Halloween Costume ideas 2015

How did the Bible?

బైబిలు ఎలా వచ్చింది?

బైబిలు ఎవరు వ్రాసారు? 
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. (2తిమోతి 3:16, 17)
ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి. (2పేతురు 1:21)
యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది. (2సమూయేలు 23:2)
మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. (1కొరిందీ 2:13)

కాబట్టి బైబిలు నందు గల మాటలు దైవ ప్రేరేపితములు. అవి మనుష్యుల ఊహలు, మాటలు కాదు
బైబిలు ఎలా వ్రాసారు?

uప్యాపిరస్ అనే కాగితము లాంటి వాటి మీద

uచర్మపు చుట్టల మీద

uమట్టితో చేసిన అచ్చుల మీద

బైబిలు ప్రతులు ఎక్కడ దొరికాయి?
uసెయింట్ కాధరిన్ చర్చి నందు 

uమృత సముద్రము దగ్గర ఉన్న ఖుమ్రాన్ గుహల నందు

uమృత సముద్రము దగ్గర ఉన్న ఖుమ్రాన్ గుహల నందు ఇలాంటి పాత్రలో 

uమృత సముద్రము దగ్గర ఉన్న ఖుమ్రాన్ గుహల నందు దొరికిన చర్మపు చుట్టలు


బైబిలు యొక్క అమరిక
uబైబిలు 66 పుస్తకముల యొక్క సముదాయము
uబైబిలు అనే మాట బిబ్లియా అనే గ్రీకు పదము నుండి వచ్చినది
uబైబిలును సుమారు 40 మంది 1500 సంవత్సరముల పాటు వ్రాసిరి.
uబైబిలులోని 66 పుస్తకములను పాత, క్రొత్త నిబంధన అనే 2 విభాగములుగా చేయటము జరిగినది
uపాత నిబంధన హీబ్రూ బాషలోను, క్రొత్త నిబంధన గ్రీకు బాషలోను వ్రాయబడినవి


uక్రీ.పూ 2వ శతాబ్దములో పాత నిబంధన లేఖనములు గ్రీకు లోనికి తర్జుమా చేయబడినవి. దేనినే సేప్తువజింట్ వర్షన్ అంటారు.
uరోమన్ బాషలోని అంకెల ప్రకారము LXX అని కూడా పిలుస్తారు
u72 మంది పండితులు 72 రోజులలో ఈ అనువాదము పూర్తి చేసిరి.
uపాత నిబంధన గ్రంధములో మొత్తము 39 పుస్తకములు కలవు.
uవీటి ఎంపిక క్రీ.శ. 100వ సంవత్సరములో యూదు పండితుల సమావేశములో జరిగినది అని ఒక అవగాహన కలదు
uక్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్య 27. వీటిని క్రీ. శ. 50-100 సంవత్సరముల మద్యలో గ్రంధస్థము చేసిరి.
uఈ 27 పుస్తకములను క్రీ.శ. 367లో అలెగ్జాండ్రియ బిషప్ అతనేషియస్ నిర్ణయించారు.
uఇవి కాక రోమన్ కాధలిక్ బైబిలు నందు 14 పుస్తకములు అధికముగా ఉండును. వీటిని అపోక్రిప అంటారు.
uబైబిలును అధ్యాయములుగా బిషప్ స్టీఫెన్ ల్యాంగ్టన్ క్రీ.శ 1238 లో విభజించారు
uబైబిలును వచనములుగా రాబర్ట్ స్టీఫెన్స్ క్రీ.శ. 1551 లో విభజించారు

uపూర్వకాల మందు బైబిలును స్క్రైబ్స్  అనేవారు చేతితో క్రొత్త ప్రతులను వ్రాసేవారు
బైబిలు పాత నిబంధన పుస్తకములు

బైబిలు క్రొత్త నిబంధన పుస్తకములు

బైబిలు యొక్క విభజన – పాత నిబంధన
బైబిలు యొక్క విభజన – క్రొత్త నిబంధన


బైబిలు – గ్రంథకర్తలు

uరాజులు – దావీదు, సొలోమోను
uపండితులు – మోషే
uప్రవక్తలు – యెషయా, యిర్మియా, యెహెజ్కేలు, సమూయేలు, నాతాను, గాదు, హోషేయ, యోవేలు, ఓబధ్యా, యోనా, మీకా, నహూము, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ
uజాలరులు – పేతురు, యోహాను, యాకోబు
uయుద్ద వీరుడు – యెహోషువ
uరాజకీయ వేత్తలు – దానియేలు, నెహెమ్యా
uశాస్త్రి – ఎజ్రా
uపశులకాపరి – ఆమోసు
uవ్యవసాయదారుడు – హబక్కూకు
uవేదాంతి – అపోస్తలుడైన పౌలు
uవైద్యుడు – లూకా
శిష్యులు – యూదా, మార్కు
బైబిలు సాహిత్య రీతులు

uఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు
uచరిత్ర
uపద్యము, కీర్తనలు
uసామెతలు, జ్ఞానయుక్తమైన సూక్తులు
uసువార్తలు
uపత్రికలు
uదర్శనములు
uప్రవచనములు
uగద్యము
uప్రార్థనలు
వంశావలులు
బైబిలు తర్జుమా

uక్రీ.పూ 2వ శతాబ్దములో పాత నిబంధన లేఖనములు గ్రీకు లోనికి తర్జుమా చేయబడినవి. దేనినే సేప్తువజింట్ వర్షన్ అంటారు.
uరోమన్ బాషలోని అంకెల ప్రకారము LXX అని కూడా పిలుస్తారు
u72 మంది పండితులు 72 రోజులలో ఈ అనువాదము పూర్తి చేసిరి.
uక్రీ.శ. 383లో జేరోమ్ అనే భక్తుడు బైబిలును లాటిన్ బాషలోనికి అనువదించాడు. దీనినే లాటిన్ వల్గేట్  బైబిలు అంటారు
uక్రీ.శ. 1384 లో విక్లిఫ్ బైబిలును ఇంగ్లీషు లోనికి తర్జుమా చేసినాడు.
uదీనిలో మొత్తము 80 పుస్తకములు కలవు. (పాత నిబంధన + క్రొత్త నిబంధన + అపోక్రిప) 


uక్రీ.శ. 1522 లో మార్టిన్ లూధర్ క్రొత్త నిబంధన జర్మనీ బాషలో చేసెను

uక్రీ.శ. 1526 లో విలియం టిండెల్ క్రొత్త నిబంధన ఇంగ్లీషులో ముద్రించెను

uక్రీ.శ. 1611 లో కింగ్ జేమ్స్ బైబిలు ఇంగ్లీషులో ముద్రించెను
బైబిలు తర్జుమా - తెలుగు

uక్రీ.శ. 1727 లో జర్మన్ లూధరన్ మిషనరీ బెంజిమిన్ షూల్జ్ తెలుగులో క్రొత్త నిబంధన అనువాదము చేసారు
uక్రీ.శ. 1732 లో జర్మన్ లూధరన్ మిషనరీ బెంజిమిన్ షూల్జ్ తెలుగులో పాత నిబంధన అనువాదము చేసారు
uక్రీ.శ. 1742 లో జర్మనీకి చెందిన ఫిలిప్ ఫెబ్రీషియన్ తెలుగులో అనువాదము చేసారు
uక్రీ.శ. 1795 లో కెప్టెన్ జేమ్స్ డాడ్స్ స్కాటిష్ అధికారి తెలుగులో అనువాదము చేసారు.
uఈ పైన పేర్కొన్న ఏ అనువాదము కూడా ముద్రణకు నోచుకోలేదు
uక్రీ.శ. 1805 – 1811 వరకు విలియం కెరీ బృందము తెలుగు అనువాదము చేసారు
uక్రీ.శ. 1812 లో వారి ప్రెస్ అగ్ని ప్రమాదానికి గరి అయి అనువాద ప్రతి కాలిపోయేను
uక్రీ.శ. 1818 లో మరలా అనువదించి క్రొత్త నిబంధన ప్రచురించిరి
uక్రీ.శ. 1821 లో పంచ కాండములు ముద్రించిరి
uక్రీ.శ. 1854 లో పాత నిబంధన ముద్రించిరి
uక్రీ.శ. 1857 లో తొలి సంపూర్తి బైబిలు పాత, క్రొత్త నిబంధనలతో మద్రాసు ఆక్సలరీ వారు ముద్రించారు
uక్రీ.శ. 1911, 1953 లొ తెలుగు బైబిలునకు సవరణలు జరిగాయి



Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget