Halloween Costume ideas 2015

Is Jesus really exist? Historical Jesus nidarsanalunnaya nunnadanataniki arbitrary?

యేసు నిజంగా ఉనికిలో ఉన్నాడా? యేసు చారిత్రలో నున్నాడనటానికి నిర్హేతుకమైన నిదర్శానాలున్నాయా? 

ఒక వ్యక్తి ఇలా అడిగినపుడు ఆ ప్రశ్నలో బైబిలు వెలుపట అన్నది ఇమిడి యున్నది. బైబిలు యేసుక్రీస్తు ఉనికిలోనున్నాడు అని అంటానికి బైబిలును వాడకూడదు అనేది మనము అంగీకరించం. క్రొత్తనిబంధనలో యేసుక్రీస్తు విషయమై వందలాది ఋజువులున్నాయి. కొంతమంది సువార్తలు, యేసుక్రీస్తుమరణమునకు వంద సంవత్సారాల తర్వాత రెండో శతాబ్ధములో రాసారని చెప్పేవారున్న్నారు. ఒకవేళ ఇది వాస్తవమైనప్పటికి (దీనిని మనము గట్టిగా ప్రశ్నిస్తున్నాం). రెండువందల సంవత్సారాలలోపు పురాతన నిదర్శానలను నమ్మదగినవిగా గుర్తిస్తారు. అనేకమంది పండితులు (క్రైస్తవేతర) పౌలు రచించిన పత్రికలు (కనీసము) కొన్నైన్న మొదటి శతాబ్ధములోని యేసుక్రీస్తు మరణమునుంచి 40 సంవత్సరాలలోపే పసులు రచించాడని నమ్ముతారు.

పురాతన చేవ్రాతల ఋజువుల ప్రకారము ఒకటవ శతాబ్దపు ఇశ్రాయేలీయుల దేశమునందు యేసు ఆ వ్యక్తి వున్నాడనుటకు అసాధరణమైన శక్తివంతమైన ఋజువు.

క్రీస్తు శకము 70వ సంవత్సరములో రోమీయులు, ఇశ్ర్హాయేలీయుల దేశమును దాడి చేసి యెరుషలేమును పూర్తిగా నాశనముచేసి అందలి నివసించేవారిని ఊచకోతకోసారు. కొన్ని పట్టణాలు అగ్నితో సమూల నాశనంచేశారు. అటువంటి పరిస్థితులలో యేసయ్య ఉనికికి సంభందించిన సాక్ష్యులు పూర్తిగా నాశనమయిన ఆశ్చర్య పడనక్కరలేదు. అనేకమందిని యేసయ్యను చూచిన అ సజీవ సాక్ష్యులు చంపబడ్డారు. ఈ వాస్తవాలు యేసయ్యకు సంభందించిన సజీవ సాక్ష్యులు తక్కువగా వుంటాయని సూచిస్తున్నాయి.

యేసుక్రీస్తుయొక్క పరిచర్య రోమా సామ్రాజ్యములోని ఒక మారుమూల ఏ మాత్రము ప్రాధాన్యతలేని ఒకటిగా భూభాగమునకు పరిమితమైంది. అయినాప్పటికి ఆస్చర్యకరంగా బైబిలేతర లౌకికమైన చరిత్రలో ఎక్కువ సమాచారం కలిగియుండుట. యేసుకి సంభందించిన కొన్ని ప్రాముఖ్యమైన చారిత్రక సాక్ష్యాలు ఈ దిగువను పేర్కొనబడినవి.

తిబేరియకు చెందిన మొదటి శతాబ్దపు రోమీయుడైన టాసిటస్ ఆ కాలపు ప్రపంచానికి చెందిన గొప్ప చరిత్రకారుడని గుర్తిస్తారు. ఆయన రచనలలో మత భక్తి కలిగిన క్రైస్తవుడు. "క్రిస్టియన్స్" ( క్రిస్టస్ అనగా లాటిన్ భాషలో క్రీస్తు తిబేరియస్ పరిపాలనలో పొంతిపిలాతు అధికారము క్రింద శ్రమపొందారు. సుటోనియస్ హెడ్రియన్ చక్రవర్తియొక్క ప్రముఖ కార్యదర్శి. మొదటి శతాబ్దములో క్రిస్టస్ (క్రైస్ట్) అనే వ్యక్తి వున్నాడని రాశాడు (యానల్స్ 15:44)

జోసెఫస్ ఫ్లేవియస్ ప్రఖ్యాతిగాంచిన యూదా చరిత్రకారుడు. యాంటిక్విటిస్ లో యాకోబు గురుంచి ప్రస్తావించిన ఆయన "యేసు అనగా క్రీస్తు అని పిలువబడే సహోదరుడు" అన్నాడు. ఆయన గ్రంధములో 18:3 ఎంతో వివాదస్పదమయిన వచనము. ఆసమయంలో యేసు అనే జ్ఞానము కలిగిన వ్యక్తి వుండేవాడు. ఆయానను మనిషి అని పిలువటం ధర్మబద్దమయితే ఎందుకంటే ఆయన ఎన్నో ఆశ్చర్యకరమైన క్రియలు చేశాడు. ఆయన క్రీస్తు ఆయన మూడవదినమున సజీవుడుగా అగుపడ్డాడు.ప్రవక్తలు కొన్ని వేల సంవత్సారాలు ముందుగా ఆయన గురించి పలికిన అద్భుతమైన

ప్రవచనాల కనుగుణంగా మూడవ దినమున సజీవుడుగా కనపడ్డాడు. మరియొక అనువాదము ఈ విధంగా పేర్కోంటుంది. ఆ సమయంలో యేసు అనే ఒక నీతిమంతుడు వుండేవాడు. ఆయన మంచివాడు, పవిత్రుడు, యూదులలోను మరియు ఇతర దేశస్థులు అనేకులు ఆయన శిష్యులయ్యారు. పిలాతు శిక్షించగా ఆయనను సిలువపై చంపారు. అయితే ఆయన శిష్యులు ఆయనను విడిచి పోలేదు. అయితే ఆయన శిష్యులు ఆయనను విడిచి పోలేదు. అంతేకాదు, ఆయన గురించే వారికి మూడు దినాన్న కనబడ్డాడని, ఆయన సజీవుడని, ప్రవక్తలు అనేక అద్భుతాలు విషయాలు పేర్కోన్నారని కాబట్టి ఆయనే మెస్సీయా అని భోధించేరు.

జూలియస్ ఆఫ్రికానస్ చరిత్రకారుడైన థాలస్ ను ఉదహరిస్తూ యేసుక్రీస్తు సిలువ సమయంలో ఏర్పడిన చీకటి గురించి ప్రస్తావించాడు (ఎక్స్టాంట్ రైటింగ్స్, 18).

ప్లిని ది యంగర్, ఆయన రాసిన లెటర్స్ 10:96 లో ఆదిమ క్రైస్తవుల ఆరాధన, ఆచారాలు గురించి ప్రస్తావిస్తూ యేసుక్రీస్తుని దేవుడుగా పూజించేవారని ఎంతో నీతిగా వుండేవారని ప్రేమవిందు అనగా ప్రభురాత్రి భోజన సంస్కారమును కలిగి యుండేవారని పేర్కొన్నాడు.

బాబిలోనియన్ టాల్మడ్ (సన్హెద్రిన్ 43ఎ)పస్కాముందు సాయంత్రం యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని మరియు ఆయనపై వున్న నింద ఆయన మంత్రాలు ప్రయోగించేవాడని యూదులను మతభ్రష్టత పట్టించాడని అన్నదే.

సమోసటకు చెందిన లూసియన్ రెండవ శతాబ్ధపు గ్రీకు రచయిత క్రీస్తుని క్రైస్తవులు ఆరాధించేవారని, ఆయన క్రొత్త భోధలు భోధించేవాడని, సిలువ వేయబడ్డాడు అని ఒప్పుకున్నాడు. యేసయ్య భోధనలలో ప్రాముఖ్యమైనవి విశ్వాసులయొక్క సహోదరత్వము, మారుమనస్సు మరియు ఇతర దేవతలను తృణీకరించటం అని అన్నాడు. క్రైస్తవులు యేసయ్య నియమాలకు అనుగుణంగా జీవించేవారని, నిత్యజీవులని నమ్మేవారని, మరణముకైనను తెగించేవారని , స్వఛ్చంధంగానైన తమ్మును తాము పరిత్యజించేవారని రాశారు.

మెర (మర) బర-సెరపియన్ యేసు జ్ఞానము కలిగినవాడు మరియు పవిత్రుడని ఇశ్రాయేలీరాజుగా ఆయనను గుర్తించారని, యూదులు ఆయనను చంపారని, అయితే ఆయన అనుచరులు ఆయన భోధలు ద్వారా జీవించారు అని రాశారు.

గ్నాస్టిక్ రచనలలో (ద గాస్పల్ ఆఫ్ ట్రూత్, ద అపొక్రిఫాన్ ఆఫ్ జాన్, ద గాస్పల్ ఆఫ్ థామస్, ద ట్రిటీస్ ఆన్ రిజరక్షన్, ఇటిసి) అనేకమైన వాటిలో యేసయ్య గురుంచి ప్రస్తావించటం జరిగింది.

వాస్తవానికి క్రైస్తవేతర రచనలనుంచి సువార్తను మనము వ్రాయవచ్చు. యేసుని క్రీస్తు అన్నారు (జోసెఫస్) "అధ్భుతాలు" చేశారు. ఇశ్రాయేలీయులను కొత్త భోధలో నడిపించారు. పస్కాదినమున సిలువవేయబడ్డరు (బాబిలోనియన్ టాల్మడ్ ),యూదులలో (టాసిటస్) ఆయనే దేవుడని మరల తిరిగి వస్తాడని చెప్పుకున్నాడు (ఎలియాజరు), ఈ విషయాలను నమ్మి తన అనుచరులు ఆయనను దేవుడుగా అంగీకరించారు (ప్లీని ద యంగర్).

యేసుక్రీస్తు ఉనికికి సంభంధించిన అనేక నిదర్శానాలు ఇటు బైబిలు చరిత్రలలోను అటు లౌకిక చరిత్రలోనూ కూడ కలదు. అన్నిటికంటే యేసుక్రిస్తు ఉనికికి సంభంధించిన ఋజువులన్నిటిలో అతి గొప్పదైన మొదటి శతాబ్ధమునకు చెందిన వేలకొలది క్రైస్తవులు ఆయన శిష్యులతో కలిసి హతసాక్ష్యులుగా చనిపోడానికి ఇష్టపడటమే. ప్రజలు తాము నిజము అనుకొన్నదానికి చనిపోతారుగాని ఎవరూ అబద్దము అనేదానికి హతసాక్ష్యులవ్వరు.

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget