Halloween Costume ideas 2015

Jesus is the Son of God means?

యేసు దేవుని కుమారుడు అనగా అర్థం ఏంటి? 

యేసు దేవుని కుమారుడు అనేది మానవ తండ్రికుమారులవలె కాదు. దేవుడు పెళ్ళి చేసుకోలేదు కుమారుని కలిగి యుండటానికి. దేవుడు మరియను శారీరకంగా కలువలేదు కుమారుని కనటానికి. యేసు దేవుని కుమారుడు అన్నప్పుడు మానవ రూపంలో ఆయనను దేవునికి ప్రత్యక్ష పరచాడు (యోహాను 1:1-14). పరిశుధ్ధాత్ముని ద్వారా మరియ గర్భము ధరించుటను బట్టి యేసు దేవుని కుమారుడు. లూకా1:35 ఈ విధంగా చెప్తుంది " దూత- 'పరిశుధ్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.'"

యూదా నాయకుల తీర్పు సమయంలో ప్రధానయాజకుడు యేసయ్యను రెట్టించి అడిగాడు. "అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి -నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని ఆనబెట్టుచున్నాననెను" (మత్తయి 26:63). "అందుకు యేసు నీవన్నట్టే." 'ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా'" (మత్తయి 26:64). అందుకు దానికి యూదానాయకులు స్పందిస్తూ యేసయ్య దేవదూషణ చేస్తున్నాడని నేరారోపణ చేశారు (మత్తయి 26:65-66).ఆ తర్వాత పొంతిపిలాతుముందు "అందుకు యూదులు- మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి" (యోహాను 19:7). ఆయన దేవుని కుమారుడను చెప్పుకోవటం ఎందుకు మరణ శిక్ష విధించాల్సిన దేవదూషణ అయ్యింది? యూదానాయకులు "దేవుని కుమారుడు" అని చెప్పుకొన్నదాన్ని సరిగాఅర్థం చేసుకున్నారు. దేవుని కుమారుడు అనగా దేవుని స్వభావము కలిగినవాడు అని అర్థం. దేవుని కుమారుడు దేవునినుండి వచ్చాడు. దేవుని స్వభావము కలిగినవాడు అనగా దేవుడు. కాబట్టి యూదానాయకులు దేవదూషణగా గుర్తించారు. లేవీకాండం 24:15 ఆధారం చేసుకొని యేసయ్య మరణాన్ని కోరారు." ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునైయుండి," అని హెబ్రీయులకు 1:3 దీనిని చాలా స్పష్టంగా ప్రకటిస్తుంది.

ఇంకొక ఉదాహరణను యోహాను 17:12 లో యూదాను "నాశనపుత్రుడు" గా ఆభివర్ణించుటలో చూడగలుగుతాం. యోహాను 6:71 యూదా సీమోను కుమారుడు అని ప్రకటిస్తుంది. యోహాను 17:12 యూదాను "నాశనపుత్రుడు" గా ఎందుకు ఆభివర్ణిస్తున్నాడు? "నాశనము" అను మాటకు అర్థం "ధ్వంసం, వినాశము, వ్యర్థపరచటం." యూదా నాశనము అనగా " ధ్వంసం, వినాశము, వ్యర్థపరచటం" అనే వీటికి పుట్టినవాడుకాడు. అయితే యూదా జీవితానికి ఇది గుర్తింపుగా వున్నది. యూదా నాశనమును వ్యక్తీకరిస్తున్నాడు. అదేవిధంగా యేసు దేవుని కుమారుడు, దేవుడు. యేసయ్య దేవుని యొక్క మూర్తిమంతమునైయున్నాడు (యోహాను 1:1, 14).


Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget