ప్రతి 2 స్తంభముల మద్యన తెల్లని నారతో చేయబడిన తెరలు ఉండవలెను. తేరా యొక్క ఎత్తు 5 మూరలు
ప్రతి స్తంభమునకు ఇత్తడి దిమ్మ, ఇత్తడి మేకులు, వెండి వంకీలు, వెండి పెండె బద్దలు కలవు
ఈ ఆవరణము యొక్క ఏర్పాటు ప్రత్యక్ష గుడారము బయట ప్రపంచము నుండి వేరుచేయు సరిహద్దుగా ఉన్నది
ఆవరణ తూర్పు భాగమును, తెరను 2 భాగములుగా, 15 మూరల నిడివి గలవిగా విభాగించిరి. ఒకవైపు 15 మూరలు, 3 స్తంభముల మీద నిలువ బెట్టవలెను. రెండవ వైపు 15 మూరలు 3 స్తంభముల మీద నిలువ బెట్టవలెను. మిగిలిన 20 మూరలు ఆవరణ ద్వారమునకు విడిచిపెట్టవలెను. ఆవరణ ద్వారము యొక్క స్తంభములు 4.
మొత్తము స్తంభముల సంఖ్య 60
ప్రతి స్తంభము యొక్క వంకీలకు త్రాళ్లు కట్టబడి అవి మేకుల సహాయముతో భూమిలో దిగగొట్టబడి స్తంభము నిలువబెట్టుటకు సహాయపడును. ఈ మేకులు యేసుక్రీస్తు శిలువలో కొట్టబడిన మేకులకు, ఆయన భరించిన తీర్పు ద్వారా కలిగిన విమోచనకు సాదృశ్యమై ఉన్నవి
ఆవరణ చుట్టూ కట్టబడిన తెరలు ఈ క్రింది విషయములకు సాదృశ్యమై ఉన్నవి
పాపుల మార్గము నుండి వేరుపరచబడుట (యెషయా 59:2; 2కొరిం 6:17; హెబ్రీ 7:26)
పరిశుద్దుల యొక్క నీతి క్రియలకు తెల్లని తెరలు సాదృశ్యమై ఉన్నవి (ప్రక 19:8; రోమా 3:22; 2కొరిం 5:21; యెషయా 61:10)
స్తంభములు విశ్వాసులకు సూచనగా ఉన్నవి (1తిమో 3:15)
ఇత్తడి పాపము మీద దేవుని యొక్క తీర్పునకు సాదృశ్యమై ఉన్నది (గల 3:12-14; కొల 2:13-15)
వెండి యేసుక్రీస్తు యొక్క త్యాగము ద్వారా విశ్వాసులకు లభించిన విమోచనకు సాదృశ్యమై ఉన్నది (ఎఫె 6:17; యోహా 3:16, 5:24)
స్తంభములను కలుపు వెండి బద్దలు విస్వాసుల యొక్క సహవాసమునకు సూచనగా ఉన్నవి (1యోహా 1:17)
విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సంక్రమించిన నీతి ద్వారా, క్రియల వలన ఇతరులను క్రీస్తు వైపునకు ఆకర్షింపవలెను (1పేతు 2:12; మత్త 5:16)
ఆవరణము ప్రజలు దేవుని స్తుతింప వలసిన స్థలమై ఉన్నది (కీర్త 100:4, 96:8, 92:13, 65:4, 84:2, 10)
ఆవరణము యొక్క తెరల ఎత్తు 5 మూరలు ఉండుట వలన ఎవరూ కూడా లోపల చొరబడటానికి వీలు కాదు. త్రొంగి చూచుటకు వీలుపడదు. లోపల ప్రవేసింపవలెను అనిన కేవలము ద్వారము ద్వారా మాత్రమే రావలెను. దీనిని బట్టి ప్రత్యక్ష గుడారము నందలి విషయములు అందరికీ చెందినవి కావు అని, కేవలము ద్వారము ద్వారా లోపలికి ప్రవేశించు వారికి మాత్రమే అనియూ మనము అర్ధము చేసికొనగలము.
ఆవరణము యొక్క మొత్తము వైశాల్యము 4 దిక్కులా కలిపి 1500. ఇది మోషేకు యేసుక్రీస్తుకు మద్య ఉన్న కాలముతో సమానము
తూర్పు వైశాల్యము (వెడల్పు x ఎత్తు) = 50×5 = 250
పడమర వైశాల్యము (వెడల్పు x ఎత్తు) = 50×5 = 250
ఉత్తరము వైశాల్యము (పొడుగు x ఎత్తు) = 100×5 = 500
దక్షిణము వైశాల్యము (పొడుగు x ఎత్తు) = 100×5 = 500
మొత్తము కలిపి 250+250+500+500 = 1500
ఇశ్రాయేలీయులు ఇగుప్తులొ ఫరో రాజు చేతి క్రింద బాధింపబడిన సంవత్సరములు 155.
ఆవరణము పొడుగు + వెడల్పు + ఎత్తు = 100+50+5 = 155
ఆవరణము యొక్క పొడుగు 100. ఇది మనిషి యొక్క జీవితకాలమునకు సమానము
ఆవరణము యొక్క వెడల్పు 50. ఇది విడుదలకు గుర్తు. ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము, పరిశుద్దాత్మ దేవుడు పునరుద్దానము తరువాత 50వ దినమున పెంతెకోస్తు నాడు దిగి వచ్చెను (లేవి 25). పెంతెకోస్తు పండుగ 7వ వారము 8వ దినమున జరుగును.
యేసుక్రీస్తు ప్రభువు పరిచర్యను ప్రారంభించినపుడు 30 సంవత్సరముల వయస్సు కలదు. తూర్పు ఆవరణ ఇరుప్రక్కల ఉన్న దూరము 30. ఆవరణ ద్వారము కుడివైపున 15 మూరలు + ఆవరణ ద్వారము ఎడమవైపున 15 మూరలు. 15 కృపతో కూడిన దైవిక పరిపూర్ణతను సూచిస్తున్నది
తూర్పున ఆవరణ ద్వారము వెడల్పు 20. ఇది సహాయమునకు ఎదురుచూచు కాలమును సూచించు సంఖ్య లేదా కార్యము సంపూర్తి చేయబడుటకు ఎదురుచూచు సంఖ్య (న్యాయా 4:1-3, 15:20, 16:31; 1సమూ 7:1-2; 1రాజు 9:10-11)
ఆవరణము యొక్క తూర్పు, పడమరల వెడల్పు కలిపి 100. ఇది మనిషి జీవిత కాలమునకు అవసరమైన విడుదలను సూచిస్తున్నది.
ఆవరణము తెరల యొక్క ఎత్తు 5. ఇది లేఖనములలో కృపను సూచించు సంఖ్య.
ఆవరణము పొడుగు, వెడల్పులు సమానమైన 5 మూరల ఎత్తులో ఉండుట మన జీవిత కాలమునకు ఆయన కృప సరిపోవును అని, అది మార్పులేనిది అని, మనము కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే సత్యము మనకు తెలియజేయుచున్నది (ఎఫె 2:8)
ఆవరణము పొడుగున స్తంభములు 20. వెడల్పున 10. మొత్తము అన్ని వైపులా కలిపి 20+20+10+3+3+4 = 60
ఆవరణము రెండు వైపులా పొడుగున ఉన్న స్తంభముల సంఖ్య కలిపి 20+20 = 40. ఇది క్రమశిక్షణను సూచించు సంఖ్య
ఆవరణము వెడల్పున ఉన్న స్తంభముల సంఖ్య 10. ఇది లేఖనములో దేవుని ప్రభుత్వమును సూచించు సంఖ్య.
ఆవరణము పొడుగు x వెడల్పు x ఎత్తు = 100x50x5 = 25000
Post a Comment