Heavens and the Earth' గా ఉండటం గమనించవచ్చును.

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget