Halloween Costume ideas 2015

The search for the Bible instruction

శోధనపై బైబిల్ భోధన

ఈ రోజు ప్రపంచములోని మానవులంతా రెండు మహా అదృశ్య శక్తుల మధ్య జీవిస్తున్నారు. ఇందులో ఒక శక్తీ పేరు దేవుడైతే మరొక శక్తీ పేరు సాతాను. అనగా ఒక శక్తీ మంచిదైతే మరొక శక్తీ దుష్ట శక్తీ. కనిపించని ఈ రెండు అదృశ్య శక్తులైన దేవుడు ,సాతానుల మధ్య మనుష్యుడు బ్రతుకుతున్నాడని మొదట తెలుసుకోవాలిమరియుఈ రెండు శక్తులకు కావలసిన వాడే మనుష్యుడు కూడా. అయితే పైన చెప్పబడిన రెండు అదృశ్య శక్తులలో మనం ఎవరికీ చెందిన వారమో, ఎవరు మన తండ్రో, ఎవరు మనల్ని నడిపిస్తున్నారో,ఎవరి పిల్లలమో అను విషయములు తప్పక పరిశిలించుకుని తెలుసుకోవాలి.

కనిపించని మహా అదృశ్య శక్తీయైన దేవుడే ఈ సృష్టిలోనున్న మానవులైన ప్రతి వారిని కన్న పరలోకపు తండ్రి అని మనకు తెలుసు.ఎఫేసి 4:5-అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. మనమందరికి తండ్రి ఆ పరలోకపుదేవుడైతే మనం అయన పిల్లలమే అవ్వుతాము. నా పిల్లలు నాకే కావాలని, నా పిల్లలు నేను చెప్పినట్టు వినాలని,  నా పిల్లలు నా ఇష్టానుసారముగా ఉండాలని, నా పిల్లలు నాకే చెందిన వారిగా ఉండాలని మనల్ని కన్న ఆ పరలోకపు తండ్రియైన దేవుడు తలంచుట ధర్మమే అవ్వుతుంది. యోహాను 8:44-మీరు మీ తండ్రియగు ఆపవాది( సాతాను) సంభందులు. పౌలు గారు ఎఫేసి 4:5 లో మన తండ్రి దేవుడనిఅని చెబితే యోహాను 8:44 లో తండ్రి సాతాను కూడ అనియేసుక్రీస్తు చెప్పాడు. అయితే సాతాను అన్యాయముగా తండ్రిగా దూరి మీరు నాకు కావాలి అని అనుకోవడము ఆధర్మమే అవ్వుతుంది. అనగా దేవుడు మనల్ని నిజముగా కన్న పరలోకపు తండ్రియైతే దుష్టుడైన సాతానుమధ్యలో వచ్చి మనకు తండ్రిగా మారిపోయిన దుర్మార్గుడు. ఈ రెండు అదృశ్య మహా శక్తుల లక్షణాల విషయములో, మనస్తత్వం విషయములో చాలా తేడా ఉన్నదీ. మొదటిగా తండ్రియైన దేవుని గూర్చి చూద్దాము. దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్తయైనపరలోకపు తండ్రి. పరిశుద్దత విషయములో దేవుడు గొప్పవాడు. ఈ పరిపూర్ణత గల దేవుడు తన పిల్లలమైన మన పట్ల ఏ కోరిక కలిగియున్నాడో చూస్తే లేవియకాండము 11:44- నేనుమీ దేవుడైన యెహోవాను ;నేను పరిశుద్దుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలేను. తన పోలికను తన పిల్లలమైనమనపట్ల ఉండాలనుకున్నాడు. అంటే దేవుడు మనల్ని పాపము లేని పరిశుద్దులుగా చూడాలనుకుంటున్నాడు. ఎఫేసి 1:4,6-మనము తన యెదుట పరిశుద్దులమును,నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత అయన (తండ్రి) క్రిస్తులో మనలను ఏర్పరుచుకోనేను. అనగా ఈ సృష్టికి పునాది వేయబడకముందే ఏ పాపము లేకుండా,ఏ లోపాలు,తప్పులు లేని వారిగా నా పిల్లలు ఉండాలనే కోరిక దేవుడు మన పట్ల కలిగియున్నాడు.

తన పిల్లలను తమకు తాముగా ఒక విషయముపై ఏది మంచి, ఏది చెడు, ఏది న్యాయము,ఏది అన్యాయము, ఏది సత్యము ,ఏది అసత్యము అని ఆలోచింపజేయడానికి దేవుడు పెట్టిన విధానమే “ పరిక్ష”. మన పిల్లలకు బడిలో ప్రతి సంవత్సరముఅనేకమైన పరిక్షలుపెడుతూ ఉంటారు. ఏ రోజైన పిల్లలు కలిగిన తల్లితండ్రులు బడికి వెళ్లి నా వాడికి ఎన్ని పరిక్షలు ఎందుకు పెడుతున్నారని అడుగుతారా? లేదు. పరిక్షలు పెట్టకపోతే అడుగుతారు కానీ పరిక్షలు పెడితే ఎవ్వరూ అడగరు. పరిక్ష ఉంటుందని తెలిసిన పరీక్షలో నెగ్గాలి అనే మనస్సు ఉండాలే తప్ప పరిక్ష పెట్టుటఎందుకు అని దేవునిని ప్రశ్నించుట సరి కాదు. పరిక్ష అన్నది మన మంచికే జరుగుతుందనే విషయము మనము తెలుసుకోవాలి. అందుకే దేవుడు మనిషికి పరిక్షలు పెట్టాడు.

దేవుడు మొదటి పరీక్షను ఆదాము-హవ్వలకు పెట్టినప్పుడు చివరికి తినవోద్దన్న పండు తినీ దేవుడు పెట్టిన పరీక్షలో విఫలము అయ్యారు. ఏందుకు వీరు విఫలము అయ్యారని అలోచించలే తప్ప దేవుడు పరీక్ష ఎందుకు పెట్టాలి అని ఆలోచించుట తప్పు. ఆదాము-హవ్వలకు పరిక్ష పెట్టిన దేవుడే మరలా అబ్రహమునకు కూడా పెట్టాడు. అయితే దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము నెగ్గి ఈ రోజు విశ్వాసులకు తండ్రి అయ్యి చరిత్రలోనే గొప్పవాడు అయ్యాడు.(ఆదికాండము 22:1 నుండి 19).అనగా దేవుడు ఆదాము-హవ్వలకు, అబ్రహమునకుపరీక్ష పెట్టినప్పుడు అందులో అబ్రహాము నేగ్గినట్టుగా, అదాము-హవ్వలు తప్పినట్టుగా అర్థమయ్యింది. అంటే దేవుడు మనిషిని పరిక్ష చేయడానికి ముందుకు వచ్చినప్పుడు నెగ్గిన వ్యక్తి మరియు ఓడినవ్యక్తులు కనపడుతున్నారు. అనగా దేవుడు పరిక్షించువాడని, పరిశోదించువాడని అర్థమయ్యింది.

దేవుని యొక్క తత్వం ఏంటో చూస్తే - (a) ఆదికాండ 6:5-నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఉహా అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి... అంటేనరులహృదయ తలంపులను పరిశిలించేవాడుగా ఉన్నాడు. (b)ఆదికాండ 8:21-నరుల హృదయాలోచన వారిబాల్యము నుండి చెడ్డది.. అంటే హృదయ ఆలోచనలు పరీక్షించే వాడు. (c)1సముయేలు 16:7-యెహోవా హృదయమును లక్ష్య పెట్టును... (d) యోబు 34:21-అయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి యున్నది. అయన వారి “నడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు”.కీర్తనలు 7:9- “హృదయములను,అంతరింద్రియములను పరిశిలించు”నీతి గల దేవా.... (e) సామెతలు 17:3-హృదయ పరిశోధకుడు యెహోవాయే. (f) సామెతలు 21:2-యెహోవాయే హృదయమును పరిశీలన చేయువాడు. (g) యిర్మియా17:10- యెహోవా అను నేను హృదయమును పరిశోదించువాడను.. (h) రోమా 8:27-హృదయములను పరిశోదించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. (i) 1యోహాను 3:20-దేవుడు మన హృదయము కంటే అధికుడై ,సమస్తమును ఎరిగియున్నాడు. ఇలా పై వచనములోని సారాన్ని ఆలోచిస్తే దేవుడు పరీక్షించువాడని , పరిశోదించువాడని అర్థమయ్యింది.

దేవుడు పెట్టు పరిక్ష మనిషికి మంచి చేస్తుందే కానీ చెడు చెయ్యదు. తన యెదుట మనిషిని గొప్పగా నిలబెట్టటానికి దేవుడే ఆ పరీక్షలు పెడుతున్నాడు. అస్సలు ఈ పరిక్షలు ఎందుకు పెడుతున్నాడో చూస్తే నిర్గమ 20:20-మీరు పాపము చేయకుండునట్లు, అయన భయము మీకు కలుగుటకు ... పాపము చేయకుండ ఉండడానికి, దేవుని యెడల భయము కలుగుటకు ఈ పరిక్షలు.. అనగా 1) పరిక్ష ఉంటేనే భయము ఉంటుంది. 2)భయము కలిగినప్పుడు పాపము చేయకుండా ఉండడానికి జాగ్రత్తపడుతాము. పై వివరణలో దేవుని యొక్క తత్వం పరిశోధకుడనీ అర్థమయ్యింది.

ఇప్పుడుసాతాను యొక్క తత్వము - చూస్తే వీడు శోధకుడు. పరిశోధకుడు & శోధకుడు అను రెండు పదాలకు చాలా తేడ ఉన్నదీ. పరిశోధకుడు-మనం పాపము చేయకుండ ఆపుతాడు& శోధకుడు- మనం పాపము చేయుటకు రెచ్చగొట్టి ప్రయత్నిస్తాడు. అనగా తప్పులు చేయుటకు ఆపేవాడు పరిశోదకుడైన దేవుడైతే తప్పు చేసేలా ప్రయత్నించేవాడు శోదకుడైన సాతాను. దేవుడు పరిశోధించిన అనేకమందిలో మనం గొప్పవారిగా చెప్పువారిలో యోబు ఒకరు. యోబు యధార్ధవంతుడు, న్యాయవంతుడు,దేవుని యెడల భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించిన వాడు అను విషయములు మనకు తెలుసు. యోబు 2:3 నుండి చూస్తే తన కుమారుడైన యోబు ఎంత గొప్పవాడో సాతనుకు నిరూపించడానికి శోదించుటకు సాతనుకు ఆవకాశంఇచ్చాడు. భక్తుడైన యోబును దేవుడు సాతనుకు అప్పగించాడు.

యోబు విషయములో దేవుని పరిశోదన & సాతాను శోదన జరిగాయి. యోబుచివరికి దేవుడు పెట్టిన పరీక్షలో గెలవడమే కాక సాతాను పెట్టిన శోధనను జయించాడు. అనగా భక్తుడైన యోబుకు పరిశోదన & శోదనఏదురైనది. “”దేవుడుతన భక్తులను చూచి ఏంత ఆనందపడుతాడో ఆ భక్తులను చూసి సాతాను తట్టుకోలేక వారిని చెడగొట్టాలని,లోకములో కలిపి వేయాలని చివరికి దేవునికి దూరం చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునితో దగ్గర సంభంధం కలిగియున్న వారిపై సాతాను గురి ఎప్పటికి ఉంటుంది. ఒక్కసారి నా చేతికి అప్పగిస్తే మీ బిడ్డలు ఎంత బలహినులో చూపిస్తానని దేవునికే సవాలు విసురుతాడు. లూకా 22:31- ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోదుమవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను.

సాతాను పెట్టు శోదనలు జయించాడు కనుక చరిత్రలో యోబు గొప్పవాడయ్యాడు. యాకోబు 1:12 నుంచి-శోదన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్ధానము చేసిన జీవకిరిటము పొందును.””” శోధనకు నిలిచిన వాడు,శోధనను సహించు వాడు, శోధనను జయించువాడే జీవకిరిటానికి పాత్రుడు”””. ప్రకటన 3:21-నేను జయించి నా తండ్రితో కూడ అయన సింహాసనము నందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడ నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను. అనగా తండ్రి సింహాసనముపై కూర్చుండే అర్హత శోధనను జయించిన వాడిదే.. జీవకిరిటం పొందాలని మీకుగురిఉంటే సాతాను పెట్టు శోధనకు నిలిచి, సహించి& జయించాల్సిందే. పిరికివారు అంటే దేవునికి అసహ్యము. సాతాను పెట్టు శోధనకు భయపడి, సహించలేక చివరికి జయించలేక శోదనలు కల్పించవద్దు అనికొందరు ప్రార్ధనలు చేసే వారు దేవునికి ఇష్టులు కాలేరు.

అనేకమంది బాప్తీస్మం తీసుకున్నాక శోదనలు ఎక్కువ అయ్యాయి అని, రోజు వాక్యము చదువుతూ,ప్రార్ధన చేసుకుంటూ ,సంఘానికి వెళ్తున్న నాకు శోదనలు ఎక్కువుగా వస్తున్నాయి అని ,దేవునిలోకి రాక ముందు ఆనందముగా ఉన్నాను కానీ దేవునిలోకి వచ్చాక శోదనలు ఎక్కువుగా వస్తున్నాయి అని కొందరు అంటూ ఉంటారు. శోదనలన్నవి ప్రతి మనిషికి వస్తాయి. అప్పుడు వాటియందు నిలిచి, సహించి& జయించి సాతనును చితకకొట్టి రావాలే కానీ పిరికివాడిగా శోదనలు వద్దు ప్రభువా అని ప్రార్ధన చేయకూడదు. దేవుడునా తండ్రి అని చెప్పుకుంటూనప్పుడు , అయన బలవంతుడని చెప్పుకుంటూనప్పుడు అయన పిల్లలమైన మనము ధైర్యవంతులుగా, శక్తివంతులుగా ఉండాలే కానీ సాతాను పెట్టు శోధనలకు భయపడి పిరికివాడిగా చరిత్రలో నిలిచిపోతావా??

సాతాను మనల్ని చూసి పారిపోవాలే కానీ వాడు పెట్టు శోధనలకు దేవుని నుండి మనం పారిపోకూడదు. 1 కోరంది 10:12,13- తాను నిలుచుచున్నానని తలంచుకోనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోనవలెను. సాధారణముగామనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభావింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించ గలిగినంతకంటే ఎక్కువుగా అయన మిమ్మును శోదింపనియ్యడు.సహింపగలుగుటకు అయనశోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.పై వచనములోని భావాన్ని చూస్తే దేవుడు సహించ గలిగినంతకంటే ఎక్కువుగా అయన మిమ్మును శోదింపనియ్యడని, సహింపగలుగుటకు అయనశోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయునను విషయము అర్థమయ్యింది.

సాతాను పెట్టు శోధనను జయించే మార్గమును చూస్తే - ఎఫేసి 6:11- మీరు అపవాది తంత్రములను ఏదిరించి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు” సర్వాంగ కవచమును ధరించుకోనుడి”. అనగా సాతాను యొక్క తంత్రములైన శోదనలు జయించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనుడి అని అంటున్నాడు. అలానే మనకు శత్రువు శరిరులు కాదు కానీ సాతనే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకములో మనకు శత్రువు అనే వాడు ఉన్నాడు అంటే వాడు కేవలం సాతనే కానీ సాటి మనిషి కాదు.ఇప్పుడు సర్వాంగ కవచుములోని ఒక్కొక భాగాన్ని చూద్దాము.

(a) ఎఫేసి 6:14-“నడుమునకు సత్యమను దట్టి కట్టుకోవాలి”. సత్యం అనగా వాక్యం(యోహాను 17:17). సత్యమను వాక్యమును ధరించాలి. నీ దగ్గర నుండి సత్యం దూరము అవ్వకుండా మరియు సత్యానికి నువ్వు దూరం అవ్వకుండా జాగ్రత్తపడాలి.సాతాను కల్పించు అబద్ద భోదనల యెందు కాక సత్యమైన వాక్యమునకు కట్టుబడి యుండాలి. అనగా సత్యములో నిలిచి ఉండాలి.

(b) ఎఫేసి 6:14-“నీతి అను మైమరువు తోడుగుకోవాలి”. నిరిక్షిణకు ఆధారమే లేనప్పుడు దేవునిని నమ్మడమే దేవుని దృష్టిలో నీతి. హెబ్రీ 11:7 లో నోవాహు విశ్వాసము బట్టి నీతికి వారసుడాయేను. ఆదికాండ 15:6 లో అబ్రహాము యెహోవాను నమ్మెను; అది అతనికి నీతిగా ఎంచెను. నమ్ముటకు అవకాశమే లేని దేవునిని, పరలోకమును,నరకమును, యేసుక్రీస్తును, పరిశుద్దాత్మను నమ్ముటయే నీతి& నమ్మువాడే నీతిమంతుడు.

(c) ఎఫేసి 6:15-“పాదములకు సమాధాన సువార్త వలనైనసిద్ద మనస్సను జోడు తోడుగుకోవాలి”.సువార్త వ్యాప్తిలో పాలి భాగస్థుడు అవ్వుటకు మనం సిద్దముగా ఉండాలి. దేవుని వాక్యం నేర్చుకుని ,పాటించి, చెప్పాలి, చెప్పించాలి& చెప్పే వాళ్ళకు సహకరించాలి.

(d) ఎఫేసి 6:16-“విశ్వాసము అను డాలు పట్టుకోనుడి”. హెబ్రీ 11:1 లో విశ్వాసం యొక్క నిర్వచనము చెప్పబడింది. అదృశ్యమైన ఉన్నాయి అని నమ్ముటయే విశ్వాసము. అద్రుశ్యుడైన దేవుడు ఉన్నాడని,ఆ దేవుడు మన పాపాల నిమిత్తము యేసును ఈ లోకానికి పంపించాడని, ఈ యేసు చనిపోయి తిరిగి లేచాడని,పునరుర్ధనుడైన యేసు రెండవ రాకడలో వచ్చి విశ్వాసుల జాబితలోనున్న వారిని పరలోకానికి తీసుకెళ్ళుతాడని విస్వసించాలి. మనం విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి.

(e) ఎఫేసి 6:17-“రక్షణ అను శిరస్త్రాణమును ధరించాలి”. రక్షణ పొందాలి అంటే i) యేసుప్రభువు అని ఒప్పుకుని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని విశ్వసించాలి. ii) యేసుప్రభువు నామమున తండ్రికి పాపపు ఒప్పుకోలు ప్రార్ధనను చేయాలి. iii) నమ్మి బాప్తీస్మం పొందితే రక్షింపబడుతారు. బాప్తీస్మం తీసుకుని నమ్మకముగా జీవిస్తే రక్షణ అను శిరస్త్రాణమును కలిగియుంటాము.

(f) ఎఫేసి6:17- “వాక్యమను ఖడ్గమునుధరించుకోవాలి”. ఇలా సర్వ అంగమునకు పై చెప్పబడిన కవచమును ధరించి సాతాను పెట్టు శోధలతో యుద్ధము చేస్తే విజయము మనదే అవ్వుతుంది... ఇందులో ఈ ఒక్కటి లేకుంటే సాతను పెట్టు యుద్దములో ఓడిపోతాము.


Labels:

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget