Halloween Costume ideas 2015

Papapu Prapancham pie Devuni Pranalika

పాపపు ప్రపంచముపై దేవుని ప్రణాళిక

మన ఆత్మలకు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) నేడు పేపర్లో వస్తున్న వార్తలను బట్టి, టివిలో చూపిస్తున్న వార్తలను బట్టి, మన కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలను బట్టి సమాజం నాటి నుండి నేటి వరకు ఎంత భయంకరముగా చెడిపోయిందో మనకు అర్థమవుతుంది. పరలోకమందున్న దేవుడు ఈ సమాజాన్ని ఇలా చూడాలనుకున్నడా? ఆదియందు దేవునికి మనిషి పట్ల ఉన్న ప్రణాళిక వేరన్న విషయము బైబిల్ లోని మాటల ద్వార అర్థమవుతుంది.

2) పుట్టబోయే బిడ్డ పట్ల తల్లితండ్రులు ఎన్నో కలలు కంటారు. వాడు పెరిగి పెద్ద వాడయ్యాక చెడు స్నేహాల వలన చెడిపోయి చివరికి కన్న తల్లితండ్రులను నిందించేవాడిగా ఉన్నప్పుడు వాళ్ళు అనే మాట “మేము వీడిని గూర్చి అనుకున్నది వేరు జరిగింది వేరు అని భాదపడుతూ ఉంటారు”. అనగా భూమి మీద రాక మునుపు తల్లితండ్రులు మనల్ని బట్టి ఎంతో ఆనందముగా ఉండేవారు. భూమి మీదకు వచ్చి ఒక ఆకారమును ధరించుకుని , పెరిగి పెద్దయాక చెడు ప్రవర్తన బట్టి తల్లితండ్రుల ఆనందం అవిరి అవుతుంది.  చెడు చేష్టల వలన ప్రతి రోజు వాడు ఏమి చేస్తాడా అని కంటి మీద కునుకు లేకుండా వాళ్ళ భవిష్యత్తును గురించి వాపోతున్న తల్లితండ్రులు ఎంతో మంది నేడు మనకు కనబడుతున్నారు. వాడినైతే కనగలము కానీ వాడి భవిష్యత్తును కనగలమా అని, వాడిని గొప్పవాడిగా చుడాలనుకున్నాము కానీ ఇలా చూస్తామని అనుకోలేదని తల్లితండ్రులు భాదపడుతూ ఉంటారు.

3) పై సందర్భము చక్కగా అర్థమైతే పరలోకమందున్న మనల్ని కన్నతండ్రికి కూడ మనం కలుగనప్పుడు ఉన్న ఆలోచన వేరు. అనగా ఈ భూమి మీదకు మనం రాక ముందు తండ్రికి మన యెడల ఉన్న ఉద్దేశం వేరు. కానీ ఆదాము ద్వారా అందరు భూమి మీదకు వచ్చిన తర్వాత మనిషిని ఎలా అయితే చూడకూడదని దేవుడు అనుకున్నాడో అలానే చూడవలసిన పరిస్థితి ఏర్పడిందన్న విషయం ఈ సమాజన్ని బట్టి మనకు తెలుసు. నా పిల్లలు రాబోతున్నారని ,నా కోసం భూమి మీద బ్రతుకుతారని ఆరు దినాల మహా కష్టాన్ని అనుభవంచి కలుగును గాక అని అనకుండా ఆదామును మట్టితో ఆకారమును నిర్మించి, తనలో ఉన్న ఆత్మను మట్టి ఆకరాములోకి ప్రవేశపెట్టి ఎంతగానో ఆనందపడ్డాడు. 4) కష్టము అంటే ఏంటో తెలియనియ్యకుండా, కష్టించి పని చేసి సంపాదించుకోవలసిన అవసరం లేకుండా, ఆకలే లేకుండా ఇక చివరికి కనబడుతున్న ఆహార పదార్ధాలను తింటూ దేవుడు కలిగించిన ప్రకృతిని అనుభవించే మంచి జీవితాన్ని మనిషికి దేవుడు ప్రారంభించాడు . ఆదాము ఏదేనులో ఉంటున్నప్పుడు దేవుడు మనిషికి ఇచ్చిన జీవితాన్ని చూస్తే ఎలాంటి మంచి పరిస్థితుల మధ్య పెట్టాడో అర్థమవుతుంది.తన తొలి కుమారుడు భూమి మీద పుట్టాడని ఆనందముతో పొంగిపోతూ కోటాను కోట్ల పిల్లలతో తండ్రిగా నేనే కొలవబడాలని ఆలోచన కల్గిన పరలోకపు తండ్రికి భాద అంటే ఏంటో మనిషి రూచి చూపించాడు. ఈ ప్రకృతిని దేవుడు తన కొరకు కలిగించుకోనక మానవులైన మనము ఉండడానికి కలిగించాడన్నది సత్యం. తోట మధ్యన ఉన్న ఒక్క ఫలం తప్పితే సమస్తమును భుజించమని చెప్పాడు. ఏ ఫలం తినకూడదో చెప్పాడు, తినవద్దన్న ఫలం ఎక్కడ ఉందో చెప్పాడు, ఎందుకు తినకూడదో చెప్పాడు,తింటే జీవితం ఏమైపోతుందో అన్న విషయాలు చెప్పిన్నప్పటికి ఏదైతే వొద్దు అన్నాడో అదే ఆదాము హవ్వలు చేసారు.

5) మనిషి తినుచు, త్రాగుచు, సంపాదనే ద్యేయంగా పెట్టుకని ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఆ తర్వాత చివరికి మరణానికి చేరువైపోతున్నాడు నేటి మనిషి. ఏదేను తోటలో ఎన్నో జాగ్రతలు చెప్పి తినవోద్దని చెప్పిన ఆ ఒక్క పండు కోసం పరమ తండ్రి మాటను ప్రకన్న పెట్టి పాపాన్ని ఆహ్వానించి ఈ రోజు పరలోకపు తండ్రికి కంట నీరు కలిగిస్తున్న సమాజమును చూస్తే అర్థమవుతుంది. ఆదాము పాపానికి ప్రారంభోస్తవం చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రతి మనిషి పాపంలో మునికి చివరికి మంచిలేని సమాజముగా మార్చేసారు.

6) పాపానికి చోటు లేకుండా మొదట ఈ ప్రపంచాన్ని నిర్మిస్తే మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత మంచికి చోటు లేనిగా దేవుడు చూస్తున్నాడు. ఏదైతే పరలోకము తండ్రికి ఇష్టం లేదో దానితో(పాపం) మనిషి భూమిని నింపేశాడు. ఏదైతే వద్దన్నాడో అదే చేస్తున్నాడు. ఏదైతే మానేయ్యమన్నాడో అదే చేస్తున్నాడు. అయన కోసం బ్రతకాలనే ఆలోచనలు నేటి మనిషికి లేదనే చెప్పాలి. ఆదికాండ 3:9-దేవుడైన యెహోవా ఆదామును పిలిచి- నీవు ఎక్కడ ఉన్నవనేను. అందుకతడు-నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననేను. తప్పు చేసిన ఆదాము భయపడినట్టుగా పై వచనము బట్టి అర్థమవుతుంది.ఈ రోజు తప్పు చేసిన కూడ దేవునికి భయపడక ధైర్యముగా ఉంటున్నాడు. తప్పు చేస్తున్న భయం లేదంటే దృడమైన మనస్సాక్షి కలిగిన వారై దేవునికి ఎదురు తిరగడానికి అలవాటుపడ్డారు. మనిషి తప్పు చేస్తున్న భయపడటం లేదంటే మానవ జీవితాలు ఎంత భయంకరముగా మారాయే ఆలోచించండి.

7) వాస్తవముగా మొదట దేవుడంటే మనిషికి కావాల్సింది భయము ఆ తర్వాత భక్తి రావాలి( హెబ్రీ 5:7) . ముందు మనిషికి దేవుడంటే భయం ఉంటె వణుకుతూ ఒంట్లో భక్తి పుడుతుంది. మనిషికి దేవుని యెడల భయమే లేకుంటే భక్తి ఎలా ఉంటుంది? దేవునికి ఇష్టంలేని నిర్ణయాలతో పరలోకమందున్న కన్న తండ్రి కన్న కలలు కన్నీరు అయిపోయిన ఈ కాలములో మనిషికి ఎలాంటి మాటలు కావాలి? మానవత్వం మంట కలిపి మనిషే మృగం అయిపోయి సమాజమే అరణ్యము అయిపోతే మనిషికి దేవుని మాటలు ఎలా ఉండాలి? మనిషి మనస్సు బండైతే దేవుని మాట సూత్తే కావాలి. మనిషి హృదయాలు బండలైతే ఆ బండలు బద్దలు కొట్టడానికి దేవుని వాక్యం సుత్తిలా ఉండాలి.మనిషి కృర మృగం అయితే ఆ కృర మృగాన్ని చీల్చి చెండాడే కత్తిలాంటి వాక్యం ఈ రోజు సమాజనికి కావాలి. అలంటి భోదలు నేడున్న సమాజానికి వస్తే కాస్తంత భయం దేవునిపై ఉంటుంది.

8) అన్ని భయాలు కోల్పోయిన మనిషి గురించి దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? పాడైపోయిన ఈ సమాజాన్ని చూచి అస్సలు పరలోకమందున్న కన్న తండ్రి ఆలోచన ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?? దేవుడికే భయపడని ఈ కాలములో ఉన్నవారిని దేవుడు ఏమి చేయాలి? అయన తీసుకున్న నిర్ణయాలు ఏంటో, దేవుడు ఎంత భికరుడో, దేవుడు ఎలా దహించు అగ్నిగా ఉన్నాడో, అయన విశ్వరూపం ఏంటో, అయన కోసం బ్రతకకపోతే మానవ బ్రతుకులు ఎలా నాశనం అవుతాయో అన్న ప్రాముఖ్యమైన సంగతులు ప్రతి మనిషికి తెలియాలి.

9) పరలోకం నుండి ఈ చెడిపోయిన సమాజమును చూసి, పరలోకం నుండి భయపడని మనిషిని చూసి, ఎన్ని సార్లు దేవుని మాటలు విన్న భయం లేని మనిషిని, తినీ త్రాగి వ్యబిచరించడం ఆలవాటుగా మార్చుకున్న మనిషిని, సంపాదనే ద్యేయముగా మారిన వారిని దేవుడు ఏమి చేస్తున్నాడో చూస్తే కీర్తనలు 7:11,12,13- న్యాయమును బట్టి అయన తీర్పు తీర్చును.అయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని యెడల ,అయన తన ఖడ్గమును పదును పెట్టును.తన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్దపరచియున్నాడు.”వాని కొరకు మరణ సాధనములను సిద్దపరచియున్నాడు”.

10) బ్రతుకు మార్చుకొనుటకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన దేవునిని ప్రక్కన పెట్టి తన ఇష్టానుసారముగా జీవిస్తున్న వారి కొరకు మరణ సాధనములు సిద్దపరుస్తున్నాడని పై వచనము ద్వారా అర్థం అవుతుంది. జీవితములో కలుగు కష్టమైన,నష్టమైన,భాదనైన,వ్యాదినైన ఏదైనా ఉన్నను అయన కోసము బ్రతికితే నిన్ను కాపాడుకుని పర సంభంధమైన ప్రతి ఆశీర్వాదమును ఇస్తాడు. అవసరాల కోసమే దేవునిని నమ్ముకుంటూ బ్రతుకుని మార్చుకొనక ,బైబిల్ లోని మహా జ్ఞానమును నేర్చుకోనక జివిస్తుంటే అప్పుడు దేవుడు ఆశీర్వాదాలు కాక మరణ సాధనములు సిద్దపరుస్తున్నాడు.

11) ఈ ప్రకృతిలో దేవుడు ప్రతి దానికి అజ్ఞాపించాడు & ఆజ్ఞాపించిన ప్రకారముగా ఈ ప్రకృతి అంత పరుగెడుతుంది.దేవుని మాటను కాదంటే,దేవుని మాటకు ఎదురు తిరిగితే,దేవునితో ఎదురాడితే చివరికి నష్టపోయేది మనిషే. ఈ ప్రకృతి దేవుని చేతిలో ఒక ఆయుధం. పైనుండి దేవుడు మనల్ని శిక్షించడానికి రానవసరం లేదు కానీ ప్రకృతికి ఆజ్ఞాపిస్తే చాలు.

12) దేవునికి మనం లోబడి ,భయభక్తులతో వాక్యనుసారముగా జీవిస్తే ఈ ప్రకృతి మన మాట ఉంటుంది. ఒక వేళ దేవునిని కాదని బ్రతికితే ఈ ప్రకృతి మన పతనాన్ని చూస్తుంది, ప్రాణమును తీస్తుంది. దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ ప్రకృతి మనల్ని కాపాడుతుంది లేక ప్రాణమును తీసేస్తుంది. కనుక ఈ పాపపు ప్రపంచము పై శిక్షించుటకు దేవుడు గొప్ప ప్రణాళికను ప్రకృతి ద్వార సిద్దం చేస్తున్నాడు. ఓ మనిషి బైబిల్ నేర్చుకో! మనస్సు మార్చుకో!! ఆత్మను రక్షించుకో!


Labels:

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget