Halloween Costume ideas 2015

Nijamyna Christians Evaru?

నిజమైన క్రైస్తవులు ఎవరు?

నిజమైన క్రైస్తవులు ఎవరు?
మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభములు తెలియజేస్తున్నాను.
1) ప్రతి ఆదివారం తలంటు పోసుకుని చక్కటి తెల్లని వస్త్రాలు ధరించి bible పట్టుకుని మేడలో సిలువను ధరించి చర్చికెళ్ళి కాసేపు ప్రార్ధన,కాసేపు స్తుతి ఆరాధన& చివరిగా పాట,కనుక ఆశీర్వాద ప్రార్ధనతో ఇంటికి తిరుగు ముఖం పట్టే వారినే క్రైస్తవులని నేటి సమాజం బలంగా విశ్వాసిస్తుంది. ఒక విధముగా చెప్పాలంటే క్రైస్తవుల భక్తి దేవున్ని మైమరిపించి దేవుని నుంచి ఏదో పొందుకోవాలనో ధ్యాసలో సాగుతుంది.
a) క్రీస్తును నమ్మటం వలన నాకు సంతానం కలిగింది అని, అందువలన క్రిస్తుని విశ్వసిస్తున్నానని ప్రకటించుకోవటం.
b) క్రీస్తును నమ్మటం ద్వారా నయం కానీ జబ్బు అద్భుతంగా నయం అయిపోయింది అని మరో సాక్ష్యం.
c) క్రీస్తును విశ్వసించటం ద్వారా ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను ,దేవునికి స్త్రోత్రం అనే ప్రశంసలు.
d) క్రీస్తును చేరటం ద్వారా కోర్టులో కేసును గెలిచాను అన్న ఆనందం.
e) క్రీస్తును దేవునిగా అంగికరించినప్పటి నుంచి నేను ఆశిర్వదించబడ్డాను అనే ప్రకటనలు.
f) పంటల్లో దిగుబడి,వ్యాపారంలో అభివృద్ధి ,విద్యలో ముందంజుకు కారణం క్రీస్తును నమ్మటమేనని, చివరికి ఈ సాక్ష్యాలు ఎంత దిగజారి పోయాయి అంటే యేసుక్రీస్తును నమ్మినప్పటి నుంచి మా గేదె నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది అనే సాక్ష్యాలు లేకపోలేదంటే క్రైస్తవ్యం ఎంత దిగజారి పోయిందో ప్రత్యేకంగాచెప్పుకోనక్కర లేదు. 2) ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తును నమ్మి వెంట తిరిగి, క్రీస్తును 30 వెండి నాణేలకు అమ్ముకున్న ఇస్కరియోతు యుదా లాంటి వారినే క్రైస్తవులని పిలుస్తుoడటం ఎంత పాపమో క్రింది దేవుని మాటను పరిశిలించండి. 1 కోరంది 15:19- ఈ60-70 years జీవితకాలం మట్టుకే మనం క్రైస్తవులుగా మరి క్రీస్తు నందు నిరిక్షిస్తే ప్రపంచములో ఉన్న మిగిలిన మనుష్యుల అందరి కంటే దౌర్భాగ్యులమై యుందుము.
3) నిజమైన క్రైస్తవులు ఎవరు మరి?
a) నీటి మూలముగా (బాప్తీస్మం ద్వారా),ఆత్మ మూలముగా జన్మించిన వారు –(యోహాను 3:5).
b) క్రీస్తును పోలి నడుచుకునే వారు –(1 కోరంది 11:1).
c) క్రీస్తు స్వరూపాన్ని సంతరించుకున్న వారు- (గలతీ 4:19).
d) యేసుక్రీస్తు మరణ విషయములో మరణానుభావము గల వారు,యేసుక్రీస్తు అనుభవించిన శ్రమలలో పాలివారు, యేసుక్రీస్తు నిమ్మితం సమస్తము పెంటతో సమానముగా ఎంచుకున్నవారు –(ఫిలిప్పి3:10-11).
e) క్రీస్తు కొరకు భాదను అనుభవించే వారు-( 1 పేతురు 4:16).
f) క్రీస్తు కొరకు హింసను అనుభవించేవారు (11 తిమోతి 3:12).
g) క్రీస్తు కొరకు శ్రమను అనుభవించేవారు-( 11 తిమోతి 2:3).
h) పరలోక ప్రవేశం కొరకు ఈ భూమి మీద అనేక శ్రమలు అనుభవించేవారు-( అపో.కా.14:22).
ఈ భూ సంభంధమైన కార్యాల మీద కాకుండా పరలోక సంబంధమైన వాటి మీదనే మనస్సు నిలిపి వాటి కోసమే బ్రతికే వారు-(కొలస్సి 3:2&3).
i) మన పౌర స్థితి పరలోకంలో ఉందని,ఆ పౌరస్థితి కోసమే బ్రతికే వారు- (ఫిలిప్పి 3:20).
j) పగలు ఉన్నంత వరకూ దేవుని పని చేయాలి అని, ఆ పని కోసమే తమ బ్రతుకును అర్పించుకున్నవారు –(యోహాను 9:4).
k) దేవుని పని నిమిత్తం తమ శరీరాలను సైతం సజివయాగంగా సమర్పించుకున్న వారే క్రైస్తవులు-(రోమ 12:1).
l) యేసుక్రీస్తును విశ్వసించుట ద్వారానీతిమంతులుగా తీర్చబడిన వారే క్రైస్తవులు-(రోమ 3:24).
4) పై మాటలను పరిశీలించిన తర్వాత క్రైస్తవులు అంటే ఎల్లప్పుడూ దేవునిని సంతోషపెడుతూ ,దేవుని పని నిమిత్తమే బ్రతికేవారు అని అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే “” దాన ధర్మాలతో ,మేలులతో మనుష్యులను సంతోషపరచేవాడు ,మనష్యుల దయను,మనుష్యుల పొగడ్తలను ఆశించేవాడు క్రైస్తవుడు కాలేడని అర్థమవుతుంది.




Labels:

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget