Halloween Costume ideas 2015
January 2017

M. M. Srilekha Telugu Christian Songs



Aadi Deva Nirmaatha Tanaya  - Download
Aakaasam Veligindi Raathri Velalo - Download
Aakaasa Vaasulaara Bhooloka Vaasulaara  - Download
Aakaasam Bhoomiyu Gathinchipoyina  - Download
Aalayamlo Praveshinchandi Andaru  - Download
Anduko Naa Sthuthulu Naa Yesayya  - Download
Daiva Kumaarudu Sree Yese  - Download
Dedeepyamaanamu Nee Divya Roopamu  - Download
Deva Devaraa Maa Jeevanaadhaaraa  - Download
Devaa Eevula Neeya Raavaa  - Download
Ee Dinamu Naade  - Download
Ee Maranamu Needalo  - Download
Gaganaana O Thaara  - Download
Gaganamu Cheelchukoni  - Download
Happy Christmas  - Download
Ide Jeevamu Niche Prabhu vaakhyamu  - Download
Ide Naaku Sudinam  - Download
Jyothi Vudayinchenu  - Download
Kaalamu Konchemu  - Download
Kaarunya Devaa Ninnu Keerthinchedanu - Download
Koodi Prarthana Cheyare  - Download
Korithimi Nee Sannidhi  - Download
Kreesthu Saakshiga  - Download
Mana Paapa Vimochakuni  - Download
Manishi Nee Nivaasam  - Download
Marana Bhayamu Theerchi  - Download
Naa Madilo Mrogenu  - Download
Naa Prabhuvaa Naa Devaa  - Download
Naa Sarvamu Prabhu Korake  - Download
Naa Yesu Raaju  - Download
Naaku Aadhaaramaina Yesayya - Download
Nakshatram Nakshatram  - Download
Nee Jeevam Ye Paatidi  - Download
Nee Karune Nee Smarane  - Download
Nee Rekkala Needalo  - Download
Nee Swaramunu Vinipichega  - Download
Nee Vaakhya Preranalo  - Download
Neethiki Raaja Neethi Sooryudaa  - Download
Nee Thodu Nakundaga  - Download
Neeve Naa Rakshana Sthothra Geetha - Downloadm
Nemmadiga Vunnadi  - Download
Nerpumaya Yesu Deenaathvamun - Downloadu
O Manasaa Digulu Chendaku  - Download
O Paramaathmudaa Parishuddaathmudaa  - Download
Nee Prema Selayerrulai  - Download
Voohinchalenaya Vivarinchalenaya  - Download
Paadanti Andaru  - Download
Paavuramaa Paavuramaa  - Download
Parishuddudaina Mana Prabhu  - Download
Pasidi Kaanthulu Nannu  - Download
Praneswaram  - Download
Praardhana Nerpuma Prabh - Downloaduvaa
Praardhinchumaa Sodaraa  - Download
Prabhuni Naamam  - Download
Prabhuvaa nee Prema  - Download
Prabhuvaa Neeve Naaku Saranam  - Download
Prabhuvaa Ninnu Ne Mahima Paricheda  - Download
Prema Maaradu Yesuni Prema  - Download
Sakala Janamulaku  - Download
Shaaronu Polamu  - Download
Shaaronu Raaja  - Download
Siluvalo Yesuni Choosi  - Download
Simhaasanamandu  - Download
Sree Yesu Raktha Praabhavam  - Download
Sthuthulu Sangathulanu  - Download
Vadalanu Devaa Nee Paadamulu  - Download
Vara GuruNavaThaaramu  - Download
Viduvani Devudu  - Download
Viduvadu Nannika  - Download
Ye Paatidi Jeevithamu  - Download
Yedabaayani Devaa Immaanuyelu Prabhuvaa  - Download
Yemani Varninthu Nee Premanu  - Download
Yemani Vivarinthumu Yesuni Vaartha  - Download
Yentha Manchi Vaadavayya  - Download
Yehovaa Andari Vupakaari  - Download
Yehovaa  - Download
Yesayya Nee Paina  - Download
Yesayya Thvaraga  - Download
Yesu Kreesthu Ee Jagaana  - Download
Yesu Naamame  - Download
Yesu Raaja Arpinthunaya  - Download
Yuga Yugaala Nireekshana  - Download

1వ భాగం: సృష్టి నుండి జలప్రళయం వరకు

భూమ్యాకాశాలు ఎక్కడనుండి వచ్చాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అలాగే భూమ్మీద ఉన్న అనేక వస్తువులు ఎలా వచ్చాయి? వాటన్నింటిని దేవుడే సృష్టించాడు అని చెబుతూ బైబిలు సరైన సమాధానాన్ని ఇస్తుంది. అందుకే మన ఈ పుస్తకము సృష్టికి సంబంధించిన బైబిలు కథలతో మొదలవుతుంది.

దేవుని మొదటి సృష్టి ఆయనలాంటి ఆత్మ వ్యక్తులే అని మనం తెలుసుకుంటాం. వారు దేవదూతలు. అయితే భూమి మనలాంటి మనుష్యుల కోసం సృష్టించబడింది. కాబట్టి దేవుడు పురుషున్ని, స్త్రీని చేసి వారికి ఆదాము, హవ్వ అని పేర్లుపెట్టి వారిని ఒక అందమైన తోటలో ఉంచాడు. కానీ వారు దేవునికి అవిధేయత చూపించినందుకు నిరంతరం జీవించే హక్కును పోగొట్టుకొన్నారు.

ఆదాము సృష్టించబడినప్పటి నుండి జలప్రళయం వరకు మొత్తం 1,656 సంవత్సరాలు. ఈ కాలంలో చాలామంది చెడ్డ వ్యక్తులు జీవించారు. పరలోకంలో అదృశ్య ఆత్మ ప్రాణులైన సాతాను, అతని చెడ్డ దూతలు ఉండేవారు. భూమ్మీద కయీను, అనేకమంది ఇతర చెడ్డ వ్యక్తులతో పాటు అసాధారణ శక్తిగల మనుష్యులు కూడా ఉండేవారు. అయితే భూమ్మీద హేబెలు, హనోకు, నోవహులాంటి మంచివాళ్లు కూడా ఉండేవారు. ఆ ప్రజల గురించి, జరిగిన సంఘటనల గురించి ఈ మొదటి భాగంలో మనం చదువుతాం.

1వ కథ: దేవుడు సృష్టిని ప్రారంభించడం 

2వ కథ: ఒక అందమైన తోట 

3వ కథ: మొదటి పురుషుడు, స్త్రీ

4వ కథ: వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికిగల కారణం

5వ కథ: కష్టమైన జీవితం మొదలవడం

6వ కథ: మంచి కుమారుడు, చెడ్డ కుమారుడు

7వ కథ: ఒక ధైర్యవంతుడు

8వ కథ: భూమిపై రాక్షసులు

9వ కథ: నోవహు ఓడను నిర్మించడం

10వ కథ: గొప్ప జలప్రళయం





2వ భాగం: జలప్రళయం మొదలుకొని ఐగుప్తు నుండి విడుదల వరకు coming soon

గొప్ప జలప్రళయం

ఓడ బయట ప్రజలు అంతకు ముందులాగే అన్ని పనులూ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించారు. జలప్రళయం వస్తుందని వారింకా నమ్మలేదు. బహుశా వాళ్ళు ఇంతకు ముందుకంటె ఎక్కువగా నవ్వి ఉంటారు. కానీ వాళ్ళు ఎంతోకాలం అలా నవ్వలేకపోయారు.

భయపడుతున్న, వరద నీళ్ళలో చిక్కుకొన్న ప్రజలు, జంతువులు
అకస్మాత్తుగా నీళ్ళు కురవడం మొదలయ్యింది. మీరు బకెట్టునుండి నీళ్ళు క్రిందకు పోస్తుంటే ఎలా పడతాయో అలాగే ఆకాశం నుండి నీళ్ళు పడ్డాయి. నోవహు చెప్పింది నిజమే! కానీ అప్పుడు ఓడలోకి వెళ్ళడానికి ఎవ్వరికి అవకాశం లేదు. యెహోవాయే ఓడ తలుపులను గట్టిగా వేసేశాడు.
త్వరలోనే పల్లపు ప్రాంతమంతా నీళ్ళతో నిండిపోయింది. నీళ్ళు పెద్ద నదుల్లా మారాయి. అవి చెట్లను పెకిలిస్తూ, పెద్ద పెద్ద రాళ్ళచుట్టూ ప్రవహిస్తూ, పెద్ద శబ్దాన్ని సృష్టించాయి. ప్రజలు భయపడ్డారు. ఎత్తైన స్థలాలకు ఎక్కారు. అయ్యో, ఓడ తలుపులు తెరిచి ఉన్నప్పుడే నోవహు మాట విని, ఓడలోకి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేదని వాళ్ళు అనుకున్నారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
నీళ్ళ స్థాయి అంతకంతకు పెరిగిపోయింది. ఆకాశంనుండి 40 పగళ్ళు, 40 రాత్రుల వరకు నీళ్ళు కురిశాయి. అవి కొండల వరకు చేరడంతో ఎత్తయిన కొండలు కూడా మునిగిపోయాయి. దేవుడు చెప్పినట్లే ఓడ బయట ఉన్న మనుష్యులందరూ చనిపోయారు, జంతువులన్నీ చనిపోయాయి. కానీ ఓడ లోపల ఉన్నవాళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారు.
నోవహు ఆయన కుమారులు ఓడను చక్కగా నిర్మించారు. నీళ్ళు ఓడను పైకి లేపినప్పుడు అది నీళ్ళపై తేలింది. చివరికొక రోజున వర్షం కురవడం ఆగిపోయింది, సూర్యుడు ప్రకాశించడం ప్రారంభించాడు. అది ఎంత చక్కని దృశ్యమై ఉంటుందో కదా! అంతా ఒక పెద్ద సముద్రంలా మారిపోయింది. కనిపించేదల్లా నీళ్ళపై తేలుతున్న పెద్ద ఓడ మాత్రమే.

నీళ్ళ మీద తేలుతున్న ఓడ
రాక్షసులు చనిపోయారు. ప్రజలను బాధించేందుకు వాళ్లిక లేరు. వాళ్ళందరూ తమ తల్లులతోపాటు మిగిలిన చెడ్డవాళ్ళతోపాటు చనిపోయారు. అయితే వాళ్ళ తండ్రుల మాటేమిటి?
ఆ రాక్షసుల తండ్రులు మనలాంటి మానవులు కాదు. వాళ్ళు మనుష్యుల్లా జీవించడానికి భూమిపైకి వచ్చిన దూతలు. అందువల్ల జలప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు మిగిలిన మనుష్యులతోపాటు చనిపోలేదు. తాము దాల్చిన మానవ శరీరాలను వదిలేసి, తిరిగి దూతల్లా పరలోకానికి వెళ్ళారు. అయితే వాళ్ళు దేవుని దూతల కుటుంబంలో భాగంగా మళ్ళీ అంగీకరించబడలేదు. అందుచేత వాళ్ళు సాతాను దూతలయ్యారు. బైబిలులో వాళ్ళు దయ్యాలని పిలువబడుతున్నారు.
ఆ తర్వాత దేవుడు గాలి వీచేలా చేశాడు, జలప్రళయపు నీళ్ళు ఇంకిపోవడం మొదలయ్యింది. అయిదు నెలల తర్వాత ఓడ ఒక కొండ శిఖరంపై నిలిచింది. చాలా రోజులు గడిచాయి, ఓడ లోపల ఉన్నవారు బయటకు చూసినప్పుడు కొండల శిఖరాలు కనబడ్డాయి. నీళ్ళు క్రమక్రమంగా తగ్గాయి.
అప్పుడు నోవహు కాకి అనే ఒక నల్లని పక్షిని ఓడనుండి బయటకు పంపాడు. అది కొంతసేపు ఎగిరి ఎక్కడా కాలు నిలపడానికి స్థలము లేనందువల్ల తిరిగి వచ్చేసింది. అది చాలాసార్లు అలా వెళ్లి తిరిగి చూసి మళ్ళీ వచ్చి ఓడపైన వాలుతుండేది.

