Halloween Costume ideas 2015

God

ఏమి లేనప్పుడు దేవుడెలా ఉన్నాడు



ఏమి లేనప్పుడు దేవుడెలా ఉన్నాడు?
ముందుగా మన ప్రభువైన యేసు నామమున మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలయజేస్తున్నాను.
1) మనుష్యలందరికీ మిగిలిపోయిన చిక్కు ప్రశ్న “దేవుడు అర్థము కాకపోవడము”. ఏమి లేనప్పుడు దేవుడు ఎలా పుట్టాడు అని అడుగుతారే కానీ, తన కుడి చెయ్యి గుప్పెడు మెతుకులతో తన నోటి వద్దకు ఎందుకు తీసుకోని వస్తుందో ఆలోచించలేడు. దేవుని గూర్చి రుజువులతో చూపించే శక్తీ ఒక్క bibleకు మాత్రమే ఉన్నది. చెట్టు ముందా లేక విత్తనము ముందా? కోడి ముందా గుడ్డు ముందా అని తలతిక్క ప్రశ్నలు అడుగుతుంటారు. చెట్టు రావాలంటే విత్తనము ఉండాలి and విత్తనము రావాలంటే చెట్టు ఉండాలి అంటూ ఎదుటి వారిని తిక మక పెడుతూ ఉంటారు. అదే విధముగా దేవుడు పుట్టాలి అంటే దేవుడు అమ్మ అన్న ఉండాలి లేక దేవుడికి తండ్రి అన్న ఉండాలి అంటారు.

2) కుడి ముందా గుడ్డు ముందా అనే వారికీ మనము వేయాల్సిన ప్రశ్న నువ్వు ముందా? మీ నాన్న ముందా? దీనికి ఖచ్చితముగా మా నన్నే ముందు అని సమాధానము చెప్పక తప్పదు. అనగా సృష్టిలో ఉన్న ప్రతిది కూడా చిన్నది పెద్దదాని నుండి రావలసిందే కాని చిన్న దాని నుండి పెద్దది ఎప్పటికి రాదు.చిన్నది ఎదుగుతూ పెద్దదానిగా మారుతుంది. ఈ విషయము గూర్చి bibleలో చూస్తే ఆదికాండ1:11,12- దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మిధ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మోలిపించును గాక అని పలకగా ఆప్రకారమాయెను. అనగా వృక్షములు మొదట మొలిచినవి ,వాటిలో గల ఫలములలో విత్తనాలు ఉన్నయి. ఈ విశ్వములో వృక్షములు భూమి మిద తప్పించి మరే గ్రహములో చెట్లు ఉండవు. ఇక్కడ మనము చాల జాగ్రతగా ఆలోచిస్తే ఈ భూమి మీదకు విత్తనములు వచ్చుటకు ఆ విత్తనములు కలిగిన చెట్లు ఎక్కడ ఉన్నాయి?? అందుకనే మొదట దేవుడు చెట్లను కలిగించాడు. మరో ముఖ్యమైన సంగతి ఏమనగా సృష్టిలో ఉన్నవన్నీ(మనతో సహా) వచ్చినవే గానీ ఉన్నవి కాదు.మనకంటే ముందే వచ్చేసాయి కాబట్టి మనకు సృష్టి అర్థము కావటము లేదు. మనకంటే ముందు ఈ సృష్టి జరిగినదని మనము ఎలా చెప్పగలం అంటే మనము ముందు చేయబడిన తర్వాత గాలిని చేసియుంటే ,గాలి లేక మనము చచ్చిపోయి ఉండేవారము. అందుకే తల్లి గర్భము నుండి భయటకు రాగానే మనకంటూ ముందే గాలి భూమి మిద ఉంటుంది. 3) భుగర్భములో నుండి ఆదాము యొక్క మట్టి బొమ్మ భయటకు రాకముందే దేవుడు అన్ని వసతులు కలిగించి యుంచాడు. ఈ లోక వస్తువు వలెనే దేవుడు కూడా వచ్చిన వాడు కాదు.... దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు ?? దేవుడు చెబుతున్న సమాధానము నిర్గమ 3:!4- నేను ఉన్నవాడను,అనువాడను..... అంటే నేను వచ్చిన వాడిని కాదు అని నేను ఉన్నవాడినిఅని చెబుతున్నాడు . example:: nithin అని నేను ఉన్నాను. మా daddy నుండి వచ్చాను. మా daddy వాళ్ళ daddy నుండి వచ్చాడు. ఈ విధముగా వెనక్కి పోతే ఆఖరున చివరి ఎవరో ఒకాయన ఉండకపోడు. అందరి కంటే ఆఖరున(అనగా ప్రారంభములో) మిగిలిన వాడె దేవుడు. యెషయ 43:10,11- నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు.నా తరువాత ఏ దేవుడును ఉండదు. నేను నేనే యహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

4) అన్నిటికంటే ముందు ఉన్నవాడే నాకు ముందు ఎవరు లేరు అని అంటూ ఉంటె ,ఆఖరున పుట్టిన మనిషి దేవుడు ఎలా పుట్టాడు అంటాడు. దీనికి దేవుడు జవాబును యెషయ45:9లో చూడొచ్చు. దేవుడు చేస్తే కలిగిన వారము మనము. అయన పోమన్ని చెబితే మట్టిలోనికి పోవలసిన వారమే మనమంతా!!!! అ,ఆ లు రానివాడు lessons చదివిన ఎలా గ్రహించలేడో అలానే దేవుడు గురించి, మనము అనుభవిస్తున్న ప్రకృతి గురించి అర్థము కాని వారికీ దేవుని విషయాలు కూడా అర్థము కాలేవు.. దేవుని గూర్చి అర్థము కావాలంటే మన శరీర అవయవాల నిర్మాణము and వాటి పనితీరు దగ్గర నుండి దేవుడు వరకు ఆలోచించాలి.

5) మనిషికి దేవుడు అర్థంకాలేకపోయినా దేవుళ్ళును మాత్రము కలిపివేస్తూ అందరి దేవుళ్ళు ఒక్కటే అంటాడు.మనము కలిపితే కలిసిపోవడానికి అయన( తండ్రియైన యెహోవా) నీళ్ళలో పాలను కుంటున్నారా??? నిర్గమ 20:3,4- నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు..నేను రోషము గల దేవుడను............ఒకసారి ఈ వచనమును చదవండి. bible నందు దేవుని మనస్సు తెలుసుకోక అందరి దేవుళ్ళు ఒక్కటే అనుట correct కాదు. యెషయ 44:24-యెహోవానాగు నేను సమస్తమును జరిగించువాడను.........మనిషికి బ్రతుకు నేర్పించింది దేవుడే. అందుకే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ నుండి వచ్చాడు? అని ప్రశ్నించి తెలుసుకొనుట గుండుసూదితో మహా పర్వతాన్ని త్రావ్వినంత కష్టమైనదిగా భావించాలి. దేవుడు కలిగించిన మెదడు దేవుడుని ప్రశ్నిస్తున్నాడు.

6) దేవుడు కాలము లేని వాడు.( కీర్తన 102:27) .పరిమితి కలిగిన ఆయుష్షు ఉన్నవాడు కాదు. పూర్వ కాలము నుండి మనిషికి అన్ని విషయాలు దేవుడే నేర్పించాడు. భూమిని ఈ విధముగా సేద్యపరచాలో అడమునకు నేర్పించింది దేవుడే. పురుషుడు ఈ విధముగా ఉండాలని, స్త్రీ ఈ విధముగా ఉండాలని కలగజేసింది ఆయనే. ప్రపంచములో అంత పురుషులో లేక స్త్రీలో ఉంటె మన సంగతి ఏమిటో ఆలోచించండి. ఆదికాండ 1:27-దేవుడు తన స్వరుపమందు నరుని సృజించెను.

7) మనిషి తన కళ్ళతో చుడలేనివి,తన ఆలోచనకు అందనివి చాలా ఉన్నాయి. కొన్నిటిని microscope లో చూసుకుంటున్నాడు and మరి కొన్నిటిని habul telescopeలో చూసుకుంటున్నాడు. మరి దేవుని దేనితో చూడాలో తెలుసా?????? bible నందు వ్రాయబడిన వాక్యముతో చూడాలి.దేవునికి జ్ఞానము మనవలె మట్టి మెడదు నుండి వచ్చింది కాదు. 1కోరంది2:11- ఒక మనుష్యుని సంగతులు అతనిలో నున్న మనుష్యత్మకే కాని, ముష్యులలో మరి ఎవరికీ తెలియును???అలాగే దేవుని సంగతులు దేవుని అత్మకే గానీ మరి ఎవనికిని తెలియవు. కాబట్టి దేవుడు మాటలను,కార్యములను translate చేయుటకు ప్రవక్తలకు తన పరిశుద్దాత్మను ఇచ్చియున్నాడు.

8) సూర్యుడు మండుచున్నాడు అంటే నమ్ముతున్నారు. నీరుగడ్డకడుతుంది అంటే నమ్మగలరు. కానీ కానీ దేవుడు ఉన్నాడు అంటే మాత్రమూ ఎందుకో నమ్మలేడు. మనకు వాలే దేవుడు వచ్చియుంటే అయన దేవుడు ఎలా అవుతాడు?? దేవుని గూర్చి bibleలో పూర్తిగా వ్రాయబడింది. bible ముద్రణ యంత్రాన్ని కనుగొనిన తరువాత అచ్చు వేయబడిన మొదటి పుస్తకము ఇదే కాబట్టి చివరిగా మరొక మాట యోహాను 5:26 ను చదవండి.

9) దేవుడు ఒక మహాశక్తి కాబట్టి ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు.శక్తికి పుట్టుక ఉన్నదా? చావు ఉన్నదా?? శక్తిని గానీ ,పదార్ధాన్ని గానీ పుట్టించలేము నాశనము చేయలేము. శక్తికి లింగ భేదము లేదు. శక్తికి పుట్టుక చవులు లేనట్లే దేవునికి కూడా లేవు. మరి ఈ శక్తులు దేవుని ఉనికిని తెలియజేస్తున్నాయి దేవుడు కలిగించిన శక్తీకే ఇంతటి ధర్మము ఉంటె దేవుడు కూడా నాశనము లేనివాడుగా మహా శక్తిగా ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు స్వతంత్రుడుగా ఉన్నవాడు వచ్చివాడు కాదు. దేవుడు మరొక రూపము ధరించవలసిన అవసరము లేదు.

10) నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడే దేవుడు. మాటలలో, క్రియల్లోనూ దైవత్వాన్ని చూపించేవాడు.ఆయనకు బ్రతుకును ఎవ్వరు ఇవ్వలేదు.
11) దేవుడు ఎలా వచ్చాడో ఆలోచించుటకు ముందు మనము ఎలా వచ్చామో ఆలోచించండి. తల్లి గర్భములో నుండి వచ్చాము అంటారా?? అది నిజమే. ఆ తల్లి గర్భాములోనికి ఎక్కడ నుండి వచ్చాము?? తల్లి గర్భాములోనికి రాకముందు ఎక్కడో ఉన్నాము. ఎక్కడో చెప్పమంటారా???? ఉన్నవాడైన దేవునిలో ఉన్నాము. కాబట్టి దేవుడు “”ఉన్నవాడే”” గానీ వచ్చినవాడు కాదు. లోకములో ఉన్నవి మనము మొదట ఆలోచిస్తే అర్థమైతే అప్పుడు దేవుడు అర్థమవుతాడు.





Labels:

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget