Halloween Costume ideas 2015

Who are you?


ఓ మనిషి నీ వెవరు?
యేసుక్రీస్తు నామములో మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శుభములు తెలయజేస్తూన్నాను.
1) మనిషి అనగానే ఎంతో మంది మనకు కనబడుతున్నఈ శరీర ఆకారమేనని అనుకుంటారు,అంటారు. వాస్తవముగా కనిపించే ఈ ఆకారమును(శరీరం), కనిపించని ఆత్మల కలయికను మనిషీ అంటారు. ప్రారంభములో ఆదాము నిర్మాణం గురించి ఆలోచిస్తే రెండు కనపడతాయి. ఆదికాండ2:7-దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంద్రాములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఈ వచనములో చూస్తే మొదట ఆకారాన్ని నిర్మించాడు and రెండవదిగా ఆకారాన్ని కదిలించుటకు ఆత్మను ఇచ్చాడు( ఆత్మ ప్రవేశం).
2) సాధారణముగా తల్లితండ్రులు తమ పిల్లలకు ఆట భోమ్మలు కొంటారు. అందులో కదలని బొమ్మలు and కదిలే బొమ్మలు ఉంటాయి. ఒక బొమ్మ కదలాలంటే వెనుక battery system or key system ఉంటుందన్న విషయము మనకు తెలుసు. అలానే మనం కదలాలంటే ఏమి కావాలి??? మనం కదలాలి అంటే, చూడాలి అంటే, మాట్లాడాలి అంటే, చేతులు,కాళ్ళు కదలాలంటే ,పని చేయాలంటే ,ఆలోచించగలగాలి అంటే మనకి ఈ పనులన్నీ చేపించే ఒక శక్తీ కావాలి. ఆ శక్తీనే ఆత్మ. మనం చనిపోయే వరకు సరిపడ శక్తిని ఈ మట్టి బొమ్మ(శరీరం)లో ప్రవేశ పెట్టాడు దేవుడు. మనకు కనపడుతున్నది ఆకారం(శరీరం) కానీ కనబడని మహా శక్తీ(ఆత్మ) చాలా గొప్పది. మనిషి అనగానే ఒకటి కనిపించేది and రెండవది కనిపించనది.ఒకటి మట్టిలో నుంచి వచ్చింది and మరొకటి పరలోకము నుండి వచ్చింది. ఆ పరలోకము నుండి వచ్చిన దాని పేరు ఏంటో యేసుక్రీస్తు మొదటి శతాబ్దములో చెప్పాడు యోహాను 6:63-ఆత్మయే జివింపజేస్తుంది ;శరీరం కేవలము నిష్ ప్రయోజనము. 3) . మీరు బ్రతుకుతున్నది,జీవిస్తున్నది ఆహారం వల్ల కాదు కానీ ఆత్మ వల్ల అన్నాడు. ఒక వేళా ఆహరం వల్లే మనిషి బ్రతుకుతున్నాడు అని మీరు అంటే చచ్చిన శవానికి భోజనం పెడితే లేచి కూర్చుంటాడా?????లేదు. అదే చచ్చిన శవంలోకి ఆత్మను ప్రవేశ పడితే లేచి కూర్చుంటాడు.వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళి ప్రవేశ పెడితే లేచి కూర్చుంటాడు కానీ ఆహారం పెడితే కాదు. అంటే మనిషి బ్రతుకుతున్నాడంటే ఆత్మ వల్లే తప్ప ఆహారం వల్ల కాదు అని మనకు తెలిసింది. ఒక వేళ మనిషి ఆహారం వల్లే బ్రతుకుతాడు అని ఇంకా మీరు అనుకుంటే ఆదాముకు మానవ ఆకార నిర్మాణము మట్టితో తయారు చేసిన తర్వాత ఒక ప్లేట్ భోజనాన్ని దేవుడు ముందు పెట్టి తినిపించే వాడు. కానీ ఇలా జరగలేదు. మొట్ట మొదట మానవుని నిర్మాణంలో దేవుడు ఆహారాన్ని పెట్టాడా లేక ఆత్మను లోపల ప్రవేశ పెట్టాడా?????? ఆ సంగతి మనకు తెలియక తినే తిండి వాళ్ళ బ్రతుకుతున్నామని మనలో కొంత మంది అనుకుంటున్నరు. సమాజానికి కూడా ఇదే నేర్పించారు.

4) అందుకే యేసుక్రీస్తు చెబుతున్న మాటను ఆలోచిస్తే మనిషి అనగానే కనబడుతున్న ఆకారం కనే కాదు అన్న సత్యం మనకు తెలుస్తుంది. ఈ కనబడుతున్న ఆకారంలో శక్తివంతమైన ఆత్మ ఉంది. ఆ ఆత్మ వల్లే ఈ శరీరానికి కదలికలు వచ్చాయి. ఆ ఆత్మ వల్లే కళ్లకు చూపు వచ్చింది, ఆ ఆత్మ వల్లే నోటికి మాట వచ్చింది,ఆ ఆత్మ వల్లే చెవికి వినికిడి వచ్చింది,ఆ ఆత్మ వల్లే మెదడుకు ఆలోచనలు వస్తున్నాయి,ఆ ఆత్మ వల్లే శరీర నిర్మాణంలో ఉన్న ప్రతి అవయవం పని చేస్తుంది,ఆ ఆత్మ వల్లే చేతులు కదులుతున్నాయి,కాళ్ళు నడవగలుగుతున్నాయి. ఆ ఆత్మ లేకపోతే శవం అంటారు. శవంగా ఉంటే పై చెప్పినవన్నీ పని చేయవు.

5) మనం బ్రతికినంత కాలం ఆత్మ మనలో ఉండి మనకు అన్నింటికీ ఉపయోగపడుతున్నది. ఏదో ఒక రోజు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీర అవయవాలు పని చేయవు. అంటే పని చేయించే శక్తి లేదు. ఆ శక్తీ “””” ఆత్మ””. ఆత్మ ఉంటేనే అక్క,అన్న,చెల్లి బావ మరదల బంధాలు. ఆత్మ లేకుంటే ఆ సమాజములో మనకు చోటు లేదు. శరీరం మట్టిలో నుండి వచ్చింది కనుక మట్టిలో కలిసిపోవాలి. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శవం ఎందుకు పని రాకుండా పోతుంది. ఆత్మ ఉంటేనే ఈ శరీరానికి విలువ and ఆత్మ లేకపోతే ఈ శరీరానికి విలువ లేదు. మనిషి అనగానే ఈ శరీరం and ఆత్మల కలయిక.

6) కనిపించనంత మాత్రాన మన లోపల ఏమి లేదు అను అనుకోకూడదు. current కనిపించదు. current ఉందో,లేదో చూడడానికి wire తెంపి కళ్ళ దగ్గర పెట్టుకుని చూస్తామా?????? లేదు. light వేసాక current ఉంటె వెలుగుతుంది అని and current లేకపోతే వెలగలేదు అని అనుకుంటాము. అలానే doctor గారు నాడి పట్టుకుని బ్రతికి ఉన్నాడా లేక చనిపోయాడా అనే నిర్ధారణకు వస్తారు. అంటే లోపల ఉన్నదీ,ఉంటున్నది వెళ్లిపోయింది. అదే ఆత్మ.

7) bulb అనేది current కాదు కానీ bulbనీ వెలిగించేది current. అలానే ఈ శరీరం నువ్వు కాదు కానీ ఆ శరీరంలో ఉన్నదీ నువ్వు. ఈ శరీరంలో ఉన్నదీ ఆత్మ. ఆత్మే నువ్వు కానీ శరీరం కాదు. చిన్న example:: మనం ఉంటున్న అద్దె ఇళ్ళు ఎప్పుడో అప్పుడు కాళీ చేసి వెళ్లిపోతాము కదా.ఇళ్ళు కాళీ చేసి వెళ్ళేటప్పుడు ఇళ్లును కూడా తీసుకువెళ్తామా???? ఇంటిలో ఉన్న సామానులను తీసుకువెళ్తాం కానీ ఇళ్ళు మాత్రం అక్కడే ఉంటుంది. ఒక ఇళ్లును కాళీ చేసి మీరు ఎలా వెళ్లిపోతారో ఒక రోజు ఈ శరీరం కాళీ చేసి వెళ్లిపోవాలి. ఇంటిలో ఉంటుంది మీరు and అలాగే శరీరంలో ఉంటుంది మీరు. అదే ఆత్మ.. ఇళ్ళు కాళీ చేసేటప్పుడు ఇళ్ళు ఎలా వదిలివేయాలో ఒక రోజు ఆత్మగా ఉంటున్న నువ్వు ఈ శరిరమనే ఇంటిని కాళీ చేసి వెళ్లిపోవాలి. కాళీ చేసి వెళ్ళిపోయావు కనుక శరీరం శవంగా ఉంది and శరీరంలో ఉన్న నువ్వు మాత్రం వెళ్ళిపోయావు.

8) యోబు 10:10 నుంచి- చర్మముతోను,మాoసముతోను నీవు నన్ను కప్పితివి .ఎముకులతోను,నరములతోను నన్ను సంధించిటివి.. ఉదా:: nithinకి మీరు శాల్వ కప్పారు. అనగా nithinకు శాల్వ కప్పారు.. అంటే nithin వేరు and శాల్వ వేరు కానీ nithinనే శాల్వ కాదు. అంటే nithin వేరు and nithinకి కప్పిన శాల్వ వేరు. ఇప్పుడు యోబు 10:10లో యోబు మాటలలో నీవు నన్ను కప్పితివి అన్నాడు. అంటే యోబు వేరు and యోబుకు కప్పబడినవి వేరు అని అర్థం. కప్పబడినవి అనగా చర్మము,మాంసము...... యోబు 10:12-నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అనగా యోబు మాటలలోని అర్థం చూస్తే ఈ శరీరములో నేను ఉండడానికి చర్మాన్ని,మాంసాన్ని,ఎముకులతో,నరాలతో లోపల నన్ను పెట్టి కాపాడావు అని అంటున్నాడు. అనగా శరీరం వేరు ఆత్మ వేరు. అలానే యేహెజ్కేలు3:19,3:21-నీవు అను చోట బ్రాకెట్లో ఆత్మ అని రాయబడింది. అంటే నీవు అనగా ఆత్మ. లోపల ఉన్నది నువ్వు and నీకు ఇవ్వబడింది ఈ శరీరం.

9) doctor దగ్గరకు వెళ్లి నాకు తలనొప్పి ఉంది అని చెబుతాము. అంటే నాకు ఒక తల ఉంది and ఆ తలలో నొప్పి ఉంది అని అర్థం. ఇది నా తల అంటే నేను వేరు తల వేరు. ఇంత గొప్పదైన ఆత్మను గూర్చి మనిషి అస్సలు ఆలోచించక మనిషి అనగానే శరీరమని అనుకుంటున్నారు.అద్దెకి ఉంటున్న ఇంటిని గూర్చి ఆలోచిస్తామా?? ఈ ఇళ్లును ఇలా చేద్దాము అలా చేద్దాము అని అనుకుంటారా? లేదు . ఎందుకంటే అద్దె ఇల్లులో ఉంటున్నాం కనుక ఒక రోజు వెళ్లిపోవాలి వదిలి. అలానే ఆత్మగా ఉంటున్న నువ్వు ఈ శరీరం అనే ఇంటిలో కొద్ది కాలం అద్దెగా ఉంటున్నాము. ఆత్మ అను నువ్వు శరిరమనే అద్దె ఇంటిలో ఉండి ఎల్లప్ప్పుడు శరీరాన్ని గురించే ఆలోచిస్తున్నాము. ఆత్మ గురించి ఆలోచించక కాళీ చేసి వెళ్ళిపోయే శరీరం గురించి ఎందుకు ఆలోచించాలి??? కానీ ఈ రోజు బ్రతికినంత కాలం శరీరాన్ని గురించి అలోచించి చివరికి శవంగా మారుతున్నారు.వదిలివేసే శరీరం గూర్చి ఇంత ఆలోచిస్తే మరి నీ గురించి నువ్వు ఆలోచించుకోవా??? ఆత్మయైన నువ్వు నీ గురించి ఆలోచించక పోతే ఎలా?? అస్సలు ఈ భూమి మీద ఉన్న మనము ఆలోచించాల్సింది శరీరములోకి ఎందుకు వచ్చాను, దేవుడు ఎందుకు మట్టి శరీరంలో నన్ను పెట్టాడు,ఎందుకు మళ్ళి తీసుకోని పోతున్నాడన్న సంగతులు ఆలోచించాలి.

10) బ్రతుకుతున్నది దేవుని వల్ల. కదులుతున్నది దేవుని వల్ల. ఉనికి కలుగుతున్నది దేవుడు ఇచ్చిన ఆత్మ వల్ల. మరి అయన కొరకు బ్రతుకుతున్నారా??? నిద్ర లేచారు అంటే దేవుని దయ వలన. లేచిన ఆ దినములో దేవుని కొరకు బ్రతుకుతున్నారా??? మనం సొంత పనుల కోసం కదులుతున్నాము కానీ దేవుని కొరకు కదులుతున్నామా??? దేవుడు లోపల ఆత్మను పెట్టి ఈ శరీరానికి కదలికలు ఇచ్చాడు గనుక పనికి వెళ్తున్నారు కానీ దేవుని పని చేయడం లేదు. అయన వల్ల కదులుతున్న మనం దేవుని కొరకు రావట్లేదు. అయన వల్ల బ్రతుకుతున్నారు కానీ అయన కొరకు బ్రతకడం లేదు.

11) బ్రతుకు ఇచ్చింది నీ,నా కోసం బ్రతకమని కాదు కానీ దేవుని కోసం బ్రతకమని. కదలికలు ఇచ్చింది నీ,నా కోసం కదలమని కాదు కానీ దేవుని కోసము కదలమని. మనిషి జన్మ ఎందుకు and దేవుడు శరీరాన్ని ఎందుకు చేసాడు అన్న అంశాలు ఇది వరకే post చేసియున్నాను. ఒకవేళ చదవకపోతే commentలో అంశము యొక్క link కాపీ చేయబడియున్నది.

Labels:

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget