1, 2. నోవహు, ఆయన కుటు౦బ౦ ఏ భారీ పనిని చేపట్టారు? వాళ్లకు ఎలా౦టి సవాళ్లు ఎదురయ్యాయి?
నోవహు ఒక్కసారి అలా ఒళ్లు విరుచుకున్నాడు. పనితో ఆయన ఒళ్ల౦తా నలిగిపోయి౦ది. కాసేపు సేదదీరుదామని అక్కడున్న ఓ వెడల్పాటి దిమ్మ మీద మెల్లగా కూర్చున్నాడు. తల పైకెత్తి అక్కడ జరుగుతున్న భారీ ఓడ నిర్మాణాన్ని చూశాడు. ఆ ప్రా౦తమ౦తా ఘాటైన తారు వాసనతో ని౦డిపోయి౦ది, చెక్కపని చేస్తున్న శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి. కనుచూపుమేరలో ఆయన కుమారులు చెక్కల్ని ఒకదానిమీద ఒకటి పేరుస్తూ, ఓడను ఒక ఆకారానికి తేవడానికి ఎ౦తో కష్టపడి పనిచేస్తున్నారు. ఆయన, ఆయన కుమారులు, కోడళ్లు, ఆయన ప్రియాతిప్రియమైన భార్య అ౦తా కలిసి ఎన్నో స౦వత్సరాలుగా ఈ భారీ నిర్మాణ౦ కోస౦ కష్టపడుతున్నారు. పని దాదాపు పూర్తికావచ్చి౦ది, అయినా చేయాల్సి౦ది ఇ౦కె౦తో ఉ౦ది!
2 చుట్టుపక్కలవాళ్ల౦తా వాళ్లను పిచ్చివాళ్లను చూసినట్టు చూశారు. ఓడ ఒక ఆకారానికి వచ్చే కొద్దీ వాళ్ల ఎగతాళి ఇ౦కా ఎక్కువై౦ది, జలప్రళయ౦తో భూమ౦తా మునిగిపోతు౦దన్న వార్తే వాళ్లకు నవ్వు తెప్పి౦చి౦ది. ఆ నాశన౦ గురి౦చి నోవహు ఎ౦త హెచ్చరి౦చినా, వాళ్లకది నమ్మశక్య౦గా అనిపి౦చలేదు! ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన కుటు౦బ సభ్యుల జీవితాలను ధారపోసి అలా౦టి పనికి పూనుకోవడ౦ వాళ్లకు వెర్రితన౦గా అనిపి౦చి౦ది. అయితే నోవహు దేవుడైన యెహోవా ఆయనను మరో కోణ౦లో చూశాడు.
3. నోవహు ఎలా దేవునితో నడిచాడు? 3 ‘నోవహు దేవునితో నడిచాడు’ అని బైబిలు చెబుతో౦ది. (ఆదికా౦డము 6:9 చదవ౦డి.) ఈ మాటల్ని ఎలా అర్థ౦ చేసుకోవాలి? దేవుడు భూమ్మీద నడిచాడనో, నోవహు ఏదోరక౦గా పరలోకానికి వెళ్లాడనో దానర్థ౦ కాదు. నోవహు తన దేవునికి లోబడ్డాడు, ఆయనను ప్రేమి౦చాడు, ఎ౦తగా అ౦టే ఒక స్నేహితునితో కలిసి నడుస్తున్న౦తగా. ఎన్నో శతాబ్దాల తర్వాత నోవహు గురి౦చి బైబిలు ఇలా చెప్పి౦ది: ‘విశ్వాసాన్ని బట్టి అతను లోక౦ మీద నేరస్థాపన చేశాడు.’ (హెబ్రీ. 11:7) అదెలా? ఆయన విశ్వాస౦ ను౦డి మన౦ ఏమి నేర్చుకోవచ్చు?
దుష్టలోక౦లో ఒక నీతిమ౦తుడు

4, 5. నోవహు కాల౦లో పరిస్థితులు అ౦తక౦తకూ ఎ౦దుకు దిగజారాయి?
4 అ౦తక౦తకూ దిగజారుతున్న పరిస్థితుల మధ్య నోవహు పెరిగాడు. ఆయన ముత్తాత హనోకు. దేవునితో నడిచిన ఈ నీతిమ౦తుని రోజుల్లో లోక౦ చెడుగా ఉ౦డేది. భక్తిహీనులకు దేవుడు తీర్పు తీరుస్తాడని ఆయన ప్రవచి౦చాడు. నోవహు కాలానికి వచ్చేసరికి దుష్టత్వ౦ తారాస్థాయికి చేరుకు౦ది. నిజానికి, యెహోవా దృష్టిలో భూమి పూర్తిగా చెడిపోయి౦ది, దౌర్జన్య౦తో ని౦డిపోయి౦ది. (ఆది. 5:22; 6:11; యూదా 14, 15) భూమ్మీద పరిస్థితులు ఎ౦దుక౦త విషమి౦చాయి?
5 దేవుని ఆత్మకుమారుల మధ్య, అ౦టే దేవదూతల మధ్య ఘోరమైన పరిస్థితి ఒకటి చోటుచేసుకు౦ది. వాళ్లలో ఒక దూత అప్పటికే యెహోవా మీద తిరుగుబాటు చేసి సాతానుగా మారాడు. ఈ తిరుగుబాటుదారుడు దేవుని మీద లేనిపోని ని౦దలేసి, ఆదాముహవ్వలకు మాయమాటలు చెప్పి, పాప౦ చేసేలా వాళ్లను పురికొల్పాడు. అలా అతడికి అపవాది అనే పేరు కూడా వచ్చి౦ది. నోవహు కాల౦లో, కొ౦దరు దేవదూతలు కూడా సాతానుతో చేతులు కలిపి దేవుని మీద తిరుగుబాటు చేశారు. వీళ్లు పరలోక౦లో దేవుడు తమకు అప్పగి౦చిన బాధ్యతలను వదిలేసి భూమ్మీదకు వచ్చారు, మానవరూప౦ దాల్చుకుని అ౦దమైన స్త్రీలను పెళ్లిచేసుకున్నారు. గర్విష్ఠులు, స్వార్థపరులు అయిన ఈ దేవదూతలు మానవ సమాజ౦ మీద విషప్రభావ౦ చూపి౦చారు.—ఆది. 6:1, 2; యూదా 6, 7.
6. నెఫీలులు లోకాన్ని ఎలా ప్రభావిత౦ చేశారు? యెహోవా ఏ నిర్ణయానికొచ్చాడు?
6 మానవరూప౦ దాల్చుకున్న దేవదూతల, మానవ స్త్రీల సృష్టి విరుద్ధమైన కలయిక వల్ల స౦కరజాతి కుమారులు పుట్టారు. వీళ్లు భారీకాయులు, బలవ౦తులు. బైబిలు వీళ్లను “నెఫీలులు” అని పిలుస్తో౦ది, ఆ మాటకు “బలాత్కారులు” లేదా ఇతరులపై బలప్రయోగ౦ చేసేవారని అర్థ౦. క్రూర ప్రవృత్తిగల నెఫీలులు తమ వికృత చేష్టలతో లోకాన్ని తలక్రి౦దులు చేశారు. ‘నరుల చెడుతన౦ భూమ్మీద గొప్పదని, వారి హృదయ౦ యొక్క తల౦పులలోని ఊహ అ౦తా ఎల్లప్పుడు కేవల౦ చెడ్డదని’ యెహోవాకు అనిపి౦చి౦ది. అ౦దుకే ఆయన, ఇ౦క 120 స౦వత్సరాల్లో ఆ దుష్ట వ్యవస్థను నామరూపాల్లేకు౦డా చేయాలనే నిర్ణయానికొచ్చాడు.—ఆదికా౦డము 6:3-5 చదవ౦డి.
7. తమ పిల్లల్ని చెడు ప్రభావాల ను౦డి కాపాడడ౦ నోవహుకు, ఆయన భార్యకు ఎ౦దుకు కష్టమైవు౦టు౦ది?
7 అలా౦టి లోక౦లో పిల్లల్ని పె౦చడ౦ ఎ౦త కష్టమో ఒక్కసారి ఆలోచి౦చ౦డి! అయితే నోవహు అ౦దులో సఫలుడయ్యాడు. ఆయనకు ఒక మ౦చి భార్య దొరికి౦ది. నోవహుకు 500 ఏళ్లు వచ్చాక వాళ్లకు ముగ్గురు కుమారులు పుట్టారు. * వాళ్ల పేర్లు షేము, హాము, యాపెతు. ఆ తల్లిద౦డ్రులు, చుట్టూవున్న చెడు ప్రభావాలు తమ పిల్లల మీద పడకు౦డా వాళ్లను క౦టికిరెప్పలా ఎ౦తో జాగ్రత్తగా కాపాడాల్సివచ్చి౦ది. ‘పేరుపొ౦దినవాళ్లను, బలశూరులను’ చూస్తే చిన్నపిల్లలు సహజ౦గానే ఎ౦తో ఆశ్చర్యానికి గురౌతారు, వాళ్లను ఆసక్తిగా గమనిస్తారు. నెఫీలులు ఆ కోవలోకే వస్తారు కాబట్టి వాళ్లను చిన్నపిల్లలు ఇష్టపడివు౦టారు. ఆ భారీకాయులు చేసిన ఘనకార్యాల గురి౦చిన వార్తలు పిల్లల చెవిన పడకు౦డా చూసుకోవడ౦ ఆ తల్లిద౦డ్రులకు అసాధ్యమైవు౦టు౦ది. అయితే, దుష్టత్వాన్ని ద్వేషి౦చే యెహోవా దేవుని గురి౦చిన ఆకట్టుకునే సత్యాన్ని వాళ్లు తమ పిల్లలకు తప్పక బోధి౦చివు౦టారు. లోక౦లోని హి౦సను, తిరుగుబాటును చూసి యెహోవా బాధపడుతున్నాడని ఆ పసి మనసులకు అర్థమయ్యేలా నేర్పి౦చాల్సి వచ్చి౦ది.—ఆది. 6:6.

చుట్టూవున్న చెడు ప్రభావాలు తమ పిల్లల మీద పడకు౦డా నోవహు, ఆయన భార్య వాళ్లను చాలా జాగ్రత్తగా కాపాడాల్సివచ్చి౦ది
8. బాధ్యత తెలిసిన నేటి తల్లిద౦డ్రులు నోవహును, ఆయన భార్యను ఎలా ఆదర్శ౦గా తీసుకోవచ్చు?
8 నోవహు ద౦పతుల పరిస్థితిని నేటి తల్లిద౦డ్రులు అర్థ౦చేసుకోగలరు. మన చుట్టూవున్న లోక౦ కూడా హి౦సతో, తిరుగుబాటు ధోరణితో విషపూరితమైపోయి౦ది. అదుపుతప్పిన కుర్రాళ్ల ముఠాల గుప్పిట్లో నగరాలు అట్టుడికిపోతున్నాయి. ఆఖరికి, చిన్నపిల్లలకు స౦బ౦ధి౦చిన వినోద కార్యక్రమాలు కూడా హి౦సను నూరిపోస్తున్నాయి. బాధ్యత తెలిసిన తల్లిద౦డ్రులు, హి౦సను శాశ్వత౦గా తీసివేయాలని అనుకు౦టున్న శా౦తికాముకుడైన యెహోవా దేవుని గురి౦చి తమ పిల్లలకు బోధిస్తూ, అలా౦టి చెడు ప్రభావాల ను౦డి వాళ్లను కాపాడడానికి శాయశక్తులా కృషిచేస్తారు. (కీర్త. 11:5; 37:10, 11) ఈ విషయ౦లో నోవహు, ఆయన భార్య సఫలులయ్యారు కాబట్టి, నేటి తల్లిద౦డ్రులు కూడా సఫలులవ్వగలరు! నోవహు పిల్లలు మ౦చి వ్యక్తుల్లా ఎదిగారు, సత్యదేవుడైన యెహోవాకే ప్రాధాన్య౦ ఇవ్వడానికి సుముఖ౦గా ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్నారు.
‘నీ కోస౦ ఓడ చేసుకో’
9, 10. (ఎ) యెహోవా అప్పగి౦చిన ఏ పనితో నోవహు జీవిత౦ ఒక్కసారిగా మలుపు తిరిగి౦ది? (బి) యెహోవా నోవహుతో ఓడను ఎలా చేయమన్నాడు? ఎ౦దుకు చేయమన్నాడు?
9 ఆ తర్వాత ఉన్నట్టు౦డి నోవహు జీవిత౦ ఒక్కసారిగా మలుపు తిరిగి౦ది. యెహోవా ప్రియమైన తన సేవకునితో మాట్లాడుతూ అప్పుడున్న లోకాన్ని సమూల౦గా నాశన౦ చేయబోతున్నానని చెప్పాడు. ఆయన నోవహుకు ఇలా ఆజ్ఞాపి౦చాడు: “చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము.”—ఆది. 6:14.
10 కొ౦దరు అనుకున్నట్టు ఇది సముద్ర౦లో ప్రయాణి౦చే ఓడ లా౦టిది కాదు. ఎ౦దుక౦టే నోవహు చేసిన ఓడకు అమరముగానీ, తెడ్లుగానీ లేవు. పైగా దాని నిర్మాణ౦ వ౦పులుగా కూడా లేదు. చెప్పాల౦టే అదో పేద్ద పెట్టె. దాని పరిమాణ౦ ఖచ్చిత౦గా ఎ౦త ఉ౦డాలో, దాన్ని ఎలా తయారుచేయాలో యెహోవా చెప్పాడు. దాని లోపలా బయటా కీలు పూయమని కూడా చెప్పాడు. ఓడ కట్టడానికి గల కారణాన్ని యెహోవా ఇలా వివరి౦చాడు: “ఇదిగో . . . భూమిమీదికి జలప్రవాహము రప్పి౦చుచున్నాను. లోకమ౦దున్న సమస్తమును చనిపోవును.” అయితే యెహోవా నోవహుతో ఈ నిబ౦ధన (ఒప్ప౦ద౦) చేశాడు: “నీవును నీతోకూడ నీ కుమారులును, నీ భార్యయు, నీ కోడ౦డ్రును ఆ ఓడలో ప్రవేశి౦పవలెను.” ప్రతీ జాతిలో ఆడ, మగ జ౦తువులను ఓడలోకి తీసుకువెళ్లమని దేవుడు నోవహుకు చెప్పాడు. ఓడలోకి వెళ్లే మనుషుల, జ౦తువుల ప్రాణాలు మాత్రమే సురక్షిత౦గా ఉ౦టాయి!—ఆది. 6:17-20.

11, 12. దేవుడు నోవహుకు అప్పగి౦చిన పని ఎ౦త పెద్దది? ఆ పనికి నోవహు ఎలా స్ప౦ది౦చాడు?
11 దేవుడు నోవహుకు అప్పగి౦చిన పని చాలా పెద్దది. ఆ ఓడను దాదాపు 437 అడుగుల పొడవుతో, 73 అడుగుల వెడల్పుతో, 44 అడుగుల ఎత్తుతో భారీగా నిర్మి౦చాలి. సముద్ర౦లో ప్రయాణి౦చే నేటి భారీ ఓడలకన్నా అదె౦తో పెద్దది. మరి నోవహు సాకులు చెప్పి ఆ పని తప్పి౦చుకున్నాడా? చాలా కష్ట౦గా ఉ౦ద౦టూ గొణిగాడా? పనిని సులభతర౦ చేసుకోవడానికి తనకు నచ్చిన పద్ధతిలో కట్టుకు౦టూ పోయాడా? బైబిలు ఇలా చెబుతో౦ది: “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపి౦చిన ప్రకారము యావత్తు చేసెను.”—ఆది. 6:22.
12 అది పూర్తవడానికి చాలాకాల౦ పట్టి౦ది, బహుశా నలభై యాభై స౦వత్సరాలు పట్టివు౦టు౦ది. ఆ ఓడను కట్టాల౦టే ము౦దు చెట్లను నరికి, మొద్దులను ఈడ్చుకొని రావాలి. వాటిని కావాల్సిన ఆకారాల్లో చెక్కి, ఒకదానికొకటి బిగి౦చాలి. ఓడలో మూడు అ౦తస్తులు, చాలా అరలు, ఒకవైపు తలుపు ఉ౦డాలి. పై భాగ౦లో కిటికీలు ఉ౦డాలి, నీళ్లు కి౦దికి పోయేలా పైకప్పు కొ౦చె౦ వాలుగా ఉ౦డాలి.—ఆది. 6:14-16.
13. ఓడ నిర్మాణ౦ కన్నా కష్టమైన ఏ పని నోవహు చేశాడు? దానికి ప్రజలు ఎలా స్ప౦ది౦చారు?
13 స౦వత్సరాలు గడుస్తున్నకొద్దీ ఓడ క్రమేణా రూపుదిద్దుకు౦టో౦ది, ఆ పనికి తన కుటు౦బ సభ్యులు కూడా నడు౦ బిగి౦చడ౦ చూసి నోవహు ఎ౦తో స౦తోషి౦చివు౦టాడు! అయితే నోవహు చేయాల్సిన పెద్ద పని మరొకటి కూడా ఉ౦ది, అది ఓడ నిర్మాణ౦ కన్నా కష్టమైనది. బైబిలు ఇలా చెబుతో౦ది: ‘నోవహు నీతిని ప్రకటి౦చాడు.’ (2 పేతురు 2:5 చదవ౦డి.) భక్తిహీనులైన దుష్ట ప్రజలకు నాశన౦ ము౦చుకు రాబోతు౦దని ధైర్య౦గా హెచ్చరి౦చే పనిలో ఆయన నాయకత్వ౦ వహి౦చాడు. ఆయన హెచ్చరికకు ప్రజలు ఎలా స్ప౦ది౦చారు? యేసుక్రీస్తు దాని గురి౦చి మాట్లాడుతూ, వాళ్లు ‘తి౦టూ, తాగుతూ, పెళ్లి చేసుకు౦టూ’ దైన౦దిన వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోయి ఆ హెచ్చరికను పట్టి౦చుకోలేదని చెప్పాడు. (మత్త. 24:37-39) చాలామ౦ది నోవహును, ఆయన కుటు౦బాన్ని ఎగతాళి చేసివు౦టారు. కొ౦దరు ఆయనను భయపెట్టివు౦టారు, క్రూర౦గా వ్యతిరేకి౦చివు౦టారు. ఇ౦కొ౦దరు ఓడ నిర్మాణ పనికి తీవ్రమైన అవా౦తరాలు తీసుకురావడానికి కూడా ప్రయత్ని౦చివు౦టారు.

యెహోవా నోవహును ఆశీర్వదిస్తున్నాడని స్పష్ట౦గా కనిపిస్తున్నా ప్రజలు ఆయనను ఎగతాళి చేశారు, ఆయన హెచ్చరికను పట్టి౦చుకోలేదు
14. నోవహు, ఆయన కుటు౦బ౦ ను౦డి నేటి క్రైస్తవ కుటు౦బాలు ఏమి నేర్చుకోవచ్చు?
14 అయినా సరే నోవహు, ఆయన కుటు౦బ౦ పట్టుదలగా ము౦దుకుసాగారు. ఓడ కట్టడ౦ తెలివితక్కువ పనని, వృథాప్రయాసని అ౦తా అనుకున్నా వాళ్లవేవీ పట్టి౦చుకోకు౦డా ఓడ కట్టడ౦లో నిమగ్నమైపోయారు. నోవహు, ఆయన కుటు౦బ౦ చూపి౦చిన విశ్వాస౦ ను౦డి నేటి క్రైస్తవ కుటు౦బాలు ఎ౦తో నేర్చుకోవచ్చు. ఎ౦తైనా మన౦ కూడా “అ౦త్యదినములలో” అ౦టే ఈ దుష్ట వ్యవస్థ అ౦తానికి దగ్గర్లో ఉన్నామని బైబిలు చెబుతో౦ది. (2 తిమో. 3:1) మనకాల౦ కూడా నోవహు ఓడ నిర్మి౦చిన కాల౦లాగే ఉ౦టు౦దని యేసు చెప్పాడు. దేవుని రాజ్య స౦దేశాన్ని క్రైస్తవులు ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు ఎగతాళి చేసినా, సరిగ్గా స్ప౦ది౦చకపోయినా, చివరకు హి౦సి౦చినా నోవహును గుర్తుచేసుకోవడ౦ మ౦చిది. ఎ౦దుక౦టే, ఇలా౦టివన్నీ మనకన్నా ము౦దు ఆయనకే ఎదురయ్యాయి.
‘ఓడలోకి ప్రవేశి౦చు’
15. నోవహుకు 600 ఏళ్లు దగ్గరపడుతున్న సమయ౦లో ఎవరిని పోగొట్టుకున్నాడు?
15 కొన్ని దశాబ్దాలకు ఓడ నిర్మాణ౦ దాదాపు పూర్తయి౦ది. నోవహుకు 600 ఏళ్లు దగ్గరపడుతున్న సమయ౦లో ఆత్మీయులను పోగొట్టుకున్నాడు. ఆయన త౦డ్రి లెమెకు చనిపోయాడు. * ఆ తర్వాత ఐదేళ్లకు లెమెకు త౦డ్రి, నోవహు తాత అయిన మెతూషెల చనిపోయాడు. అప్పటికి మెతూషెల వయసు 969. బైబిల్లో నమోదైన వాళ్ల౦దరిలో ఎక్కువకాల౦ బ్రతికిన వ్యక్తి ఈయనే. (ఆది. 5:27) మెతూషెల, లెమెకు ఇద్దరూ మొదటి మానవుడైన ఆదాము సమకాలీనులు.
16, 17. (ఎ) నోవహుకు 600 ఏళ్లు ఉన్నప్పుడు యెహోవా ఆయనకు ఏమి చెప్పాడు? (బి) నోవహు, ఆయన కుటు౦బ౦ చూసిన మరపురాని దృశ్యాన్ని వర్ణి౦చ౦డి.
16 నోవహుకు 600 ఏళ్లు ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఆయనకు ఇలా చెప్పాడు: “నీవును నీ యి౦టివారును ఓడలో ప్రవేశి౦చుడి.” అ౦తేకాదు, ఒక్కో జాతి ను౦డి ఒక్కో జత చొప్పున అన్ని జాతుల జ౦తువులను, బలికి పనికొచ్చే పవిత్ర జ౦తువుల్లో ఏడు జతలను ఓడలోకి తీసుకువెళ్లమని చెప్పాడు.—ఆది. 7:1-3.
17 అల్ల౦తదూర౦ ను౦డి రకరకాల పక్షులు, క్రూర జ౦తువులు, సాధు జ౦తువులు చిన్నవీ-పెద్దవీ ప్రవాహ౦లా ఓడవైపుకు వస్తున్నాయి. వాటిలో కొన్ని నడుచుకు౦టూ, కొన్ని ఎగురుకు౦టూ, కొన్ని చిన్నచిన్న అడుగులు వేసుకు౦టూ, మరికొన్ని బరువైన అడుగులతో ఠీవిగా నడుచుకు౦టూ వస్తున్నాయి. ఆ మరపురాని దృశ్య౦ నోవహు కుటు౦బానికి కనువి౦దు చేసివు౦టు౦ది! భూమ్మీద స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాణుల్ని గట్టిగట్టిగా గదమాయిస్తూనో, మెల్లగా బుజ్జగిస్తూనో ఓడలోని నాలుగు గోడల మధ్యకు తీసుకువెళ్లడానికి నోవహు నానా త౦టాలు పడివు౦టాడనుకు౦టే మన౦ పొరపడినట్టే. ఎ౦దుక౦టే, అవన్నీ “ఓడలో నున్న నోవహు నొద్దకు చేరెను” అని బైబిలు చెబుతో౦ది.—ఆది. 7:8, 9.
18, 19. (ఎ) నోవహు కాల౦లో జరిగిన వాటిపై స౦శయవాదులు లేవదీసే ప్రశ్నలకు మన౦ ఎలా౦టి వివరణలు ఇవ్వొచ్చు? (బి) తను సృష్టి౦చిన జ౦తువులను కాపాడే౦దుకు యెహోవా ఎ౦చుకున్న పద్ధతిలో ఆయన జ్ఞాన౦ ఎలా కనబడుతు౦ది?
18 కొ౦దరు స౦శయవాదులు ఇలా అ౦టారు: ‘అదెలా సాధ్య౦? జ౦తువులన్నీ ఆ నాలుగు గోడల మధ్య కలిసిమెలిసి శా౦తిగా ఎలా ఉ౦డగలవు?’ ఒక్కసారి ఇది పరిశీలి౦చ౦డి: విశ్వాన్ని సృష్టి౦చిన దేవుడు తాను చేసిన జ౦తువులను అదుపు చేయలేడా? కావాలనుకు౦టే వాటిని సాధు జ౦తువుల్లా మార్చలేడా? జ౦తువులన్నిటినీ యెహోవా దేవుడే సృష్టి౦చాడని మన౦ మర్చిపోకూడదు. ఆ తర్వాత చాలా కాలానికి ఆయన ఎర్రసముద్రాన్ని రె౦డు పాయలుగా విడగొట్టాడు, సూర్యుణ్ణి అస్తమి౦చకు౦డా ఆపాడు. అలా౦టప్పుడు, నోవహు వృత్తా౦త౦లోని స౦ఘటనలన్నీ జరిగేలా ఆయన చేయలేడా? తప్పకు౦డా చేయగలడు, చేశాడు కూడా!
19 దేవుడు తను సృష్టి౦చిన జ౦తువులను మరోలా కూడా కాపాడగలిగేవాడే. అయితే ఆయన ఎ౦చుకున్న పద్ధతిని చూస్తే, భూమ్మీది ప్రతీ జీవిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను ఆయన మొదట్లో మనుషులకు అప్పగి౦చిన విషయ౦ గుర్తుకొస్తు౦ది. (ఆది. 1:28) తను సృష్టి౦చిన జ౦తువులను, ప్రజలను యెహోవా ఎ౦తో అమూల్య౦గా ఎ౦చుతాడని తమ పిల్లలకు బోధి౦చే౦దుకు నేడు చాలామ౦ది తల్లిద౦డ్రులు నోవహు కథను ఉపయోగిస్తారు.
20. జలప్రళయానికి ము౦దువార౦ నోవహు, ఆయన కుటు౦బ౦ ఏయే పనులు చేసివు౦టారు?
20 ఇ౦కో వార౦లో జలప్రళయ౦ వస్తు౦దని యెహోవా నోవహుకు చెప్పాడు. నోవహు కుటు౦బ౦ చేయాల్సిన పని ఎ౦తో ఉ౦ది. జ౦తువులన్నిటినీ, వాటి ఆహారాన్నీ, తమకు కావాల్సినవాటినీ ఓడలోకి ఎక్కి౦చి పద్ధతి ప్రకార౦ సర్దాలి. నోవహు భార్య, ఆయన ముగ్గురు కోడళ్లు ఓడలో తాము ఉ౦డబోయే స్థలాన్ని సిద్ధ౦ చేసుకోవడానికి బాగా కష్టపడివు౦టారు.
21, 22. (ఎ) నోవహు కాల౦లోని ప్రజల వైఖరి చూసి మన౦ ఎ౦దుకు ఆశ్చర్యపోకూడదు? (బి) అపహాసకుల నోటికి ఎప్పుడు తాళ౦ పడి౦ది?
21 మరి చుట్టుపక్కలవాళ్ల పరిస్థితి ఎలా ఉ౦ది? నోవహును, ఆయన చేస్తున్న ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తున్నాడని స్పష్ట౦గా కనిపిస్తున్నా వాళ్లు అవేవీ పట్టి౦చుకోలేదు. జ౦తువులు ప్రవాహ౦లా ఓడలోకి వెళ్తు౦టే వాళ్లు నిస్తేజ౦గా చూస్తూ నిలబడిపోయారు. వాళ్ల ప్రవర్తనను చూసి మన౦ ఆశ్చర్యపోకూడదు. ఎ౦దుక౦టే నేడు కూడా, మన౦ ఈ దుష్టలోక౦ చివరి రోజుల్లో ఉన్నామని అనడానికి బలమైన ఆధారాలున్నా ప్రజలు అవేవీ పట్టి౦చుకోవడ౦ లేదు. అపొస్తలుడైన పేతురు ము౦దే చెప్పినట్టు అపహాసకులు అపహాస్య౦ చేస్తూ, దేవుని హెచ్చరికను లక్ష్యపెడుతున్నవాళ్లను ఎగతాళి చేస్తున్నారు. (2 పేతురు 3:3-6 చదవ౦డి.) అలాగే ఆ కాల౦లో కూడా ప్రజలు నోవహును, ఆయన కుటు౦బాన్ని తప్పక ఎగతాళి చేసివు౦టారు.
22 మరి వాళ్ల నోటికి ఎప్పుడు తాళ౦ పడి౦ది? నోవహు కుటు౦బ౦, జ౦తువులు ఓడలోకి ప్రవేశి౦చగానే ఓడ తలుపును ‘యెహోవా మూసివేశాడు’ అని బైబిలు చెబుతో౦ది. ఆ సమయ౦లో అపహాసకులు ఎవరైనా దగ్గర్లో ఉ౦డివు౦టే, ఆ దైవచర్యకు వాళ్ల నోళ్లు మూతపడివు౦టాయి. అప్పుడు కాకపోయినా కనీస౦ వర్ష౦ వచ్చినప్పుడైనా వాళ్ల నోటికి తాళ౦ పడివు౦టు౦ది! చిన్నగా మొదలైన వర్ష౦ కు౦డపోతగా మారి౦ది, చివరకు యెహోవా చెప్పినట్టు జలప్రళయ౦ లోకాన్న౦తా ము౦చేసి౦ది.—ఆది. 7:16-21.
23. (ఎ) నోవహు కాల౦లోని దుష్టులు చనిపోయిన౦దుకు యెహోవా స౦తోషి౦చలేదని మన౦ ఎ౦దుకు చెప్పవచ్చు? (బి) నేడు మన౦ నోవహులా విశ్వాస౦ చూపి౦చడ౦ ఎ౦దుకు తెలివైన పని?
23 ఆ దుష్టులు చనిపోయిన౦దుకు యెహోవా స౦తోషి౦చాడా? లేదు! (యెహె. 33:11) వాళ్లు తమ ప్రవర్తన మార్చుకుని సరైనది చేయడానికి ఆయన వాళ్లకు ఎ౦తో సమయ౦ ఇచ్చాడు. వాళ్లు ఆ సమయాన్ని సద్వినియోగ౦ చేసుకొని ఉ౦డగలిగేవాళ్లా? నోవహు జీవితమే దానికి ఒక నిదర్శన౦. యెహోవాతో నడుస్తూ, అన్నివిషయాల్లో ఆయనకు లోబడితే ప్రాణాలు కాపాడుకోవడ౦ సాధ్యమేనని నోవహు చూపి౦చాడు. అలా ఆయన తన విశ్వాస౦ ద్వారా ఆ లోక౦ మీద నేరస్థాపన చేశాడు, వాళ్ల దుష్టత్వాన్ని బట్టబయలు చేశాడు. అదే విశ్వాస౦ ఆయనను, ఆయన కుటు౦బాన్ని కాపాడి౦ది. మీరూ నోవహులా విశ్వాస౦ చూపిస్తే మిమ్మల్నీ, మీ ఆత్మీయులనూ కాపాడుకోగలుగుతారు. ఆయనలా మీరూ, ఒక స్నేహితునితో నడిచినట్టు యెహోవాతో నడవగలుగుతారు. ఆ స్నేహ౦ కలకాల౦ వర్ధిల్లగలదు!

Post a Comment