పావురం
ఆ తర్వాత నోవహు భూమ్మీద నీళ్ళు తగ్గాయేమో చూడడానికి ఓడలోనుండి ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురం కూడా కాలు మోపడానికి స్థలం లేనందున తిరిగి వచ్చేసింది. నోవహు దానిని రెండవసారి పంపినప్పుడు అది దాని నోట ఒక ఒలీవ ఆకు తీసుకొని తిరిగివచ్చింది. నీళ్ళు తగ్గిపోయాయని నోవహుకు అర్థమైంది. నోవహు పావురాన్ని మూడవసారి బయటకు వదిలాడు, చివరికి బయట జీవించడానికి దానికి ఆరిన నేల కనబడింది.
అప్పుడు దేవుడు నోవహుతో మాట్లాడాడు. ఆయన, ‘నీతోపాటు నీ కుటుంబాన్నంతటిని, జంతువులను తీసుకొని ఓడ బయటకు వెళ్ళు’అన్నాడు. వాళ్ళు ఒక సంవత్సరం కంటే ఎక్కువకాలం ఓడలోపల ఉన్నారు. వాళ్ళు సజీవంగా మళ్ళీ బయటకు వచ్చినందుకు ఎంత సంతోషించి ఉంటారో మనం ఊహించవచ్చు!
ఆదికాండము 7:10-24; 8:1-17; 1 పేతురు 3:19, 20.


ప్రశ్నలు

  • వర్షం మొదలైన తర్వాత ఎవ్వరూ ఓడలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు?
  • ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు వర్షం పడేలా యెహోవా చేశాడు, నీళ్ళు ఎంత ఎత్తుకు చేరుకున్నాయి?
  • భూమిపై నీళ్ళు నిండే కొద్దీ ఓడకు ఏమయ్యింది?
  • రాక్షసులు జలప్రళయం నుండి తప్పించుకున్నారా, రాక్షసుల తండ్రులకు ఏమి జరిగింది?
  • అయిదు నెలల తర్వాత ఓడకు ఏమి జరిగింది?
  • నోవహు ఒక కాకిని ఓడనుండి బయటకు ఎందుకు పంపించాడు?
  • భూమిపై నీళ్ళు తగ్గిపోయాయని నోవహుకు ఎలా అర్థమయ్యింది?
  • నోవహు, ఆయన కుటుంబం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంపాటు ఓడలో ఉన్న తర్వాత దేవుడు నోవహుకు ఏమి చెప్పాడు?

అదనపు ప్రశ్నలు

  • ఆదికాండము 7:10-24 చదవండి.
    భూమిపై వినాశనం ఎంత పూర్తిగా జరిగింది? (ఆది. 7:23)
    జలప్రళయపు నీళ్ళు ఇంకిపోవడానికి ఎంతకాలం పట్టింది? (ఆది. 7:24)
  • ఆదికాండము 8:1-17 చదవండి.
    భూమికి సంబంధించి యెహోవాకున్న మొదటి సంకల్పం మారలేదని ఆదికాండము 8:17 ఎలా చూపిస్తోంది? (ఆది. 1:22)
  • మొదటి పేతురు 3:19, 20 చదవండి.
    తిరుగుబాటుదారులైన దూతలు పరలోకానికి తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎలాంటి తీర్పు తీర్చబడింది? (యూదా 6)
    నోవహు ఆయన కుటుంబానికి సంబంధించిన వృత్తాంతం, యెహోవాకు తన ప్రజలను రక్షించే సామర్థ్యం ఉందనే మన నమ్మకాన్ని ఎలా బలపరుస్తుంది? (2 పేతు. 2:9)

నోవహు ఓడను నిర్మించడం

నోవహును చూసి నవ్వుతున్న ప్రజలు
నోవహుకు భార్య, ముగ్గురు కుమారులు ఉండేవారు. ఆయన కుమారుల పేర్లు షేము, హాము, యాపెతు. వాళ్ళ ముగ్గురికి భార్యలుండేవారు. అంటే నోవహు కుటుంబంలో మొత్తం ఎనిమిదిమంది ఉండేవారన్నమాట.
దేవుడు నోవహుతో ఒక విచిత్రమైన పని చేయించాడు. ఆయన నోవహుకు ఒక ఓడను నిర్మించమని చెప్పాడు. ఆ ఓడ ఎంతో పెద్దగా ఉండి పొడవాటి పెట్టెలా కనిపించేది. దానిని ‘మూడంతస్తులుగల దానిగా చేసి, దానిలో గదులు ఏర్పాటు చెయ్యి’ అని దేవుడు చెప్పాడు. ఆ గదులు నోవహు, ఆయన కుటుంబం, జంతువులు ఉండడానికి, వాళ్ళకు, వాటికి అవసరమైన ఆహారం నిలువచేసుకొనేందుకే.
ఓడలోకి నీరు జొరబడకుండా, దానిని బిగించాలని కూడా దేవుడు నోవహుకు చెప్పాడు. ‘నేను జలప్రళయాన్ని రప్పించి లోకాన్నంతటిని నాశనం చేయబోతున్నాను. ఓడలోకి ప్రవేశించనివారంతా చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు.
నోవహు, ఆయన కుమారులు యెహోవాకు విధేయత చూపించి ఓడను నిర్మించడం ప్రారంభించారు. కానీ వేరేవాళ్ళు దాన్ని చూసి నవ్వారు. వాళ్ళు తమ చెడుతనాన్ని మార్చుకోలేదు. దేవుడు చేయబోయేదాని గురించి నోవహు చెప్పినప్పుడు ఎవ్వరూ ఆయన మాట నమ్మలేదు.
జంతువులను, ఆహారాన్ని ఓడలోకి తీసుకువెళుతున్న నోవహు కుటుంబం
ఓడ ఎంతో పెద్దది కాబట్టి దానిని కట్టడానికి చాలాకాలం పట్టింది. చివరకు అనేక సంవత్సరాల తర్వాత అది పూర్తయ్యింది. ఆ తర్వాత జంతువులను ఓడలోకి తెమ్మని దేవుడు నోవహుతో చెప్పాడు. కొన్ని రకాల జంతువులను జతలుగా అంటే ఒక ఆడదానిని, ఒక మగదానిని తీసుకొనిరమ్మని దేవుడు చెప్పాడు. మరికొన్ని రకాల జంతువులనేమో ఏడింటి చొప్పున తీసుకొనిరమ్మన్నాడు. అన్నిరకాల పక్షులను కూడా లోపలికి తీసుకొనిరమ్మని దేవుడు నోవహుతో చెప్పాడు. దేవుడేమి చెప్పాడో నోవహు అదే చేశాడు.
తర్వాత నోవహు, ఆయన కుటుంబం కూడా ఓడలోకి వెళ్ళారు. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసేశాడు. లోపల, నోవహు ఆయన కుటుంబం ఎదురు చూడడం ప్రారంభించారు. మీరు కూడా వాళ్ళతోపాటు ఓడలో ఉండి ఎదురు చూస్తున్నట్లు ఊహించుకోండి. దేవుడు చెప్పినట్లు నిజంగానే జలప్రళయం వచ్చిందా?
ఆదికాండము 6:9-22; 7:1-9.

భూమిపై రాక్షసులు
ఎవరో ఒక వ్యక్తి మీ వైపు నడిచి వస్తున్నాడు అనుకోండి. అతను మీ ఇంటి పైకప్పును తాకేంత ఎత్తుగా ఉంటే, మీరు ఏమనుకుంటారు? ఆ వ్యక్తి రాక్షసుడై ఉండాలి! ఒకప్పుడు భూమిపై నిజంగానే రాక్షసులుండేవారు. వాళ్ళ తండ్రులు పరలోకంనుండి వచ్చిన దేవదూతలని బైబిలు చెబుతోంది. అదెలా సాధ్యం?
దౌర్జన్యం చేస్తున్న రాక్షసులు
గుర్తు తెచ్చుకోండి, చెడ్డ దూత సాతాను కష్టాలను కలిగించడానికి చాలా చురుకుగా పనిచేస్తున్నాడని మనం తెలుసుకున్నాము. అతను దేవుని దూతలను కూడా చెడ్డవారిగా చెయ్యాలని ప్రయత్నించేవాడు. చివరకు కొంతమంది దేవదూతలు అతని మాట వినడం మొదలుపెట్టారు. వాళ్ళు పరలోకంలో దేవుడు తమకు నియమించిన పనిని చేయడం మానుకున్నారు. వాళ్ళు భూమ్మీదకు వచ్చి తమ కోసం మానవ శరీరాలను చేసుకున్నారు. ఎందుకో తెలుసా?
దేవుని కుమారులైన ఆ దూతలు భూమిపైవున్న అందమైన స్త్రీలను చూసి వాళ్ళతో జీవించాలని కోరుకున్నారు అని బైబిలు చెబుతోంది. కాబట్టి వాళ్ళు భూమ్మీదికి వచ్చి ఆ స్త్రీలను వివాహం చేసుకున్నారు. అలా చేయడం తప్పని బైబిలు చెబుతోంది, ఎందుకంటే దేవుడు దేవదూతలను పరలోకంలో జీవించడానికే చేశాడు.
దేవదూతలకు వాళ్ళ భార్యలకు పిల్లలు పుట్టినప్పుడు, ఆ పిల్లలు భిన్నంగా ఉన్నారు. బహుశా వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు అంత భిన్నంగా కనిపించివుండరు. కానీ వాళ్ళు అలా, రాను రాను ఎత్తుగా, బలంగా రాక్షసులుగా పెరిగిపోయారు.
ఆ రాక్షసులు చెడ్డవారు. వాళ్ళు ఎత్తుగా, బలంగా ఉండేవాళ్ళు కాబట్టి ఇతరులను బాధపెట్టేవారు. వాళ్ళు తమలాగే ఇతరులు కూడా చెడ్డగా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నించేవారు.
హనోకు మరణించాడు, కానీ భూమిపై మరో మంచి వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు నోవహు. ఆయన ఎప్పుడూ దేవుడు చేయమన్న దానినే చేసేవాడు.
ఒకరోజు నోవహుతో దేవుడు, తాను చెడ్డ వాళ్ళనందరిని నాశనం చేసే సమయం వచ్చిందని చెప్పాడు. అయితే దేవుడు నోవహును, ఆయన కుటుంబాన్ని, అనేక జంతువులను మాత్రం రక్షించాడు. దానిని దేవుడెలా చేశాడో చూద్దాం.
ఆదికాండము 6:1-8; యూదా 6.

ఒక ధైర్యవంతుడు

హనోకు
భూమ్మీద ప్రజలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళలో చాలామంది కయీనులాగే చెడ్డ పనులు చేయడం ప్రారంభించారు. కానీ ఒక వ్యక్తి భిన్నంగా ఉండేవాడు. ఆయనే ఇక్కడ కనిపిస్తున్న హనోకు. ఆయన ధైర్యవంతుడు. తన చుట్టూవున్న ప్రజలు చాలా చెడ్డ పనులు చేస్తున్నా హనోకు మాత్రం దేవుని సేవ చేస్తుండేవాడు.
ఆ కాలంలోని ప్రజలు ఎందుకు అన్ని చెడ్డ పనులు చేసేవారో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి, ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపించి ఆయన తినకూడదని చెప్పిన పండును తినేలా చేసింది ఎవరు? ఒక చెడ్డ దూత. బైబిలు అతనిని సాతాను అని పిలుస్తుంది. అతనే అందరూ చెడ్డగా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
దొంగతనం, హత్య
యెహోవా దేవుడు, ప్రజలు వినడానికి ఇష్టపడని విషయాన్ని హనోకుతో చెప్పించాడు. ‘దేవుడు ఒకరోజు చెడ్డ వారినందరిని నాశనం చేయబోతున్నాడు’ అని హనోకు చెప్పాడు. ఆ విషయం విన్న ప్రజలకు ఎంతో కోపం వచ్చివుంటుంది. వాళ్ళు హనోకును చంపడానికి కూడా ప్రయత్నించి ఉంటారు. కాబట్టి దేవుడు చేయబోయేదాని గురించి ప్రజలకు చెప్పడానికి హనోకుకు ఎంతో ధైర్యం అవసరమయ్యింది.
అలాంటి చెడ్డవారి మధ్య హనోకును దేవుడు ఎంతోకాలంపాటు బ్రతకనివ్వలేదు. హనోకు 365 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. మనం “365 సంవత్సరాలు మాత్రమే” అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఆ కాలంలోని ప్రజలు ఇప్పటికంటే ఎంతో బలంగా ఉండి చాలాకాలం బ్రతికేవారు. అంతెందుకు, హనోకు కుమారుడైన మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు!
చెడ్డ పనులు చేస్తున్న ప్రజలు
హనోకు మరణించిన తర్వాత ప్రజలు అంతకంతకూ చెడ్డవారయ్యారు. ‘వారి ఆలోచన ఎల్లప్పుడు కేవలం చెడ్డదిగానే ఉంది’ అని, దాని ఫలితంగా ‘భూమంతా బలాత్కారంతో నిండిపోయింది’ అని బైబిలు చెబుతోంది.
ఆ రోజుల్లో భూమ్మీద అన్ని సమస్యలు ఉండడానికిగల కారణాల్లో ఒక కారణమేమిటో మీకు తెలుసా? ప్రజలు చెడ్డ పనులు చేసేలా చేయడానికి సాతాను ఒక కొత్త పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించాడు. దాని గురించి మనం తర్వాతి కథలో తెలుసుకుంటాం.
ఆదికాండము 5:21-24, 27; 6:5; హెబ్రీయులు 11:5; యూదా 14, 15.

మంచి కుమారుడు, చెడ్డ కుమారుడు
ఇప్పుడు కయీనును, హేబెలును చూడండి. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. కయీను వ్యవసాయకుడయ్యాడు. అతను ధాన్యాన్ని, పండ్లను, కూరగాయలను పండించేవాడు.
దేవునికి బలులు అర్పిస్తున్న కయీను, హేబెలు
హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. ఆయనకు చిన్న గొర్రె పిల్లలను పెంచడమంటే ఇష్టం. అవి పెరిగి పెద్దవుతాయి కాబట్టి కొద్దికాలానికే హేబెలు చూసుకోవడానికి పెద్ద గొర్రెల మంద తయారయ్యింది.
ఒకరోజు కయీను, హేబెలు దేవునికి అర్పణ తెచ్చారు. కయీను తాను పండించిన పంటను తెచ్చాడు. హేబెలు తన దగ్గరున్న మంచి గొర్రెను తెచ్చాడు. యెహోవా హేబెలును, ఆయన అర్పణను చూసి సంతోషించాడు గాని, కయీనును అతని అర్పణను చూసి సంతోషించలేదు. ఎందుకో తెలుసా?
హేబెలు అర్పణ కయీను అర్పణ కంటె మంచిదైనందుకు యెహోవా ఆయనను చూసి సంతోషించలేదు. హేబెలు మంచివాడు కాబట్టే దేవుడు ఆయనను చూసి సంతోషించాడు. హేబెలు యెహోవాను, తన సహోదరుణ్ణి ప్రేమించాడు. అయితే కయీను చెడ్డవాడు, అతను తన సహోదరుణ్ణి ప్రేమించలేదు.
కాబట్టి తన మార్గాలను మార్చుకొమ్మని దేవుడు కయీనుతో చెప్పాడు. కానీ కయీను వినలేదు. దేవుడు హేబెలును ఎక్కువగా ఇష్టపడినందుకు అతను కోపం పెంచుకున్నాడు. అందుచేత కయీను హేబెలుతో, ‘మనం పొలానికి వెళ్దాము పద’ అన్నాడు. పొలంలో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలుపై పడి, ఆయన చనిపోయేంత గట్టిగా కొట్టాడు. కయీను చేసిన పని ఎంత ఘోరమైనదో కదా?
హేబెలును చంపిన తర్వాత పారిపోతున్న కయీను
హేబెలు చనిపోయినా దేవుడు ఆయనను గుర్తుంచుకున్నాడు. హేబెలు మంచివాడు, అలాంటి వ్యక్తిని యెహోవా ఎన్నడూ మరచిపోడు. కాబట్టి యెహోవా ఒక రోజున హేబెలును తిరిగి బ్రతికిస్తాడు. అప్పుడు హేబెలు మళ్ళీ చనిపోవలసిన అవసరముండదు. ఆయన ఇదే భూమిపై నిత్యమూ జీవించగలుగుతాడు. హేబెలులాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం బాగుంటుంది కదూ?
అయితే కయీనులాంటి వ్యక్తులను మాత్రం దేవుడు ఇష్టపడడు. అందుకే తన సహోదరుణ్ణి చంపిన తర్వాత కయీనును శిక్షిస్తూ దేవుడు ఆయనను తన కుటుంబానికి దూరంగా పంపించాడు. కయీను భూమిపై మరో ప్రాంతంలో జీవించడానికి వెళ్ళినప్పుడు తనతోపాటు తన సహోదరీలలో ఒకరిని తీసుకొనివెళ్ళాడు. ఆమె ఆయనకు భార్య అయ్యింది.
కొంతకాలానికి కయీనుకు ఆయన భార్యకు పిల్లలు పుట్టడం ప్రారంభించారు. ఆదాము హవ్వల మిగిలిన కుమారులు కుమార్తెలు పెళ్ళి చేసుకొన్నారు, వారికి కూడా పిల్లలు పుట్టారు. కొద్దికాలానికే భూమ్మీద చాలామంది ప్రజలు తయారయ్యారు. వారిలో కొందరి గురించి మనం తెలుసుకుందాం.
ఆదికాండము 4:2-26; 1 యోహాను 3:11, 12; యోహాను 11:25.

కష్టమైన జీవితం మొదలవడం
ఏదెను తోట బయట ఆదాము హవ్వలకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఆహారం కోసం వాళ్ళు కష్టపడి పని చెయ్యవలసి వచ్చింది. అందమైన ఫలవృక్షాలకు బదులు తమ చుట్టూ ముండ్లపొదలు, గచ్చతుప్పలు పెరగడం వాళ్ళు చూశారు. ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపించి ఆయనకు స్నేహితులుగా ఉండడం మానుకున్నప్పుడు అలా జరిగింది.
ఆదాము తన కుమారుడితో కలిసి కష్టపడి పనిచేస్తున్నాడు
అంతకంటే దారుణమేమిటంటే, ఆదాము హవ్వలు క్రమేణా చనిపోయే పరిస్థితి వచ్చింది. ఒకానొక చెట్టు పండు తింటే చనిపోతారని దేవుడు వాళ్ళను హెచ్చరించాడని జ్ఞాపకం చేసుకోండి. వారు అలా తిన్న రోజునే చావుకు దగ్గరయ్యారు. వాళ్ళు దేవుని మాట వినకపోవడం ఎంతటి బుద్ధిహీనతో కదా!
ఆదాము హవ్వల పిల్లలు, దేవుడు తమ తలిదండ్రులను ఏదెను తోటనుండి బయటకు పంపించిన తర్వాతే పుట్టారు. అంటే పిల్లలు కూడా ముసలివాళ్ళై చనిపోతారు.
ఆదాము హవ్వలు దేవునికి విధేయత చూపించివుంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు సంతోషంగా జీవించేవారు. వాళ్ళందరూ భూమ్మీద సంతోషంగా నిరంతరం జీవించేవారు. ఎవ్వరూ ముసలి వాళ్ళయ్యేవారు కాదు, రోగులై చనిపోయేవారు కాదు.
ప్రజలు సంతోషంగా నిరంతరం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక రోజు వాళ్ళు అలా తప్పకుండా జీవిస్తారని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. భూమంతా అందంగా ఉండడమే కాకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. భూమ్మీద ప్రతి ఒక్కరు మిగతా అందరికి, అలాగే దేవునికి మంచి స్నేహితులై ఉంటారు.
హవ్వ, ఆమె పిల్లలు
కానీ హవ్వ ఇక ఎంతమాత్రం దేవునికి స్నేహితురాలు కాదు. అందుకే పిల్లలను కనేటప్పుడు ఆమెకు చాలా కష్టమయ్యింది. ఆమె వేదన అనుభవించింది. యెహోవాకు అవిధేయత చూపించడం ఖచ్చితంగా ఆమెకు ఎంతో దుఃఖాన్ని కలిగించిందని మీరు అంగీకరించరా?
ఆదాము హవ్వలకు చాలామంది కుమారులు, కుమార్తెలు పుట్టారు. వాళ్ళకు మొదటి కుమారుడు పుట్టినప్పుడు అతనికి కయీను అని పేరు పెట్టారు. రెండవ కుమారునికి హేబెలు అని పేరు పెట్టారు. వారికేమి జరిగింది? మీకు తెలుసా?
ఆదికాండము 3:16-23; 4:1, 2; ప్రకటన 21:3, 4.

వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికిగల కారణం
ఇక్కడేమి జరుగుతుందో చూడండి. అందమైన ఏదెను తోట నుండి ఆదాము హవ్వలు బయటకు పంపివేయబడుతున్నారు. ఎందుకో తెలుసా?
ఆదాము, హవ్వ ఏదెను తోటలో నుండి పంపించి వేయబడడం
వాళ్ళు చాలా చెడ్డ పని చేశారు. అందుకే యెహోవా దేవుడు వాళ్ళను శిక్షించాడు. ఆదాము హవ్వలు చేసిన ఆ చెడ్డ పని ఏమిటో మీకు తెలుసా?
దేవుడు చెయ్యవద్దన్న పనినే వాళ్ళు చేశారు. తోటలోని చెట్లనుండి ఆహారం తినవచ్చని దేవుడు వాళ్ళతో చెప్పాడు. కానీ ఒక్క చెట్టునుండి మాత్రం వాళ్ళు తినకూడదని, అలా తింటే చనిపోతారని దేవుడు చెప్పాడు. ఆ చెట్టును ఆయన తన స్వంత దానిగా ఉంచుకున్నాడు. వేరే వాళ్ళదేదైనా తీసుకోవడం తప్పని మనకు తెలుసు కదా? అసలు ఏమి జరిగింది?
ఒకరోజు హవ్వ తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పాము ఆమెతో మాట్లాడింది. అదెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి! దేవుడు ఏ చెట్టునుండి పండు తినవద్దని చెప్పాడో ఆ చెట్టునుండే పండు తీసుకొని తినమని ఆ పాము హవ్వతో చెప్పింది. యెహోవా పాములను చేసినప్పుడు వాటికి మాట్లాడే శక్తి ఇవ్వలేదు. అంటే ఆ పామును ఇంకెవరో మాట్లాడేలా చేశారన్నమాట. ఎవరు అలా చేశారు?
అలా చేసింది ఆదాము కాదు. కాబట్టి భూమిని చేయడానికి ఎంతోకాలం ముందు యెహోవా చేసిన వారిలో ఒకరు అలా చేసి ఉండాలి. వాళ్ళు దూతలు, వాళ్ళను మనం చూడలేం. అలా చేసిన దూత చాలా అహంకారిగా తయారయ్యాడు. తాను కూడా దేవునిలా పరిపాలకుడినవ్వాలని అతను అనుకున్నాడు. ప్రజలు యెహోవాకు విధేయత చూపించే బదులు తనకు విధేయత చూపించాలని అతడు కోరుకున్నాడు. ఆ దూతే పామును మాట్లాడేలా చేశాడు.
ఆ దూత హవ్వను మోసం చేయగలిగాడు. పండు తింటే తను దేవునిలా అవుతుందని అతను హవ్వతో అన్నప్పుడు, ఆమె దానిని నమ్మింది. అందుకే ఆమె, అలాగే ఆదాము కూడా ఆ పండును తిన్నారు. ఆదాము హవ్వలు దేవునికి అలా అవిధేయులైనందువల్లనే, వాళ్ళు తమ అందమైన గృహాన్ని పోగొట్టుకున్నారు.
అయితే ఒక రోజు, ఈ భూమంతా ఏదెను తోటలా అందంగా మారేలా దేవుడు చేస్తాడు. ఆ పనిలో మీరు కూడా ఎలా పాల్గొనవచ్చో మనం తర్వాత తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు, ఆదాము హవ్వలకు ఏమి జరిగిందో చూద్దాం.
ఆదికాండము 2:16, 17; 3:1-13, 24; ప్రకటన 12:9.

మొదటి పురుషుడు, స్త్రీ


ముందు పేజీలోని చిత్రానికి ఇక్కడున్న చిత్రానికి మధ్య తేడా ఏమిటి? అవును, ఇక్కడ మనుష్యులు కనిపిస్తున్నారు. వాళ్లే మొదటి పురుషుడు, స్త్రీ. వాళ్లను ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుని పేరేమిటో తెలుసా? ఆయన పేరు యెహోవా. ఆయన ఈ పురుషునికి ఆదాము అని, స్త్రీకి హవ్వ అని పేరు పెట్టాడు.

ఏదెను తోటలో ఆదాము, హవ్వ
యెహోవా దేవుడు ఆదామును ఇలా చేశాడు. ఆయన నేలనుండి కొంత మట్టిని తీసుకొని దానితో ఒక పరిపూర్ణమైన పురుషుని శరీరాన్ని తయారు చేశాడు. ఆ తర్వాత దేవుడు ఆ పురుషుని నాసికలో గాలి ఊదినప్పుడు, ఆదాము జీవించడం ప్రారంభించాడు.

యెహోవా దేవుడు ఆదాముకు ఒక పని ఇచ్చాడు. ఆయా రకాల జంతువులకు పేర్లు పెట్టమని ఆయన ఆదాముకు చెప్పాడు. వాటన్నిటికి సరైన పేర్లు పెట్టేందుకు ఆదాము బహుశా జంతువులను ఎంతోకాలంపాటు పరిశీలించివుండవచ్చు. ఆదాము వాటికి పేర్లు పెడుతున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాడు. అదేమిటో మీకు తెలుసా?

జంతువులన్నిటికి వాటివాటి జతలున్నాయి. ఆడ ఏనుగులున్నాయి, మగ ఏనుగులున్నాయి. ఆడ సింహాలున్నాయి, మగ సింహాలున్నాయి. కానీ ఆదాముకు మాత్రం జత ఎవరూ లేరు. కాబట్టి యెహోవా దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలిగించి, ఆయన ప్రక్కలోనుండి ఒక ఎముకను తీశాడు. ఆ ప్రక్కటెముకను ఉపయోగించి యెహోవా ఆదాము కోసం ఒక స్త్రీని చేశాడు. ఆమే ఆదాముకు భార్య అయ్యింది.

అప్పుడు ఆదాము ఎంత సంతోషించాడో! అలాంటి అందమైన తోటలో జీవించడానికి చేయబడినందుకు హవ్వ కూడా ఎంత సంతోషించివుంటుందో ఆలోచించండి! వారు పిల్లలను కని సంతోషంగా కలిసి జీవించవచ్చు.

ఆదాము హవ్వలు నిరంతరం జీవించాలని యెహోవా దేవుడు కోరుకున్నాడు. వారు భూమినంతటిని ఏదెను తోటలాగే అందంగా మార్చాలని ఆయన కోరుకున్నాడు. ఆదాము హవ్వలు తాము చేయవలసిన ఆ పని గురించి ఆలోచించినప్పుడు ఎంత సంతోషించి ఉంటారో కదా! భూమిని అందమైన తోటగా మార్చే ఆ పనిలో పాల్గొనడానికి మీరు కూడా ఇష్టపడి ఉండేవారా? అయితే ఆదాము హవ్వల ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. ఎందుకో చూద్దాం.

కీర్తన 83:18; ఆదికాండము 1:26-31; 2:7-25.

ఒక అందమైన తోట
ఇక్కడున్న భూమిని చూడండి! ప్రతీది ఎంత అందంగా ఉందో కదా! పచ్చగడ్డిని, చెట్లను, పువ్వులను, జంతువులను చూడండి. ఏనుగులను, సింహాలను మీరు గుర్తుపట్టగలరా?


ఏదెను తోటలోని జంతువులు
ఇంత అందమైన తోట ఎలా వచ్చింది? దేవుడు మన కోసం భూమిని ఎలా సిద్ధం చేశాడో చూద్దాం.

దేవుడు మొదట భూమిని కప్పడానికి పచ్చగడ్డిని తయారు చేశాడు. తర్వాత అన్ని రకాల చిన్నచిన్న మొక్కలను, పొదలను, చెట్లను చేశాడు. పెరుగుతూ ఉండే మొక్కలు, చెట్లు భూమికి అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే అవి అంతకంటె ఎక్కువగానే ఉపయోగపడతాయి. వాటిలో అనేకం మనకు మంచి రుచికరమైన ఆహారాన్ని కూడా ఇస్తాయి.

ఆ తర్వాత దేవుడు నీటిలో ఈదే చేపలనూ ఆకాశంలో ఎగిరే పక్షులనూ చేశాడు. కుక్కలను, పిల్లులను, గుర్రాలను, చిన్న జంతువులను, పెద్ద జంతువులను చేశాడు. మీ ఇంటి దగ్గర ఏయే జంతువులు జీవిస్తుంటాయి? దేవుడు మన కోసం వీటన్నింటినీ చేసినందుకు మనం సంతోషించాలి కదా?

చివరగా దేవుడు, భూమ్మీది ఒక ప్రాంతాన్ని చాలా ప్రత్యేకమైనదానిగా చేశాడు. ఆ ప్రాంతాన్నే ఆయన ఏదెను తోట అని పిలిచాడు. అది సంపూర్ణమైనది. దానిలో ఉన్నవన్నీ అందమైనవే. తాను చేసిన ఆ అందమైన తోటలాగే భూమంతా అందంగా మారాలని దేవుడు కోరుకున్నాడు.

అయితే మరొకసారి ఈ తోట చిత్రాన్ని చూడండి. అక్కడ ఏమి లోపించిందని దేవుడు చూశాడో మీకు తెలుసా? మనం చూద్దాం.
ఆదికాండము 1:11-25; 2:8, 9.

దేవుడు సృష్టిని ప్రారంభించడం
మనకున్న మంచివన్ని దేవుని నుండి వచ్చినవే. ఆయన పగటివేళ వెలుగునివ్వడానికి సూర్యుణ్ణి, రాత్రివేళ వెలుగునివ్వడానికి చంద్రుణ్ణి, అలాగే నక్షత్రాలను చేశాడు. మనం నివసించేందుకు భూమిని సృష్టించాడు.

అయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి దేవుడు మొట్టమొదట చేసినవి కావు. ఆయన మొదట ఏమి చేశాడో తెలుసా? మొదట దేవుడు తనలాంటి వ్యక్తులను చేశాడు. మనం దేవుణ్ణి ఎలా చూడలేమో అలాగే ఆ వ్యక్తులను కూడా చూడలేము. బైబిలులో వాళ్ళు దేవదూతలని పిలువబడుతున్నారు. దేవుడు, ఆ దేవదూతలను తనతోపాటు పరలోకంలో జీవించడానికి చేశాడు.

దేవుడు సృష్టించిన మొట్టమొదటి దూత చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనే దేవుని మొదటి కుమారుడు, ఆయన తన తండ్రితో కలిసి పనిచేశాడు. మిగిలిన వాటినన్నింటిని చేయడానికి ఆయన దేవునికి సహాయం చేశాడు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, మన భూమిని కూడా తయారు చేయడానికి ఆయన దేవునికి సహాయం చేశాడు.

మొదట్లో భూమి ఎలా ఉండేది? మొదట్లో భూమ్మీద ఎవ్వరూ జీవించగలిగేవారు కాదు. భూమి అంతా ఒక పెద్ద సముద్రంలా నీళ్ళతో నిండి ఉండేది. కానీ భూమ్మీద ప్రజలు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆయన భూమ్మీద మనకు కావలసిన వాటిని సిద్ధం చేయడం ప్రారంభించాడు. ఆయన ఏమి చేశాడు?

మొదట భూమికి వెలుగు అవసరమైంది. కాబట్టి దేవుడు, సూర్యుని నుండి వచ్చే వెలుగు భూమిపై ప్రకాశించేలా చేశాడు. రాత్రీ పగలూ ఏర్పడేలా చేశాడు. ఆ తర్వాత దేవుడు సముద్రజలము నుండి భూమి పైకివచ్చేలా చేశాడు.

మొదట్లో భూమిపై ఏమీ ఉండేది కాదు. అది ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలా ఉండేది. అప్పుడు భూమిపై పువ్వులు, చెట్లు, జంతువులు ఏమీ ఉండేవి కావు. చివరకు సముద్రంలో చేపలు కూడా ఉండేవి కావు. భూమిని జంతువులు, మనుష్యులు నివసించేందుకు అనుకూలంగా చేయడానికి దేవుడు ఇంకా ఎంతో చేయవలసి ఉండింది.

యిర్మీయా 10:12; కొలొస్సయులు 1:15-17; ఆదికాండము 1:1-10.

8వ భాగం: బైబిలు ప్రవచిస్తున్నది నెరవేరుతుంది
బైబిలు గతంలో జరిగినవాటి గురించి నిజమైన వృత్తాంతాన్ని తెలియజేయడమే కాక భవిష్యత్తులో జరగబోయేవాటి గురించి కూడా తెలియజేస్తోంది. మానవులు భవిష్యత్తును చెప్పలేరు. అందుకే బైబిలు దేవుని నుండి వచ్చిందని మనకు తెలుసు. బైబిలు భవిష్యత్తు గురించి ఏమి చెబుతోంది?

అది దేవుని మహా యుద్ధం గురించి చెబుతోంది. ఆ యుద్ధంలో దేవుడు చెడుతనాన్నంతటినీ, చెడ్డ ప్రజలందరినీ తీసివేసి భూమిని శుభ్రం చేస్తాడు. కానీ ఆయన తనను సేవించే వాళ్ళను రక్షిస్తాడు. దేవుడు నియమించిన రాజైన యేసుక్రీస్తు దేవుని సేవకులు శాంతి సమాధానాలతో జీవిస్తూ ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కాకుండా లేక మరణించకుండా ఉండేలా చూస్తాడు.

దేవుడు భూమ్మీద ఒక క్రొత్త పరదైసును ఏర్పాటు చేస్తున్నందుకు మనం సంతోషిస్తాం, కాదా? అయితే మనం ఆ పరదైసులో జీవించాలంటే కొన్ని పనులు చేయాలి. దేవుడు తనను సేవించేవారి కోసం సిద్ధంగా ఉంచిన అద్భుతమైన వాటిని అనుభవించాలంటే మనమేమి చేయాలో ఈ పుస్తకంలోని చివరి కథలో తెలుసుకుంటాం. కాబట్టి 8వ భాగం చదివి భవిష్యత్తు గురించి బైబిలు ఏమి చెబుతోందో తెలుసుకోండి.

ఈ భాగంలో

114వ కథ: చెడుతనమంతా అంతం కావడం

115వ కథ: భూమిపై ఒక క్రొత్త పరదైసు

116వ కథ: మనమెలా నిరంతరం జీవించవచ్చు

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget