Halloween Costume ideas 2015
August 2017

యేసుక్రీస్తు మూడు రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా
.

మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలయజేస్తున్నాను. నేడు క్రీస్తు గురించి ,అయన మరణ సమాధి పునరుర్ధానము గూర్చి క్రీస్తు విరోధులు వేస్తున్న నిందలు చెప్పలేనివి. యేసుక్రీస్తు బాల్యము నుండి పెరుగుతున్నప్పుడు , సువార్త ప్రకటిస్తున్నప్పుడు ,సిలువ ఎక్కినప్పుడు ,సమాధి చేయబడినప్పుడు,తిరిగి లేచి పరలోకానికి వెళ్లి సుమారు 2000 years గడిచిన అయన మీద ఇంకా నిందలు  ఉన్నాయంటే అయన వలన ఈ ప్రపంచానికి ఎలాంటి రక్షణ,ఎలాంటి పరిస్థితులు అయన రెండవ రాకడలో జరగబోతుందో ఆలోచించవచ్చు.
1) యేసుక్రీస్తు పలికిన కొన్ని మాటలను బట్టి నేడు క్రీస్తు విరోధులు(muslims) క్రీస్తు మూడు రాత్రింబగళ్ళు సమాధి లో ఉన్నాడా అను ప్రశ్నను సమాజములో పుట్టించారు.ముందుగా bibleలో ప్రశ్నలు అనేవి లేవు .కేవలము సమాధానాలే ఉంటాయి. bibleలో వ్రాయబడిన సంగతులు మనిషికి అర్థము కాక అపార్ధము చేసుకుని ప్రశ్నలుగా ఈ రోజు సమాజములో పుట్టిస్తున్నారు. మత్తయి 12:40లో యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భుగర్భములో ఉండును. యేసు పలికిన ఈ మాటను పట్టి క్రీస్తు విరోధులు ముఖ్యముగా muslim వారు క్రీస్తు మూడు రాత్రింబగళ్ళు సమాధి లో ఉన్నాడా అను ప్రశ్నను ప్రపంచానికి వేసి అమాయకులైన క్రైస్తవులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నము చేసారు,చేస్తున్నారు... 2) bibleను తప్పు పట్టాలని , క్రీస్తు మరణ సమాధి పునరుర్ధానములు అబద్దము అని చెప్పడానికి వారు పడుతున్న ప్రయాస వివరించలేనిది. bible ప్రకారముగా వాస్తవముగా యేసుక్రీస్తు విశ్రాంతి దినమున ముందటి రోజు అనగా friday మధ్యాహానము మూడు గంటలకు అయన సిలువలో చనిపోయాడని and మరలా sunday early morning లేచాడని మనకు తెలుసు. ఇప్పుడు క్రీస్తు విరోధులు ఏమి అడుగుతున్నారంటే friday దినమున ఒక పగలు ,ఒక రాత్రి వచ్చింది ,saturday ఒక పగలు ఒక రాత్రి వచ్చింది and sunday రాత్రి ఎక్కడ అయింది అనగా యేసు మాటలలో వాస్తవము లేదు and 2 రాత్రులు, 2 పగలు వస్తున్నాయే తప్ప మూడు రాత్రులు మూడు పగలు ఎక్కడ ఉన్నాయని ప్రపంచానికి ప్రశ్న వేసే సరికి అమాయక క్రైస్తవులు అవును నిజమే కదా యేసు మాటలలో తప్పు ఉంది అని అనుకుని చివరికి bible తప్పు అని declare అయ్యి islamగా మారిపోతున్నారు. bibleలో ఎన్నో తప్పులు ఉన్నాయని అమాయక క్రైస్తవుల దగ్గరకు వెళ్లి తప్పుడు ప్రచారము చేసి ఎన్నో వందల familiesను muslimsగా మారుస్తున్నారు. వాళ్ళ మత గ్రంధము అయిన quranలోనివి christians చెప్తే నమ్మరు అని మన గ్రంధమైన bibleలోని కొన్ని వచనాలను తప్పు పట్టి ఈ రోజు అమాయక క్రైస్తవులను తప్పు దోవ పట్టిస్తున్నారు. క్రీస్తు విరోధుల యొక్క ఈ ప్రశ్నకు మన christiansలో కొంత మంది ఎలాగన్నా జవాబు ఇవ్వాలని యేసుక్రీస్తు friday కాదు చనిపోయింది thursday అని బదులు ఇస్తున్నారు.

3) ఈ ప్రపంచములో తప్పు అనేది లేని ఏకైక మహా జ్ఞాన గ్రంధ రాజు bible.. bibleలో అర్థము కానీ విషయము అర్థము అవ్వాలంటే సరిగా విభజించి,విభజించినది అన్ని విధాలుగా ఆలోచించాలి ( 2 timothy2:15,కొలాసి 3:16). mark 8:31లోని మాటను చూపించి ఈ మాటలో యేసు మూడు దినములైన తర్వాత లేస్తాడని ఉంది కనుక thursday లేచాడు అని తప్పుడు జవాబు ఇస్తున్నారు. ఇలాంటి తప్పుడు జవాబులు ఇచ్చి క్రీస్తు విరోధులకు అవకాసము ఇస్తున్నారు.

4) మూడవ దినమున లేస్తాను అని అన్నాడా లేక మూడు దినములైన తర్వాత లేస్తాను అని అన్నాడా??? మత్తాయి16:21-మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా......... మూడవ దినమున లేస్తాను అని మత్తాయిలో వ్రాయబడింది. మరి mark 8:31లో యేసు మూడు దినములైన తర్వాత లేస్తాడని ఉంది.. ఈ mark 8:31, మత్తాయి16:21,మూడు రాత్రింబగళ్ళు తర్వాత లేచుట ఏది వాస్తవము???? ఇంత గంధరగోలములో ఏది వాస్తవము అంటారు??? ఆ మూడు సందర్భాలలో యేసునే మాట్లాడాడు. ఇప్పుడు మనము తెలుసుకోవలసింది ౩ రోజుల తర్వాత లేచాడా లేక మూడవ దినమున లేచాడా లేక మూడు రాత్రి మూడు పగలు ముగిసిన తర్వాత లేచాడా?

5) ఇప్పుడు వివరణలోకి వెళ్దాము.. 2 దినవృత్త 10:4 లో అతడు- మీరు మూడు దినములు తాళి(ఆగి) మరలా నా యొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్ళిపోయిరి. ఇక్కడ మూడు దినములు అయిన తర్వాత రండని చెప్పచున్న సందర్భము.. 2 దినవృత్త 10:12లో మూడవ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము...... పైన 4వ వచనములో3 days తర్వాత రండి అని రాజు చెప్పాడు and 12వ వచనములో ముడువ దినము నందు రండి అని రాజు చెప్పాడు.. అనగా మూడు దినముల తర్వాత అన్న ,మూడవ దినము అన్న ఒక్కటే భావము... 1సముయేలు30:11- వాడు మూడు రాత్రింబగళ్ళు అన్నపానము లేమియు పుచ్చుకొనలేదని తెలుసుకుని.... 1సముయేలు30:13-మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా.....పై వివరణ బట్టి చివరగా అనగా మూడు దినములైన తర్వాత అన్న ,మూడవ దినమున అన్న , మూడు రాత్రింబగళ్ళు అన్న ఒక్కటే భావము అర్థము.. యేసు మూడు దినములైన తర్వాత తిరిగి లేస్తాడని markలో ఉన్నట్టు చూసాము., ముడువ దినమున లేస్తాడని మత్తాయిలో ఉన్నట్టు చూసాము, మూడు రాత్రింబగళ్ళు అయన తర్వత లేస్తాడు అను మాటను మత్తాయిలో ఉన్నట్టు చూసాము. ఈ మూడు సందర్భాలలో భావము- నేను మూడవ దినము తిరిగి లేస్తాను అని అర్థము....

6) అపోకార్య 10:40-దేవుడు ఆయనను మూడవ దినమున లేపి..... అంటే యేసు మూడవ దినమున లేచాడని అపోస్తులలు సాక్ష్యము ఇస్తున్నారు. luke 24:21- ఇశ్రాఎలును విమోచించుబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములు ఆయెను..... అంటే కచ్చితముగా మూడవ దినమున తిరిగి లేచాడు..

7) మత్తాయి 12:38 నుంచి 41-వాళ్ళు సూచక క్రియ అడిగినప్పుడు యోన సూచక క్రియే మీకు అనుగ్రహిoపబడును అని యేసు అన్నాడు. ఇందులో ఆలోచించాల్సింది బ్రతుకున్నవాడు భయటపడడము గొప్ప లేక బ్రతుకున్న వాడు చనిపోయి తిరిగి లేవడము గొప్ప????? యేసు చనిపోయి లేచాడు గనుక యోన కంటే గొప్పవాడు. luke 11:30- ఇందులో తిమింగలము time చూసుకుని మ్రింగిందా లేక time చూసుకుని కక్కిందా??????? example:: 16-4-14న nithin అనే నేను ఉదయము 9 గంటలకు officeకి వెళ్ళాను. వెళ్ళిన నేను ఆ రోజు పూర్తి చేయాలంటే మరలా రేపు ఉదయము 9 వరకు ఉండాలా???? 12am వస్తే 17date వస్తుంది.

8) time చూసుకుని సమాధిలోకి వెళ్ళవలసిన అవసరత, time చూసుకొని లేవవలసిన అవసరత లేదు. మనకు తిరిగి లేవడము ముఖ్యము కానీ ఎన్ని రోజులకు లేచాడన్న విషయము ముఖ్యము కాదు. సమాధిని గెలవడము ముఖ్యము. విశ్రాంతి దినమున ఎప్పుడు ప్రారంభమైనదో చూస్తే లేవియు 23:32- సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను..అంటే ముందటిరోజు evening 6 నుంచి తర్వాత రోజు 6 pm వరకు అని అర్థము. friday దినమున 6pm దాటితే విశ్రాంతి దినము start అవుతుంది. john19:31- ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మిద ఉండకుండునట్లు.. .... అనగా విశ్రాంతి దినమున సిలువపై శవము వ్రేలడకుడదు.. friday 3pm సమీపములో అరిమతయ ఎసుపు పిలాతు దగ్గరకు వెళ్లి deadbody కోసము permission అడిగి సమాధి చేసాడు,..

9) ఎందుకు లేవాలి మూడవ దినమున?? అయన తిరిగి sunday దినాన లేవలేకపోతే permanentగా మట్టిలో పాతిపెట్టేవారు. పాతి వేస్తే అయన దేహము కుళ్ళు పడుతుంది. నీ పరిశుద్దుని కుళ్ళు పట్టనియ్యవు అను ప్రవచనము ఉంది గనుక sunday లేచాడు. అయన లేవడము ముఖ్యమా ? ముందు క్రైస్తవుడిగా ఆలోచించవలసినది time కాదు లేవడము ముఖ్యము. మూడు రాత్రింబగళ్ళు ఎలాగో చూద్దాము... a)మొదటి దినము(ఒక పగలు,ఒక రాత్రి)- ఇది friday-afternoo n 3 నుంచి 6 pm వరకు పగలు ,6 pm నుంచి 12am వరకు ఒక రాత్రి. b) రెండవ దినము( ఒక పగలు ,ఒక రాత్రి)-ఇది saturday- 12 am నుంచి 6pm వరకు పగలు, 6 pm నుంచి 12 am వరకు రాత్రి. c) మూడవ దినము ( ఒక పగలు ఒక రాత్రి)-ఇది sunday -12 am నుండి 6 వరకు రాత్రి ,సూర్యోదయము అవుతుండగా లేచాడంటే పగలు వచ్చింది..

10) 1 కోరంధీ 15:3- లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను,సమాధి చేయబడెను,లేకహనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను..మూడవ లేవుట అనునది లేఖనాల నెరవేర్పు.. చివరగా యేసుక్రీస్తు friday చనిపోయినది, సమాధి చేయబడడము వాస్తవము and తిరిగి మూడవ దినమైన sunday లేవడము వాస్తవము. time correctగా ఉంటె రక్షణ రాదు కానీ తిరిగి లేస్తేనే రక్షణ.



దైవప్రత్యక్ష గుడారపు యాజకత్వ ప్రార్ధనా సరళి



దైవప్రత్యక్ష గుడారపు  యాజకత్వ ప్రార్ధనా సరళి 
ప్రార్ధన-జీవపు  సరళి 
మూలము : బెర్న్ జుమ్పనో 




ప్రత్యక్ష గుడారమును గూర్చిన ధ్యానము అత్యంత లోతైన, గూఢమైన అనుభవములోనికి మనల్ని నడిపిస్తుంది. ప్రత్యక్ష గుడారము యొక్క ఉద్దేశము, మనలను అతిపరిశుద్ధ స్థలములొనున్న పరిశుద్ధ దేవుని సన్నిధిలోకి నడిపింపబడుట  ద్వారా మనము దేవునితో సహవాసము కలిగియుండుటయే .అతిపరిశుద్ధ స్థలములొ దేవుని ప్రసన్నత మనము అనుభవించగలము దేవునితో స్థిరమైన, శాశ్వతమైన అనుభవములొకి నడిపించబడతాము .

దేవుని సన్నిధిలో మనము ప్రతిరోజు నిలువబడుట క్రైస్తవ విశ్వాస నడతలో తప్పనిసరి. హెబ్రీ 8:5 "నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము". ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు మనకు ఒక మాదిరి లేక ఒక సరళి ని అనుగ్రహించాడు ఆ సరళిని అనుసరించుట మనకు శ్రేయస్కరము.
ప్రత్యక్ష గుడారములో 8 దశలున్నవి. ప్రతి దశలోను మన ప్రార్ధన జీవపు సరళి ప్రతిఫలించాలి.

(1) Eastern Gate - తూరుపు ద్వారము
(2) Doorway of the Tent of Meeting - దైవప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము
(3) Brazen Laver- ఇత్తడి గంగాళము
(4) Brazen Alter - ఇత్తడి బలిపీఠము
(5) Lamp-stand - దీపస్తంభము
(6) Table of Shew-bread- దర్శనీయాపూపము (7) Alter of Incense - ధూపవేదిక
(8) Holy-of-Holies - అతి పరిశుద్ధ స్థలము
1:- Eastern Gate-తూరుపు ద్వారము:
ప్రభువైన యేసు! నీవు మార్గమైయున్నావు , సత్యమైయున్నావు, జీవమైయున్నావు. నా మార్గము, నా జీవము మరియు నా సత్యము నీవే . కృతజ్ఞతార్పణలు చెల్లించుచు నీ గుమ్మములలో ప్రవేశించుచున్నాను, కీర్తనలు పాడుచు నీ ఆవరణములలో ప్రవేశించుచున్నాను.  నా మర్గాములన్నిటిలో నేడు నేను నిన్ను గుర్తించుచున్నాను మరియు నీకు కృతజ్ఞ్యత, స్తుతి చెల్లించుచున్నాను ఎందుకంటే నా మార్గములను నీవు సరాళము చేయుచున్నావు. నీవే స్తుతికి పాత్రుడవు అర్హుడవు యోగ్యుడవు . నీ విస్వాస్యతను బట్టి నీకు కృతజ్ఞ్యతలు. నా కొరకు జరిగించిన శిలువ యాగమునుబట్టి నేడు నిన్నుకీర్తిస్తున్నాను, స్తుతిస్తున్నాను. ముగించబడిన శిలువ కార్యము ద్వారా నాకనుగ్రహించబడిన పరిత్రాణము స్వస్థత విడుదల మరియు నూతన జీవము నుబట్టి నీకు కృతజ్ఞ్యతలు తెలుపుచున్నాను. నీవనుగ్రహించిన సకల ఆశీర్వాదములకై, నీకు స్తుతులు స్తోత్రములు సమర్పించుచున్నాన.

2:- Doorway of the Tent of Meeting-దైవప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము:
ప్రభువా, నా హృదయమును పరిశోదించి నీవు చూచినట్లు నా హృదయములోని మరుగైయున్న దోషములను నాకు చూపుము. నీకు అయాసకరమైన అంగీకారముకాని ఆలోచనలు తలంపులు ఉద్దేశములు నాలో ఉన్నయెడల నాకు బయల్పరచుము. ఈ పాపములు: శరీరాశ, నేత్రాశ , జీవపు డంబము, (పరిశుద్దాత్ముడు చూపిన పాపములను ఒప్పుకోనుడి ) నాలో ఉన్నవి వాటిని నేను ఒప్పుకోనుచున్నాను వాటి కొరకు పశ్చాత్తాప పడుచున్నాను, వాటిని తిరస్కరిస్తున్నాను. ఈ పాపముల నిమిత్తము నాకు మిష లేదు వాటికి బాధ్యుడను నేనే నన్ను నేను విమర్శించుకోనుచు, ఒప్పుకోనుచున్నాను . అవిధేయత వలన నీ పరిశుద్దాత్మను నొప్పించాను వీటన్నిటి మిత్తము యేసు నామములో క్షమార్పణ కోరుచు క్రీస్తుయేసు నందు విశ్వాసముంచుట ద్వారా క్షమార్పణ పొందుచున్నాను. (ఇప్పుడు ప్రార్ధన తైలముతొ నుదుటిమీద అభిశేకించుకొండి లేదా నోటితో పలకండి ).

ప్రభువా, నీవు అనుగ్రహించిన సర్వాంగ కవచమును ధరించుచున్నాను: రక్షణయను శిరస్త్రాణము - నీవే నా పరిత్రాణ కర్తవు; నీతియను మైమరువు-నీవే నా పాపరహితత్వము; నడుముకు సత్యమును దట్టి-నీవే నా సత్యము; పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు- నీవే నా సమాధానము; విశ్వాసమను డాలు-నీవే నా కేడేము, నా విశ్వాసమునకు కర్తవు దానిని కొనసాగించువాడవు; మరియు వాక్యమను ఆత్మ ఖడ్గము- నీవే నా సజీవమైన నిత్యమైన రెండంచులుగల ఖడ్గము.

యేసు, నీ ప్రశస్తమైన రక్తముతో వీరిని కప్పుచున్నాను ( మీ ప్రియుల-పేర్లు వారి పరిస్థితులను వారు కలిగిన వాటిని) మా శరీరములను సజీవ యాగముగా అవయువములు నీతియుక్తములుగా నీకు సమర్పించుకొనుచున్నాను. విశ్వాస నివేదము ద్వారా నేను ప్రార్ధించిన ప్రతిది కలిగియున్నాను అని నమ్ముచున్నాను నీ యందు నమ్మికతో, యేసు నామములో ప్రకటిస్తున్నాను. స్తుతి వస్త్రమును ధరించియున్నాను నీవే స్తుతికి అర్హుడవు, తండ్రితో ఏకమైయున్నపవిత్రాత్ముడవు.

(3) Brazen Laver - ఇత్తడి గంగాళము: ఈ దినమందు నీ వాక్యము యొక్క శక్తిని ఒప్పుకోనుచున్నాను. ఓ ప్రభువా! సాతానును మొదట బంధించుచున్నాను. ప్రధానులను అధికారులను ప్రస్తుత అంధకార సంబధులగు లోకనాథులను ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములను ప్రతి విధమైన చీకటి శక్తులను యేసు నామములో బంధించుచున్నాను. వారికి అప్పగించబడిన నమూనాలు , కుట్ర, పన్నాగం , యోచన లనుండి నేను మా ప్రియులు, మేము మాకు కలిగిన సమస్తమును వాటినుండి విడిపించు కొనున్నాను. వాటిని వాటి సహాయభూతసైన్యమును యేసు నామములో బంధించుచున్నాను. వాటి ప్రయత్నములను వ్యర్ధపరుస్తున్నాను కొట్టివేస్తున్నాను. వాటి ప్రయత్నములు ఎన్నడును వ్యక్తము కాకుండును గాక! నిష్ఫలమగును గాక! అమలు జరపబడకుండును గాక! ప్రతికిప్రతి నిషేదిస్తున్నానని యేసు నామములో ప్రకటిస్తున్నాను.

నీ వాక్యముతో ఎకీభవించుచున్నాను వాక్యము ప్రకటించుచున్నది "నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము " పలపలకబడిన వాక్యమును బట్టి నీకు స్తుతి, కృతజ్ఞ్యత చెల్లిస్తున్నాను ప్రభువా. నీ వాక్యముతో ఎకీభవిస్తున్నాను నేను క్రీస్తుతో మరణించినాను, నా ప్రాచీన స్వభావము నీటి బాప్తీస్మం ద్వారా పాతిపెట్టబడినది. ఆ పాత స్వభావము మరి ఎన్నడును తిరిగి ఎత్తబడదు, రాదు.

(4) Brazen Alter-ఇత్తడి బలిపీఠము: ప్రభువైన యేసు, నీకు ఉన్నతమైన స్తుతి హృదయపూర్వకమైన కృతజ్ఞ్యత చెల్లిస్తున్నాను నేను పొందవలసిన శిలువ మరణము నా బదులు స్వీకరించావు. నీ ప్రశస్తమైన రక్తమును నా పాపము మరియు మా ప్రియుల పాపములకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించావు మమ్మల్ని పాపపు శక్తినుండి విమోచించావు. మాతో నూతన నిబంధన స్థాపించావు. నీకు సమస్తమైన మహిమ ఘనత కలుగును గాక.

ప్రభువైన యేసు! నీకు స్తుతి, మహిమ, ఘనత , ఆరాధన, కృతజ్ఞ్యత సమర్పిస్తున్నాను నన్ను పునీతుణ్నిగా(Justification ) ఎంచినందు బట్టి. నీకు స్తుతి, మహిమ, ఘనత , ఆరాధన, కృతజ్ఞ్యత సమర్పిస్తున్నాను నాకు ప్రతినిధానము(Substitution ) వహించినావు. నీకు స్తుతి, మహిమ, ఘనత , ఆరాధన, కృతజ్ఞ్యత సమర్పిస్తున్నాను నీవే తండ్రితో నాకు శాంతి చేసావు (Propitiation ). నీకు స్తుతి, మహిమ, ఘనత , ఆరాధన, కృతజ్ఞ్యత సమర్పిస్తున్నాను నీవే నా అభిజ్ఞానమైయున్నవు (Identification ).

ప్రభువా! నా హృదయములో నీకు అంగీకారముకాని ఆలోచన, మాట, చేత నడత ఉన్నయెడల దానిని తీసివేయుము. నా హృదయమును సున్నతి చేయమని అడుగుచున్నాను. ప్రభువా, నీకు అనుమతినిస్తున్నాను దానిని నాలోనుండి వాక్యమనే ఖడ్గముతో పెరికివేయుము. ముఖ్యముగా (ఈ పాపమును,---) నాలోనుంచి తీసివేయుము. దాని నిమిత్తము నేను పశ్చాత్తాప పడుచున్నాను దానిని తిరస్కరిస్తున్నాను నీ క్షమార్పణ కోరుచున్నాను. నీయందు విస్వాసముంచుట ద్వారా మా పాపములు క్షమించబడియున్నవని నమ్ముచున్నాను.

రోమా 6 ను ఆధారము చేసికోనుచు నా ప్రాచీన పురుషుడు నీతో శిలువ మరణం పొందాడని నీటి బాప్తిస్మము ద్వారా పాతిపెట్టబడ్డాడని, ప్రతిదినము పాపము నిమిత్తము నేను శిలువ మరణంలో పాలు పొందుచున్నాను నన్ను నీకు సమర్పించుకొంటున్నాను. పరిశుద్ధాత్మకు లోబడుచు నీ శిలువ కార్యము నాలో కాపాడుకోనుచున్నాను. నేను ఒప్పుకొనుచున్నాను నేనొక నూతన సృష్టి నాలో పాతవి గతించెను సమస్తము క్రోత్తవి ఆయెనని .

(5) Lamp-stand- దీపస్తంభము : ప్రభువా! నేను నీకు లోబడుచున్నాను. నన్ను నీ పరిశుద్ధాత్మ ద్వారా దైవికముగా లోబర్చుకొనుము నీ కొరకై ప్రత్యేకించి ఉపయోగించుకొనుము. ఆత్మ వరములతో నీ పరిచర్య జరిగించుటకు కృపనిమ్ము వివేచనాత్మ అనుగ్రహించు. విశ్వాస నివేదము ద్వారా నేను ప్రార్ధించిన ప్రతిది యేసు నామములో పొందియున్నాను అని నమ్ముచున్నాను . (ఆత్మలో ప్రార్ధిస్తూ .. గమనించండి .. బుద్ధి వాక్యము, జ్ఞ్యాన వాక్యము , అత్మలవివేచన వరముల కొరకు లేదా ఇతర ఆత్మ వరములు - ప్రవచన, పరిశుద్ధాత్మ బాప్తీస్మం మొ:. అభివ్యక్తమైనవేమో ).

(6) Table of Shew-bread-దర్శనీయాపూపము: ప్రభువా , నీతో నీ నూతన నిబంధనలో పాలుపంచుకుంటున్నాను విస్వాసముద్వారా నీ శరీరమును నీ రక్తమును స్వీకరిస్తున్నాను. (రొట్టె, మరియు ద్రాక్షరసమును స్వీకరించండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగితే ). నీ వాక్య ప్రత్యక్షత వెదకుచున్నాను, దేవా! నీ వాక్యము గ్రహించుటకు నా హృదయము వీప్పుమని యేసు నామములో అడుగుచున్నాను.

(7) Alter of Incense-ధూపవేదిక: ప్రభవా! నేను మధ్యవర్తిత్వము వహిస్తూ మనవిచేసుకుంటున్నాను, యేసు నామములో వీరిని( పూర్తి పేర్లు ... ) వారు ఎదుర్కుంటున్న పరిస్థితులను నీకు అప్పగిస్తున్నాను (ఇది వ్యక్తిగత ప్రార్ధన సమయము .. ఆత్మలో ప్రార్ధించండి ) ప్రభూ ! నీకు స్తుతి చెల్లిస్తున్నాను కృతజ్ఞ్యత చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నీవే నా మధ్యవర్తివి నీ కృప ద్వారా నీ చిత్తాన్ని నేను జరిగిస్తున్నాను కాబట్టి నేను విశ్వసిస్తున్నాను నేను అడిగినవన్నీ పొందియున్నానని. ఆమెన్!

(8) Holy of Holies -అతి పరిశుద్ధ స్థలము : తండ్రీ! యేసు నామములో నీ కృపాసనము దగ్గరకి ధైర్యముగా చేరియున్నాను. తండ్రియైన దేవా! సర్వశక్తిమంతుడా! మాట్లాడు నీ దాసుడు ఆలకించును. ( ఆలకించండి .. మెల్లనైన స్వరము లేదా వాక్య జ్ఞ్యానము కొరకు , భావాలను బట్టి కాదు గాని మీరు ఇప్పుడు దేవుని సహవాసములొ ఉన్నారు మీ స్వంత మాటలతో ప్రార్ధించండి .. జవాబు కొరకు కనిపెట్టండి .. అయన ఆత్మ మీ ఆత్మతో సాక్ష్యమిచ్చును. హృదయములో ఆయన మాట కొరకు వేచిఉండండి)
                
                                  షాలోం. 

ప్రత్యక్ష గుడారము ఆవరణము

ప్రత్యక్ష గుడారము ఆవరణము

  • ప్రత్యక్ష గుడారము యొక్క ఆవరణము దీర్ఘ చతురస్రాకారముగా ఉన్నది
  • ఉత్తరము, దక్షిణము యొక్క పొడుగు 100 మూరలు, తూర్పు, పడమరల వెడల్పు 50 మూరలు
  • ఉత్తరము, దక్షిణమున 20 స్తంభములు ఉండవలెను. తూర్పు, పడమరల వైపున 10 స్తంభములు ఉండవలెను
  • ప్రతి 2 స్తంభముల మద్యన తెల్లని నారతో చేయబడిన తెరలు ఉండవలెను. తేరా యొక్క ఎత్తు 5 మూరలు
  • ప్రతి స్తంభమునకు ఇత్తడి దిమ్మ, ఇత్తడి మేకులు, వెండి వంకీలు, వెండి పెండె బద్దలు కలవు
  • ఈ ఆవరణము యొక్క ఏర్పాటు ప్రత్యక్ష గుడారము బయట ప్రపంచము నుండి వేరుచేయు సరిహద్దుగా ఉన్నది
  • ఆవరణ తూర్పు భాగమును, తెరను 2 భాగములుగా, 15 మూరల నిడివి గలవిగా విభాగించిరి. ఒకవైపు 15 మూరలు, 3 స్తంభముల మీద నిలువ బెట్టవలెను. రెండవ వైపు 15 మూరలు 3 స్తంభముల మీద నిలువ బెట్టవలెను. మిగిలిన 20 మూరలు ఆవరణ ద్వారమునకు విడిచిపెట్టవలెను. ఆవరణ ద్వారము యొక్క స్తంభములు 4.
  • మొత్తము స్తంభముల సంఖ్య 60
  • ప్రతి స్తంభము యొక్క వంకీలకు త్రాళ్లు కట్టబడి అవి మేకుల సహాయముతో భూమిలో దిగగొట్టబడి స్తంభము నిలువబెట్టుటకు సహాయపడును. ఈ మేకులు యేసుక్రీస్తు శిలువలో కొట్టబడిన మేకులకు, ఆయన భరించిన తీర్పు ద్వారా కలిగిన విమోచనకు సాదృశ్యమై ఉన్నవి
  • ఆవరణ చుట్టూ కట్టబడిన తెరలు ఈ క్రింది విషయములకు సాదృశ్యమై ఉన్నవి
    • పాపుల మార్గము నుండి వేరుపరచబడుట (యెషయా 59:2; 2కొరిం 6:17; హెబ్రీ 7:26)
    • పరిశుద్దుల యొక్క నీతి క్రియలకు తెల్లని తెరలు సాదృశ్యమై ఉన్నవి (ప్రక 19:8; రోమా 3:22; 2కొరిం 5:21; యెషయా 61:10)
    • స్తంభములు విశ్వాసులకు సూచనగా ఉన్నవి (1తిమో 3:15)
    • ఇత్తడి పాపము మీద దేవుని యొక్క తీర్పునకు సాదృశ్యమై ఉన్నది (గల 3:12-14; కొల 2:13-15)
  • వెండి యేసుక్రీస్తు యొక్క త్యాగము ద్వారా విశ్వాసులకు లభించిన విమోచనకు సాదృశ్యమై ఉన్నది (ఎఫె 6:17; యోహా 3:16, 5:24)
  • స్తంభములను కలుపు వెండి బద్దలు విస్వాసుల యొక్క సహవాసమునకు సూచనగా ఉన్నవి (1యోహా 1:17)
  • విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సంక్రమించిన నీతి ద్వారా, క్రియల వలన ఇతరులను క్రీస్తు వైపునకు ఆకర్షింపవలెను (1పేతు 2:12; మత్త 5:16)
  • ఆవరణము ప్రజలు దేవుని స్తుతింప వలసిన స్థలమై ఉన్నది (కీర్త 100:4, 96:8, 92:13, 65:4, 84:2, 10)
  • ఆవరణము యొక్క తెరల ఎత్తు 5 మూరలు ఉండుట వలన ఎవరూ కూడా లోపల చొరబడటానికి వీలు కాదు. త్రొంగి చూచుటకు వీలుపడదు. లోపల ప్రవేసింపవలెను అనిన కేవలము ద్వారము ద్వారా మాత్రమే రావలెను. దీనిని బట్టి ప్రత్యక్ష గుడారము నందలి విషయములు అందరికీ చెందినవి కావు అని, కేవలము ద్వారము ద్వారా లోపలికి ప్రవేశించు వారికి మాత్రమే అనియూ మనము అర్ధము చేసికొనగలము.
  • ఆవరణము యొక్క మొత్తము వైశాల్యము 4 దిక్కులా కలిపి 1500. ఇది మోషేకు యేసుక్రీస్తుకు మద్య ఉన్న కాలముతో సమానము
    • తూర్పు వైశాల్యము (వెడల్పు x ఎత్తు) = 50×5 = 250
    • పడమర వైశాల్యము (వెడల్పు x ఎత్తు) = 50×5 = 250
    • ఉత్తరము వైశాల్యము (పొడుగు x ఎత్తు) = 100×5 = 500
    • దక్షిణము వైశాల్యము (పొడుగు x ఎత్తు) = 100×5 = 500
    • మొత్తము కలిపి 250+250+500+500 = 1500
  • ఇశ్రాయేలీయులు ఇగుప్తులొ ఫరో రాజు చేతి క్రింద బాధింపబడిన సంవత్సరములు 155.
    • ఆవరణము పొడుగు + వెడల్పు + ఎత్తు = 100+50+5 = 155
  • ఆవరణము యొక్క పొడుగు 100. ఇది మనిషి యొక్క జీవితకాలమునకు సమానము
  • ఆవరణము యొక్క వెడల్పు 50. ఇది విడుదలకు గుర్తు. ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము, పరిశుద్దాత్మ దేవుడు పునరుద్దానము తరువాత 50వ దినమున పెంతెకోస్తు నాడు దిగి వచ్చెను (లేవి 25). పెంతెకోస్తు పండుగ 7వ వారము 8వ దినమున జరుగును.
  • యేసుక్రీస్తు ప్రభువు పరిచర్యను ప్రారంభించినపుడు 30 సంవత్సరముల వయస్సు కలదు. తూర్పు ఆవరణ ఇరుప్రక్కల ఉన్న దూరము 30. ఆవరణ ద్వారము కుడివైపున 15 మూరలు + ఆవరణ ద్వారము ఎడమవైపున 15 మూరలు. 15 కృపతో కూడిన దైవిక పరిపూర్ణతను సూచిస్తున్నది
  • తూర్పున ఆవరణ ద్వారము వెడల్పు 20. ఇది సహాయమునకు ఎదురుచూచు కాలమును సూచించు సంఖ్య లేదా కార్యము సంపూర్తి చేయబడుటకు ఎదురుచూచు సంఖ్య (న్యాయా 4:1-3, 15:20, 16:31; 1సమూ 7:1-2; 1రాజు 9:10-11)
  • ఆవరణము యొక్క ఉత్తరము, దక్షిణము పొడుగు కలిపి 200. ఇది లేఖనములలో లోటును సూచించు సంఖ్య. (యోహా 6:7; యెహో 7:1, 19-22, 24, 25; 2సమూ 14:25, 26, 18:9, 14; న్యాయా 17:1, 4, 5, 30, 31; నెహె 8:5-9)
  • ఆవరణము యొక్క తూర్పు, పడమరల వెడల్పు కలిపి 100. ఇది మనిషి జీవిత కాలమునకు అవసరమైన విడుదలను సూచిస్తున్నది.
  • ఆవరణము తెరల యొక్క ఎత్తు 5. ఇది లేఖనములలో కృపను సూచించు సంఖ్య.
  • ఆవరణము పొడుగు, వెడల్పులు సమానమైన 5 మూరల ఎత్తులో ఉండుట మన జీవిత కాలమునకు ఆయన కృప సరిపోవును అని, అది మార్పులేనిది అని, మనము కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే సత్యము మనకు తెలియజేయుచున్నది (ఎఫె 2:8)
  • ఆవరణము పొడుగున స్తంభములు 20. వెడల్పున 10. మొత్తము అన్ని వైపులా కలిపి 20+20+10+3+3+4 = 60
  • ఆవరణము రెండు వైపులా పొడుగున ఉన్న స్తంభముల సంఖ్య కలిపి 20+20 = 40. ఇది క్రమశిక్షణను సూచించు సంఖ్య
  • ఆవరణము వెడల్పున ఉన్న స్తంభముల సంఖ్య 10. ఇది లేఖనములో దేవుని ప్రభుత్వమును సూచించు సంఖ్య.
  • ఆవరణము పొడుగు x వెడల్పు x ఎత్తు = 100x50x5 = 25000

ప్రత్యక్షపు గుడారము గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

ప్రత్యక్షపు గుడారము గురించి బైబిల్ లో చాల అధ్యాయాలలో రాయబడింది. ఎంతో ప్రాముఖ్యమైనది గనుక పరిశుద్దాత్మ దేవుడు ఈ అంశాన్ని అనేకసార్లు ప్రస్తావించాడు. యింత సవిస్తరంగా వివరించిన ప్రత్యక్షపు గుడారము నిర్మాణం గురించి, అందులో అర్పించే బలులు, అర్పణలు గురించి చాలా మంది చదవరు.
ఈ తెరలు ఏంటి? ఈ పలకలు, దిమ్మలు, స్తంభాలు, అడ్డకర్రలు, వంకులు, పెండేబద్దలు అసలు యివన్నీ ఏంటి అని, వీటితో ఏమి అవసరం అని పేజీలు తిప్పేస్తుంటారు...  యింకా యౌవనస్తులు అయితే బైబిల్ చదువుతున్నప్పుడు ఆ కొలతలు, ఆ మూరలు రాగానే ఏమి కొలతలురా నాయనా అని ఫాస్ట్ ఫాస్ట్ గా చదివేసుకొంటు వెళ్తుంటారు. (పేపర్స్ లో వచ్చే పజిల్స్ ని జెనరల్ ఇంటలిజెన్స్ కి సంబంధించిన లెక్కలని మాత్రం బాగా చేస్తారు. బైబిల్ లో దేవుడు రాయించిన లెక్కలు గురించి మాత్రం ఆలోచించరు)

పరిశుద్ద గ్రంధమంతటిలో ప్రత్యక్షపు గుడారము అంత వివరణ ఏ ఒక్క అంశము మీద కూడా రాయబడలేదు. దేవుని పిల్లలు ఈ అంశాన్ని మనసు పెట్టి (శ్రద్ధతో) చదవకపోవడం చాలా విచారకరమయిన సంగతి. ప్రత్యక్షపు గుడారము గురించి చదువుతున్నప్పుడు ఆ ఉపకరణాలు, ఆ కొలతలు, ఆ నిర్మాణం, ఆ బలులు - అర్పణలు, యాజకుని సేవా ధర్మాలు మనకు అనవసరం అనిపించినప్పటికీ 2 తిమోతి 3:16 ప్రకారం దైవవేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కదా....కొంతమంది పాత నిబంధన అవసరం లేదు అనుకొంటూ ఉండొచ్చు. కానీ, పాత నిబంధన లో రాసిన సంగతులని మనకు బుద్ది కలుగుటకై రాయబడినవి అని మర్చిపోకండి సుమా. (రోమా 15:4; 1 కొరింథీ 10:6). పైగా ప్రత్యక్షపు గుడారము కొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రిక లో రాయబడింది. ఈ పత్రిక అర్థం కావాలంటే నిర్గమ, లేవి, సంఖ్యాకాండాల మీద అవగాహన ఉండాలి.

పరిశుద్దాత్మ దేవుడు ఈ అంశాన్ని కొత్త నిబంధనలో కూడా రాయించాడు అంటే సంఘానికి ఏదో నేర్పించాలి అనేగా? వ్యర్థంగా ఏది రాయించడు అని ప్రతీది మన ప్రయోజనం కొరకే అని 2 తిమోతి 3:16 వచనంలో చూసాముగా. మరి యింత సవిస్తరంగా రాయబడిన అంశం గురించి మీరు తెలుసుకోవాలని ఆశ పడుతున్నారా? ఒకవేళ యింతవరకు నిర్లక్ష్యం చేసి ఉంటె యిప్పుడైనా శ్రద్ధ పెట్టి చదవండి. ప్రత్యక్షపు గుడారము రెఫెరెన్సులు :

ప్రత్యక్షపు గుడారము అంశము నిర్గమకాండము 25 వ అధ్యాయములో ప్రారంభం అవుతుంది. నిర్గమకాండము 25 నుండి 40 అధ్యాయాలలో ప్రత్యక్షపు గుడారము గురించి రెండు సార్లు రాయబడినట్లుగా మనకు కనబడుతుంది. నిజమే. ప్రత్యక్షపు గుడారమును ఎలా కట్టారో, అందులో 7 పరికరములను ఎలా తయారు చేయాలో దేవుడు మోషేకి వివరించినప్పుడు ఒకసారి రాయబడింది, ఆ వివరణ అంతా నిర్గమకాండము 25,26,27,30 అధ్యాయాలలో ఉంటుంది. రెండోసారి ఇశ్రాయేలీయులు ఆ ప్రత్యక్షపు గుడారమును ఏ విధంగా కట్టారో, అందులో 7 పరికరములను ఏ విధంగా తయారు చేసారో నిర్గమ 36,37,38 అధ్యాయాలలో ఉంటుంది... ఆ విధంగా ప్రత్యక్షపు గుడారము నిర్మాణం గురించి రెండుసార్లు రాయబడినట్లుగా కనబడుతుంది. ఈ అంశం ఎంతో ప్రాముఖ్యమైనది కనుకనే పరిశుద్దాత్మ దేవుడు రెండుసార్లు ప్రస్తావించాడు. ఈ ప్రాముఖ్యమైన అంశము గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నిర్గమకాండము 25 నుండి 40 అధ్యాయాలు కనీసం రెండుసార్లు చదవండి. లేవియాకాండము, సంఖ్యాకాండము కూడా చదవండి.

మీ కోసం ప్రత్యక్షపు గుడారము రెఫెరెన్సులను విభజించి ఇవ్వడం జరిగింది... వీటిని note చేసుకోండి...
1) ప్రత్యక్షపు గుడారమును ఎలా కట్టాలో మోషేకి చెప్పుట (నిర్గమ 26 వ అధ్యాయం, 27:9-19 వచనాలు)
2) ప్రత్యక్షపు గుడారమును ఏ విధంగా కట్టారో వివరించుట (నిర్గమ 36 వ అధ్యాయం ; 38:9-20 వచనాలు)
3) ప్రత్యక్షపు గుడారములో పెట్టవలసిన 7 పరికరముల యొక్క రెఫెరెన్సులు ....
a) మందసము (నిర్గమ 25:10-17 ; 37:1-5 ; సంఖ్యా 17:1-13 ; హెబ్రీ 9:4)
b) కరుణాపీటం (నిర్గమ 25:18-22 ; 37:6-9 ; 2 రాజులు 19:14-15 ; యెషయా 6:1-8)
c) సముఖపు రొట్టెల బల్ల (నిర్గమ 25:23-30 ; 37:10-16 ; లేవియా 24:5-9)
d) దీపవృక్షం (నిర్గమ 25:31-40 ; 37:17-24 ; లేవియా 8:1-4) దీపస్తంభము.
e) ఇత్తడి బలిపీటం (నిర్గమ 27:1-8 ; 38:1-7 ; 29:38-46 ; లేవియా 6:8-12)
f) ధూపవేధిక (నిర్గమ 30:1-10 ; 37:25-29) బంగారు బలిపీటం
g) గంగాళము (నిర్గమ 30:17-21 ; 38:8)
4) ప్రత్యక్షపు గుడారము పనిలో వాడిన సామాగ్రి (నిర్గమ 35:4-19 ; 39:33-43)
5) ప్రత్యక్షపు గుడారము కట్టుటలో పని చేసినవారు (నిర్గమ 31:1-11 ; 35:30-35 ; 36:1-8 ; 38:22-23 ; 35:25)
6) ప్రత్యక్షపు గుడారమును రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి తేదీన నిలబెట్టబడెను (నిర్గమ 40:17)
7) ప్రత్యక్షపు గుడారము కోసము ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలు (నిర్గమ 35:20-29 ; 30:11-16 ; 38:24-26)
8 ) ప్రత్యక్షపు గుడారమును నిలువబెట్టుట మరియు అభిషేకించుట (నిర్గమ 40 వ అధ్యాయం ; 30:22-29)
9) ప్రత్యక్షపు గుడారమును మేఘము కమ్ముట (నిర్గమ 40:34-35 ; సంఖ్యా 9:15-23)
10) ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు నియమింపబడినవారు లేవీయులు. యాజక వంశం వీరిది. (సంఖ్యా 1:47-54 ; 3,4,18 అధ్యాయాలు, ద్వితియో 33:10-11)
11) ప్రత్యక్షపు గుడారములో యాజకులు ఎలా సేవ చేయాలో, బలులు - అర్పణలు ఎలా అర్పించాలో లేవి, సంఖ్యాకాండాలలో వివరించడం జరిగింది.
12) ప్రత్యక్షపు గుడారము గురించి మరి కొన్ని రెఫెరెన్సులు (హెబ్రీ 7,8,9,10 అధ్యాయాలు ; మార్కు 15:38 ; 1 పేతురు 1:18-19)
"నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను." నిర్గమ 25:8

ప్రత్యక్ష గుడారము ప్రాముఖ్యత (ఈ అంశాన్ని నిర్లక్ష్యము చేసే ప్రతి ఒక్కరు తప్పక చదవండి)
దేవుడు మానవుల మధ్య నివసించుటకు ఆశించిన గుడారమే ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారము గురించి అందులో బలులు - అర్పణలు గురించి 50 అధ్యాయాలలో పైగానే రాయబడింది... చాలా మంది ప్రత్యక్ష గుడారము టాపిక్ రాగానే దీనితో ఏమి అవసరములే, మనకు క్రొత్త నిబంధన ఉంది కదా, అది చాలులే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ క్రొత్త నిబంధన లో కూడా పరిశుద్దాత్మ దేవుడు ప్రత్యక్ష గుడారము గురించి హెబ్రీ పత్రికలో 4 అధ్యాయాలలో రాయించాడు. ఈ అధ్యాయాలు అర్థం కావాలంటే నిర్గమ, లేవి, సంఖ్యా కాండాల మీద తప్పక అవగాహన ఉండాలి. క్రొత్త నిబంధనలో కూడా ప్రత్యక్ష గుడారము గురించి దేవుడు రాయించాడు అంటే ఈ అంశము ద్వారా దేవుడు తన సంఘానికి ఏదో నేర్పించాలి అని ఆశిస్తున్నాడు అనేగా అర్థం. 2 తిమోతి 3:16,17 ప్రకారం పరిశుద్దాత్ముడు రాయించిన ప్రతి లేఖనము ప్రయోజనకరమైనది కదా! కానీ ఈరోజు సంఘము ప్రత్యక్ష గుడారమును ప్రయోజనకరమైనదిగా భావించకపోవడం బాధాకరం.

క్రీస్తునందు నా ప్రియమైన సహోదరులారా ప్రత్యక్ష గుడారము గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. "ప్రస్తుతానికి ఈ పోస్ట్ లో కొన్ని విషయాలు తెలుసుకొందాము. తరువాయి భాగములో మిగతా విషయాలు తెలుసుకొందాము."
ప్రత్యక్ష గుడారము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. ప్రత్యక్ష గుడారము ప్రాముఖ్యంగా 3 అంశాలను తెలియచేస్తుంది.
1) ప్రత్యక్ష గుడారము పరలోక సంబంధమగు సంగతులకు సాదృశ్యంగా ఉంది. (హెబ్రీ 8:5). అనగా పరలోకంలో ఆరాధనా స్థలం (ఆలయం) ఒకటి ఉంది. అక్కడ దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడై కెరూబుల మధ్య నివసిస్తున్నాడని కీర్తనలు 11:4 ; ప్రకటన 7:15 ; 2 రాజులు 19:15 లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే విధంగా మనము ప్రత్యక్ష గుడారమును గమనించినట్లైతే "అతి పరిశుద్ద స్థలంలో" కరుణా పీటం ఉంటుంది. కరుణా పీటం దేవుని సింహాసనాన్ని సూచిస్తుంది. ఆ కరుణా పీటం మీద రెండు కెరూబులు చేయబడి ఉంటాయి. వాటి మధ్య నుండి నేను మాట్లాడతాను అని దేవుడు తెలియచేసాడు. (నిర్గమ 25:22 ; 1 సమూయేలు 4:4)

నిర్గమ 25:8 లో నేను వారిలో నివసించునట్లు నాకు పరిశుద్ద స్థలం నిర్మింపవలెను అని దేవుడు సెలవిచ్చాడు. ప్రకటన 21 వ అధ్యాయాన్ని గమనించినట్లైతే పరలోక సంబంధమగు జెరూసలేము పట్టణముతో (తనని విశ్వసించిన ప్రజలతో) దేవుని నివాసం శాశ్వతంగా వుండబోతుందని మనకు తెలుస్తుంది, అందుకు ఈ లోకంలో కట్టబడిన ప్రత్యక్ష గుడారము ముంగుర్తుగా దేవుని నివాస స్థలముగా నిర్మించబడింది... ఈ విధంగా ప్రత్యక్ష గుడారము పరలోక సంబంధమైన సంగతులకు సాదృశ్యంగా వుంది. 2) ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా వున్నది. ప్రత్యక్ష గుడారము ఒక ఛాయా (నీడ) మాత్రమే.... నీడ ఏర్పడాలి అంటే అసలు వస్తువు ఉండాలి కదా, ఆ అసలు వస్తువే మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు. అసలు ప్రత్యక్ష గుడారములోని ప్రతి వస్తువు యేసు క్రీస్తు పరిచర్యను, దైవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి.... (అవన్నీ వివరంగా ముందు భాగములలో తెలుసుకుందాము.)

3) ప్రత్యక్ష గుడారము సంఘాన్ని సూచిస్తుంది. ప్రత్యక్ష గుడారము అరణ్యములో కట్టబడుతుంది... అరణ్యములో ప్రయాణించబడుతుంది.... తర్వాత కానానుకు చేర్చబడుతుంది.... అదే విధంగా "సంఘము" కూడా ఈ అరణ్యంలాంటి లోకంలో కట్టబడింది. ఇప్పుడు సంఘము కూడా ఈ లోకంలో ప్రయాణించి "పరమ కానానుకు" అనగా పరలోక సంబంధమగు జెరుసలేము పట్టణముకు చేరవలసి వుంటుంది... అక్కడ మన నివాసం దేవునితో శాశ్వతంగా ఉండిపోతుంది. మరో రకంగా చెప్పాలంటే అరణ్యంలో ప్రత్యక్షపు గుడారము దేవుని నివాస స్థలం అయితే (నిర్గమ 25:8) నేడు "సంఘం దేవుని నివాస స్థలం" ఈ సంఘం క్రీస్తు అను సజీవమగు రాయిపై కట్టబడిన విశ్వాసుల సమూహము. నేడు దేవుడు "రాళ్ళతో కట్టబడిన మందిరాలలో నివాసం చేయడు. కాని ప్రజలు అనబడే ఆధ్యాత్మిక ఆలయాలలో నివాసం ఉంటాడు. (1 కొరింథీ 3:16-17).

"ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను." మత్తయి 18:20
ఈ విధంగా ప్రత్యక్ష గుడారము, ప్రత్యక్ష గుడారములోని 7 పరికరములు, వాటిని తయారు చేయడానికి వాడిన వస్తువులు అనేక విషయాలను తెలియచేస్తాయి. ఒక సంఘము (విశ్వాసులు) ఎలా ఎదగాలి అనేది కూడా ప్రత్యక్ష గుడారము తెలియచేస్తుంది

ప్రత్యక్ష గుడారము కట్టబడిన విధానం :
ప్రత్యక్ష గుడారమును ఏ విధంగా నిర్మించారో నిర్గమ 26,36 అధ్యాయాలు మరియు నిర్గమ 27:9-17 వచనాలు, 38:9-20 వచనాలు తెలియచేస్తున్నాయి. ప్రత్యక్ష గుడారము కట్టబడిన విధానం అర్థం చేసుకోవడం కాస్త కష్టతరం. అయినప్పటికీ కాస్త మీకు అర్థం అవ్వులాగున వివరించడం జరిగింది ఆలకించండి.
1) పునాది (నిర్గమ 26:15-30 ; 36:20-34)
ప్రత్యక్ష గుడారము పునాదికి తుమ్మకర్రతో చేయబడిన 48 పలకలను, 96 వెండి దిమ్మలను ఉపయోగించారు. ప్రతి పలక పొడుగు 10 మూరలు (15 అడుగులు), వెడల్పు మూరెడునర (2:25 అడుగులు), ప్రతి పలక అడుగు భాగాన రెండు కుసులు (Tenons or pegs) ఉంటాయి. ఈ "కుసులు" పలకలను వెండి దిమ్మలను కలుపుతాయి. ప్రతి పలకను ఈ కుసుల సహాయంతో 2 దిమ్మల మీద నిలబెడతారు. అలా కుడివైపును 20 పలకలను 40 వెండి దిమ్మల మీద, ఎడమ వైపున 20 పలకలను 40 వెండి దిమ్మలమీద, వెనుక భాగమున 6 పలకలను 12 వెండి దిమ్మల మీద, మూలలకు 2 పలకలను 4 వెండి దిమ్మల మీద నిలబెడతారు. ముందు భాగమున అనగా తూర్పున గుడారపు ద్వారము ఉంటుంది. అలా పలకలను వెండి దిమ్మల మీద నిలబెట్టిన తర్వాత తుమ్మకర్రతో అడ్డకర్రలను 3 భాగములుగా చేసి కుడివైపున 5, ఎడమ వైపున 5, వెనుక భాగమున 5 అడ్డ కర్రలను "బంగారు ఉంగరములతో" పలకలకి అమర్చుతారు. యిందులో "నడిమి అడ్డకర్ర" ఈ కొస (corner) నుండి, ఆ కొస వరకు వుంటుంది (end to end). ఆ తర్వాత పలకలకు, అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగిస్తారు. తర్వాత నేలకు మేకులను కొట్టి, ఆ మేకులను పలకని కలుపుతూ త్రాళ్ళు కడతారు. యిది పునాది (నిర్గమ 35:18 ; 38:31).

2) అడ్డతెర :
ఇప్పుడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల (blue, purple, scarlet yarn) అడ్డతెరని పేనిన సన్ననారతో (fine woven linen) చేసి ఆ అడ్డతెర మీద కెరూబులను చిత్రీకరిస్తారు. ఇప్పుడు ఈ అడ్డతెరను తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదిగించబడిన 4 స్తంభముల మీద ఈ అడ్డతెరను వేస్తారు. ఈ 4 స్తంభాలను 4 వెండి దిమ్మల మీద నిలబెడతారు. ఈ స్తంభములకు బంగారు వంకులు (hooks) వుంటాయి. ఈ వంకులకు అడ్డతెరను తగిలిస్తారు. ఇప్పుడు ఈ అడ్డతెర లోపల భాగాన్ని "అతి పరిశుద్ద స్థలము అని, అడ్డతెర వెలుపటి భాగాన్ని పరిశుద్ద స్థలము అని అంటారు. (నిర్గమ 26:31-33 ; 36:35-36).

3) గుడారపు ద్వారము :
ఇప్పుడు ఈ గుడారపు ద్వారమునకు తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగించబడిన 5 స్తంభములను, 5 యిత్తడి దిమ్మల మీద నిలబెడతారు. ఈ స్తంభములకు బంగారు వంకులు వుంటాయి. ఈ 5 స్తంభములను ఒకదానితో ఒకటి కలుపుతూ "పెండే బద్దలు" (rods, కర్ర) ఉంటాయి. ఈ పెండే బద్దలు కూడా బంగారు రేకుతో పొదిగింపబడి ఉంటాయి. ఇప్పుడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో ఒక తెరని చేసి ఆ స్తంభములకు వున్నటువంటి బంగారు వంకులకు తెరను తగిలిస్తారు. యిదే గుడారపు ద్వారము (నిర్గమ 26:36-37 ; 36:37-38).

4) తెరలను కప్పుట :
నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో 10 తెరలను చేసి, ఆ 10 తెరల మీద కెరూబులను చిత్రీకరిస్తారు. ఒక్కొక్క తెర పొడుగు 28 మూరలు (42 అడుగులు), వెడల్పు 4 మూరలు (6 అడుగులు) ఉంటుంది. ఇప్పుడు 5 తెరలను ఒకదానితో ఒకటి కలిపి మొదటి కూర్పుగా (coupling, set) చేస్తారు. ఈ కూర్పు చివరన "50 కులుకులను (loops)" చేస్తారు. మిగతా 5 తెరలను కూడా ఒకదానితో ఒకటి కలిపి రెండవ కూర్పుగా చేసి కూర్పు చివరన 50 కొలుకులు చేస్తారు. ఆ తర్వాత "50 బంగారు గుండీలను" చేసి వాటిని కొలుకులకు తగిలించి రెండు కూర్పుల తెరలను కలుపుతారు. ఇప్పుడు ఈ తెరలను పలకల మీద కప్పుతారు. ఈ తెరలు లోపల ఉన్నవారికి మాత్రమే కనపతాయి.
తర్వాత ఈ తెరల మీద మేక వెండ్రుకలతో చేయబడిన తెరలను గుడారంగా కప్పుతారు. ఈ మేక వెండ్రుకల తెరలు 11 ఉంటాయి. ఒక్కొక తెర పొడుగు 30 మూరలు (45 అడుగులు) వెడల్పు 4 మూరలు (6 అడుగులు) ఉంటుంది. ఈ తెరలు కూడా 5 తెరలు కలిపి ఒక కూర్పుగా (coupling or set), 6 తెరలు కలిపి రెండో కూర్పుగా చేయబడతాయి. ఈ కూర్పుల తెర చివరన కొలుకులు (loops) చేస్తారు. వాటిని "యిత్తడి గుండీలతో" కలుపుతారు. తర్వాత ఈ తెరల మీద పైకప్పుగా యెర్ర రంగు వేసిన పొట్టేల తోళ్ళని, సముద్ర వత్సల తోళ్ళని కప్పుతారు.
యిది "ప్రత్యక్ష గుడారము". ఈ గుడారము లోపల పరిశుద్ద స్థలము, అతి పరిశుద్ద స్థలము అని రెండు భాగాలు ఉంటాయి. (నిర్గమ 26:1-14; 36:9-19) ప్రత్యక్ష గుడారము - ఆవరణము
చాలామంది ప్రత్యక్ష గుడారము చిన్నదిగా ఉంటుంది అనుకొంటారు. కానీ ప్రత్యక్ష గుడారము చాలా పెద్దదిగా వుంటుంది. ప్రత్యక్ష గుడారము ఆవరణము 100 మూరల పొడుగు వుంటుంది. అనగా 150 అడుగుల పొడవు ఉంటుంది. వెడల్పు 50 మూరలు అనగా 75 అడుగుల వెడల్పు వుంటుంది. యింత స్థలంలో ప్రత్యక్ష గుడారము కట్టబడుతుంది. గత భాగంలో ప్రత్యక్ష గుడారము ఏ విధంగా కట్టబడిందో చూసాము. ఇప్పుడు ప్రత్యక్ష గుడారము ఆవరణం (compound) ఎలా కట్టారో చూద్దాము.
ఈ ప్రత్యక్ష గుడారము ఆవరణముకు 60 స్తంభములు, 60 యిత్తడి దిమ్మలను ఉపయోగించారు. దక్షిణ దిక్కున 20 స్తంభములు ఉంటాయి. ఈ 20 స్తంభాలను యిత్తడి దిమ్మల మీద నిలబెడతారు. ఈ స్తంభాల బోదెలకు వెండి రేకును పొదిగిస్తారు, స్తంభాల పైకప్పును (covering of the top) బోదెలు అంటారు. ఈ స్థంభాలను కలుపుతూ వెండితో చేయబడిన "పెండె బద్దెలు" వుంటాయి. ఈ స్థంభాలకు వెండి వంకులు (hooks) వుంటాయి. ఈ వంకులకు పేనిన సన్న నారను తగిలిస్తారు... ఆవరణపు పొడుగు 100 మూరలు వుంటుంది. కనుక ఆవరణపు పొడుగుకు 100 మూరల పేనిన సన్న నార తెర వుంటుంది... అనగా ఒక్కొక్క స్తంభానికి మధ్యదూరం 5 మూరలు (7.5 అడుగులు) వుంటుంది. (20 x 5 =100). ఒక్కొక్క స్థంభం ఎత్తు 5 మూరలు, అనగా 7.5 అడుగుల ఎత్తు వుంటుంది. (నిర్గమ 27:18)
అలానే ఉత్తర దిక్కున కూడా 20 స్తంభాలను యిత్తడి దిమ్మల మీద నిలబెట్టి, ఆ స్తంభాలను పెందేబద్దలు కలిపి, ఆ స్థంభాలకు వున్న వంకులకు 100 మూరల పొడుగు గల పేనిన సన్న నారను తగిలిస్తారు.
మందిరమునకు వెనుక భాగమున 10 స్తంభాలను 10 యిత్తడి దిమ్మల మీద నిలబెట్టి, స్తంభాలను rods తో కలిపి 50 మూరల పొడుగు పేనిన సన్న నారను తగిలిస్తారు.
తూర్పు వైపున ఆవరణ ద్వారం వుంటుంది. (ప్రత్యక్ష గుడారముకు gate అన్నమాట). ఈ ద్వారం 20 మూరల వెడల్పు వుంటుంది. అనగా 30 అడుగుల వెడల్పు వుంటుంది.
సామాన్యంగా యింత పెద్ద ద్వారం దేనికి ఉండదు. కానీ ఎవరైనను, ఎందరైనను ప్రవేశించునట్టు ఈ ద్వారం వుంది. ఈ ద్వారమునకు అందమైన రంగులతో (నీల ధూమ్ర రక్తవర్ణములు) అలంకరింపబడిన తెర వుంటుంది. ఈ తెర ఎత్తు 5 మూరలు (7.5 అడుగులు). అనగా ఆవరణపు ద్వారం 30 అడుగుల వెడల్పును 7.5 అడుగుల ఎత్తు వుంటుంది. (నిర్గమ 27:18).
ఈ ఆవరణ ద్వారమునకు 4 స్తంభాలను 4 యిత్తడి దిమ్మల మీద నిలబెడతారు. ఈ 4 స్తంభములకు కూడా వెండి వంకులు ఉంటాయి. ఈ వంకులకు 20 మూరల పొడువు గల నీల ధూమ్ర రక్తవర్ణములు గల సన్న నారని తగిలిస్తారు. యిది ఆవరణపు ద్వారం. ఆవరణపు ద్వారమునకు కుడి పక్కన 3 స్తంభాలు, 3 యిత్తడి దిమ్మలు, 15 మూరల పేనిన సన్ననారని ఉపయోగిస్తారు. ఆవరణపు ద్వారము ఎడమ ప్రక్కన్న కూడా 3 స్తంభాలు, 3 యిత్తడి దిమ్మలు, 15 మూరల పేనిన సన్ననారని తగిలిస్తారు.
(note : ఆవరణపు ద్వారం యొక్క తెరకి మాత్రమే నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నార తెరను ఉపయోగించారు. ద్వారం చుట్టూ అంతా సాధారణ పేనిన సన్న నార తెరను కట్టారు)
మొత్తం ఆవరణం వెడల్పు 75 అడుగులు. ద్వారం వెడల్పు 30 అడుగులు, కుడి పక్కన 22.5 అడుగులు, ఎడమ పక్కన 22.5 అడుగులు వుంటుంది. మొత్తముగా 30 22.5 22.5=75 అడుగులు. ఈ 75 అడుగులకు 10 స్తంభాలను వాడారు. అనగా ఒక్కొక్క స్థంభం మధ్య దూరం 7.5 అడుగులు.
చివరిగా ఈ ఆవరణం స్తంభములు తమ తమ స్థానం యందు గట్టిగా ఉండుటకు నేలకు మేకులను కొట్టి, ఆ మేకులను స్తంభాలను కలుపుతూ త్రాడులు కడతారు. యిది మొత్తం ప్రత్యక్షపు గుడారము కట్టబడిన విధానం.

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget