Halloween Costume ideas 2015

The Book of Ezra

ఎజ్రా గ్రంథం
ఇశ్రాయేలును పునర్నిర్మించడానికి 100సం.ల కాలం పట్టినప్పటికీ అందులో జరిగిన
ఉపోద్ఘాతం : మానవుల పట్ల దేవుని ఉద్దేశాల నేరవేర్పు కొన్ని సార్లు ఆలస్యంగా జరుగవచ్చునుకాని అవి ఏ మాత్రం విసర్జించబడవు అనే దానికి నిదర్శనం ఈ గ్రంధం. దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు అనగా ఇశ్రాయేలీయులు బబులోను చేర నుండి తిరిగి వచ్చిన ఉదంతాన్ని ఎజ్రా గ్రంథం తెలియజేస్తుంది. దేవుని ప్రజలు దేవుని పనిని చెయ్యడానికి ఇష్టపడితే దేవుడు వారి ద్వారా అన్ని కాలాల్లోను తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని పని చేయడానికి ఎలాంటి నాయకులు కావలెనో తెలియజేసే ఈ గ్రంథం, దేవుని నియమాలు, సూత్రాలు మరియు పద్ధతులను కూడా తెలియజేస్తుంది.

ఈ గ్రంథం రెండు భాగాలుగా చేయబడినది 1. జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో మందిరం యొక్క రెండవ దశ నిర్మాణం. (ఎజ్రా 1-6 అధ్యాయాలు) 2. ఎజ్రా చేసిన పరిచర్య (ఎజ్రా 7-10 అధ్యాయాలు).
ఇశ్రాయేలును పునర్నిర్మించడానికి 100సం.ల కాలం పట్టినప్పటికీ అందులో జరిగిన సగం కాలమంతా 6 మరియు 7 అధ్యాయాలలో ఎజ్రా గ్రంథం విశదీకరించింది. ఈ గ్రంధము సగ భాగం వరకు కనిపించిన వ్యక్తులు ఎజ్రా కాలం నాటికి మరణించినా ఎజ్రా ఒక ప్రాముఖ్య పాత్రగా ఇశ్రాయేలీయులు ఎక్కడైతే పాపములో ఉన్నారో వారిని లేవనెత్తుటకు కారకుడయ్యాడు. యూదా చివరి రాజైన సిద్కియా బబులోనుకు తీసుకొనిపోబడ్డాడు. యెరూషలేము పట్టణం నాశనం చేయబడింది. మందిరం కాల్చివేయబడింది. కోరెషు ఆధ్వర్యంలో మాదీయులు మరియు పారసీయులు చేసిన దాడిలో బబులోను కూలిపోయింది. కోరేషు బబులోనుపై దర్యావేషును నియమించాడు. కోరెషు పాలనలో మొదటి సంవత్సరం యూదులు యెరూషలేమునకు తిరిగి వెళ్లి మందిరాన్ని పునర్నిర్మించుకోవచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞతో ఈ గ్రంథం ప్రారంభం అయింది. దేవుని మందిర ఉపకరణాలన్నిటిని భద్రం చేసేందుకు దేవుడు బబులోను ఖజానాను వాడుకున్నారు. ఈ ఆజ్ఞతో యూదా చరిత్రలో, యూదుల జీవితాల్లో క్రొత్త అధ్యాయం ప్రారంభమైంది. మోషే నాయకుడుగా ఉన్నా ఇశ్రాయేలు జనాంగానికి ఎజ్రా న్యాయకత్వం వహించి మందిర పనియంతటిని చేపట్టి ముందుగా బలిపీఠాన్ని నిర్మించారు. కోరెషు మరణానంతరం మందిర నిర్మాణ పని ఆగినప్పటికి హగ్గయి జెకర్యా ప్రవక్తల ప్రోత్సాహం ద్వారా మరలా కట్టనారంభించారు. దేవుడు అధికారులను రాజులను సయితం తన సాధనాలుగా వాడుకొని దర్యావేషు ఆధ్వర్యంలో మందిర నిర్మాణం పూర్తయి ప్రతిష్ఠించబడుతుంది.
ఎజ్రా దేవుని ప్రజల కొరకు దేవుని ప్రణాళికలో తోడ్పడిన నాయకుడు. ఎజ్రా అనే పేరునకు అర్ధం “సహాయము”. అతడు మోషే మరియు సమూయేలు వలె ఇశ్రాయేలు చరిత్రాధారాలను పొందుపరచి వ్రాసి వాటిని కాపాడడమే గాక ఇశ్రాయేలు జాతి ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు దోహదపడినవాడు.
సారాంశం : ఎజ్రా వలన ఇశ్రాయేలుకు అది సాధ్యం అయింది. ఎజ్రాను దేవుడు వదిలి పెట్టలేదు గాని అతని ద్వారానే తన కార్యాన్ని జరిగించుకున్నాడు. ఎజ్రాకు కలిగిన క్లిష్ఠ పరిస్థితుల్లో కూడా తన చేయి విడువకుండా దేవుడతనిని కాపాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలు ఎక్కడున్నా వారికి భద్రతా సంరక్షణ. మనము కూడా ప్రభువు పరిచర్యలో మరి ముఖ్యముగా బయలు పరచబడిన సంగతులను కార్యసిద్ధి కలుగజేయు సంగతులలో ఎంతో విధేయత కలిగిన వారమై చురుకుగా ఆయన సన్నిధిలో ముందుకు సాగవలెనని ప్రభువు పేరట మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. అంతే కాకుండా విశ్వాసి దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే చెడిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలంటే మొదట పాప నివారణను గూర్చి శ్రద్ధ వహించాలి. దేవుడు మనిషిని దీవించాలి అంటే ముందుగా ఆతని హృదయం సరిగా ఉండాలి. అట్టి కృప ప్రభువు మనందరికి దయచేయును గాక. ఆమేన్.


Labels:

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget