Halloween Costume ideas 2015

Paralokapu Thandri Istamu Neraverchana ?

పరలోకపు తండ్రి ఇష్టము నేరవేర్చవా?
పరలోకపు తండ్రి ఇష్టము నేరవేర్చవా?
ముందుగా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలయజేస్తున్నాను.
మొదటగా పరలోకమందున్న తండ్రియైన మన దేవుని ఇష్టము మనుష్యులలో నెరవేరుతుందా అని ఆలోచించాలి? మన జీవితములో అయినదానికి , కాని దానికి నా ఇష్టము అనే పదాన్ని మాటిమాటికి use చేస్తాము. మానవులంతా ““ నా ఇష్టము”” అను పదముతో మనల్ని పుట్టించిన దేవునికి, తల్లితండ్రులకు, ఎదురు తిరుగుతున్నారు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు మనలో తన ఇష్టాన్ని జరిగించుకోవాలని ఆశ ఉన్నది. ఈ సత్యాన్ని తొలి మానవుడు నుండి మనమంతా మరచిపోయాము. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము తండ్రి ఇష్టాన్ని నెరవేర్చవలసిన భాద్యత ఉన్నది. దేవునికి ఇష్టము ఉందని యేసుక్రీస్తు వారు ప్రపంచానికి నేర్పిస్తున్న విధానాన్ని చూద్దాము.. మత్తాయి 6:10- నీ చిత్తము( ఇష్టము) పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక..... అంటే భూమి మిద ఉన్న మనుషులలో నెరవేరును గాక అంటున్నాడు. అపోకార్య 13:22:అతడు(దావీదు) నా ఇష్టానుసారుడైన మనుష్యుడు,అతడు నా ఉద్దేశములన్నియు నేరవేర్చునని చెప్పి అతని గూర్చి(దావీదు) సాక్షామిచ్చేను. ఈ లోకములో ఉన్న దావీదు పరలోకములో ఉన్న దేవుని ఇష్టాన్ని అనుసరించాడు. దేవుని ఇష్టాలను తెలుసుకుని నెరవేర్చాడు. నా ఇష్టాన్ని నేరవేర్చేది ఎవరు అని దేవుడు ఈ ప్రపంచములో తన పిల్లలను కనిపెడుతున్నాడు. మత్తాయి 3:17లో-ఈయనే(యేసు) నా ప్రియ కుమారుడు .ఈయన ఎందు నేను అనంధించుచున్నాను అన్నాడు. యేసుక్రిస్తును నమ్మిన మనలను చూచిన దేవునికి ఆనందము ఉందా? (a)యోహాను 5:31-నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గానీ నా ఇష్టాప్రకారము చేయగోరను అని యేసు అన్నాడు.
(b)యోహాను 6:38-నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని అని యేసు అన్నాడు.
(c)యోహాను 4:34-నన్ను పంపినవాని చిత్తము నేరవేర్చుటయు,అయన(తండ్రి) పని తుదుముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని యేసు అన్నాడు.
(d)యోహాను8:29-ఆయనకు( తండ్రికి) ఇష్టమైన కార్యము నేను ఎల్లపుడు చేయుదును అని యేసు అన్నాడు.
(e)హెబ్రీ 10:7-దేవా ఇదిగో నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చియున్నాను అని యేసు అన్నాడు.
(f)మత్తాయి 26:39- నా ఇష్టప్రకారం కాదు తండ్రి నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని యేసు అన్నాడు. యేసు పలికిన పై వచనములను అన్నిటిలో యేసుక్రీస్తు ఉన్న తన జీవితకాలములో తండ్రి చిత్తమును తన మాటలలో, చేతలలో, నడతలలో, జీవితములో జరిగించినట్లుగా మనము చూస్తున్నాము. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుట జీవిత పరమార్ధమని ఏ సుఖానికి నోచుకోక సిలువపై యేసుక్రీస్తు ప్రాణాన్ని అర్పించాడు. యేసు జీవితములో నా ఇష్టము అను మాటకు తావే లేదు.తండ్రి చిత్తమే నూటికి నురుపాలు జరిగించాడు. మరి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులైన మన సంగతి ఏంటి? సంపూర్ణమైన నా చిత్తము(ఇష్టము) ఏదో 66 పుస్తకాలలో పరీక్షించి తెలుసుకుని , మీ మనస్సును మార్చుకొని మార్పు నోoదుడి అని రోమా12:2 లో అంటున్నాడు దేవుడు.

తన ఇష్టాన్ని ఈ ప్రపంచముపై జరిగించాలనుకున్న hitler తుపాకితో పేల్చుకుని చనిపోయాడు. ప్రపంచమంతా హస్తగతము చేసుకోవాలని కోరికతో ప్రపంచాన్ని జయించుటకు భయలదేరిన alexander చివరికి బాంబుతో మరణించాడు.ప్రపంచ చరిత్రలో ఎందరో వారి ఇష్టాలను నెరవేర్చుకోవాలని అనుకున్న చివరికి నెరవేర్చక కనుమరుగై పోయారు. భూమి పై నీ ఇష్టాన్నినేరవేర్చుకుంటే ఏ దేశ చట్టము శిక్షించదు కాని దేవుని చట్టము శిక్షిస్తుంది. కారణము అయన ఆశలను తీర్చుటకే మనము జన్మించాము. దేవుని చిత్తమును జరిగించాకపోతే పాతలములో అగ్ని జ్వాలలో యాతన పడుచు భాదపడాల్సి వస్తుంది. luke 16:24,25- నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించిటివి. నీకిష్టమైనట్టు బ్రతికావు అందుకే నరకాగ్నిలో ఉన్నావు అని అన్నాడు అబ్రహాము. యేసు తన కోర్కెలు తిర్చుకోకుండా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. నా ఇస్తానని నేను జరిపించుకుంటాను అని నీవు అనుకుంటే ఆ నరకానికి శిక్ష తప్పదు.
ఫిలిప్పు 2:21-అందరు(క్రైస్తవులు కూడా) తమ సొంత కార్యములనే చుచుకోనుచున్నారు గానీ ,యేసుక్రీస్తు (దేవునికి ఇష్టమైన ) కార్యములను చూడరు అని అంటున్నాడు దేవుడు. దేవుని ఇష్టాన్ని మన జీవితములో నింపుకొని తండ్రిని ఆనందపరచి పరలోకము చేరుదామా? లేదా కొద్ది కాలము మనకు ఇష్టమైనట్టు బ్రతికి పాతాళానికి జరుకుందామా?
ఒకనాడు యేసు వారు ( మత్తాయి 6:10) నీ చిత్తము నెరవేరును గాక అనమన్నాడు . ప్రతి sunday నీ చిత్తము నెరవేరును గాక అని పలికి మిగిలిన ఆరు దినము తమ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారు. మత్తాయి 7:21- తండ్రి చిత్తము నెరవేర్చు వారికే పరలోకము కాని నీ చిత్తము నెరవేరును గాక అని పలికితే రాదు. క్రీస్తు నేర్పిన ప్రార్ధన కాదు చేయాల్సింది క్రీస్తు చేసిన ప్రార్ధన చేయాలి.
క్రీస్తు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు కష్టపడితే నేడు మనము churchలో AC, fans క్రింద ప్రార్ధన అని సుఖపాడుధామా???? ఇప్పటికైనా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి నడుము కట్టి అనేకులను రక్షించుదాము.


Labels:

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget