Halloween Costume ideas 2015

Kristuvudu Cheyavalachina Melu (Dhanam) Edhi?

క్రైస్తవుడు చేయవలసిన మేలు(దానం) ఏది?


క్రైస్తవుడు చేయవలసిన మేలు(దానం) ఏది?? యేసుక్రీస్తు నామములో మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాను.
1) మేలు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి దానధర్మాలు ,పుణ్య కార్యాలు, సహాయ సహకారాలు,ఎక్కువుగా కలిగి ఉన్నవారు లేని వారికీ పంచటాలు ఇలా వీటిని సమాజం మేలులుగా భావిస్తుంది.ముఖ్యముగా ఈ మేలులు చేసేవారిలో కొందరు స్వార్ధ ప్రయోజనాలు ఆశిస్తూ ,కొందరు నిస్వార్ధంగా చేస్తూ ఉంటారు.ఈ దాన ధర్మాలు చేయటం వెనుక సమాజములో కొన్ని సామెతలు కూడ లేకపోలేదు. అవి“మానవ సేవే మాధవ సేవ”,ప్రార్దించే పెదవులకన్న సయం చేసే చేతులే మిన్న. ఇలాంటి మాటలు వినబడినప్పుడు లేదా కనపడినప్పుడు మానవత్వం ఉన్న ఎవరికైనా ఖచ్చితముగా సాటి మనిషికి దానం చేయాలనో,సహాయం చేయాలనో అనిపించటం సహజం.
ఈ దాన ధర్మాలు చేయటం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.
a) ఈ జనంలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మంచి జీవితం వస్తుందని .
b) మేలులు లేదా పుణ్య కార్యాలు ద్వార సంతానం కలుగుతుందనే నమ్మకం.
c)కొందరు పేరు ప్రఖ్యాతలు కోసం మంచిని తలపెట్టేవారు.
d) చేసిన పాపాలను నివృత్తి చేసుకోవటం కోసం చేస్తారు.
e) కొందరు పిల్లలు లేక ఇక చేసేది ఏమి లేక ఉన్న ఆస్తిని దాన ధర్మాలు చేయటం .
f) మనిషిగా పుట్టాము కాబట్టి ఈ జన్మలో నలుగురు గుర్తు పెట్టుకునే పనులు చేయాలి...

2) పైన చెప్పిన విధముగా స్వార్ధంగానో,నిస్వార్ధంగానో సమాజానికి మేలు కలిగించే పనులు జరుగుతున్నాయి. అన్నదానం అని, నీటి దానం అని ,గోవుల దానం అని, భూదానం అని, విద్య దానం అని,బంగారు మామిడి పండ్ల దానం ,శ్రమ దానం,రక్త దానం,నేత్ర దానం,మూత్రపిండాల దానం ఇలా అనేక దానాలు మనం సమాజములో చూస్తున్నాము. ఇక ప్రభుత్వం సమజానికి చేసే మేలులు గురించి ఆలోచిస్తే బియ్యం,కందిపపు నుంచి నిత్యావసర వస్తువులు తక్కువ ధరకే పంపిణి చేయటం,ముసలి,వికలాంగులకు pension ఇవ్వటంఇలా అనేక విధముగా మేలులు చేస్తుంది ప్రభుత్వం. 3) పైన చెప్పిన దాన ధర్మాలు, మేలులు,సేవలు,పుణ్య కార్యాలు అన్నింటికీ ఉద్దేశం ఒకటే.అదేమనగా మరో జన్మంటూ ఉంటె మంచి జన్మ పొందుకోవాలి అని ఒకరు,స్వర్గం –నరకం నిజంగా ఉంటె స్వర్గములోకి వెళ్ళాలని ఇంకొకరు. ఇంతకు ఈ కార్యక్రమాలు దేవునికి ఎలా ఉన్నాయో ఒక్కసారి bibleనీ అడిగితే యెషయ ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన మాటను చూస్తే అర్చర్యపోక తప్పదు.యెషయ 64:6- మా నీతి క్రియలు(మనం చేసే మేలులు) దేవుని దృష్టికి మురికి గుడ్డవలె ఉన్నాయి. లోకంలో నిజ దేవున్ని నమ్మకుండా చేసే ఏ విధమైన మేలు అయిన,ధర్మం అయిన “ దేవుని“దృష్టికి మురికి గుడ్డ వాలే ఉందంటే మరి దేవునికి మనం చేసే దానం నచ్చటం లేదా???? లేక దానం చేసే మనుష్యులు నచ్చటం లేదా????? ఇంతకి నచ్చకపోవటం వెనుక కారణం ఏంటి??? యోహాను 12:43- వారు దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును ఎక్కువుగా అపెక్షించిరి.

4) పైన చెప్పిన మాటను బట్టి దానం లేదా మేలు చేయటం తప్పు కాదు కానీ ,ఆ దానం చేసే వ్యక్తులు పేరు ప్రఖ్యాతలు కోసమే,స్వార్ధ ప్రయోజనాల కోసమో,అందరు గుర్తించుకోవలనో చేస్తున్నారే తప్ప దేవునికి మహిమకరంగా ,దేవునికిఇష్టమైన మేలులు చేయటం లేదు. అయితే దేవుడు ఎవరినైనా మేలు చేయమని చెప్పాడా అని ఆలోచిస్తే bibleలో దేవుడు చెబుతున్నమాటను చూస్తే 11 దేస్సా3:13- సహోదరులారా,మీరైతే మేలు చేయుటలో విసుక వద్దు. దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞను జాగ్రత్తగా పరిశిలిస్తే ఒక అద్భుతమైన విషయం బయటపడుతుంది. అది క్రైస్తవులు చేసే మేలు ప్రపంచ ప్రజలు చేసేటటువంటి మేలు కాదని,క్రైస్తవులు చేసే మేలు దేవునికి ఇష్టమైనదని ,అందువలననే దేవుడు క్రైస్తవులను విసుగక మేలు చేస్తూ ఉండమని అజ్ఞాపించాడు.

5) ఇంతకుక్రైస్తవుని మేలు ఏంటో చూద్దాం.... మేలు చేయటం అనగా మంచి చేయటం,దానం చేయటం అని పర్యాయ పదాలు వస్తాయి. క్రైస్తవ మేలు అనగానే దేవుని వలన క్రైస్తవుడు మేలు పొందటం అనుకుంటే పొరపాటే. నిజం ఏంటంటే క్రైస్తవుడు అనగా “”” క్రీస్తు రక్తం ద్వారా విలువ పెట్టి కొనబడిన వ్యక్తి “”.అనగా క్రైస్తవుడు చేయవలసిన మేలు సాక్షాత్తు క్రీస్తు ద్వార దేవునికే.. ఎందుకనగా మనం కొనే ఏ వస్తువు అయిన మనకు మేలు చేస్తే మనం ఉంచుకుంటాం. అలాగే క్రీస్తు మనల్ని తన క్రయధనంతో కొన్నప్పుడు మనం కూడ క్రీస్తుకు మేలు చేయలి.

6) మేలు చేయటం వలన ఉపయోగాలు ఉన్నాయా అంటే ఈ లోక సంభందమైన ఉపయోగాలు లేవు గానీ పరలోక సంభంధమైన మేలులే ఉన్నాయి. యోహాను 5:29- మేలు చేసిన వారు మాత్రమే జివ పునరుర్దానమునకు సమాధి నుండి బయటకు వస్తారు &1 తిమోతి 6:18- వాస్తవమైన నిత్యజివాన్ని రాబోవు కాలానికి మంచి పునాదిని వేసుకోవాలంటే మేలు చేయాలి. దేవునిదృష్టిలో మేలు చేయటం ద్వార దేవున్ని సంతోషపెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి.. రోమా 3:12- మేలు చేయువాడు లేడు,ఒక్కడును లేడు.... ఈ విషయాన్ని గమనించిన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ భూమి మీదకు వచ్చాడు(హెబ్రీ 10:7). కాబట్టి మేలు అనే పదానికి అర్థం యేసుక్రీస్తు ద్వారానే తెలుసుకోవాలి.

7) “”యేసుక్రీస్తు పరలోకానికి మార్గమని,యేసు ద్వారానే నిత్యజివమని ప్రకటించుటయే క్రైస్తవుడు చేయవలసిన మేలు””.. రోమా 5:17-మరణము ఒకని అపరాధములమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబహుల్యమును “”నీతి దానము”” ను పొందిన వారు జీవము గలవారై మరి నిర్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే యేలుదురు.

8) పైన చెప్పబడిన మాటను బట్టి క్రైస్తవుడు చేయవలసిన దానము “” నీతి దానము”” అని అర్థమయింది. మరి నీతి అనగా ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే దానికి కూడా bible సమాధానం చెప్తుంది. రోమా 4:3- లేఖనమేమి చెప్పుచున్నది,అబ్రహాము దేవున్ని నమ్మెను.అది అతనికి నీతిగా ఎంచబడెను.. కాబట్టి దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయనను నమ్మటమే నీతి. మరి ఈ నీతిని దానం చేయటం ఎలాగో పరిశిలిద్దాం. 11 పేతురు 2:5- మరియు అయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక,భక్తిహినుల సమూహము మీదికి జలప్రళయం రప్పించినప్పుడు “” నీతిని ప్రకటించిన”” నోవహును మరి ఏడుగురిని కాపాడెను.

9) కాబట్టి పైన చెప్పబడిన లేఖనం ప్రకారం నోవాహు జలప్రళయం సమయంలో రక్షణ సువార్తను ప్రకటించాడు అనేవిషయాన్ని పరిశుదాత్మ దేవుడు నీతిని ప్రకటించటంగా బయలుపరిచాడు(1 పేతురు 3:21). ఇంతవరకు మన వివరణలో మనకు తెలిసిన ఫలితార్ధం ఏమనగా“””క్రైస్తవుడు సువార్తను ప్రకటించుటయే నీతిని దానం చేయటం”””

10) సర్వలోకనికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే సర్వలోకాన్ని నీతిమంతులుగా మార్చమనే అర్థం ఇమిడి ఉంది. కానీ క్రైస్తవులు ఆకలిలేని ప్రపంచాన్ని నిర్మించాలని అన్నదాన కార్యక్రమాలు ,ఆరోగ్యవంతమైన సమాజం కోసం మిషనరీ hospitals, రక్తదానాలు,నేత్రదానాలు ,పేదరిక నిర్మూలనకు వేదేశాలు పంపుతున్న ధనంతోకేవలం ఇవి మాత్రమే చేయటం ద్వారా క్రైస్తవ్యం కాస్తా క్రైస్తవ మతంగా మారిపోయింది.

11) ఈ జీవితకాలం మట్టుకు సుఖాల కోసం దాన ధర్మాలు చేసి మనుష్యుల్ని ధనవంతుడు ఉండే వేధనకరమైన స్థలానికి పంపుతారో లేక వాటితో పాటు నీతి దానం చేసి దరిద్రులను సైతం దేవుడున్న లోకానికి చేరుస్తారో నిర్ణయం మిదే. యుదా1:23- నీతి దానం ద్వారా అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా రక్షించండి. యాకోబు 4:17- మేలైనది చేయనేరిగియు ఆలాగు చేయని వణికి పాపము కలుగును. యాకోబు 1:21-ఆత్మలను నరకగుండం అనే కటినమైన శిక్ష నుండి తప్పించగల శక్తీ గల్గిన వాక్యమును ప్రకటించండి.

12) ఇదే క్రైస్తవుడు చేయవలసిన, క్రీస్తు చేసిన ,దేవుడు చేయమన్న అతి ప్రాముఖ్యమైన,శ్రేష్టమైన గొప్ప మేలు. ఇది అన్ని దానముల కన్నా విశిష్టమైన దానం. ఈ మేలు(దానం) మరుపురానిది,దేవుడు మరువలేనిది.




Labels:

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget