Halloween Costume ideas 2015

The plot of the story of Noah's ark? True?

నోవహు ఓడ ఇతివృత్తం కథ? నిజమా?


బైబిలు అనేది మత గ్రంథం కాదు. సృష్టికర్త గురించి చెప్పడంతో పాటు ఆది నుంచి జరిగిన ఘటనలు నమోదు చేసి భావి తరాల కోసం పదిలం చేసిన ఒక అద్భుత చరిత్ర గ్రంథం. అలాంటప్పుడు అందులోని విషయాలకు ఋజువులు ఉండాలి కదా? అని ఎప్పుడో ఒకప్పుడు అనుకొనే ఉంటాము. అవును బైబిలులోని ప్రతీ విషయము అక్షర సత్యము. అయితే వాటికి సంబంధించిన ఋజువుల్లో కొన్ని కాలగర్భములో కలిసిపోయి ఉండొచ్చు. మరికొన్నిటికి ఎంతో కొంత ఆధారాలు ఉండొచ్చు. ఇంకొన్నిటికైతే ఆధారాలు ఆలస్యముగా వెలుగులో చూడవచ్చు. ఈ చివరి కోవకు చెందినదే నోవహు ఓడ ఘటన.

నోవహు ఓడ జాడ కోసం శతాబ్దాల పరిశోధన
నోవహు ఓడ... బైబిలు చరిత్రలో మనకు కనిపించిన ప్రప్రథమ భారీ నిర్మాణము ఇదే. ఈ ఓడ ఎంత పెద్దదంటే, నేటి భారీ ఓడలకు ఏ మాత్రం తీసిపోని పరిమాణము కలిగినది. అంత పెద్ద ఓడను సుమారు 5వేల సంవత్సరాల కిందట నిర్మించారంటే సులభముగా నమ్మడం కష్టం. అయితే నోవహు ఓడ శిథిలావస్థలో ఉందనే విషయాన్ని క్రీస్తు శకము 90వ సంవత్సరమునకు చెందిన యూదుల ప్రముఖ చరిత్రకారుడు జోసెఫస్ నమోదు చేశాడు. దీంతో బైబిలు చరిత్రపైన పరిశోధనలు చేస్తున్న పలువురు ఔత్సాహికులు ఓడ నిలిచిన స్థలాన్ని గుర్తించాలని కృషి చేశారు. బైబిలు చరిత్ర పరిశోధన ఔత్సాహికులు బైబిలు లేఖనాల్లోని సంఘటనలు, ప్రాంతాలు తదితర విషయాలను ప్రామాణికముగా తీసుకొని పరిశోధనలు చేస్తూ ఉంటారు. నోవహు ఓడ విషయములో కూడ వారు బైబిలులోని "ఏడవ నెల పదియేడవ దినమున ఓడ ఆరారాతు కొండల మీద నిలిచెను." (ఆదికాండము 8 : 4) అనే వాక్యమును ఆధారముగా తీసుకున్నారు. ఆరారాతు కొండలు అనేవి పలు కొండల సమూహము. ఇవి టర్కీ తూర్పు భాగములో వ్యాపించి మరోవైపు ఇరాన్ మరియు రష్యాల పశ్చిమ భాగములను ఆనుకొని యున్నాయి. ఇంత పొడవున వ్యాపించియున్న ఆరారాతు కొండల్లోని ఒక కొండ పేరు కూడ అదే, ఆరారాతు. సరిగ్గా ఇక్కడే మన ఔత్సాహికులు పొరపాటు పడ్డారు. బైబిలు వాక్యములోని 'ఆరారాతు కొండలు' అనే పదమును 'ఆరారాతు కొండ'గా భావించడంతో వారి పరిశోధనలు ఆరారాతు కొండపైనే కొనసాగాయి. దీంతో వారి పరిశోధనలకు ఫలితం కనిపించలేదు. నివ్వెరపరచిన ఓడ జాడ

నోవహు ఓడ నిలిచిన స్థలాన్ని కచ్చితముగా గుర్తించడానికి శతాబ్ధాల కాలంగా కొనసాగిస్తున్న పరిశోధనల్లో అతిపెద్ద అద్భుతమే జరిగింది. ఓడ నిలిచిన స్థలాన్ని గుర్తించడమే కాదు, ఆ ఓడ శిథిలాలను, ఓడ తయారీలో ఉపయోగించిన వస్తువులను కూడ గుర్తించగలిగారు. 1959వ సంవత్సరమున టర్కీ ఆర్మీ కెప్టెన్ లిహన్ డురుపీనర్ ఓడ జాడ విషయాన్ని బయటి ప్రపంచానికి చేరవేశారు. వైమానిక దళం ఏరియల్ ఫోటోను తీస్తుండగా ఆరారాతు కొండల్లోని ఒక కొండ మీద భారీ ఓడ ఆకారములోని ఓ గుట్ట కనిపించింది. అయితే అది బురద, రాళ్లతో సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్ట మాత్రమేనంటూ అప్పట్లో తేలికగా కొట్టిపారేశారు. అయితే 1977వ సంవత్సరమున రాన్ వ్యట్ అనే ఔత్సాహిక శాస్త్రవేత్త దీనిపైన పరిశోధనలు ప్రారంభించారు. ఓడ ఆకారములోని గుట్టకు లోతుగా డ్రిల్ వేయించి సేకరించిన నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపాడు. రాడార్ స్కాన్, లోహ గుర్తింపు పరీక్షలు నిర్వహించి అక్కడి శిథిల వస్తువుల్లో ఇనుము, అల్యూమినియం, టైటానియం ఉన్నట్లు గుర్తించారు. ఇనుము మినహా అల్యూమినియం, టైటానియం ప్రకృతిలో సహజ సిద్ధముగా లభించవు. అందువల్ల అది బురద, రాళ్లతో ఏర్పడిన సహజ సిద్ధమైన గుట్ట కాదని, మానవ నిర్మితమైన ఓడ శిథిలాలు అని తేల్చిపారేశారు. దీనికి బలము చేకూర్చే విధముగా ఆ రాళ్ల గుట్ట నుంచి ఓడ భాగాలైన కొన్ని వస్తువులను శిథిలాల రూపములో గుర్తించారు. అలాగే ఈ ప్రాంతమునకు సుమారు 20 కిలో మీటర్ల దూరములోని ఓ గ్రామములో ఓడను నిలుపడానికి ఉపయోగించే భారీ రాతి లంగరును కనుగొన్నారు.

అది నోవహు ఓడ అని ఎలా నమ్మడం?
బైబిలు లేఖనాల్లో చెప్పిన నోవహు ఓడ నిర్మాణ కొలతలతో ఓడ శిథిలమైన గుట్టగా మారిన భాగము యొక్క కొలతలు కూడా కచ్చితముగా ఉన్నాయి. అనగా ఓడ ఆకారములోని గుట్ట పొడుగు 515 అడుగులు (300 మూరలు) కచ్చితముగా ఉంది. ఈ ఓడ ఆకారములోని గుట్టపైన పరిశోధనలు చేయించిన టర్కీ ప్రభుత్వము సైతము అది నోవహు ఓడగానే తేల్చిచెప్పింది. చివరకు దానిని పర్యాటక ప్రాంతముగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం నోవహు ఓడ ప్రాంతం ఎక్కడ ఉన్నది? గ్రేట్ ఆరారాతు కొండకు సుమారు 30 కిలోమీటర్ల దూరములో నోవహు ఓడ శిథిలాలు ఉన్న ప్రాంతం నెలకొంది. ఇది ఇరాన్ సరిహద్దుకు మూడు కిలో మీటర్ల దూరములో ఉంది. ఓడ శిథిలాలు విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజెప్పిన ఆర్మీ కెప్టెన్ లిహన్ డురుపీనర్ పేరును ఓడ శిథిలాలు ఉన్న కొండకు పెట్టారు. ఓడ శిథిలాలు ఉన్న ప్రాంతానికి Nuhun Gemisi (నోవహు ఓడ) అని పేరు పెట్టారు. నోవహు ఓడ జాడను శాటిలైట్ చిత్రము ద్వారా చూసేందుకు..


Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget