Halloween Costume ideas 2015

Ghosts?

చనిపోయిన వారు దయ్యాలుగా మారుతారా?? దయ్యాలు,మంత్రాలు,క్షుద్రశక్తులు ఉన్నాయా??

చనిపోయిన వారు దయ్యాలుగా మారుతారా?? దయ్యాలు,మంత్రాలు,క్షుద్రశక్తులు ఉన్నాయా?
అటు గ్రామీణ స్థాయి నుండి ఇటు చదువుకున్న వారి వరకు అర్చర్యాన్ని కలిగించి ఎటూ తేల్చుకోని విషయమే దయ్యాలు,మంత్రాలు,క్షుద్రశక్తులు ఉన్నాయా అని. ఒక వైపు అక్షర జ్ఞాన౦ అంతరిక్షానికి వెళుతున్న మనిషి నమ్మకాలలో మాత్రము మూడనమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి అనుటలో ఈ దయ్యాలు, మంత్రాలు, క్షుద్రశక్తులు ఉన్నాయా.. technology పేరుతో మనిషి అభివృద్ది అవుతున్నా కానీ మూడ నమ్మకాల పేరుతో పతనానికి వెళ్ళిపోతున్నాడు. పతన అంచుల లోతు వెళ్తున్న మనిషికి దైవ జ్ఞానం(bible) తో సరి చేయడము అవసరము.ఈ 66 పుస్తకాలలో మనిషికి అవసరమైనది లేదు అనే మాట రానియ్యకుండా ప్రతి విషయాన్నీ దేవుడు మన చేతిలో పెట్టాడు(bible).

1) ఈ రోజు ఎవ్వరు మాట్లాడుతున్న దయ్యాలు కనిపించాయి అని మాట్లాడడము,ఆ దయ్యనికి రూపు రేకలు ఉన్నాయి అనుకోవటము చూస్తున్నాము,వింటున్నాము.ఇలా మాట్లాడడానికి కారణము సినిమాలు. మనిషి మరణించిన తరువాత ఏదో జరిగిపోతున్నాడని, భూమి మీదకు దయ్యముగా వచ్చినట్లు చూపించి నీజ జీవితములో ఇవే సత్యాలుగా ఈ రోజు మనిషి నమ్ముతూ దయ్యాలు ఉన్నాయన్న భ్రమలో ఉన్నాడు.అస్సలు ఉన్నవి ఏంటి,లేనివి ఏంటి??అస్సలు ఈ గందరగోళము జరగటానికి కారకులు ఎవరు అను విషయమును bible లో చూస్తే ఎంతో సమాచారాన్ని దేవుడు వ్రాయించాడు. ప్రకటన 12:7-ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. ఈ సృష్టి కలుగక ముందు పరలోకములో జరిగిన మహా యుద్దము జరిగింది.వాడు (సాతాను లేక అపవాది,లేక దయ్యము)ఎన్నో పేర్లుతో ఈ భూమి మీదకు వచ్చాడు. ప్రకటన 12:12-అపవాది తనకు time కొంచమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చిఉన్నాడని చెప్పెను. దయ్యము అనగా మనిషి ఏమి అనుకుంటున్నాడంటే మరణిస్తే దయ్యముగా మారుతాడని,కోరికలు తీరకపోతే దయ్యాలుగా మారుతారని. 2) ఒక వేళా కోరికలు తీరనివారు దయ్యాలు అయితే ఈ భూమి మీద ప్రతి మనిషి చచ్చేంత వరకు ఏదో ఒక కోరికతో ఉంటాడు.చచ్చిన కూడా కోరికలు తీరకుoటే వారు దయ్యాలు గా వస్తారా???కోరికలకు,దయ్యాలుగా మారటానికి సంభందము ఉన్నదా???కేవలము మరణించిన తరువాత దయ్యాలుగా మారుతారని తెలుసు మనుషులకు. ప్రసంగి 10:14-నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? మహా జ్ఞాని అయిన సోలోమోను పరిశుద్దాత్ముని ప్రేరణతో చనిపోయిన తరువాత ఏమి జరుగుతుందో తెలియదు అంటున్నాడు. గాలిలో కలిసిపోతాడని కొంతమంది ,కోరికలు తీరకపోతే భూమి మీదకు వచ్చి కోరికలు తిర్చుకునేంతవరకు ఇకడిక్కడే తిరుగుతాడని కొంతమంది ఇలా ఎంతో మంది భుద్దిహినులు అపోహ పుట్టించి దాన్ని వాస్తవాలను కుంటున్నారు.

3) అస్సలు కోర్కెలు అత్మకా? లేక శరీరానికా??శరీర సంభంధమైన కోర్కెలు ఆత్మకు ఉండవు.కోర్కెలు కలిగిన ఈ శరీరము శవమై మట్టిలో కలిసిపోతే ,వెళ్ళిపోయినా ఈ ఆత్మ మల్లీ శరీర సంభంధమైన కోర్కెలను తీర్చుకోవటానికి రావడము ఏంటి?? చనిపోయిన తర్వాత ఆత్మకు ఇక భూమికి సంభందము లేదు. ప్రసంగి 9:5,6- అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు.వారి పేరు మరువబడింది.వారికిక ఈ లాభము కలగదు .వారిక ప్రేమింపరు,పగపెట్టుకోనారు,అసూయ పడరు,సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యెందును వారికిక నెప్పటికి వంతు లేదని ఉంది వాక్యము..మరణించిన వారి కొరకు మాట్లాడుతున్న మాట.కోరికలు తీరనంత మాత్రన దయ్యాలుగా మారుతారనుటలో వీళు లేదు.ఎందుకంటే ఈ భూమి మీద ఈ సంభందము ఉండదు. ఏదో గాలిలో కలిసిపోతారని నమ్మవలసిన అవసరము అంతకన్నా లేదు. మరణించిన తరువాత గాలిలో కలిసిపోయే చిన్నది కాదు మనలో ఉండే ఆత్మ. మనము సాక్షాత్తు దేవునిలో నుండి వచ్చిన వారము.ఒకవేళ మనము గాలిలో కలిసిపోతే మనకంటే ముందు దేవుడు గాలిలో కలిసిపోవాలి.ఎందుకంటే దేవుడు కూడా ఆత్మ గనుక.దేవుడు గాలిలో కలిసిపోయేవాడా?? గాలినే కలిగించిన గొప్పవాడు. మనిషిలో ఉన్న ఆత్మ ఎందుకు గాలిలో కలిసిపోవాలి?? ఈ సత్యాలు తెలియకపోవటము వలన ఇక్కడే ఉంటుందని ఒకడు,అప్పుడప్పుడు వస్తుందని ఒకడు ఈ రోజు విభిన్నముగా మాట్లాడుకుంటూ దయ్యాలుగా ఉహించుకుంటూ ఎన్నో కధలు తెచ్చారు.

4) ఇలా అనుకోవడానికి కారణము శవాన్ని మేమే తీసుకెళ్ళి పాతిపెట్టాము కదా కానీ ఆత్మ ఏమి అయిపోయిందో మాత్రము మాకు తెలియదు గనుక ఇక్కడిక్కడే తిరుగుతుందని అనుకుంటున్నారు. శవాన్ని తీసివేయటము మన పని కానీ ఆత్మను తీసివేయటము దేవుని పని.మరణించాక శవాన్ని ఎత్తివేయుటలో మూడు రోజులన్న ఆలస్యము అవుతుందేమో గాని దేవుని పని (ఆత్మను తీసివేయుట) మాత్రమూ ఒక్క క్షణము. యోబు 21:13-ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అనగా శరీరాన్ని విడిచిపెట్టిన మరు క్షణమే పాతాళానికి దిగిపోయాలి.శరీరము లేకుండా ఈ భూమి మీద ఆత్మ ఉండదు అలానే ఆత్మ లేకుండా శరీరము ఈ భూమి మీద ఉండదు. కనుక మరణించిన తరువాత ఏమి జరుగుతుందో తెలియక పోవటము వలన మనిషి తన జ్ఞానముతో ఇక్కడిక్కడే ఉన్నాడని, దయ్యాలుగా మారుతారని ఉహిస్తున్నాడు.

5) సాతాను( దెయ్యము) తన ఉనికిని మనిషికి తెలియనివ్వకుండా స్మసానాన్ని చూపించి వాడు మాత్రము సమాజములో ఎవరిని మ్రింగుదునా అని ఎదురుచూస్తున్నాడు.మనము స్మసానములో దయ్యము ఉందని అనుకుంటున్నాము.అస్సలు దయ్యము(సాతాను) సమాజములో ఉంది. స్మసానములో శవాలు ఉంటాయి. దెయ్యముగా,సాతానుగా,ఘట సర్పముగా, ధర్మ విరోదుగా,సత్య విరోధిగా పరలోకానికి మనల్ని వెళ్ళనివ్వకుండా మనిషిలో ఎన్నో దుర్గునాలు పెట్టి దేవునికి కాకుండా లోకాన్ని,లోక వ్యామోహాన్ని చుపించి ,పడవేసి మనిషిని దేవుడికి దూరముగా చేస్తన్న అసలైన వాడిని వదిలేసి మరణించినవారు దయ్యాలుగా మారుతారని ఈ రోజు మనిషి మాట్లాడుకుంటున్నాడు. john 8:43,44-మీరు నా భోధ విననేరకుండుట వలనే గదా?? మీరు మీ తండ్రియగు అపవాది(సాతాను,దయ్యము) సంభందులు. నా భోధ విననేరకుండుట వలనే గదా అపవాది(సాతాను,దయ్యము) సంభందులు అయ్యారు అని యేసు అంటున్నాడు.

6) మనిషి దేవుని మాటలు నమ్మక newspaper,tv లో వచ్చే news వినీ నమ్ముతున్నాడు.మనిషి రాసిన news విలువ ఎక్కువ లేక దేవుడు రాసిన వార్తలు విలువ ఎక్కువ??? దేవుడు ఏమి చెబుతున్నాడని bibleనే చూడాలి తప్ప లోకాన్ని కాదు.లొకము నుంచి bibleనీ చూస్తే నమ్మాలని పించాడు. వాక్యములో ఉంటున్న విలువియన్ సమాచారాన్ని విని లోకములో ఉన్నవి ఆలోచించగలిగితే అస్సలు ఎంత మోసము జరుగుతుందో వీటి వలన తెలుస్తుంది. దెయ్యము అనగా సాతాను.




Labels:

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget