Halloween Costume ideas 2015

Awesome Facts

అద్భుత వాస్తవాలు


1.విశ్వం గురించిన అద్భుత వాస్తవాలు
చంద్రమండలాన్ని చేరినంతటిలోనే మానవుడు అంతరిక్షాన్ని జయించానని అనుకుంటున్నాడు. అయితే చంద్రమండలం అంతరిక్షంలో కేవలం అంతరిక్షం యొక్క అంచుమాత్రమే. అంతరిక్షం మన ఊహలను తడబాటు చేసేటంతటి విశాలమైనది.

కొన్ని నక్షత్రాలయొక్క దూరాన్ని గురించి ఆలోచిద్దాం. మనకు దగ్గర్లో ఉండి మాములు కంటితో చూడగలిగే నక్షత్రం ఆల్ఫా సెంటౌరి - 40 వేల కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉంది. నీవు వెలుతురుతో సమానమైన వేగంతో ప్రయాణించగలిగినట్లయితే చంద్రున్ని చేరటానికి 1-1/2 సెకన్లు మరియు సూర్యున్ని చేరటానికి 8-1/2 నిమిషాలు పడుతుంది. అదే వేగంతో 4-1/2 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఆల్ఫా సెంటౌరి చేరగలవు. మరెన్నో గెలాక్సీ అనబడే నక్షత్ర వీధి లేక నక్షత్ర సముదాయాలు టెలిస్కోపు సహయంతో కనబడ్తున్నాయి. అవయితే 650 కోట్ల వెలుగు సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నక్షత్రాల పరిమాణం గూర్చి చూద్దాము. ఓరియన్ బెల్టులో ఉండే బేతెల్ గీసు అనే నక్షత్రం యొక్క వ్యాసం 50 కోట్ల కిలోమీటర్లు. ఈ నక్షత్రం కనుక గుల్లగా ఉన్నట్లయితే అందులో భూమి సూర్యుని చుట్టూ తన మామూలు కక్ష్యలో పరిభ్రమించవచ్చు. ఎందుచేతనంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే కక్ష వ్యాసం కేవలం 30 కోట్ల కి.మీ.లు మాత్రమే.

ఇప్పుడు నక్షత్రాల సంఖ్యను గురించి ఆలోచిద్దాము. మన సూర్యకుటుంబం ఈ పాలపుంత అనబడే గెలాక్సీ లేక నక్షత్ర వీధిలో భాగం. అందులో సూర్యుడు ఒక్కటి మాత్రమే. మరియు పాలపుంత అనేది అనేక నక్షత్ర వీధులలో ఒక్కటి మత్రమే మనము టెలిస్కోపులో చూడగలిగినంతటిలో కనీసం పదికోట్ల నక్షత్ర సముదాయాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఇంకా ఎన్నో వున్నాయి.
ఈ గ్రహలు తమ తమ కక్ష్యలలో ఎంత ఖచ్చితంగా తిరిగుతున్నాయో అనేది కూడా ఆలోచిద్దాము. మనుష్యుని చేత ఎంతో చక్కగా తయారుచేయబడ్డ గడియారము కూడ ఆకాశమందలి నక్షత్రాలంత ఖచ్చితమయినది కాదు. ప్రతి నక్షత్రాన్ని, గ్రహన్ని సృష్టించి, వాటికి ప్రణాళిక ఏర్పాటు చేసిన ఏదో ఒక అత్యున్నతమైన జ్ఞానము, తప్పనిసరిగా ఈ విశ్వానికంతటికి వెనుక ఉండి ఉండాలి.
ఎంత విశాలమైనది విశ్వం! ఎంత చిన్నవాడు మానవుడు!! బైబిలును వ్రాసిన వారిలో ఒకరు ఈ విధంగా వ్రాసారు. నేను రాత్రివేళ ఆకాశాన్ని, నక్షత్రాలను చూసినప్పుడు ఓ దేవా! నీవు ఈ అల్పుడైన మానవుని యెడల ఆసక్తి ఎందుకు చూపుతున్నావో అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. అయినప్పటికి ఈ విశ్వమంతటికి సృష్టికర్తయైన దేవుడు మన గురించి జాగ్రత్త తీసికొంటున్నాడు. ఈ అద్భుతమైన సత్యాన్ని బైబిలులో మనం నేర్చుకుంటాము.

ఏదైన ఒక వస్తువు యొక్క విలువ దాని పరిమాణం బట్టి నిర్ణయమవదు. ఒక లక్షాదికారికి ఎకరాల కొద్దీ భూమి ఉండవచ్చు. కాని వాని యొక్క చిన్న బిడ్డ తనకుండిన ఎంతో భూమికంటె అతనికి విలువయినవాడు. దేవుని విషయంలోనూ అంతే. అంతరిక్షం ఎంతో గొప్పది కావచ్చు. నక్షత్రాలు వాటి పరిమాణంలో మరెంతో పెద్దవి కావచ్చు. కాని దేవుడు మానవుని ఆయన యొక్క మిగిలిన సృష్టికంటె ఎక్కువగా ప్రేమించి కాపాడుతున్నాడు. మానవుడు దేవునికి కుమారునిగా ఉండుటకు, దేవునితో సహవాసం కొరకు సృష్టించబడ్డాడు. దేవునితో అటువంటి సహవాసం కలిగి యుండటం మన ఉనికికి ఒక అర్థాన్ని, ఒక ఉద్దేశ్యాన్ని ఇస్తుంది. మనం సృష్టిలో దేవుని యొక్క గొప్పతనాన్ని చూడగలం. కాని దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని, మరియు మన గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడని బైబిలు బయలు పరుస్తుంది.

2. మానవుని గురించిన అద్భుత వాస్తవాలు
మానవుడు దేవుని సృష్టియొక్క కిరీటము. విశ్వములో నక్షత్రాలకంటే గొప్పది మరియు ఎంతో అద్భుతమైనది మానవునకు మానవుని గూర్చిన అద్భుతమే. అన్నింటికంటే మొదటిగా మన శరీరాలవైపు చూచుకొన్నట్లయితే దేవుడు ఎంత అద్భుతంగా వాటిని సృష్టించాడో చూడవచ్చును. మన యొక్క ఒక్కోకంటిలో 13 కోట్ల చిన్న చువ్వలవంటివి నలుపు తెలుపు దృష్టి కోసం, మరియు 70 లక్షలు కోణాలవంటివి రంగు దృష్టికోసం ఉంచబడినవి. మరియు 15 లక్షల సందేశాలను ఒకేమారు అందుకోగలవు. ఈ విధంగా ఒక కన్ను పనిచేసిన తీరులో యాంత్రికంగా పనిచేయించటానికి మనకు రెండు లక్షల యాబైవేలు టెలివిజన్ ట్రాన్స్ మీటర్లు (ప్రసారం చేసేవి) రిసీవర్లు (ప్రసారాలను అందుకునేవి) కావాలి.

అలాగే చెవిగురించి ఆలోచిద్దాం. శ్రవణేంద్రియ సంబంధమైన నరము కేవలం 3/4 అంగుళం పొడవు మరియు పెన్సిలులో ఉండే నల్లగా వ్రాసే పదార్థమంత వ్యాసంతో ఉంటుంది. అయితే దానిలో 30 వేల వెద్యుత్ కు సంబంధించిన సర్క్యూట్స్ అనబడేవి ఇమిడి ఉంటాయి. ఫియానో వాయిద్యము యొక్క వాయించే మీటల బల్లకు 88 మీటలు మాత్రమే ఉంటాయి. అయితే మన లోపలి చెవిలో మీటల బల్లకు సుమారు 1100 మీటలు ఒకే దూరపు ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి. అది బహు సున్నితమైనది. ఒక ఫియానో వాయించినప్పుడు ఏ రెండు మీటలు నొక్కినప్పుడు వెలువడే 12 వేరు వేరు స్వరాలను అది అందుకోగలదు.

నీ యొక్క గుండె గురించి చూడు. అది ఒక సంవత్సరానికి 4 కోట్ల మార్లు నీ శరీరంలో సెలవనేది తీసుకోకుండా కొట్టుకుంటుంది. అది ప్రతి రోజు నీ తల నుండి పాదాల వరకు లక్ష కిలోమీటర్లు రక్త నాళాల ద్వారా రక్తాన్ని ప్రవహింపజేస్తూ ఉంటుంది. నీ యొక్క శరీరం కూడ ప్రతిరోజు 172 కోట్ల ఎర్ర రక్త కణాలను తయారు చేసి పాడైన లేక పనికి రాకుండా పోయిన కణాల స్థానాలను భర్తీ చేస్తూ వుంటుంది. ఈ దినాన్న నీవు బ్రతికి ఉండడం ఒక అద్భుతం కాదా!

వినాళ గ్రంథులు గురించి చూద్దాం నీ శరీరంలో ఉండిన థైరాయ్ డ్ అనే వినాళ గ్రంథికి రోజుకు 1/5000 గ్రాము (ఒక గ్రామును 5000 వంతులు చేయగా అందులో ఒకవంతు) ఆయోడిన్ అనే పదార్థము కావాలి. అయితే అంత సూక్ష్మమైనట్టి పదార్థము నీవు పసిపాపగా వున్నప్పుడు తక్కువైనట్లయితే, నీవు తప్పనిసరిగా మానసిక రుగ్మత కలిగిన వాడవయ్యుందువు. పిట్యూటరీ అనే వినాళ గ్రంథి మరియెంతో విచిత్రమైంది. దానినుండి వెలువడే హర్మోను ఒక గ్రాములో పది లక్షోవంతు మాత్రం బరువు తూగుతుంది. ఆయినను, నీవు ఎదుగుతున్న సంవత్సరాలలో ఆ హర్మోను విడుదలలో ఏ మాత్రం హెచ్చుతగ్గులు ఉండినా నీవు మానసికంగా మరియు శారీరకంగా ఆస్వాభావికంగా ఉండి ఉండేవాడివి. ఈ దినాన్న నీవు ఆరోగ్యముగా ఉన్నావంటే దానికి కారణము నీ శరీరంలో ఉన్న ఎంతో చిక్కుతో కూడిన యాంత్రక పనితనమంతా సరిగా పనిచేస్తున్నందునే.

బైబిలు వ్రాసిన ఒకాయన ఏమన్నాడంటే నన్ను అద్భుతంగా సృష్టించినందుకు ఓ దేవా! నిన్ను స్తుతిస్తున్నాను. మానవ శరీరంలో దేవుడు సృష్టించిన సమతూకము మరియు అందము నిజంగా విస్మయంతో కూడుకొన్నది.

మానవ శరీరంలో ఉండిన కొన్ని ఇటువంటి అద్భుతాలు జంతువుల శరీరాలలో కూడా ఉంటాయి. కాని మానవునికి అతనిలో జీవాత్మ ఉంటుంది. అది అతనిని ఆలోచింపచేస్తుంది. కారణాలు వెదికేలాగు చేస్తుంది. మానవుడు తన ఆలోచనలను వ్రాసియుంచి తనకున్న తెలివిని భవిష్యత్తు తరము వారికి అందించగలడు. ఈ విధంగా జంతువులు చేయలేవు. మానవుని యొక్క బుద్ది దేవుని యొక్క మహోన్నత జ్ఞానంలో ఒక భాగం అయి వున్నది.

కాని మానవునికి తనయొక్క జీవాత్మ కంటే లోతైన మరియెక్కువ ఆశ్చర్యకరమైనది ఇంకొకటి ఉంది. అది ఆత్మ ఇది నిజంగా మనలను సృష్టి అంతటికంటె పైన ఉంచుతుంది. ఈ ఆత్మ మన ఉనికి అంతటిలో లోతైనది మరియు అది దేవుడు ఉన్నాడనియు ఒక అత్యున్నతమైన శక్తికి మనము నైతికంగా లెక్క అప్పచెప్పాలనియు మనకు చెబుతుంది. దేవుడున్నాడని మనకు బోధించేది మనకున్న నాగరికతగాని, విద్యగాని కాదు. అలాగే మతం కూడ కాదు, అనాగరికులైన అడవులలో వుండే మనుష్యులను నీవు సందర్శించినట్లయితే అటువంటి కృరుల మధ్య కూడ దేవుని గూర్చిన ఆలోచనలను నీవు చూడగలవు. వారు ఒక వస్తువునో లేక మరొకదానినో పూజిస్తారు. ఎందుచేతనంటే వారిలో వుండే ఆత్మ ఒక మహోన్నతమైన శక్తికి వారు లెక్క అప్పచెప్పవలసి ఉంటుందని చెబుతుంటుంది. ఏ ఒక్క జంతువుకు కూడ లెక్క అప్ప చెప్పాలనే ఆత్మీయపు ఆలోచన సహజంగా ఉండదు. కేవలం మానవునికి మాత్రమే మనస్సాక్షి ఉంది. అందు చేతనే నీవు భక్తిగల కోతిని గాని, లేక ఆత్మ సంభంది అయిన కుక్కను గాని ఎప్పుడూ చూడలేది.

మానవుడు భూమిపై తన జీవిత కాలానికి తర్వాత ఉండిన జీవితం కొరకు సృష్టించబడ్డాడు. మానవుడు నిత్యత్వము యొక్క సృష్టి. పరిణామ సిద్దాంత వాదులు మానవులకు, జంతువులకు ఏ బేదము లేదనవచ్చు అయినప్పటికి ప్రతి దేశములో పసిపాపను చంపడం, ఒక పెద్ద ఏనుగును చంపుట కంటె ఎంతో పెద్దదైన నేరం. ఒక ఏనుగు ఎంతో పెద్దదయి ఉండవచ్చు. కాని ఒక చిన్న పసిపాప ఎంతో విలువైనది. ఎందుచేతనంటే అది దేవుని రూపంలో తయారు చేయబడింది. మానవుడు దేవుని సృష్టి అంతటికి కిరీటమై యున్నాడు. అతడు దేవునితో సహవాసం చెయ్యటానికి సృష్టించబడ్డాడు. 3. విప్లవం గురించిన అద్భుత వాస్తవాలు
విప్లవం అనే మాట ఈ దినాల్లో మామూలు మాట అయిపోయింది. మనందరిలో విప్లవం రావలసిన పరిస్థితి గురించి ఆలోచిద్దాం. మనందరము మన తల్లిదండ్రుల వద్ద నుండి ఏదో ఒక మతాన్ని వారసత్వంగా పొందాము. మరియు ఆ మతముతో పాటు కొన్ని అభిప్రాయములను కూడా పొందాము. ఈ అభిప్రాయాలు అనేక మందిని వారికి చిన్నతనము నుండి బోధింపబడిన వాటిని ప్రశ్నించకుండా ఉండేలా చేస్తున్నవి.

శాస్త్రానికి సంభందించిన విషయంలో, మానవుడు ఎప్పుడూ తన పూర్వులు చెప్పిందే నమ్మినట్లయితే ఈ పాటికి అభివృద్ధి ఉండేది కాదు. ఒక ఉదాహరణ గురించి ఆలోచించండి. కొన్ని వేల సంవత్సరాల వరకు, భూమి విశ్వానికి మధ్యలో ఉన్నదని సూర్యుడు, ఇతర నక్షత్రాలు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నవని మానవులు నమ్మేవారు. కాని 450 సంవత్సరాల క్రితం కొపెర్నికస్ అనే పేరుగలతడు తన పూర్వులు నమ్మిన దానిని గూర్చి ప్రశ్నించి వారు నమ్మినది తప్పని ఋజువు చేసాడు. మతానికి సంబంధించిన విషయంలోనే, అయ్యో, ప్రజలు గ్రుడ్డిగా వారి తల్లిదండ్రులు లేక పూజారులు చెప్పినవి నమ్ముతారు. నీ గురించి ఏమిటి? నీ మతపరమైన నమ్మకాలు ఏమిటి? అవన్నీ కేవలం నీ యొక్క పూర్వికుల నుండి గ్రుడ్డిగా వారసత్వంగా వచ్చినవా? లేక దేవుని గుర్చి, నిత్యత్వం గూర్చి నీ స్వంత ఆలోచనా జ్ఞానంతో ఆలోచించి, నీకు నీవుగా ఒప్పుకున్న వాటిని గూర్చి నిశ్చయత కలిగి ఉన్నావా?

యేసుక్రీస్తు ఇప్పటివరకు ప్రపంచం చూచియున్న వారిలో గొప్ప విప్లవాత్మకమైనవాడు. ఎందుచేతనంటే ఆయన మానవుని లోపటనుండి మార్పు చేయడానికి వచ్చారు. ఎప్పుడైతే మానవుడు ఈ విధమైన అంతరంగిక మార్పును అనుభవిస్తాడో అప్పుడు బాహ్యమైన మార్పు దానికదే కలుగుతుంది. మనం మొదట సమస్యయొక్క మూలము గూర్చి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వైద్యుడు ఒక రోగికి చికిత్స చేసేటప్పుడు బాహ్యమైన లక్షణాలకు మాత్రమే చికిత్స చేయడు. అతడు రోగానికి చికిత్స చేస్తాడు. ఉదాహరణకు కేన్సరు (రాచపుండు) వ్యాధితో భాదపడుతున్న ఒక వ్యక్తి ఆకలి లేదని ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఏ వైధ్యుడైనా కేన్సరుకు చికిత్స చేయకుండా కేవలం ఆకలి లేనందుకు మందు ఇచ్చినట్లయితే అతడు వట్టి మూర్ఖుడు అవుతాడు. అలాగునే ఎవరైతే మన సమస్యలకు బాహ్యమైన విప్లవాత్మక మార్పు పరిష్కారం అని ఆలోచిస్తారో వారుకూడ అటువంటి పొరపాటు చేసేవారే అవుతారు. వారు లక్షణాలను మాత్రం పోయేలా చేయటనికి ప్రయత్నించుతారు. కాని వ్యాధి మాత్రం అలాగునే నిలిచి వుంటుంది.

మానవునిలో మార్పు రానంతవరకు ప్రపంచము, సంఘము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లేదు.
4. మానవుని యొక్క అవసరము గురించిన అద్భుత వాస్తవాలు
మానవునికి అన్నిటికంటె గొప్ప అవసరమేది? అది తిండా లేక గృహమా లేక ఉద్యోగమా?
మానవుడు చనిపోయిన తరువాత అతనికి ఏమవుతుంది. అతడికి కావలసినంత తిండి, ఉండటానికి స్థలము, ఉద్యోగము తన జీవిత కాలమంతా ఉండినా, చావు మాత్రమే మానవుని ఉనికికి ఆఖరా? కాదు.

భూమిపైన జీవితం నిత్యత్వానికి ఉపోద్ఘాతము లాంటిది. మనం ఇక్కడ భూమిపై అర్హత నిశ్చయింపబడే కాలములో (ప్రోబిషన్ పీరియడ్ లో) ఉన్నాము. మరియు దేవుడు మనలను గమనిస్తున్నాడు. మన నిత్యత్వము ఎలా ఉంటుందో భూమిపై మన జీవితము నిర్ణయిస్తుంది. దేవునికి మన ప్రతి ఒక్కరి జీవితంలో యదార్థత ఏమిటో తెలుసు. మనం మన స్నేహితులను మన మంచితనం గురించి మభ్యపెట్టవచ్చు. కాని దేవునిని మభ్యపెట్టలేము. దేవుని దృష్టిలో అందరము నేరం చేసిన వారమే, ఎందుచేతనంటే మనమందరము ఆయన యొక్క ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన ప్రమాణాలకు తక్కువగా ఉంటున్నాము. మానవుడు దేవునితో సహవాసం చెయ్యటానికి సృష్టించబడ్డాడు. అది అతడు నెరవేర్చలేనట్లయితే అతడు భూమిపై ఉనికి కల్గి ఉండుటలో ఆయన తొలి ఉద్దేశాన్ని నెరవేర్చడం లో తప్పిపోయినట్లే.

అతడి పైనున్న పాపం యొక్క అపరాధము తీసివేయబడనట్లయితే దేవునితో ఈ సహవాసాన్ని ఎప్పుడును అనుభవించలేడు. ఇది మానవుని యొక్క గొప్ప అవసరం. ఎలాగు మన పాపం యొక్క అపరాధం తీసివేయబడుతుంది

కేవలం మన యొక్క పాపాలను గూర్చి విచారపడితే చాలదు. నేను న్యాయస్థానంలో బ్యాంకు దోపిడీని గురించి శిక్షింపబడినట్లయితే మరియు న్యాయాధిపతి నా తండ్రి అయితే నేను చేసిన పనికి విచారపడినంత మాత్రాన ఆయన నన్ను వెళ్ళిపోనివ్వడు. ఆయన న్యాయ స్థానంలో న్యాయాధిపతిగా కూర్చుని ఉన్నాడు. కనుక నేను విచారిస్తున్నప్పటికి మరియు ఆయన నన్ను తన కుమారునిగా ప్రేమిస్తున్నప్పటికి నేను చేసిన నేరానికి ఆయన నన్ను తప్పనిసరిగా శిక్షించాల్సివుంది.

మనము దేవునిని ఒక న్యాయవంతుడుగా నమ్మినట్లయితే ఆయన తప్పనిసరిగా మానవమాత్రుల కంటె ఎక్కువ న్యాయవంతుడు. అప్పుడు ఆయన మనం విచారించినంత మాత్రాన లేక ఆయన మనలను ప్రేమించినంత మాత్రమున ఏ విధంగా మనలను వెళ్ళిపోనిస్తాడు? న్యాయం శిక్షను అవశ్యంగా ఆడుగుతుంది.

అయితే నా తండ్రి నాకు సహయం చెయ్యటానికి న్యాయస్థానంలో ఒక విధంగా చేయగలడు. చట్ట ప్రకారం నాకు ప్రాయశ్చిత్తంగా ఒక లక్ష రూపాయలు జరిమానా అయినట్లైతే, నాకు తీర్పు ఇచ్చిన తరువాత. ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ములో ఒక లక్షరూపాయలు తీసుకుని నాకిచ్చి నా కుమారుడా! ఇదిగో డబ్బు, వెళ్ళి నీ జరిమానా కట్టి స్వతంత్రుడవుకా అని చెప్పవచ్చు. ఒక న్యాయాధికారిగా నన్ను శిక్షించవచ్చు మరియు ఒక తండ్రిగా అప్పుడు ఆ శిక్షను చెల్లించవచ్చును.

ఇదే దేవుడు చేసింది. ఒక న్యాయాధికారిగా మనందరిని మన పాపాలను బట్టి నిత్య మరణంలోనికి పంపాలి. కాని ఆయన మనలను ప్రేమించాడు. కాబట్టి యేసుక్రీస్తు అనే వ్యక్తి రూపంలో భూమిపైకి దిగివచ్చి ఆ శిక్షను ఆయనే చెల్లించాడు.క్రీస్తు మన పాపాల కొరకు చనిపోయినాడు.

కాని ఇప్పుడు మనం చేయవలసింది కొంత వుంది. ఎప్పుడు నాతండ్రి న్యాయస్థానంలో డబ్బును నాకు ఇవ్వజూపాడో, అప్పుడు నేను తీసుకోననట్లయితే నేను స్యతంత్రుడను కాలేను. క్రీస్తు ద్వారా దేవుడు మనకు ఇవ్వజూపుతున్న క్షమాపణ సరిగా అటువంటిదే. అది మనం స్వీకరించవలసివుంది. మనము దానిని అంగీకరించనట్లయితే, దాని నుండి ఉపయోగాన్ని పొందలేము. 5. దురలవాట్ల గురించిన అద్భుత వాస్తవాలు
ప్రపంచమంతా ప్రజలు ఆహ్లదం, గొప్ప పేరు, ఐశ్వర్యం లేక అధికారం కోసం వాటి వెనుక పరుగెడుతున్నారు.
కాని వీటన్నిటిని కలిపే నియమం ఒకటి వుంది. దానిని క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని పిలవవచ్చును.
ఈ నియమము ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటానికి సుఖమును గురించిన వెదుకులాటను ఉదాహరణగా తీసుకొందాం. ప్రారంభంలో ఒక సుఖము దానిని కొద్ది కొద్దిగా యథేచ్చగా పొందుతున్నప్పుడు చెప్పుకో తగినంత సంతృప్తిని ఇస్తుంది. ఆ సుఖం పుగాకు వలనగాని, మత్తు పదార్థాలు, రాక్ సంగీతం, మాదక ద్రవ్యాలు, బూతు పుస్తకాలు లేక చట్ట వ్యతిరేక లైంగిక సంబంధం అవ్వవచ్చు. కాని ఒక్కమారు యథేచ్చగా వీటిలోనికి వెళ్ళినట్లయితే ఇవి దొరికిన వానిచుట్టు వాటియొక్క పట్టును మరి ఎక్కువగా బిగించి చివరకు అతడు ఒక వ్యసనానికి బానిసై ఆ సుఖం అతడిని కదలిస్తూ ఉంటే తప్ప జీవించలేని స్థితికి వస్తాడు.

ఎలా అయినప్పటికి, ఆ వ్యసన పరుడు తనకు ఇంతకు ముందు ఉన్నంత సుఖానుభూతి కొరకు ప్రతిమారు సుఖాన్నిచ్చే పదార్థపు మోతాదును పెంచాల్సి వుందని గ్రహిస్తాడు. ఇదే క్షీణ ప్రతిఫల సిద్ధాంతము. ( తక్కువగా తిరిగి పొందే నియమము) ఆ వ్యసన పరుడు అప్పుడు వడ్రంగివాడు ఉపయోగించే చెక్కను పట్టుకునే యంత్రములో చిక్కుకున్నట్లు గ్రహిస్తాడు. కాని తనకు తాను బయటకు విడిపించుకోలేడు.

కీర్తిని గురించి వెదుకులాటగురించి ఆలోచిద్దాం. ఈ ప్రయత్నం వ్యక్తిగత పందాలలో కావచ్చు. సినిమాలు గూర్చి కావచ్చు. ఆటలలో కావచ్చు, లేక ఏదైన కావచ్చు. దానికి అంతం లేదు. ఒకరు పట్టణంలో కీర్తి సాధించినట్లయితే అతడు దేశమంతటిలో ప్రాముఖ్యత పొందాలని చూస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రజలు వారి మనస్సులు కూడా నాశనం చేసుకుంటారు. అంతేగాక అందరికంటె పైన ఉండాలనే ఉద్దేశంతో, ఇతరుల మనస్సులు కూడా నాశనం చేస్తారు. వీటన్నిటి ఆఖరున వారు సాధించేదేమిటి? ఇంకేమీ సాధించేది లేక నిరుత్సాహపడిపోతారు. ఎందరో పేరు పొందిన సినీతారలు ప్రపంచమంతా కీర్తి సంపాదించి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుచేతనంటే వారి అంతరంగిక అసంతృప్తిని బట్టి.

ఈ నియమము ఐశ్వర్యం గూర్చిన వెదుకులాట విషయములో ఎలా పనిచేస్తుందో చూద్దాము. ఒక మనుష్యుడు తన అవసరాలను మించి ధనాన్ని కూడ బెట్టుకోవడం మొదలుపెట్టినప్పుటి నుండి, అతడు ఎప్పటికీ పూర్తి కాని ఒక పరుగు పందెం పరుగెట్టడం మొదలు పెడతాడు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుని అవసరాలు తీరటానికి కావలసినన్ని పదార్థ ఉత్పత్తులు ఉండినా ఒక్క మనుష్యునిలో లోభం, లేక అత్యాశను సంతృప్తి పరచడానికి చాలినంత లేదు. ఇక్కడ కూడ క్షీణ ప్రతిఫల నియమము ( తక్కువగా తిరిగి పొందడం అనే నియమము) పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఖరీదైన ఆహరము, ప్రయాణం చెయ్యడము మరియు ప్రదేశాలను చూడటం వలన వచ్చే ఆనందం సంఘంలో ఉన్నతమైన జీవితం మొదలైనవి ఒక మనుష్యుడు ఐశ్వర్యాన్ని కూడబెట్టుకోవడం ద్వారా పొందగలిగినప్పటికి ఇప్పుడు అతని యొక్క సంతృప్తి అంతకంతకూ తక్కువైపోతుంది. అతడు వీటన్నిటిలో ఒక విధమైన శూన్యతను, ఖాళీను అనుభవిస్తాడు. అతనికి తక్కువ ఐశ్వర్యం వున్నప్పుడు అతడు సంతోషంగానూ తక్కువ ఉద్రేకాలతో ఉండేవాడని తెలుసుకుంటాడు. అయితే ఇప్పుడు అతనియొక్క కుటుంబ జీవితం కూడా నాశనమయిపోయివుంటుంది.

ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క మాటలు యదార్థమని ఋజువు అయ్యాయి. ఒక మనుష్యుని యొక్క జీవితం అతనికి కలిగి యున్న ఎన్నో వస్తువులను బట్టి ఉండదు. ( ఒకని కలిమి విస్తరించుట అతని జీవమునకు మూలము కాదు).

అధికారం విషయంలో కూడా ఈ నియమము ఎలా పని చేస్తుందో ఆలోచిద్దాం. రాజకీయాలు అవ్వచ్చు మరే ఇతరమైన విషయమైనా అవ్వచ్చు. రాజకీయాల్లో ఒకడు ఎమ్.పి. అయినందుకు ఒకప్పుడు సంతృప్తిపడినవాడు ఇప్పుడు అతని కన్నులు మంత్రిపదవిపై ఉంటాయి. చివరకు అతడు దేశంలో అత్యున్నత స్థానాన్ని సాధించినా అతడు అప్పటికిని విచారంతోనూ, నిరుత్సాహంగా ఉంటాడు. ఒక పాత సామెత చెప్పినట్టు కిరీటం ధరించిన తలకు అసౌఖ్యం ఉంటుంది అతడు ఎవరికీ తెలియని వ్యక్తిగా ఉన్నప్పుడు అతడు చంపబడే ప్రమాదంలో లేడు. ఎందు చేత ఈ విధమైన నిరుత్సాహం, శూన్యత ఈ పరిస్థితిలన్నిటిలో వున్నాయి?

మానవుడు నిత్యత్వం యొక్క సృష్టి అని తనకు తాను తెలుసుకునేలా ఈ క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అనే నియామాన్ని దేవుడే, గొప్పగాను, ఆఖర్షణీయముగాను, వున్నవాటిని వెదికి పట్టుకోవడంలో వుంచాడు.

మానవుడు సుఖంతో, కీర్తితో, ఐశ్వర్యంతో లేక అధికారంతో ఆ శూన్యతను నింపుకోవాలని నిరంతరం వెదుకుతూ ఉంటాడు కాని అది సాధించలేని వెదుకులాట. అందుకొరకు బైబిలు ఏమి చెబుతుందంటే మానవుని హృదయంలో దేవుడు నిత్యత్వాన్ని ఉంచాడు అని చెబుతుంది. దేవునిలో విశ్రాంతి పొందేవరుకు మన హృదయాలు ఎల్లప్పుడు విశ్రాంతి లేకుండానే ఉంటాయి. కాని ఏదైన త్రాగ తగినది ఒక ప్రాత్రలో నింపాలంటే ముందుగా ఆ పాత్రను ఎలాగు శుబ్రపరుస్తామో, అలాగే మన హృదయాలను కూడా మన సృష్టికర్తకు నివాస యోగ్యంగా ఉండే విధంగా అన్ని పాపాల నుండి శుభ్రపరచాలి.

క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు కనుక మన హృదయాలు పాపం నుండి శుభ్రపడతాయి. మరియు స్వచ్చంగా తయారు చేయబడతాయి. కనుక దేవుడు అక్కడ నివాసం చేస్తాడు.

6. తీర్పు దినము గురించిన అద్భుత వాస్తవాలు
ఈ భూమిపై మన జీవితం మరణ దినానికి ఒక్కొక్క దినం లెక్క తగ్గించుకుంటూ లెక్క పెట్టుకోవడం లాంటిది. రోజు రోజుకు లెక్క తక్కువ అవుతూ చివరకు మనం చనిపోయి శరీరాలను విడిచిపెట్టే దినానికి వెళ్తుంది. కాని తరువాత ఏమిటి?

మనం చనిపోయిన తరువాత మనము మన జీవితాల గురించి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుందని బైబిలు చెబుతుంది. మనం ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు కోట్లాది ప్రజలు ఎందరో ఈ భూమిపై జీవించి చనిపోయారు. అటువంటిది దేవుడు ఏలాగు ప్రతి మానవుడు జీవితకాలంలో చేసిన ప్రతి విషయం అనగా అతడు చేసింది, చెప్పింది మరియు ఆలోచించింది ఏవిధంగా పొందుపరచి ఉంటాడని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి మానవుని యొక్క జ్ఞాపకమే ఈ విషయాలన్ని గుర్తుగా పొందుపరచిన గ్రంథం.

జ్ఞాపకం మన ఆలోచనలను, మాటలను, పనులను, వైఖరిని మరియు కారణాలను నమ్మకంగా పొందుపరచి ఉండే వీడియో టేపు వంటిది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతడు తన శరీరాన్ని ఈ భూమిపై విడిచి పెట్టినా అతడి జ్ఞాపకం అతడి ప్రాణంతో పాటు చనిపోయిన వారి ఆత్మలుండే ప్రదేశానికి వెళ్తుంది. ఎప్పుడైతే ఆఖరుగా తీర్పు దినం వస్తుందో అతడు దేవుని ముందు నిలువబడి, భూమిపై అతడు జీవించిన జీవితం అంతటి గురించి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది.

ఆ దినాన్న తీర్పు కొరకు ఒక్కొక్క మనిషి యొక్క వంతు వచ్చినప్పుడు అందరు అతని యొక్క జీవితంలో పొందు పరచబడిన వాటిని చూచునట్లు దేవుడు కేవలం మానవుని యొక్క స్వంత జ్ఞాపకం అనే వీడియో టేపును వెనక్కు త్రిప్పాల్సివుంటుంది. ఎవ్వరు కూడా అందులో చూపబడుతున్న వాటి ఖచ్చితం గూర్చి ప్రశ్నించలేరు. ఎందుకంటే అది ప్రతి వ్యక్తి యొక్క స్వంత జ్ఞాపకం అతని యొక్క జీవిత విశేషాలను తిరిగి చూపిస్తుంది.

ఆ రోజున ప్రజలు ధరించిన బాహ్యమైన మర్యాదపు పొర మరియు మతము వలవబడుతుంది. మరియు నిజమైన అంతర్గత వ్యక్తి బయలు పరచబడతాడు. మతము ఏ వక్కరిని ఆ దినాన్న రక్షింపలేదు. ఎందుకనగా అందరు పాపం చేసారని చూస్తారు ఎటువంటి మతాన్ని వారు అచరించినా చేసిన మంచి పనులు, బీదలకు లేక క్రైస్తవ సంఘాలకు దేవాలయాలకు లేక మసీదులకు ఇచ్చిన ధనం కూడా ఏ ఒక్కరిని రక్షింపలేవు. ఎందుచేతనంటే ఈ మత సంబంధమైన కార్యములు ఏవి పొందుపర్చబడిన మన యొక్క పాపములను తుడిచి వెయ్యలేవు. మన యొక్క పొందుపర్చబడిన దుష్ట క్రియలన్ని శాశ్వతంగా దేవుని దృష్టి నుండి తుడిచి వేయడానికి ఒకే ఒక మార్గమున్నది. దానిని బట్టి అవి తిరిగి తీర్పు దినాన్న చూపబడవు. మన యొక్క మంచి క్రియలు మన యొక్క దుష్ట క్రియలను తుడిచిపెట్టజాలవు. అంతేకాదు మనం చేసిన పాపములన్నింటికి ఒక న్యాయమైన మరియు నీతి గలిగిన శిక్ష కొలవబడుతుంది (సరిచూడబడివుంది). మరియు బైబిలు చెప్పేదేమంటే దైవికమైన చట్టప్రకారము పాపానికి ఒకే ఒక శిక్ష సిద్ధపర్చబడి వుంది. అది నిత్య మరణము.

మనలను ఈ శిక్షనుండి రక్షించుటకు, దేవుని కమారుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరములకు పూర్వము పరలోకము నుండి భూమికి మానవునివలె దిగివచ్చి సిలువపై చనిపోయెను. అక్కడ ఆయన అన్ని మతాల ప్రజలందరి పాపముల కొరకు దైవికమైన శిక్షను పొందారు. ఆయన దగ్గర్లో ఉండిన ఒక సమాధిలో పాతిపెట్టబడ్డారు. కాని ముడు రోజుల పిదప మృతులలో నుండి తిరిగి జీవముతో బయటకు వచ్చి ఆయన నిజముగా దేవుని కుమారుడని మరియు మానవుని యొక్క గొప్ప శత్రువు-మరణాన్ని ఆయన జయించారని ఋజువు చేసారు. నలభైరోజుల తరువాత, అనేకులు చూస్తుండగా ఏర్పరచబడిన సమయమందు మనుష్యులందరకు తీర్పు తీర్చటానికి భూమికి వస్తానని వాగ్ధానం చేసి పరలోకానికి ఎక్కిపోయరు. ఆయన ఆ వాగ్ధానం చేసిన తరువాత నుండి ఇప్పటికి పందొమ్మిది శతాబ్ధాలు గడిచిపోయాయి. మరియు ఇప్పుడు ఆయన తిరిగి భూమికి వచ్చే సమయం దగ్గర పడింది. ఈ దినాల్లో ఒక రోజున ఆయన పరలోకం నుండి ఆకాశంలోనికి తిరిగి రావటాన్ని మనం చూస్తాము. యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే చరిత్రలో మానవజాతి పాపముల కొరకు చనిపోయారు. చనిపోయి తిరిగి లేచినది కూడా ఆయన ఒక్కరు మాత్రమే ఈ రెండు విషయాలలో ఆయన అసమానమైన వాడు. ఈ రోజు, మన యొక్క పాపములు క్షమింపబడి మన జ్ఞాపకం అనే వీడియో టేపు నుండి తుడిచివేయబడతాయి.

అయితే మనం వాటినుండి మనస్పూర్తిగా తిరిగి పోవాలి మరియు యేసుక్రీస్తును బట్టి మన పాపములు క్షమించమని దేవుని అడగాలి. ఎందుచేతనంటే ఆయన మనకొరకు చనిపోయి తిరిగి లేచారు. కాని అంత మాత్రంతో సరిపోలేదు. దేవుడు కూడ మన హృదయంలోనికి ఆయన ఆత్మద్వారా వచ్చి మనయొక్క పాపపు అలవాట్లను జయించటానికి శక్తినిచ్చి ఆ విధంగా రాబోయే దినాలలో మన జీవితం స్వచ్చతతోను, ప్రేమతోను మరియు మంచితనంతోను నింపబడి వుండేలాగు ఆయన మనతో జీవిస్తానని వాగ్ధానం చేస్తున్నారు.

దేవుడు మానవ జాతికి ఏర్పాటు చేసిన రక్షణ మార్గము ఇది ఒక్కటి మాత్రమే. జ్ఞాపకం ఉంచుకోండి. ఏ ఒక్కరికైనా ఉన్న వేరొక గత్యంతరం ఏమిటంటే తీర్పు దినాన్న తనయొక్క జ్ఞాపకం అనే వీడియోటేపు తిరిగి చూపబడుటను బట్టి దానియందు పొందుపర్చబడిన తన పాపములను ఎదుర్కొనడం.

7. చరిత్రయొక్క గొప్ప సంఘటన నుండి
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము మరియు పునరుత్థానము (తిరిగి లేచుట) రెండును కలసి యెంతో గొప్పది మరియు ఎంతో ముఖ్యమైన సంఘటనగా ప్రపంచ చరిత్రలో ఏర్పడింది. క్రైస్తవ విశ్వాసము స్థాపించబడిన రెండు ముఖ్యమైన వాస్తవాలు ఇవే.

నాలుగు సత్యాలు క్రీస్తు కల్వరి సిలువపై మరణించుటను బట్టి తేటతెల్లమవుతున్నాయి.

1.చనిపోయిన తరువాత జీవితమున్నదన్న విషయము:-
ఇక్కడున్న జీవితమే సమస్తము అయిన యెడల యేసుక్రీస్తు ఎప్పుడును చనిపోయి ఉండేవాడుకాదు. ఆయన కుండిన దైవిక శక్తిని బట్టి ఆయన అనుకున్నట్లయితే ఆయనను చంపటానికి వెదికే వారియొద్ద నుండి ఆయన సులువుగా తప్పించుకొని ఉండేవారు. మరియు యేసు చంపబడి, మరియు పాతి పెట్టబడిన మూడు రోజుల తరువాత ఆయన తిరిగి జీవంతో బ్రతికి వచ్చారు. ఇది ఆయన చెప్పినటువంటి మరణము తరువాత జీవితం అక్షరాల నిజమని తేటగా ఋజువు పరుస్తుంది.

2.దేవుడు అపారమైన పరిశుద్ధుడు:-
క్రీస్తుయొక్క మరణాన్ని బట్టి దేవుడు అపారమైన పరిశుద్ధుడని మరియు ఆయన పాపాన్ని ఎప్పుడూ సహించలేడని నేర్చుకుంటున్నాము. సిలువపై మనం చూసినప్పుడు ప్రపంచ మంతటియొక్క పాపము పాపరహితుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు మీద మోపబడినప్పుడు పాపంవైపు తేరిచూడలేనటువంటివాడు కాబట్టి దేవుడు ఆయనను విడిచి పేట్టాడు. బైబిలు (దేవుని వాక్యము) దేవుని కన్నులు దుష్టత్వాన్ని చూడలేనంతటి స్వచ్చమైనవి అని చెబుతుంది. దేవుని యొక్క ప్రేమ ఆయనను పాపాన్ని ఉపేక్షించేదిగా చేయదు. ఆయన నిన్ను ఎంతో ప్రేమించవచ్చు. కాని నీ జీవితంలో పాపం ఉండిన యెడల కల్వరి సిలువపై తన కుమారుని ఎలాగు తప్పనిసరిగా విడచి పెట్టారో అలాగే నిన్ను విడచిపెడతాడు.

3.దేవుడు అపారంగా ప్రేమించువాడు:-
క్రీస్తు మనలను మన పాపములనుండి మరియు మన దౌర్బాగ్య స్థితి నుండి రక్షించుటకు చనిపోవుటలో మనం చూచే మరియొక సత్యము - దేవుని యొక్క అపారమైన ప్రేమ. బైబిలు మానవుని యెడల దేవుని ప్రేమను ఒక తల్లికి తన బిడ్డపై నుండే ప్రేమతో సరిపోల్చింది. ఒక తల్లి ఏలాగు తన బిడ్డకు ఉండిన ఎటువంటి రోగాన్నయినా తనలోనికి తీసుకొని తన బిడ్డ స్వస్థత పడాలని ఆశిస్తుందో అలాగే మానవుడు స్వతంత్రుడగునట్లు దేవుడు మానవుని పాపము యొక్క శిక్షను తనపై వేసుకున్నాడు.

4.రక్షణకు వేరొక మార్గము లేదు:-
క్రీస్తు మరణము ద్వారా తప్ప రక్షణకు వేరొక మార్గము లేదని స్పటికమంత తేటగా తేటపర్చబడినది. రక్షణకు వేరొక మార్గమేదయినా సాధ్యమైనట్లయితే క్రీస్తుకు అంత శ్రమ కల్గించిన మార్గాన్ని దేవుడు ఏర్పరచి ఉండేవాడు కాదు. మానవుడు కేవలం మంచి జీవితం జీవించినంత మాత్రాన దేవుని సన్నిదికి వెళ్లగలిగినట్లయితే అప్పుడు క్రీస్తును అనవసరంగా సిలువపై వేదనాకరమైన మరణం గుండా వెళ్ళటానికి అనుమతించడం అనేది దేవుని బుద్దిహీనత అవుతుంది. ఆ విధంగా రక్షణకు వేరొక మార్గమున్నదని ఊహించుకోవడం మనలను మనం దేవుని కంటె తెలివైన వారంగా అనుకోవడమే మరియు అది మనయొక్క పూర్తి బుద్దిహీనతకు గుర్తు మాత్రమే. క్రీస్తు యొక్క మరణము మనకు ఏమి బోధిస్తుందో అర్థం చేసుకొన్నామా? అలా అయినట్లయితే దానికి తగిన విధంగా మనము చేయాల్సింది ఒకే ఒక్కటి వుంది. క్రీస్తుకు సంపూర్తిగా మన జీవితాలను ఇప్పటికిని మరి ఎప్పటికిని సమర్పించుకోవడమే. వివేకంతో ఒప్పుకోవడమనేది ఒక అర్థం లేనిది మాత్రమే. దేవుడు వెదికేది మన యొక్క ఇష్టాన్నుండి ఒప్పుకొని బదులు చెప్పడం.

8.ఎంతో గొప్ప అద్భుతమైన వాస్తవము
మనమందరం ఎడారిలో ప్రయాణించే ప్రజల వంటి వారము. దాహంతో బాధపడుతున్నవారము. ఒకరు నీటిని ఎక్కడైనా కనుగొన్నయెడల, అతడు తప్పనిసరిగా ఇతరులకు దాని గూర్చి తెలియజేస్తాడు. అతడు వారిని త్రాగమని బలవంతం చేయడు. కాని నీరు ఎక్కడుందో వారికి చూపెట్టగలడు. అదే మేము ఇప్పుడు చేస్తున్నది. కోరుకున్న వారికి నిత్య జీవము ఉచితంగా ఎక్కడ దొరుకుతుందో చూపెడుతున్నాము.

ప్రపంచంలో ఎంతో గొప్ప అద్భుతమైన వాస్తవము ఏమిటంటే ఎంతో గొప్ప పాపి అయినా ఒక్క క్షణంలోనే దేవుని బిడ్డగా అవగలడు. అయితే అతడు మనఃపూర్వకముగా దేవునిని వెదకాలి.
దేవునికి మరమనుషులు అక్కర్లేదు. ఆయనకు కుమారులు కావాలి. అందుచేతనే ఆయన అందరికి స్వేచ్చానుసారమైన ఇష్టాన్ని ఇచ్చారు. ఆయనకు లోబడటం లేక లోబడకపోవడం అనేది మనము ఎంచుకోవచ్చు. మనకున్న స్వేచ్చానుసారమైన ఇష్టాన్ని దేవునికి అవిధేయతగా ఉపయోగించటం ద్వారా మనందరం త్రోవతప్పి పోయాము. పాపము కేవలం మన జీవితాలను పాడుచేయడం మాత్రమే కాక మన కుంటుంబాలను కూడా నాశనం చేసింది. అది మనలను ఈ భూమిపై దౌర్భాగ్యులనుగా చేసి చివరకు శాశ్వతంగా నరకము లోనికి పంపుతుంది.

కాని ఇప్పుడు దేవుడు మనలను పశ్చాత్తాపానికి ఆహ్వనిస్తున్నాడు(అంటే మన పాపసహితమైన జీవిత విధానం నుండి తిరిగి దేవునివైపు తిరగడం). దానిని బట్టి మనము మనయొక్క గత పాపములన్నింటికి యేసుక్రీస్తు మరణము ద్వారా పూర్తియైన మరియు ఉచితమైన క్షమాపణను పొందగలము.

ఇలా చెయ్యడానికి దేవుడు మనలను బలత్కారము చేయవచ్చు. మనము పాపము చేసిన ప్రతిసారి ఆయన మనలను బలవంత పెట్టవచ్చు. కాని అప్పుడు మనము మర మనుషులము, మరియు భానిసలముగా అవుతాము. తప్ప- కుమారులుగా అవ్వము, కనుక ఆయన అట్లు చేయలేదు. మనంతట మనముగా పాపమునుండి తిరిగడం గురించి ఆయన ఎదురు చుస్తున్నారు. ఆ నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకో, మరియు ఒక్క క్షణం లోనే నీవు దేవుని బిడ్డగా అవ్వగలవు. నీవు గ్రహించకపోవచ్చు కాని ఇది జీవితానికి, మరణానికి సంభందించిన విషయం. ఇప్పుడే ఈ ప్రార్థన దేవునికి ఎందుకు ప్రార్థించకూడదు?

ప్రభువైన యేసుక్రీస్తూ, నేనొక తీర్పుకు పాత్రుడనైన పాపినని ఒప్పుకుంటున్నాను. నా యొక్క శిక్షను తీసుకున్నందుకు మరియు నా పాపముల కొరకు చనిపోయినందుకు మరియు చనిపోయిన తరువాత సమాధినుండి తిరిగి సజీవుడవై తిరిగి వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను. నేను నిజంగా నాయొక్క పాపములతోనిండిన జీవిత విధానాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు! నా హృదయంలోనికి రా, మరియు నన్ను ఒక దేవుని బిడ్డగాచెయ్యి, నా గత జీవితము యొక్క అపరాధాన్నంతటిని తొలిగించు మరియు ఒక నూతన జీవితాన్ని ఈ దినము మొదలుపెట్టటానికి సహయం చెయ్యి. నాయొక్క మిగిలియున్న జీవితమంతా నిన్ను గౌరవించుట కొరకు జీవించునట్లు నీ శక్తిని నాకిమ్ము, నాప్రార్థన వినినందుకు కృతజ్ఞణ్మి. ఇది నీ జీవితంలో ఎప్పటికిని తీసుకొన్న ఎంతో గొప్ప నిర్ణయమై ఉంటుంది. దేవుడు నిన్ను అధికంగా దీవించును గాక

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget