ఒక అందమైన తోట
ఇక్కడున్న భూమిని చూడండి! ప్రతీది ఎంత అందంగా ఉందో కదా! పచ్చగడ్డిని, చెట్లను, పువ్వులను, జంతువులను చూడండి. ఏనుగులను, సింహాలను మీరు గుర్తుపట్టగలరా?
ఏదెను తోటలోని జంతువులు
ఇంత అందమైన తోట ఎలా వచ్చింది? దేవుడు మన కోసం భూమిని ఎలా సిద్ధం చేశాడో చూద్దాం.
దేవుడు మొదట భూమిని కప్పడానికి పచ్చగడ్డిని తయారు చేశాడు. తర్వాత అన్ని రకాల చిన్నచిన్న మొక్కలను, పొదలను, చెట్లను చేశాడు. పెరుగుతూ ఉండే మొక్కలు, చెట్లు భూమికి అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే అవి అంతకంటె ఎక్కువగానే ఉపయోగపడతాయి. వాటిలో అనేకం మనకు మంచి రుచికరమైన ఆహారాన్ని కూడా ఇస్తాయి.
ఆ తర్వాత దేవుడు నీటిలో ఈదే చేపలనూ ఆకాశంలో ఎగిరే పక్షులనూ చేశాడు. కుక్కలను, పిల్లులను, గుర్రాలను, చిన్న జంతువులను, పెద్ద జంతువులను చేశాడు. మీ ఇంటి దగ్గర ఏయే జంతువులు జీవిస్తుంటాయి? దేవుడు మన కోసం వీటన్నింటినీ చేసినందుకు మనం సంతోషించాలి కదా?
చివరగా దేవుడు, భూమ్మీది ఒక ప్రాంతాన్ని చాలా ప్రత్యేకమైనదానిగా చేశాడు. ఆ ప్రాంతాన్నే ఆయన ఏదెను తోట అని పిలిచాడు. అది సంపూర్ణమైనది. దానిలో ఉన్నవన్నీ అందమైనవే. తాను చేసిన ఆ అందమైన తోటలాగే భూమంతా అందంగా మారాలని దేవుడు కోరుకున్నాడు.
అయితే మరొకసారి ఈ తోట చిత్రాన్ని చూడండి. అక్కడ ఏమి లోపించిందని దేవుడు చూశాడో మీకు తెలుసా? మనం చూద్దాం.
ఆదికాండము 1:11-25; 2:8, 9.
Post a Comment